Latest

ఆక్వా రైతులకు ప్రభుత్వం భరోసా: అచ్చెన్నాయుడు
AP: రాష్ట్రంలోని ఆక్వా రంగాన్ని దేశానికే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో నిర్వహించిన ఆక్వా రైతు మహాసభలో ఆయన మాట్లాడారు. రొయ్యల మేత ధరలను తగ్గించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించిందన్నారు. మేత తయారీ పరిశ్రమలు, రైతులు, అధికారులు, ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేసి, ధరల్లో మార్పులు చేయాలంటే అందరి ఆమోదం తీసుకునే విధానం తీసుకొచ్చామని చెప్పారు.

రైతుల కోసం కమాండ్ కంట్రోల్ రూమ్
AP: ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సాగునీటి కంటే తాగునీటి సరఫరాకే ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విజయవాడ పౌరసరఫరాలశాఖ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఏలూరు జిల్లాలో సాధారణం కంటే 74శాతం తక్కువ వర్షపాతం నమోదైనా వరిసాగు 400శాతం పెరగడంపై ఆందోళన వ్యక్తంచేశారు. తక్కువ నీటితో పండే పంటల వైపు రైతులను ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నివారించేందుకు ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

హైవేపై సడన్ షాక్.. రెండు ప్రమాదాల్లో 8మంది మృతి
హైదరాబాద్-ముంబయి నేషనల్ హైవేపై జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాలతో తీవ్ర విషాదం నెలకుంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం సత్వార్ వద్ద యూటర్న్ తీసుకుంటున్న ఆటోను వేగంగా వచ్చిన ట్యాంకర్ ఢీకొట్టడంతో ఆరుగురు మృతిచెందారు. మృతుల్లో ఐదుగురు కూలీలు, ఆటో డ్రైవర్ ఉన్నారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. కోహీర్ మండలం వెంకటాపూర్ కూడలి సమీపంలో మరో ప్రమాదం జరిగింది. డివైడర్‌ను ఢీకొన్న కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీకొట్టడంతో ఇద్దరు చనిపోయారు. పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

PF ఖాతాదారులకు బిగ్ అలర్ట్..
ఆన్‌లైన్ ద్వారా PF సేవల వినియోగం పెరగడంతో, సైబర్ నేరగాళ్లు అసలైన సైట్‌ను పోలిన నకిలీ వెబ్‌సైట్లు, లింకులతో మోసాలకు పాల్పడుతున్నారని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తెలిపింది. PF బ్యాలెన్స్, క్లెయిమ్,KYC పేరుతో వచ్చే అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయవద్దని స్పష్టం చేసింది. సైబర్ మోసగాళ్లకు UAN, ఆధార్, పాన్, బ్యాంక్ వివరాలు, పాస్‌వర్డ్ లేదా OTP సమాచారాన్ని అందిస్తే అకౌంట్లో ఉన్న డబ్బు క్షణాల్లో మాయమయ్యే ప్రమాదముందని, కేవలం అధికారిక పోర్టల్ ద్వారానే సేవలు పొందాలని సూచించింది.
అందుకే మాట్లాడలేకపోయాను: మమతా బెనర్జీ
తన వెహికల్ పై రాళ్లతో ఎటాక్ జరగడంతో తీవ్రమైన చెస్ట్ పెయిన్ వచ్చిందని, రెండు రోజుల పాటు అసలు మాట్లాడలేకపోయానని పశ్చిమ బెంగాల్ మాజీ CM మమతా బెనర్జీ తెలిపారు. ఆ దాడిలో తన కళ్లద్దాలు కూడా పగిలిపోయాయని చెప్పారు. పోలీసులు ఎవరిని అరెస్ట్ చేసినా చేయకపోయినా అది వారి డ్యూటీ అని, కానీ తమ పార్టీ వర్కర్స్‌పై అటాక్స్ చేస్తే ఊరుకోబోమని ఆమె హెచ్చరించారు. తాము పీస్ నే కోరుకుంటున్నామని ఆమె మీడియాతో చెప్పారు.

పెద్ద మనసుతో క్షమించండి- జానీ మాస్టర్
తెలుగు ఫిలిం అండ్ టీవీ డాన్సర్స్ అసోసియేషన్ వివాదంపై డాన్స్ మాస్టర్ జానీ స్పందించారు. తెలిసీ తెలియక జరిగిన తప్పులను పెద్ద మనసుతో క్షమించాలని ఇండస్ట్రీ పెద్దలను కోరారు. ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్‌తో సమస్యలు సాల్వ్ అయ్యాయని చెప్పారు. ప్రొడ్యూసర్స్ ఇచ్చిన డబ్బులు డాన్సర్లకు పూర్తిగా అందడం లేదనేదే తన బాధ అని, ఈ విషయాన్ని చిరంజీవి గారితో పాటు ఇండస్ట్రీ పెద్దలు అర్థం చేసుకున్నారని తెలిపారు. తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించాలని, అందరితో కలిసి సమస్యను పరిష్కరించుకుంటామని జానీ చెప్పారు.

