Latest

కర్నూలులో TDP కార్యకర్త దారుణ హత్య
AP: కర్నూలులో TDP కార్యకర్త ఇంతియాజ్ దారుణ హత్యకు గురయ్యారు. తన స్నేహితులతో కలిసి మాట్లాడుతుండగా మాటామాటా పెరిగి గొడవపడ్డారు. పక్కనే ఉన్న వక్తి ఇంతియాజ్‌పై రాయితో దాడి చేయగా అక్కడిక్కడే చనిపోయాడు. గత ఎన్నికల్లో ఇంతియాజ్ ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. తరువాత TDPలో చేరి పార్టీ కార్యకర్తగా కొనసాగుతున్నారు. భూ వివాదాల కారణాలతో హత్య జరిగి ఉండొచ్చన్న పర్‌స్పెక్టివ్‌లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంతియాజ్ హత్యను మంత్రి టీజీ భరత్ ఖండించారు.

అర్ధరాత్రి హాస్టల్‌లోకి యువకుడు
TG: సూర్యాపేట జిల్లా మోతె మండల కేంద్రంలోని KGBV హాస్టల్‌లోకి అర్ధరాత్రి ఓ యువకుడు చొరబడటం కలకలం రేపింది. సిబ్బంది కంటపడకుండా సుమారు రెండుగంటల పాటు హాస్టల్ ఆవరణలో అనుమానాస్పదంగా తిరిగాడు. యువకుడిని గమనించిన విద్యార్థినులు, సిబ్బంది గట్టిగా కేకలు వేయడంతో అతడు గోడ దూకి పరారయ్యాడు. ఘటనతో విద్యార్థినుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. హాస్టల్‌లో భద్రతా లోపాలపై ప్రశ్నించారు. ప్రిన్సిపల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

హైదరాబాద్‌లో అస్సాం రెస్టారెంట్
హైదరాబాద్‌లోని కోకాపేట్‌లో అస్సామీ వంటకాల రుచులను అందించడానికి 'ఆఖోల్' అనే 90 సీట్ల కొత్త రెస్టారెంట్ మొదలైంది.. అస్సామీ భాషలో 'ఆఖోల్' అంటే వంటగది అని అర్థం. అస్సాం పల్లెటూరి వాతావరణం గుర్తుకొచ్చేలా, వెదురు, బెత్తం వస్తువులతో ఈ రెస్టారెంట్ ఇంటీరియర్స్‌ను డిజైన్ చేశారు. అస్సామీ స్టైల్ వెజ్, నాన్-వెజ్ థాళీలతో పాటు ఖార్, తిల్ చికెన్, మటన్ కర్రీ, ఫిష్ తెంగా లాంటి వాళ్ల సాంప్రదాయ రుచులు బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇక్కడ ఇద్దరు కలిసి భోజనం చేయడానికి రూ. 1,500 వరకు ఖర్చవుతుంది.

బోనాల ఫ్లెక్సీ కడుతుండగా కరెంట్ షాక్
TG: బోనాల పండుగ సందర్భంగా మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి యువకుడు(19) మృతి చెందాడు. శివాలయం వద్ద ఫ్లెక్సీ కడుతున్న సమయంలో ఇనుప పైప్ ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలకు తగలడంతో మల్పర్తి హర్షవర్ధన్‌కు కరెంట్ షాక్ తగిలింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇదే ఘటనలో మరో ఇద్దరు యువకులు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Healthy Habits
మనం చేసుకునే చిన్న మంచి అలవాట్లే ఆరోగ్యాన్ని పూర్తిగా మార్చేస్తాయి. ఉదయాన్నే కాఫీకి ముందు నీళ్లు తాగడం, భోజనం తర్వాత 10 నిమిషాలు నడవడం, ప్రొటీన్ ఉన్న ఫుడ్ తీసుకోవడం మంచిదని డాక్టర్లు చెప్తున్నారు. రాత్రి 11 గంటల లోపే పడుకోవడం, రోజూ 5 నిమిషాలు స్ట్రెచింగ్, 15 నిమిషాలు ఎండలో ఉండడం వల్ల బాడీ ఆక్టివ్ గా ఉంటుంది. వారానికి 3 సార్లు వెయిట్ లిఫ్టింగ్, రోజూ పండ్లు తినడం, పడుకునే ముందు ఫోన్ పక్కన పెట్టడం, రోజుకు 10 పేజీలు బుక్స్ చదవడం లాంటి అలవాట్లు మన ఆరోగ్యాన్ని పూర్తిగా మార్చేస్తాయని అంటున్నారు.

