Latest

మసీదుబండ 100 ఫీట్ల రోడ్డు విస్తరణకు మోక్షం
TG: హైదరాబాద్ నగరం శేరిలింగంపల్లి పరిధిలోని మసీదుబండ 100 ఫీట్ల రోడ్డు విస్తరణకు స్థలాలు ఇచ్చేందుకు సమ్మతించిన బాధితులకు PAC చైర్మన్ అరెకపూడి గాంధీ అంగీకార పత్రాలు అందించారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సీసీపీ వెంకన్న, నాయకుడు రాజు యాదవ్‌లతో కలిసి కార్యక్రమం నిర్వహించారు. బాధితులకు TDR ఇచ్చి న్యాయం చేయాలని అధికారులను కోరారు. దశాబ్దాల ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు.

2027లో మార్కెట్‌లోకి ప్లాస్టిక్ నోట్స్?
కేంద్ర ప్రభుత్వం RBIకి ఒక బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. ₹10, ₹20 వాల్యూ ఉండే ప్లాస్టిక్ నోట్ల పైలట్ ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. మొత్తం ₹3,000 కోట్ల విలువైన నోట్లతో ఫీల్డ్ ట్రయల్స్ స్టార్ట్ చేస్తున్నారు. ఈ ప్లాస్టిక్ నోట్స్ నార్మల్ పేపర్ నోట్ల కంటే 2.5 నుండి 4 టైమ్స్ ఎక్కువ లైఫ్ ఇస్తాయి. ప్రజెంట్ ఇవి నార్మల్ క్యాష్‌తో పాటే యూజ్‌లో ఉంటాయి, పాత నోట్లను రీప్లేస్ చేయరు. ఈ ట్రయల్స్ సక్సెస్ అయితే ఏప్రిల్ 2027 నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తారు.

కేసీఆర్ హయాంలోనే అభివృద్ధి జరిగింది: పోచారం
TG: కేసీఆర్ హయాంలోనే అభివృద్ధి జరిగిందంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అన్నం పెట్టినవాళ్లను మర్చిపోలేనన్నారు. పదవి, డబ్బు కోసం తను పార్టీ మారలేదని, కొందరి వల్లే తను పార్టీ మారాల్సి వచ్చిందని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారాల్సి వచ్చిందన్నారు. ప్రస్తుతం నిధుల కోసం ఫోన్ చేస్తే ఎవరూ స్పందించడం లేదన్నారు. తను కాంగ్రెస్ కండువా కప్పుకోలేదని, జాతీయ జెండా మాత్రమే కప్పుకున్నానని తెలిపారు.

హిమాచల్‌లో భారీ వర్షాలు.. 157 మంది మృతి
హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు, కొండచరియలు, సడన్ ఫ్లడ్స్‌తో తీవ్ర నష్టం ఏర్పడింది. జూన్ 30 నుంచి ఆగస్టు 9 వరకు వర్షాల కారణంగా 157 మంది మృతి చెందగా, 257 మంది మిస్ అయ్యారని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. ఇందులో 68 మంది వరదలు, కొండచరియల కారణంగా, 89 మంది రోడ్డు యాక్సిడెంట్స్‌లో చనిపోయారు. 259 రోడ్స్ క్లోజ్ అవ్వగా, దాదాపు రూ.886 కోట్ల నష్టం వచ్చినట్లు అంచనా వేస్తున్నారు. ఎక్కువగా మండి జిల్లాలో 120 రోడ్లు మూసుకుపోయాయి.