రీఎంట్రీలో రోజా హిట్..
సినీ, రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసిన సీనియర్ నటి రోజా మళ్లీ వెండితెరపై రీఎంట్రీ ఇచ్చారు. ఆమె కీలక పాత్రలో నటించిన తమిళ చిత్రం ‘అన్బే డయానా’ జులైలో థియేటర్లలో విడుదలై మంచి విజయంతో పాటు కలెక్షన్లు సాధించింది. చాలా కాలం తర్వాత రోజా నటించిన ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ అక్కడ సూపర్ హిట్‌గా నిలిచింది. తెలుగులో థియేటర్ రిలీజ్ కాకపోయినప్పటికీ, త్వరలోనే ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతుండటంతో ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మీ పిల్లలకు మీరు Safe Placeగా ఉన్నారా..? ❤️
పిల్లలు పెద్దయ్యాక వాళ్లు ఎలా ఉంటారో.. వాళ్లను చిన్నప్పటి నుంచి మనం ఎలా పెంచామన్నదానిపైనే చాలా వరకు ఆధారపడి ఉంటుంది. వాళ్లు చేసే ప్రతి తప్పును కరెక్ట్ చేయడం కంటే వాళ్లు చెప్పేది వినడం, చిన్న ప్రయత్నాలను అప్రిషియేట్ చేయడం, ప్రశ్నలకు పేషెన్స్‌తో సమాధానం చెప్పడం, ప్రేమతో సపోర్ట్ చేయడం ముఖ్యం. అన్నింటికంటే పిల్లలు తప్పు చేసినప్పుడు దాక్కునే వ్యక్తిగా కాకుండా, ఏం జరిగినా ముందుగా గుర్తొచ్చే సేఫ్ ప్లేస్‌గా ఉండాలి. ఎందుకంటే మన దగ్గర వాళ్లకు దొరికే భద్రతే.. రేపు ప్రపంచాన్ని ఎదుర్కొనే ధైర్యంగా మారుతుంది.

చిరు లీక్స్ రిపీట్..
వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ మీట్‌లో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ వేడుకలో చిరు మరోసారి తన ‘చిరు లీక్స్’తో అభిమానులకు క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో వస్తున్న తన 158వ చిత్రానికి ‘కదిరి నరసింహుడు’ అనే టైటిల్ రానున్నట్లు హింట్ ఇచ్చారు. అంతేకాకుండా, ఆగస్టు 22న తన పుట్టినరోజు సందర్భంగా #Mega158 టైటిల్ టీజర్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపారు.
మెగా ఫ్యామిలీ లక్కీ చార్మ్!
మెగాస్టార్ చిరంజీవి ‘కొరియన్ కనకరాజు’ మూవీ సక్సెస్ మీట్‌లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. దాదాపు 7 ఇయర్స్ తర్వాత వరుణ్ తేజ్‌కి ఈ సినిమాతో హిట్ వచ్చి, ఆడియన్స్ నుంచి మంచి టాక్ వచ్చింది. అయితే ఈ సక్సెస్‌ని తన ఖాతాలో వేసుకోవద్దని, రీసెంట్‌గా పుట్టిన కొడుకు 'వాయువ్ తేజ్' అకౌంట్‌లో వేయాలని వరుణ్‌కి చిరు ఫన్నీగా చెప్పారు. వాయువ్ తమ ఫ్యామిలీకి లక్కీ చార్మ్ అని, వాడు వచ్చిన టైమ్‌కే ఈ హిట్ రావడం చాలా హ్యాపీగా ఉందన్నారు.
సత్య మిమిక్రీ టాలెంట్‌పై చిరు కామెంట్స్?
కామెడీ నటుడు సత్యపై మెగాస్టార్ చిరంజీవి ‘కొరియన్ కనకరాజు’ మూవీ ఈవెంట్‌లో ప్రశంసలు కురిపించారు. సత్య సినిమాలు తాను వరుసగా చూస్తుంటానని, అతని కామెడీని మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుందని చెప్పారు. "సత్య నువ్వు ఈ ఈవెంట్ లైవ్ చూస్తున్నావని తెలుసు, ముందు షూటింగ్‌కి వెళ్లు" అంటూ ఫన్నీగా అన్నారు. ఎలాంటి లిమిట్స్ లేకుండా యాక్ట్ చేసే సత్య టాలెంట్, మిమిక్రీ స్కిల్స్ అతని మెయిన్ పవర్ అని.. తన ఫ్యాన్ ఇంత గొప్ప స్థాయికి రావడం చాలా గర్వంగా ఉందంటూ చిరు మాట్లాడారు.
MLA పోచారం శ్రీనివాస్ బయటపెట్టిన కాంగ్రెస్ సీక్రెట్!
కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరాల్సి వచ్చిందో BRS మాజీ నేత పోచారం శ్రీనివాస్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. నిధుల కోసం తన కొడుకుని రేవంత్ రెడ్డి తమ్ముడి వద్దకు పంపగా, "BRS ఎమ్మెల్యేలకు ఒక్క రూపాయి కూడా ఫండ్స్ ఇవ్వం.. కాంగ్రెస్‌లో చేరితేనే పనులు జరుగుతాయి" అని చెప్పినట్లు వెల్లడించారు. అభివృద్ధి పనుల బిల్లుల కోసం కేడర్, ప్రజల నుంచి ప్రెజర్ పెరగడంతోనే నియోజకవర్గ సంక్షేమం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీ మారానని చెప్పారు.