ఆధార్ వెరిఫికేషన్ అంటూ వచ్చి హత్య చేశారు
AP: పల్నాడు జిల్లా పెదకూరపాడులోని దామచర్లపాలెంలో దారుణ ఘటన జరిగింది. వృద్ధ దంపతుల ఇంట్లోకి ఆధార్ కార్డు వెరిఫికేషన్ పేరుతో ఇద్దరు వ్యక్తులు వచ్చి బాలగురవయ్యపై సుత్తితో దాడి చేశారు. అడ్డుకునేందుకు వచ్చిన ఆయన భార్య అరుణను గొంతుకోసి చంపేసి పారిపోయారు. స్థానికులు గాయాలైన బాలగురవయ్యను హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఇన్ఫర్మేషన్ అందుకున్న పోలీసులు, డీఎస్పీ క్రిష్ణ చైతన్య ఘటన స్థలాన్ని పరిశీలించారు. స్పెషల్ టీమ్స్‌ను ఏర్పాటు చేసిన పోలీసులు నిందితుల కోసం వెతుకుతున్నారు.

కోహ్లీని దాటేసిన షారుఖ్ ఖాన్
'క్రోల్ ఇండియా సెలబ్రిటీ బ్రాండ్ వాల్యుయేషన్ 2025' రిపోర్ట్ ప్రకారం, బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ $177.9 మిలియన్ల బ్రాండ్ వాల్యూతో టాప్‌లో నిలిచారు. ఈ లిస్ట్‌లో రణ్‌వీర్ సింగ్ ($162.9 మిలియన్లు) రెండో స్థానాన్ని, కోహ్లీ ($158.4 మిలియన్లు) మూడో స్థానంలో నిలిచారు. సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. AI టెక్నాలజీ వల్ల బ్రాండ్లు, సెలబ్రిటీల వైపు ఆసక్తి చూపిస్తున్నాయి. అందుకే వాళ్ల బ్రాండ్ వ్యాల్యూలు ఇప్పుడు ఆల్ టైమ్ రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి.

నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్‌ను ప్రకటించిన CJP
కాక్రోచ్ జనతా పార్టీ(CJP) నిన్న తన తొలి నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ లిస్టును ప్రకటించింది. పార్టీ బలోపేతం దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ తెలిపింది. 'ఎక్స్'లో చేసిన పోస్టులో తమ యాక్షన్ ప్లాన్ అమలుకు నేషనల్ కమిటీ తొలి లీడర్‌షిప్ లిస్టును అప్రూవ్ చేసింది. పార్టీ ఫౌండర్ అభిజీత్ దీప్కే నేషనల్ కన్వీనర్‌గా ఉండగా, అశుతోష్ రంకా, సౌరవ్ దాస్ కో-కన్వీనర్లుగా బాధ్యతలు చేపట్టారు. జాతీయ వర్కింగ్ కమిటీ మెంబర్స్ వయసులను కూడా పార్టీ ప్రత్యేకంగా వెల్లడించడం విశేషంగా నిలిచింది.

ఆరోగ్యం మీ చేతుల్లో..
నరాల బలానికి, శరీరంలో శక్తి పెరగడానికి ఉపయోగపడే మెగ్నీషియం కోసం డార్క్ చాక్లెట్, ధాన్యాలు, అరటిపండు, పాలకూర, బాదం తీసుకోవాలి. మనకు రోగనిరోధక శక్తి పెరిగి, వ్యాధులు రాకుండా ఉండాలంటే జింక్ చాలా అవసరం. దీని కోసం రోజువారీ ఆహారంలో గుమ్మడి గింజలు, జీడిపప్పు, శనగలు, పాలు, గుడ్లు తీసుకోవాలి. గుండె ఆరోగ్యానికి, థైరాయిడ్ సమస్యలు రాకుండా కాపాడే సెలీనియం కావాలంటే చేపలు, బ్రెజిల్ నట్స్, ప్రొద్దుతిరుగుడు గింజలు, బ్రౌన్ రైస్‌ను డైట్‌లో తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు.

మనీ లాండరింగ్ కేసు పేరుతో భారీ మోసం
AP: ఈడీ అధికారులం, మేము ఢిల్లీ పోలీసులం అంటూ సైబర్‌నేరగాళ్లు కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన వృద్ధురాలు అలవేలు మంగమ్మను మోసం చేశారు. మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ చేస్తామని, ఆస్తులు సీజ్ చేస్తామని బెదిరించి వీడియో కాల్స్‌తో నమ్మించారు. కేసు నుంచి తప్పించాలంటే డబ్బు చెల్లించాలని చెప్పడంతో ఆమె రూ.1.43 కోట్లు RTGS ద్వారా వారి ఖాతాలకు బదిలీ చేశారు. మరో రూ.95 లక్షలు డిమాండ్ చేయడంతో అనుమానం వచ్చిన బాధితురాలు అమెరికాలో ఉన్న తన కుమారుడికి విషయం చెప్పింది. అతడి సూచన మేరకు పోలీసులను ఆశ్రయించింది.