Phone Cameraలో ఇక కొత్త టెక్నాలజీ! 📱
మీ Phone కెమెరా ఇంకా మెరుగవ్వబోతోందా? 👀 TSMC, Sony కలిసి కొత్త తరం ఇమేజ్ సెన్సర్ల తయారీ కోసం జపాన్‌లో $4.69 బిలియన్ల జాయింట్ వెంచర్ ప్రకటించాయి. ఈ సెన్సర్లు ప్రధానంగా స్మార్ట్‌ఫోన్స్ కోసం ఉపయోగించనున్నారు. Sony సెన్సర్ డిజైన్, టెక్నాలజీని చూసుకోగా.. TSMC తయారీ బాధ్యతలు చేపట్టనుంది. జపాన్‌లోని కుమామోటోలో ఈ సంస్థ పనిచేయనుంది. పెద్ద ఎత్తున ఉత్పత్తి 2029లో ప్రారంభం కావచ్చని కంపెనీలు తెలిపాయి. అంటే భవిష్యత్తులో మన Phone కెమెరాల్లో మరింత అడ్వాన్స్‌డ్ సెన్సర్లు వచ్చే అవకాశం ఉంది.
సెక్యూరిటీ గార్డ్ మీదికి దూసుకెళ్లిన కార్!
బెంగళూరులో ఒక షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. అర్ధరాత్రి 1:42 గంటలకు ఒక వైట్ కార్ ఫుల్ స్పీడ్‌తో రాగా, సెక్యూరిటీ గార్డ్ గేట్ తీయబోతుండగానే అతని మీదికి దూసుకెళ్లింది. ఆ గార్డ్ లాస్ట్ సెకండ్‌లో స్పీడ్‌గా పక్కకు జంప్ చేయడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. కార్ ఇంపాక్ట్‌కు అతడు కిందపడ్డా సీరియస్ ఇంజరీస్ కాలేదు. ఈ భయంకరమైన యాక్సిడెంట్ విజువల్స్ సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి.

మెగా వరుస హిట్లు.. ఇక మిగిలింది ఆ ఒక్కడే!
బాక్సాఫీస్ దగ్గర మెగా హీరోలు వరుస హిట్లతో సందడి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ‘ఓజి’, చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’, రామ్ చరణ్ ‘పెద్ది’ వంటి సినిమాలతో భారీ విజయాలు అందుకోగా, ఇటీవల వరుణ్ తేజ్ కూడా ‘కొరియన్ కనకరాజు’తో సాలిడ్ కమ్‌బ్యాక్ ఇచ్చాడు. ఇక మెగా ఫ్యామిలీ నుంచి బాక్సాఫీస్ బరిలో దిగేందుకు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ సిద్ధమవుతున్నాడు. తన కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘సంబరాల ఏటి గట్టు’ సినిమాతో ఆయన కూడా కచ్చితంగా బ్లాక్‌బస్టర్ కొడతారని మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు.

పాతబస్తీ మెట్రోకు స్పీడ్ పెంచండి.. CM రేవంత్‌రెడ్డి ఆదేశాలు
TG: హైదరాబాద్ పాతబస్తీ మెట్రో పనులపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు MCRHRDలో అధికారులతో రివ్యూ చేశారు. మెట్రో ఫేజ్-2 పనులను వేగవంతం చేయాలని సూచించారు. MGBS-చాంద్రాయణగుట్ట 7.5 కి.మీ కారిడార్‌కు సంబంధించిన రోడ్ వైడెనింగ్, పెండింగ్ ల్యాండ్ అక్విజిషన్ పనులను త్వరగా కంప్లీట్ చేయాలని ఆదేశించారు. మెట్రో పనులకు టెండర్ ప్రాసెస్‌ను వీలైనంత స్పీడ్‌గా స్టార్ట్ చేయాలని, రద్దీకి అనుగుణంగా ఎక్స్‌ట్రా కోచ్‌లు కొనాలని సూచించారు.
ప్రభుత్వ స్కూళ్లపై బిగ్ ప్లాన్!- అభిజీత్ దీప్కే
CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం దేశవ్యాప్త క్యాంపెయిన్ ప్రకటించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గ్రామీణ స్కూళ్లలోని తాగునీరు, కరెంట్, వాష్‌రూమ్స్ వంటి కనీస సదుపాయాలపై పేరెంట్స్ సోషల్ ఆడిట్ చేసి వీడియోలు తీయాలని పిలుపునిచ్చారు. పాఠశాలలను బాగుచేసే సర్పంచులకు CJP సోషల్ మీడియాలో క్రెడిట్ ఇస్తామని, తన స్వగ్రామం హంగోలీ నుండి ఈ మార్పును తానూ స్వయంగా ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు.

