Latest

ఈ ఇటాలియన్ పాస్తా స్పెషాలిటీ ఏంటో తెలుసా?
Health· 6 Aug 2026

ఈ ఇటాలియన్ పాస్తా స్పెషాలిటీ ఏంటో తెలుసా?

ఎలేన్స్ ఫెటుచిని ఆల్‌ఫ్రెడో (ఇటాలియన్-అమెరికన్ పాస్తా) చూడటానికి సింపుల్ మ్యాక్ అండ్ చీజ్ లానే అనిపించినా, దాని టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్! పెద్దగా హడావుడి, కాంప్లికేటెడ్ ఇంగ్రెడియెంట్స్ ఏమీ లేకుండా చాలా లైట్‌గా, టేస్టీగా ఉండే ఈ ఇటాలియన్ పాస్తా డిష్ ఫుడ్ లవర్స్‌ను అమితంగా ఆకట్టుకుంటోంది. ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకునే ఈ డిష్, తింటే మాత్రం మంచి ఫీలింగ్ ఇస్తుందంటున్నారు ఫుడీస్.

భారత్ మరో కీలక మిసైల్ పరీక్ష సక్సెస్! 🚀
Science· 6 Aug 2026

భారత్ మరో కీలక మిసైల్ పరీక్ష సక్సెస్! 🚀

ఒడిశాలోని చాందీపూర్ నుంచి భారత్ ‘అగ్ని-IV’ బాలిస్టిక్ మిసైల్‌ను విజయవంతంగా పరీక్షించింది! 🚀🇮🇳 దాదాపు 4,000 కిలోమీటర్ల రేంజ్ కలిగిన ఈ మిసైల్‌కు సంబంధించిన ఆపరేషనల్, టెక్నికల్ సామర్థ్యాలను చెక్ చేసేందుకు ఈ ట్రయల్ నిర్వహించారు. పరీక్ష సమయంలో నిర్దేశించిన అన్ని లక్ష్యాలను మిసైల్ విజయవంతంగా చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. అగ్ని-IV భారత్‌కు చెందిన ఇంటర్మీడియట్-రేంజ్ బాలిస్టిక్ మిసైల్. దేశ రక్షణ సామర్థ్యాన్ని పరీక్షించడంలో ఈ ట్రయల్ మరో కీలక అడుగుగా నిలిచింది.

పశ్చిమాసియాలో టెన్షన్స్ వేళ బిగ్ అప్‌డేట్!
Politics· 6 Aug 2026

పశ్చిమాసియాలో టెన్షన్స్ వేళ బిగ్ అప్‌డేట్!

పశ్చిమాసియాలో టెన్షన్స్ పెరుగుతున్న టైమ్‌లో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, భారత్ ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్‌లో మాట్లాడారు. ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలు, వివిధ రంగాల్లో భాగస్వామ్యంపై చర్చించారు. దీనితో పాటు పశ్చిమాసియాలోని తాజా సిట్యుయేషన్‌పై కూడా ఇద్దరు లీడర్స్ డిస్కస్ చేసినట్లు ప్రధాని కార్యాలయం (PMO) వెల్లడించింది.

కస్టడీలోకి ట్రైనీ IPS ఆఫీసర్!
News· 6 Aug 2026

కస్టడీలోకి ట్రైనీ IPS ఆఫీసర్!

మహిళా ట్రైనీ IPS లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన ఉదయ్ కృష్ణారెడ్డిని ఉమెన్ సేఫ్టీ వింగ్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో DCP లావణ్య నాయక్ పర్యవేక్షణలో CI జ్యోత్స్న విచారణ జరుపుతున్నారు. రేపు సాయంత్రం 5:30 గంటల వరకు కస్టడీ కొనసాగనుంది. గతనెల 28న అరెస్ట్ అయిన ఉదయ్ కృష్ణారెడ్డి నుంచి ఈ విచారణలో కీలక ఆధారాలు సేకరించాలని చూస్తున్నారు. కస్టడీలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే ఛాన్స్ ఉంది.

ఫ్రెండ్‌షిప్ డే రోజే ఘోరం!
Crime· 6 Aug 2026

ఫ్రెండ్‌షిప్ డే రోజే ఘోరం!