లెన్స్ మారింది కానీ టాలెంట్ మారలేదు
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌ను అభినందిస్తూ మెగాస్టార్ చిరంజీవి చేసిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మెగాస్టార్ చిరంజీవి, వరుణ్ తేజ్ ఉన్న ఫోటో చూసి 'లెన్స్ మారింది కానీ టాలెంట్ మారలేదు' అంటూ వరుణ్ నటనను, ఆయన ఎంచుకునే పాత్రలను చిరంజీవి ప్రత్యేకంగా పొగిడారు. ఇక మెగాస్టార్ అంతటి వ్యక్తి నుంచి ఇలాంటి ప్రత్యేకమైన కాంప్లిమెంట్ రావడంతో వరుణ్ తేజ్ అభిమానులు చాలా ఆనందంగా , ఈ పోస్ట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
నన్ను నేను ఆపుకోలేకపోతున్నా- చిరంజీవి
'కొరియన్ కనకరాజు' మూవీ ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి తన 'చిరు లీక్స్'తో సందడి చేశారు. తమన్ వర్క్ గురించి చెబుతూ, తన Mega158 సినిమా టైటిల్‌ను లీక్ చేయబోయారు. పక్కనే ఉన్న తమన్ లీక్ చేయవద్దని చెప్పడంతో ఆగిన చిరంజీవి, "నన్ను నేను ఆపుకోలేకపోతున్నాను" అంటూ, "22న వచ్చే టీజర్‌లో టైటిల్ వేస్తున్నారా?" అని తమన్‌ను అడిగారు. ఇలా టైటిల్ లీక్ ఆపినా, తన నెక్స్ట్ మూవీ టీజర్ డేట్‌ను మాత్రం చిరు రివీల్ చేసేశారు.

Gen Z రోజుకు ఎన్ని గంటలు Phone చూస్తోంది?
Gen Z రోజుకు ఎంతసేపు ఫోన్ చూస్తుందో తెలుసా?📱ఒకే నంబర్ అందరికీ వర్తించదు.. దేశం, వయసు, చదువు, పని, యాప్స్ వాడకం బట్టి మారుతుంది. 2026లో భారతదేశంలోని 18–24 ఏళ్ల 400 మంది యువతపై జరిగిన ఓ స్టడీలో సగటు రోజువారీ స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ టైమ్ 5.63 గంటలుగా నమోదైంది. మరో 2025 UK సర్వేలో 16–24 ఏళ్ల Gen Z రోజుకు సగటున 4.84 గంటలు ఫోన్ వాడుతున్నట్లు తేలింది. అయితే ఈ టైమ్ అంతా సోషల్ మీడియా కోసం మాత్రమే కాదు.. చదువు, మెసేజింగ్, వీడియోలు, పని, సెర్చ్ వంటి పనులు కూడా ఇందులో ఉంటాయి. మరి మీ Screen Time ఎంత? 🙂

కోతితో సరదా.. విక్రమ్‌కు లీగల్ ముప్పు!
తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ఓ అరుదైన విదేశీ జాతి కోతి (లార్ గిబ్బన్)తో కలిసి సరదాగా రీల్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వన్యప్రాణుల సంరక్షణ నిబంధనలకు విరుద్ధంగా ఇలాంటి అరుదైన జీవులను ఇంట్లో ఉంచుకోవడంపై వైల్డ్‌లైఫ్ అధికారులకు ఫిర్యాదులు వెళ్లడంతో విక్రమ్ ఆ వీడియోను వెంటనే డిలీట్ చేశారు. అయినప్పటికీ అటవీ శాఖ అధికారులు వీడియో ఆధారంగా పూర్తి విచారణ ప్రారంభించారు.