CJP నేషనల్ కమిటీలో హైదరాబాద్ యువకుడికి కీలక బాధ్యతలు
TG: హైదరాబాద్‌కు చెందిన యంగ్ సోషల్ యాక్టివిస్ట్ విజయ్‌రెడ్డి మల్లంగి CJP నేషనల్ మీడియా కోఆర్డినేటర్‌గా, సౌత్ స్టేట్స్ ఇన్‌చార్జిగా ఎంపికయ్యారు. CJP తొలి నేషనల్ లీడర్‌షిప్ టీమ్‌లో తెలుగు యువకుడికి చోటు దక్కడం విశేషం. అమెరికాలో హయ్యర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి జాబ్ వదిలి సోషల్ సర్వీస్‌లోకి వచ్చిన విజయ్‌రెడ్డి, 'Save KBR', 'కంచ గచ్చిబౌలి భూముల పరిరక్షణ' వంటి ఉద్యమాల్లో పాల్గొన్నారు. సోనమ్ వాంగ్‌చుక్ చేసిన నిరసన కార్యక్రమాల్లో కోఆర్డినేటర్‌గా చేసిన ఆయన సేవలను గుర్తించి సీజేపీ ఈ బాధ్యతలు అప్పగించింది.

YSRCP మాజీ ఎమ్మెల్యేకు రిమాండ్.. జైలుకు తరలింపు
AP: కిడ్నాప్, SC, ST అట్రాసిటీ కేసులో YSRCP మాజీ MLA ముస్తఫాకు నూజివీడు ఫస్ట్ అడిషనల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ రిమాండ్ విధించారు. ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం కోయిలగూడెంకు చెందిన పొగాకు వ్యాపారి అభి కిడ్నాప్ కేసులో ముస్తఫా, ఆయన కొడుకు బషీర్ నిందితులుగా ఉన్నారు. అబ్స్కాండింగ్‌లో ఉన్న ముస్తఫాను పోలీసులు గుజరాత్‌లో అదుపులోకి తీసుకుని, మిడ్‌నైట్ మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టగా రిమాండ్‌కు ఆదేశించింది. తరువాత ఆయనను, బషీర్‌ను నెల్లూరు జైలుకు తీసుకెళ్లారు.

గాంధీభవన్ నిరసనలపై DCC అధ్యక్షురాలు సీరియస్
TG: కొమురంభీమ్ జిల్లా కాంగ్రెస్‌లో నెలకొన్న అంతర్గత విభేదాలపై DCC అధ్యక్షురాలు ఆత్రం సుగుణ స్పందించారు. డీసీసీ హటావో.. కాంగ్రెస్ బచావో పేరుతో హైదరాబాద్‌లోని గాంధీభవన్ ఎదుట చేపట్టిన నిరసనలను ఆమె తీవ్రంగా ఖండించారు. ఆసిఫాబాద్‌లోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఆమె మాట్లాడారు. పార్టీపై అసంతృప్తులు ఉంటే అంతర్గతంగా చర్చించాలని, బహిరంగ నిరసనలు పార్టీ ప్రతిష్టకు నష్టం కలిగిస్తాయని అని అన్నారు. వ్యక్తిగత ప్రయోజనాలు, పదవుల ఆశతో కొందరు పార్టీని బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

బాలికల సాధికారతకు ప్రత్యేక కార్యాచరణ
AP: బాలికల విద్య, సాధికారత, కెరీర్ అవకాశాలపై సమగ్ర అవగాహన కల్పించేందుకు శ్రీ సత్యసాయి జిల్లాలో "బాలికే భవిష్యత్తు" కార్యక్రమాన్ని మోడల్‌గా నిర్వహించాలని కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ అధ్యక్షతన "బాలికే భవిష్యత్తు" కార్యక్రమ సన్నాహక సమావేశం నిర్వహించారు. బాలికల విద్య, సాధికారత, వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలు, ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు.

స్థానిక ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికారులు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా ఆదేశించారు. ఎన్నికలు ఎప్పుడైనా జరిగే అవకాశం ఉన్నందున అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని సూచించారు. విజయవాడలో జరిగిన సమీక్ష సమావేశంలో మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల అధికారులు పాల్గొన్నారు. మొత్తం 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఓటర్ల తుది జాబితా, పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై సన్నద్ధత కొనసాగుతోందన్నారు.