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఒక దారుణమైన ఇన్సిడెంట్ జరిగింది. పెళ్లి విషయంపై గొడవ జరగడంతో, ఫ్రెండ్‌షిప్ డే రోజే ఆశా డే (29) అనే యువతిని ఆమె ప్రియుడు కన్హాన్ నదిలోకి తోసేసి హత్య చేశాడు. ఘటన తర్వాత ఏమీ తెలియనట్లు నమ్మించే ప్రయత్నం చేసినా, పోలీసులు కేసును ఇన్వెస్టిగేట్ చేసి అసలు నిజం బయటపెట్టారు. నిందితుడు ఆశిష్ మాంపియాను అరెస్ట్ చేసి జైలుకు పంపారు.

APలో 'దిశ బిల్లు' విత్‌డ్రా!
Politics· 6 Aug 2026

APలో 'దిశ బిల్లు' విత్‌డ్రా!

YCP హయాంలో తీసుకొచ్చిన దిశ బిల్లును విత్‌డ్రా చేసుకునేందుకు AP CM చంద్రబాబు నేతృత్వంలోని కేబినెట్ ఆమోదం తెలిపింది. మహిళల సేఫ్టీ కోసం 2019లో అప్పటి CM YS జగన్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా దిశ యాప్, పోలీస్ స్టేషన్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లను ఏర్పాటు చేశారు. ఈ యాప్ ద్వారా ఇప్పటివరకు 31,607 మందికి పోలీసులు రక్షణ కల్పించారు. అయితే, తాజాగా ఈ బిల్లును ఉపసంహరించుకునే ప్రతిపాదనకు మంత్రిమండలి ఓకే చెప్పింది.

Gen Zకి సపోర్ట్‌గా RSS చీఫ్ మోహన్ భగవత్ రెస్పాన్స్!
Politics· 6 Aug 2026

Gen Zకి సపోర్ట్‌గా RSS చీఫ్ మోహన్ భగవత్ రెస్పాన్స్!

NEET పేపర్ లీక్ ప్రోటెస్ట్స్‌పై RSS చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రొటెస్ట్ చేస్తున్న Gen Z యూత్‌ను 'యాంటీ నేషనల్స్' అనడం తప్పు అని.. వాళ్ల ప్రాబ్లెమ్స్ నిజమైనవని ముంబై ఈవెంట్‌లో స్పందించారు. ఇప్పటి Gen Z, Gen Alpha ప్రతీది క్వశ్చన్ చేస్తూ చాలా హానెస్ట్‌గా ఉన్నారని.. డెమోక్రసీలో ప్రొటెస్ట్ చేయడం కూడా కరెక్టే అని అన్నారు. సిస్టమ్‌లో ప్రాబ్లెమ్స్ ఉన్నప్పుడు క్వశ్చన్ చేయడం తప్పు కాదని, యూత్‌తో మాట్లాడి ప్రాబ్లెమ్స్ సాల్వ్ చేయాలని చెప్పారు.

నిద్రపోయే ముందు ఇవి అస్సలు మర్చిపోకండి!
Health· 6 Aug 2026

నిద్రపోయే ముందు ఇవి అస్సలు మర్చిపోకండి!

మంచి ఆరోగ్యం, ప్రశాంతమైన నిద్ర కావాలంటే రాత్రి పడుకోవడానికి ఒక అర గంట ముందే ఫోన్ పక్కన పెట్టాలని, అప్పుడే మంచి నిద్ర పడుతుందని డాక్టర్లు చెబుతున్నారు. తర్వాత కొన్ని నీళ్లు తాగితే బాడీ డీహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుంది. లైట్‌గా స్ట్రెచింగ్ చేయడం వల్ల రోజంతా ఉన్న అలసట తగ్గి బాడీ రిలాక్స్ అవుతుంది. రేపు పొద్దున్నే వేసుకునే బట్టలు, చేయాల్సిన పనులను ఇప్పటి నుంచే ప్లాన్ చేసి పెట్టుకుంటే ఉదయాన్నే టెన్షన్ ఉండదు. చివరిగా 7 నుండి 8 గంటలు హాయిగా నిద్రపోతే, మరుసటి రోజు ఫుల్ ఎనర్జిటిక్‌గా ఉండవచ్చు.