‘Why I Am Not a Hindu’ పుస్తకానికి 30 ఏళ్లు
దళిత-బహుజన వర్గాల గొంతుకగా ప్రొ.కంచ ఐలయ్య రాసిన ‘Why I Am Not a Hindu’ పుస్తకానికి 30 ఏళ్లు పూర్తయ్యాయి. కుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా, శ్రమను, సమానత్వాన్ని, సామూహిక జీవన విలువలను గౌరవించే దళితబహుజన సంస్కృతిని ప్రాధాన్యం ఇచ్చిన పుస్తకంగా ఈ రచన పేరు తెచ్చుకుంది. అదే స్థాయిలో వివాదాస్పదంగానూ మారింది. 18వ తేదీ మంగళవారం హైదరాబాద్ నగరంలోని లామకాన్‌లో కంచ ఐలయ్యతో ముఖాముఖి నిర్వహిస్తున్నారు. ఇందులో స్పీకర్స్‌గా ప్రొ.జ్యోతిర్మయశర్మ, గీతారామస్వామి, పల్లికొండ మణికంఠ ఉంటారు.

పాలిటిక్స్‌లోకి ధనుష్?
హీరో ధనుష్ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ తమిళనాడులో పెద్ద చర్చ నడుస్తుంది. ‘ఆల్ ఇండియా ధనుష్ ఫ్యాన్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్’ కోయంబత్తూరులోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొత్త సంక్షేమ సంఘాలను ఏర్పాటు చేసి, సభ్యులను చేర్చుకోవాలని పిలుపునిచ్చింది. జిల్లా అధ్యక్షుడు జి. శంకర్ నాయకత్వంలో ఈ కార్యక్రమాలను వేగవంతం చేయాలని, ఆ సంఘం జాతీయ కార్యదర్శి బి. రాజా నోటీసును సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ విషయంపై ధనుష్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా, ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతుంది.
యువతిపై రేప్..క్షమాపణలు కోరిన నిందితుడు
అహ్మదాబాద్‌లో ఓ బిల్డింగ్ టెర్రస్‌పై యువతిని అత్యాచారం చేసిన సెక్యూరిటీ గార్డును పోలీసులు అరెస్టు చేశారు. అతను నాలుగు రోజుల క్రితమే ఉద్యోగంలో చేరాడు. యువతి గొంతు నొక్కి, అత్యాచారం చేసి, ఆమెను టెర్రస్‌పై లాక్ చేసి పారిపోయినట్టు పోలీసులు తెలిపారు. పోలీసులు అతణ్ని పట్టుకోగానే “ఏక్ బార్ మాఫ్ కర్ దో. ఫిర్ సే నహీం కరూంగా”(ఒక్కసారి క్షమించండి. మళ్లీ చేయను) అని క్షమాపణలు కోరుతున్న వీడియో వైరల్ అయ్యింది.

లారీ బోల్తా.. కోళ్ల కోసం ఎగబడ్డ జనాలు
AP: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం భాకరాపేట ఘాట్‌రోడ్డులో కోళ్ల లారీ అదుపుతప్పి బోల్తాపడింది. భాకరాపేట నుంచి తిరుపతి వైపు వెళ్తుండగా ఈ ఇన్సిడెంట్ జరిగింది. లారీ బోల్తాపడటంతో అందులోని కోళ్లు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. దీంతో కోళ్లను ఎత్తుకెళ్లేందుకు స్థానికులు, వాహనదారులు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చారు. రోడ్డుపై పడిపోయిన కోళ్లను బస్తాల్లో నింపుకుని కొందరు తీసుకెళ్లారు. ప్రమాదంతో ఘాట్‌రోడ్డుపై కొంతసేపు రాకపోకలకు ఇబ్బందులు కలిగాయి.