సామాజిక న్యాయమే ప్రధాన లక్ష్యం: కవిత
TG: BCలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్ల బిల్లును వచ్చే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోపు ఆమోదించాలని TRS పార్టీ అధ్యక్షురాలు కవిత కేంద్రాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వెయ్యి కార్లతో ఛలో ఢిల్లీ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించిన సభలో ఆమె మాట్లాడారు. BCలు, SCలు, STలు, మైనార్టీలు, మహిళలు, ట్రాన్స్‌జెండర్లు, దివ్యాంగులకు సమాన హక్కులు కల్పించడమే తమ లక్ష్యమన్నారు. రాష్ట్రం పంపిన 42శాతం బీసీ రిజర్వేషన్ బిల్లును రాష్ట్రపతి వెంటనే ఆమోదించాలని కోరారు.

ORR నిర్వహణపై CM సీరియస్
TG: ఔటర్ రింగ్‌రోడ్డు(ORR) నిర్వహణపై CM రేవంత్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తంచేశారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఫైరయ్యారు. నిర్వహణను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ORR, రీజినల్ రింగ్‌రోడ్(RRR), రాబోయే రేడియల్ రోడ్లను ఒకేవ్యవస్థ కిందకు తీసుకురావాలని సూచించారు. భూసేకరణ, రుణాలు, రోడ్ల నిర్వహణ అదేవ్యవస్థ పరిధిలో ఉండాలన్నారు. ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్ బాండ్లపై ప్రత్యేక కమిటీ ఏర్పాటుచేయాలని, TDR ప్రక్రియను ఆన్‌లైన్‌లో పారదర్శకంగా నిర్వహించాలన్నారు.

APలో కొత్త పాలసీకి గ్రీన్ సిగ్నల్
APలో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య (PPP) ప్రాజెక్టులకు కొత్త విధానానికి రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. CM చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో భారీ పెట్టుబడుల సమీకరణ, ప్రాజెక్టుల వేగవంతమైన అమలు, సమర్థ పర్యవేక్షణ లక్ష్యంగా కొత్త పాలసీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో రూ.1.23 లక్షల కోట్ల విలువైన PPP ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. ఆర్థికంగా సాధ్యంకాని ప్రాజెక్టులకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్‌తోపాటు వడ్డీలేని రుణాలు అందించేందుకు ప్రత్యేక బ్రిడ్జ్‌ఫండ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

“అమెరికాను ఆపండి.. లేదంటే మీకూ Risk”: IRAN
అమెరికా దాడులను ఆపేలా ట్రంప్‌పై ఒత్తిడి తీసుకురావాలని ఇరాన్ గల్ఫ్ దేశాలను హెచ్చరించింది. లేదంటే ఆయిల్ ఫీల్డ్స్, పవర్ గ్రిడ్స్, వాటర్ సిస్టమ్స్, ట్రాన్స్‌పోర్ట్ నెట్‌వర్క్స్ వంటి కీలక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై ప్రతీకార దాడులు జరగొచ్చని వార్నింగ్ ఇచ్చింది. మరోవైపు సౌదీ అరేబియా మాత్రం పరిస్థితి మరింత ముదరకుండా చర్చలకు అవకాశం ఇవ్వాలని అమెరికాను కోరుతోంది. దీంతో US–Iran మధ్య టెన్షన్ ఇప్పుడు గల్ఫ్ దేశాలకూ పెద్ద ఆందోళనగా మారుతోంది.

జిమ్ చేసేవారు జాగ్రత్త!
జిమ్ చేసేవారికి అండ్ హెల్త్ కాన్షియస్ ఉన్నవారికి అలర్ట్! బాడీ బిల్డింగ్ కోసం అవసరానికి మించి ప్రొటీన్ తింటే మేలు కంటే డేంజరే ఎక్కువని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ ప్రొటీన్ తీసుకోవడం వల్ల కిడ్నీలపై ప్రెజర్ పడి పాడైపోయే ఛాన్స్ ఉంది. అంతేకాదు గ్యాస్, మలబద్ధకం, హై బిపి, లివర్ ప్రాబ్లమ్స్‌తో పాటు క్యాన్సర్ రిస్క్ కూడా పెరుగుతుంది. అందుకే ప్రొటీన్‌తో పాటు ఫైబర్ ఉన్న ఫుడ్స్ తింటూ, డైటీషియన్ సలహా తీసుకోవడం బెటర్.

రేపు పిడుగులతో వర్షాలు పడే ఛాన్స్!
ఏపీలో రేపు వెదర్ కాస్త సీరియస్‌గా మారబోతోంది. శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, కోనసీమ, వెస్ట్ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడొచ్చని SDMA అలర్ట్ ఇచ్చేసింది. మిగతా ఏరియాల్లో కూడా అక్కడక్కడ చిన్నపాటి చినుకులు పడే ఛాన్స్ ఉంది. సో వర్షం పడే టైమ్‌లో చెట్ల కింద, ఎలక్ట్రిక్ పోల్స్, హోర్డింగ్స్ దగ్గర నిలబడి రిస్క్ తీసుకోకండి.