ఇప్పుడు Gen Z ట్రెండ్ ఇదే!
News· 6 Aug 2026

ఇప్పుడు Gen Z ట్రెండ్ ఇదే!

ఈ కాలం Gen Z ఆలోచనల్లో చాలా చేంజెస్ వస్తున్నాయి. వీళ్లు శాలరీ కంటే స్కిల్స్ అండ్ జాబ్ సెక్యూరిటీకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. వర్క్-లైఫ్ బ్యాలెన్స్, మెంటల్ హెల్త్ చూసుకుంటూ AI టూల్స్ నేర్చుకోవడంపై ఫోకస్ పెడుతున్నారు. ఒకే జాబ్‌పై ఆధారపడకుండా సైడ్ ఇన్‌కమ్ కోసం ఫ్రీలాన్సింగ్, బిజినెస్ వైపు మొగ్గుతున్నారు. అంతేకదా, పెళ్లి కంటే ముందే ఫైనాన్షియల్‌గా సెటిల్ అవ్వాలని, సరిగ్గా టైమ్ వచ్చినప్పుడే మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారని రీసెంట్ సర్వేలు చెప్తున్నాయి.

ప్రభాస్ 60+ Days ఈ సినిమాకే!
Entertainment· 6 Aug 2026

ప్రభాస్ 60+ Days ఈ సినిమాకే!

ప్రభాస్ నెక్స్ట్ 60 రోజులకు పైగా ‘ఫౌజీ’కే ఇచ్చేస్తున్నారా..? 🔥హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్ట్ ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. ఇటలీ ట్రిప్ తర్వాత ప్రభాస్ హైదరాబాద్‌కు తిరిగి వచ్చి 60 రోజులకు పైగా షూటింగ్ చేయనున్నట్లు సమాచారం. ఇందులో ప్రభాస్ సైనికుడి పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని పెంచగా, ఈ లాంగ్ షెడ్యూల్‌తో కీలకమైన సీన్స్‌ను పూర్తి చేయాలని టీమ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

మునక్కాయలో ఉన్న మ్యాజిక్ ఇదే!
Health· 6 Aug 2026

మునక్కాయలో ఉన్న మ్యాజిక్ ఇదే!

మునక్కాయ లో విటమిన్స్ A, C, E, K తో పాటు క్యాల్షియం, ఐరన్, ప్రోటీన్ ఫుల్లుగా ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి, షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంచడానికి, డైజెషన్ అండ్ హార్ట్ హెల్త్‌ను కాపాడటానికి సూపర్‌గా హెల్ప్ అవుతాయి. డైలీ డైట్‌లో మునక్కాయ యాడ్ చేసుకుంటే బాడీకి ఫుల్ ఎనర్జీ దక్కడమే కాకుండా, రకరకాల ఇన్ఫెక్షన్ల నుంచి బాడీని ఈజీగా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు.

‘వారణాసి’ షూటింగ్ వీడియో మళ్లీ Leak?
Entertainment· 6 Aug 2026

‘వారణాసి’ షూటింగ్ వీడియో మళ్లీ Leak?

రాజమౌళి–మహేష్ బాబు ‘వారణాసి’ నుంచి మరో లీక్.. ఫ్యాన్స్‌కే టెన్షన్! 👀🎥 సినిమా షూటింగ్‌కు సంబంధించినవిగా చెబుతున్న కొన్ని కొత్త విజువల్స్ సోషల్ మీడియాలోకి వచ్చాయి. భారీ సెక్యూరిటీ మధ్య షూటింగ్ జరుగుతున్నా ఇలా కంటెంట్ బయటకు రావడంతో, వాటిని షేర్ చేయొద్దంటూ మహేష్ ఫ్యాన్స్ కోరుతున్నారు. గతంలో జరిగిన లీక్‌పై రాజమౌళి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ తాజా లీక్‌పై మూవీ టీమ్ నుంచి ఇప్పటివరకు అధికారిక స్పందన కనిపించలేదు.

చైనా కంటే ఎంతో ముందంజ!
Sports· 6 Aug 2026

చైనా కంటే ఎంతో ముందంజ!