ట్రంప్ హెయిర్ స్టైల్ చేంజ్?
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కొత్త హెయిర్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. లాస్ వేగాస్‌లో కనిపించిన ఆయన జుట్టు మునుపటి కంటే మరింత బ్రైట్‌గా, నిండుగా కనిపించడంతో నెటిజన్స్ విపరీతంగా AI ఫోటోలు, మీమ్స్‌తో ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే ట్రంప్ మాత్రం తన హెయిర్ స్టైల్‌ను ఒక 'వర్క్ ఆఫ్ ఆర్ట్' అని చెప్తూ గర్వంగా మాట్లాడారు. దశాబ్దాలుగా ఆయన హెయిర్ పొలిటికల్ కల్చర్‌లో ఒక స్పెషల్ టాపిక్‌గా నడుస్తోంది.

లావైనా లైట్ తీసుకుంటున్నా
40 ఏళ్లు దాటాక అందం కంటే జీవితంలో చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయని నటి లక్ష్మీ మంచు అన్నారు. తనకు లవ్ సీన్లు, రొమాంటిక్ పాత్రలు ఇవ్వకుండా ఎప్పుడూ జనాలను కొట్టే, భయపెట్టే రోల్సే ఇస్తున్నారని నవ్వుతూ చెప్పారు. పదేళ్ల క్రితం శరీరం, బరువు గురించి ఎక్కువగా పట్టించుకునేదాన్నని, ఇప్పుడు అలాంటి పట్టింపులేమీ లేవని చెప్పారు. రూపం కంటే ఆరోగ్యంగా ఉండటం, పనిచేయడమే ముఖ్యమని, కెమెరా ముందు ఉండటమే తనకు ఇష్టమైన విషయమని తెలిపారు.

సినిమాల్లో అలాంటి ఆడవాళ్లే కావాలంటున్న లక్ష్మీ మంచు!
నటి లక్ష్మీ మంచు సినిమా కథలో కొత్తదనం ఉండి, దర్శకుడి విజన్ నచ్చితే ఏ ప్రాజెక్ట్ అయినా ఒప్పుకుంటానన్నారు. పాత్ర ఎంతసేపు ఉందన్నది కాకుండా, కథ బాగుందో లేదో చూడటమే తనకు ముఖ్యమని అన్నారు. వెండితెరపై తమకంటూ ఒక ఆలోచన ఉండి, ధైర్యంగా మాట్లాడే బలమైన మహిళా పాత్రలు ఇంకా ఎక్కువ రావాలని ఆమె కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె నటించిన రెండు తెలుగు కామెడీ సినిమాలు, ఒక తమిళ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వీటితో పాటు ఒక కొత్త షో షూటింగ్ కూడా త్వరలోనే మొదలుకాబోతుంది.

రైల్వేలో 734 అప్రెంటిస్ పోస్టులు.. సెప్టెంబర్ 5 వరకే
రైల్ కోచ్ ఫ్యాక్టరీ కపుర్తలా (RCF) 2026లో 734 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగస్ట్ 7 నుంచి అప్లికేషన్లు స్టార్ట్ అయ్యాయి. సెప్టెంబర్ 5, 2026 వరకు అప్లై చేసుకోవచ్చు. ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, పెయింటర్, కార్పెంటర్ వంటి ట్రేడుల్లో వేకెన్సీస్ ఉన్నాయి. 10వ తరగతిలో మినిమం 50 శాతం మార్కులతో పాటు సంబంధిత ITI/NCT అర్హత ఉండాలి. ఏజ్ 15–24 ఏళ్లు ఉండాలి. 10వ తరగతి, ఐటీఐ మార్కుల మెరిట్ ఆధారంగా సెలెక్షన్ జరుగుతుంది. అప్లికేషన్‌కు రూ. 100 ఫీజు చెల్లించాలి.

