ప్రభాస్ 60+ Days ఈ సినిమాకే!

ప్రభాస్ నెక్స్ట్ 60 రోజులకు పైగా ‘ఫౌజీ’కే ఇచ్చేస్తున్నారా..? 🔥హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్ట్ ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. ఇటలీ ట్రిప్ తర్వాత ప్రభాస్ హైదరాబాద్‌కు తిరిగి వచ్చి 60 రోజులకు పైగా షూటింగ్ చేయనున్నట్లు సమాచారం. ఇందులో ప్రభాస్ సైనికుడి పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని పెంచగా, ఈ లాంగ్ షెడ్యూల్‌తో కీలకమైన సీన్స్‌ను పూర్తి చేయాలని టీమ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.