ప్రపంచంలోనే అత్యధిక చెస్ గ్రాండ్‌మాస్టర్లు ఉన్న దేశాల జాబితాలో ఇండియా 5వ స్థానంలో నిలిచింది. 2026 ఎఫ్‌ఐడీఈ (FIDE) డేటా ప్రకారం.. 85 కంటే ఎక్కువ గ్రాండ్‌మాస్టర్లతో భారత్ టాప్ 5లో చోటు దక్కించుకుంది. ఈ లిస్ట్‌లో 250 మందికి పైగా గ్రాండ్‌మాస్టర్లతో రష్యా టాప్‌లో ఉండగా.. జర్మనీ (100+), యునైటెడ్ స్టేట్స్ (95+), ఉక్రెయిన్ (90+) వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. చైనా 40కి పైగా గ్రాండ్‌మాస్టర్లతో 10వ స్థానానికి పరిమితమైంది.

'ది ప్యారడైజ్' టీజర్ చూసేయండి!
Cinema· 6 Aug 2026

'ది ప్యారడైజ్' టీజర్ చూసేయండి!

నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'ది ప్యారడైజ్' టీజర్‌ను రిలీజ్ అయింది. ఇందులో నాని 'జడల్' అనే పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించనున్నారు. కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మోహన్‌బాబు, తనికళ్ల భరణి, సోనాలి కులకర్ణి, సంపూర్ణేష్ బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను సెప్టెంబరు 24న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు మూవీ టీమ్ అనౌన్స్ చేసింది.

రిజర్వేషన్లు ఉంటే వెనుకబాటుతనం పోయినట్టేనా?
Politics· 6 Aug 2026

రిజర్వేషన్లు ఉంటే వెనుకబాటుతనం పోయినట్టేనా?

రిజర్వేషన్లు ఉన్నంత మాత్రాన STల వెనుకబాటుతనం పోయినట్లు కాదని తెలంగాణ రక్షణ సేన (TRS) అధ్యక్షురాలు కల్వకుంట్ల <a href="https://x.com/OfficeOfKavitha/status/2085333805381156866?s=20">కవిత</a> అన్నారు. "సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ"లో మాట్లాడిన ఆమె.. ఇప్పటికీ 99% ఎస్టీలు అత్యంత పేదరికంలోనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అడవుల నుంచి ఆదివాసీలను వెళ్లగొట్టి, 1/70 చట్టాన్ని పక్కనపెట్టి కార్పొరేట్లకు అప్పగిస్తున్నారని ఆరోపించారు. గిరిజనులు, లంబాడీలు, ఎరుకల వెనుకబాటుతనాన్ని పూర్తిగా నిర్మూలిస్తానని సభలో ప్రతిజ్ఞ చేశారు.

మీకు కూడా Years చాలా Fastగా గడిచిపోతున్నట్టు అనిపిస్తోందా?
Education· 6 Aug 2026

మీకు కూడా Years చాలా Fastగా గడిచిపోతున్నట్టు అనిపిస్తోందా?

చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ చాలా లాంగ్‌గా అనిపించేవి.. ఇప్పుడు చూస్తుండగానే మరో సంవత్సరం అయిపోతోంది! 😭 ఎందుకిలా? దీనికి మన బ్రెయిన్‌లోని టైమ్ పర్సెప్షన్ ఒక కారణం. చిన్నప్పుడు కొత్త ఫ్రెండ్స్, కొత్త ప్లేసెస్, కొత్త ఎక్స్‌పీరియన్స్‌లు అంటూ చాలా విషయాలు ఫస్ట్ టైమ్ చూస్తాం. దీంతో ఎక్కువ కొత్త మెమరీస్ క్రియేట్ అవుతాయి. పెద్దయ్యాక రోజులు ఎక్కువగా ఒకే రొటీన్‌లో వెళ్లడంతో, వెనక్కి చూసినప్పుడు నెలలు, సంవత్సరాలు చాలా ఫాస్ట్‌గా గడిచినట్టు అనిపించొచ్చు. టైమ్ అదే.. మన అనుభూతే మారింది! ⏳

టీచర్లు ఆస్పత్రికి తీసుకెళ్లినా దక్కని ప్రాణం!
News· 6 Aug 2026

టీచర్లు ఆస్పత్రికి తీసుకెళ్లినా దక్కని ప్రాణం!