కోలీవుడ్‌లో వెంకీ మామ!
విక్టరీ వెంకటేష్ టాలీవుడ్‌లో పవన్, మహేష్, వరుణ్ తేజ్‌లతో కలిసి మల్టీస్టారర్లు చేసిన ఆయన, హిందీలో సల్మాన్ ఖాన్‌తోనూ మెప్పించారు. తాజాగా తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటిస్తున్న ‘డేర్ డెవిల్’ సినిమాలో వెంకటేష్ ఒక కీలక పాత్రలో నటించనున్నట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో సెప్టెంబర్ నుంచి షూటింగ్ మొదలౌతున్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో వెంకీ మామ చేరుతున్నారనే వార్తతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

గాయాన్ని కూడా లెక్కచేయని రష్మిక.. విజయ్ హిట్ కోసమేనా?
రష్మిక మందన్న ‘రణబాలి’ సినిమా కోసం రిస్క్ చేస్తున్నారని సోషల్ మీడియాలో టాక్ వస్తుంది. ఇటీవల డ్యాన్స్ షూటింగ్‌లో గాయపడిన ఆమెకు డాక్టర్లు 6 వారాలు విశ్రాంతి చెప్పినా, సినిమా ఆలస్యం కాకూడదని షూటింగ్‌లో పాల్గొనాలని చూస్తున్నారు. విజయ్ దేవరకొండ వద్దన్నా వినకుండా, ఆయనకు హిట్ ముఖ్యం అని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అక్టోబర్ 30న విడుదల కానున్న ఈ సినిమాకి ఇతర పెద్ద సినిమాల పోటీ లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది.
ఫ్రెండ్స్ డ్రగ్స్ వాడితే పోలీసులకి చెప్పండి-CM విజయ్
'నో డ్రగ్స్' ప్రోగ్రామ్‌లో CM విజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్టూడెంట్స్ తో కలిసి డ్రగ్స్ వాడకానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. ఎవరూ డ్రగ్స్ తీసుకోకూడదని, ఒకవేళ ఫ్రెండ్స్ ఎవరైనా వాడుతుంటే సైలెంట్‌గా ఉండకుండా వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పారు. సొసైటీ నుంచి డ్రగ్స్‌ను పూర్తిగా తీసేయడానికి ప్రతీ ఒక్కరూ బాధ్యతగా ఉండాలని, తమిళనాడును డ్రగ్ ఫ్రీగా మార్చేందుకు హెల్ప్ చేయాలని CM విజయ్ కోరారు.

జార్ఖండ్‌లో 10వ రోజుకు చేరుకున్న దీక్ష అప్డేట్!
సదర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న <a href="https://x.com/DevendraNathMa9/status/2087161637962957169?s=20">దేవేంద్రనాథ్ మహతో</a> న్యాయం కోసం ఒక ఓపెన్ లెటర్ రిలీజ్ చేశారు. ఆయన చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష నేటితో 10వ రోజుకు చేరుకుంది. అసెంబ్లీ ముట్టడి ప్రొగ్రామ్‌ను సక్సెస్ చేసిన సపోర్టర్స్ అందరికీ ఆయన థ్యాంక్స్ చెప్పారు. శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తున్న వారిపై లాఠీఛార్జ్ చేసిన ఆఫీసర్స్‌పై వెంటనే యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమకు కంప్లీట్‌గా న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదని, నిరసన కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

నర్సుల కోసం కవిత గళం..
TG : ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేసే నర్సులకు కనీసం హెల్త్ ఇన్సూరెన్స్ కూడా లేకపోవడంపై BRS నాయకురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. రోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసే హాస్పిటల్ యాజమాన్యాలు, తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి పనిచేసే నర్సుల సంక్షేమాన్ని పట్టించుకోకపోవడం సరికాదని అన్నారు . రాత్రింబవళ్లు శ్రమించే సిబ్బందికి ఆరోగ్య భద్రత కల్పించకపోవడం విచారకరమని, వెంటనే ప్రభుత్వం స్పందించి ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.