అటెండర్ సెలవు.. ప్రభుత్వ ఆఫీస్‌కు తాళం
TG: ఖమ్మం జిల్లా తూనికలు కొలతల శాఖ కార్యాలయంలో అటెండర్ సెలవులో ఉండటంతో కార్యాలయాన్ని మూసివేశారు. దీంతో తమ సమస్యలు, ఫిర్యాదులతో వచ్చిన ప్రజలు నిరాశగా వెనుదిరిగారు. ఇప్పటికే సిబ్బంది కొరతతో శాఖ ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, తాజాగా కార్యాలయానికి తాళం వేయడం చర్చనీయాంశంగా మారింది. శాఖ పనితీరుపై గతంలోనూ విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈ ఘటన వాటికి మరింత బలం చేకూర్చింది. ఒక ఉద్యోగి సెలవులో ఉన్నంత మాత్రాన కార్యాలయ కార్యకలాపాలు నిలిచిపోవడంపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

CMC ఆఫీస్ ముట్టడి.. హైటెన్షన్
TG: హైదరాబాద్‌లోని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(CMC) కార్యాలయం వద్ద చెత్తసేకరణ కార్మికుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. తెలంగాణ స్వచ్ఛ ఆటో, రిక్షా కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో సుమారు వెయ్యిమంది కార్మికులు CMC ఆఫీస్‌ను ముట్టడించారు. వారిని పోలీసులు ప్రధాన గేటు వద్ద అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. పాత విధానంలోనే పారిశుద్ధ్య పనులు కొనసాగించాలని, ఆస్తిపన్నుతో కలిపి చెత్త పన్ను వసూలుచేసే విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ-ఆటోల పేరుతో కొత్త వాహనాలను తీసుకొచ్చి ఉపాధిని దెబ్బతీయవద్దని కోరారు.

బ్లింకిట్ ఆర్డర్స్ జాగ్రత్త.. కుళ్ళిన సరుకులు, బొద్దింకలు!
ముంబైలోని ఒక బ్లింకిట్ స్టోర్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారులు సడన్‌గా చెకింగ్స్ చేశారు. అక్కడి ఫ్రూట్స్, వెజిటబుల్స్‌పై బొద్దింకలు తిరగడం, తిండి వస్తువులను కింద పడేయడం చూసి అధికారులు షాక్ అయ్యారు. అంతేకాకుండా ఎక్స్‌పైర్ అయిపోయిన సరుకులను కస్టమర్లకు అమ్ముతున్నట్టు పట్టుకున్నారు. రూల్స్ బ్రేక్ చేయడంతో ఆ బ్లింకిట్ స్టోర్ ఫుడ్ లైసెన్స్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. నీట్‌గా లేని ఇలాంటి ఫుడ్ స్టోర్స్‌పై పబ్లిక్ కూడా కంప్లైంట్ చేయవచ్చని చెప్పారు.

జార్ఖండ్ అసెంబ్లీ ముట్టడికి ABVP.. కార్యకర్తలు అరెస్ట్
జార్ఖండ్ రాంచీలో రిక్రూట్మెంట్ పరీక్షల్లో అవకతవకలను నిరసిస్తూ ప్రొటెస్ట్లు చేస్తున్న స్టూడెంట్స్‌పై పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ ABVP కార్యకర్తలు ఈరోజు అసెంబ్లీ ముట్టడికి ర్యాలీ చేపట్టారు. రాంచీలోని పాత విధానసభ ప్రాంతం నుంచి ర్యాలీ ప్రారంభమైన వెంటనే కొంతమంది కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన లాఠీచార్జిని నిరసిస్తూ ఈ మార్చ్‌కు ABVP పిలుపునిచ్చింది.