నారాయణపేట జిల్లా ఎక్లాస్‌పూర్‌లో ఒక శాడ్ ఇన్సిడెంట్ జరిగింది. స్థానిక గవర్నమెంట్ స్కూల్లో 3వ తరగతి చదువుతున్న రంజిత్ (8) అనే స్టూడెంట్‌ని గురువారం క్లాస్‌రూమ్‌లో ఉండగానే పాము కాటువేసింది. గమనించిన టీచర్లు వెంటనే అతడిని గవర్నమెంట్ హాస్పిటల్‌కి షిఫ్ట్ చేశారు. కానీ అక్కడ ట్రీట్మెంట్ పొందుతూ రంజిత్ చనిపోయాడు. క్లాస్‌రూమ్‌లోనే చిన్నారికి పాము కరవడంతో బాధితుడి ఫ్యామిలీ మెంబర్స్ కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనతో ఊరంతా షాక్‌లో ఉండిపోయింది.

ఇకపై PhonePe, GPay ఉచితం కాదా?
Politics· 6 Aug 2026

ఇకపై PhonePe, GPay ఉచితం కాదా?

గూగుల్ పే, ఫోన్ పే వంటి UPI లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేసేలా బ్యాంకర్లకు పర్మిషన్ ఇచ్చే 'పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ యాక్ట్-2007' సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. సభలో ఎలాంటి చర్చ లేకుండానే ఈ బిల్లు పాస్ కావడం గమనార్హం. ప్రస్తుతం దేశంలో ప్రతీ చిన్న పేమెంట్‌కి UPI వాడుతున్న నేపథ్యంలో, కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం సామాన్య యూజర్లపై పెద్ద భారం మోపే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

బెళగావిలో ఘోర రోడ్డు ప్రమాదం
Crime· 6 Aug 2026

బెళగావిలో ఘోర రోడ్డు ప్రమాదం

కర్ణాటక రాష్ట్రం బెళగావిలో KSRTC బస్సు, మోటార్ సైకిల్ ఢీకున్నాయి. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. మృతుల వివరాలు తెలుసుకొని వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.

నా లైఫ్ అంతా వీరికి అంకితం- కల్వకుంట్ల కవిత
Politics· 6 Aug 2026

నా లైఫ్ అంతా వీరికి అంకితం- కల్వకుంట్ల కవిత

"సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ"లో కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. నేను అగ్రవర్ణాల్లో పుట్టడం నా చేతుల్లో లేదు, ఎవరి పుట్టుకపైనా వాళ్లకు గర్వం ఉంటుంది.. కానీ ఎవరి కోసం పనిచేయాలో నా చేతుల్లో ఉందని ఆమె అన్నారు. దశాబ్దాలుగా అసెంబ్లీ, పంచాయతీల ముఖం చూడని BC, SC, ST, అణగారిన వర్గాల హక్కుల కోసమే తన ఫైట్ అని చెప్పారు. రాజకీయాధికారం లేని ఈ కమ్యూనిటీస్ అందరికీ కంప్లీట్ సోషల్ జస్టిస్ దక్కేంత వరకు తన జీవితాన్ని అంకితం చేస్తున్నానని కవిత అనౌన్స్ చేశారు.

బిగ్ స్క్రీన్ కల: నటుడు భాను స్టేజ్‌పై అలా ఎందుకు చేశాడు?
Cinema· 6 Aug 2026

బిగ్ స్క్రీన్ కల: నటుడు భాను స్టేజ్‌పై అలా ఎందుకు చేశాడు?

తన్ను తాను బిగ్ స్క్రీన్‌పై చూసుకోవడం ఒక కల అని నటుడు భాను ఎమోషనల్ అయ్యారు. బిక్షు డైరక్షన్ లో అన్ను, వాసవి గణేష్ జంటగా నటించిన 'హుషార్ పిట్టలు' మూవీలో ఆయన కీ రోల్ చేశారు. ఆగస్టు 15న ఈ సినిమా రిలీజ్ కానుండగా, రీసెంట్‌గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో భాను మాట్లాడుతూ.. ఇండస్ట్రీలోకి రావడానికి 8 ఏళ్లు స్ట్రగుల్ అయ్యానని చెప్పారు. ఇది కలనా, నిజమా అంటూ స్టేజ్ మీదే పదే పదే చెంపలు కొట్టుకోవడంతో అందరూ షాక్ అయ్యారు.