Latest

50 గంటలు నిద్రపోకుండా Live stream
అస్సాం వరద బాధితులను ఆదుకోవడానికి యూట్యూబర్ నిశ్చయ్ మల్హాన్ తన కుటుంబంతో కలిసి 50 గంటల పాటు నిద్రపోకుండా వరుసగా లైవ్‌స్ట్రీమ్ చేసి, రూ. 70 లక్షల ఫండ్స్ కలెక్ట్ చేశారు. వాళ్ల ఫ్యామిలీ కూడా సొంతంగా 16 లక్షల రూపాయలు డొనేట్ చేసింది. ఈ డబ్బునంతా అస్సాం వరద బాధితుల హెల్ప్ కోసం ఇస్తున్నారు. నిద్రను కూడా పక్కనపెట్టి బాధితుల కోసం కష్టపడిన ఈ ఫ్యామిలీని ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా మెచ్చుకుంటున్నారు.

మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు
AP: YSRCP నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో కేసు ఫైల్ అయ్యింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌పై ఫేక్ ప్రచారం చేశారంటూ గుంటూరు జిల్లా TDP అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు కంప్లైంట్ చేశారు. రాజకీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా, ప్రజాశాంతికి భంగం కలిగించే ఉద్దేశంతో వీడియో పోస్టు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు BNS సెక్షన్లు 356, 353, 352, 61(2), 3(5) కింద కేసు బుక్ చేసి దర్యాప్తు ప్రారంభించారు.

17 నుంచి 20 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు
AP: ఈనెల 17 నుంచి 20వ తేదీ వరకు ఏపీ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందులో వివిధ అంశాల మీద చర్చించాలని తీర్మానించింది. విశాఖలో మురికివాడల అభివృద్ధికి కొత్త పథకానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మూడు సహకార షుగర్ ఫ్యాక్టరీల లిక్విడేషన్‌కు నిర్ణయం తీసుకుంది.

తెహల్కా మాజీ ఎడిటర్‌కు 10 ఏళ్ల జైలు శిక్ష
తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌ను గోవా బెంచ్(బాంబే హైకోర్ట్) రేప్ కేసులో దోషిగా నిర్ధారించింది. ఆయనకు 10 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ.5 లక్షల జరిమానా విధించింది. 2013లో గోవాలో జరిగిన తెహల్కా ఈవెంట్‌లో ఎలివేటర్‌లో మాజీ కొలీగ్‌పై అత్యాచారం చేశాడని ఆయన మీద కేసు నమోదైంది. దీనిపై విచారించిన ట్రయల్ కోర్టు 2021లో ఆయన్ని నిర్దోషిగా విడుదల చేసింది. ఈ తీర్పును హైకోర్టు కొట్టేసింది. రెండు వారాల్లో తేజ్‌పాల్ లొంగిపోవాలని ఆదేశించింది.

డబ్బు తీసుకున్న క్షణంలోనే ACB షాక్
AP: అనకాపల్లి జిల్లాలో ACB అధికారులు మైన్స్ శాఖ సర్వేయర్ మురళీకృష్ణ అంబేద్కర్‌ను రూ.5 లక్షల లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఓ క్వారీ సర్వే రిపోర్ట్ నిమిత్తం మొత్తం రూ.15 లక్షలు డిమాండ్ చేసినట్లు బాధితుడు సందిన సునీల్ ACBని ఆశ్రయించారు. అధికారుల సూచనల మేరకు బాధితుడు రూ.5లక్షలు అడ్వాన్స్ అందజేస్తుండగా, ముందుగా మాటువేసిన ఏసీబీ అధికారులు సర్వేయర్‌ను అదుపులోకి తీసుకున్నారు. నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

హైవేపై అదుపుతప్పిన కారు.. పొలాల్లో బోల్తా
AP: తిరుపతి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అక్కాచెల్లెలు మృతి చెందారు. బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న చిన్నగొట్టిగల్లు మండలంలోని బోడిరెడ్డి గారిపల్లెకి చెందిన అనిల్‌కుమార్ తన భార్య మానస, మరదలు గౌతమితో కలిసి స్వగ్రామానికి కారులో బయలుదేరారు. వి.కోట మండలం రామాపురం సమీపంలో కారు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. గౌతమి అక్కడికక్కడే మృతిచెందగా, తీవ్రంగా గాయపడిన మానసను ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయింది. అనిల్‌కుమార్ గాయాలతో చికిత్స పొందుతున్నారు.

పెద్దపులి సంచారం.. గ్రామంలో భయం భయం
AP: నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం సింగవరం గ్రామంలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. గ్రామ శివారులోని చెరువు సమీపంలో ఆవుల మందపై పెద్దపులి దాడి చేయడంతో రెండు ఆవులు అక్కడికక్కడే మృతి చెందాయి. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. పులి అడుగుజాడలను గుర్తించి దాడి చేసినది పెద్దపులేనని ప్రాథమికంగా నిర్ధారించారు. పులి ఇంకా పరిసర ప్రాంతాల్లో సంచరించే అవకాశం ఉన్నందున గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా అడవి లేదా చెరువు ప్రాంతాలకు వెళ్లొద్దని సూచించారు.

కొత్త రేషన్ కార్డుల పంపిణీ
తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 1.05 కోట్ల కొత్త లామినేటెడ్ రేషన్ కార్డులను ఇవ్వాలని నిర్ణయించింది. సంగారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనుండగా, అదే సమయంలో రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కార్డుల పంపిణీ జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు ఆర్డర్స్ ఇచ్చారు.

ఒక్కో యాడ్‌కి 10 కోట్లు!
సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ల కంటే ఎలాంటి కాంట్రవర్సీలు లేకుండా మంచి ఇమేజ్ ఉన్న యాక్టర్స్ కే ఎక్కువ బ్రాండ్ యాడ్స్ వస్తున్నాయని 'క్రోల్' లేటెస్ట్ రిపోర్ట్ చెబుతుంది. ఈ లిస్ట్‌లో బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ టాప్‌లో నిలిచారు. ఒక్కో బ్రాండ్ యాడ్ కోసం ఆయన రికార్డు స్థాయిలో రూ.10 కోట్లు దాకా ఛార్జ్ చేస్తున్నారని రిపోర్ట్ తెలిపింది. షారూఖ్ తర్వాత రణ్‌వీర్ సింగ్, విరాట్ కోహ్లీ, ఆలియా భట్, దీపికా పదుకోణె లాంటి సెలబ్రిటీలు భారీ బ్రాండ్ వాల్యూతో టాప్ ప్లేస్‌లలో ఉన్నారు.

టీవీకే రైతులను మోసం చేసింది: ఉదయనిధి స్టాలిన్
పూర్తి రుణమాఫీ ఇస్తామని మాట ఇచ్చిన టీవీకే ఇప్పుడు పాక్షికంగా అమలు చేసి రైతులను మోసం చేసిందని తమిళనాడు అసెంబ్లీ ప్రతిపక్షనేత ఉదయనిధి స్టాలిన్ ఆరోపించారు. డెల్టా రైతులు ఇబ్బంది పడుతున్నారని, అందుకే ప్రభుత్వ వ్యతిరేకంగా నల్ల చొక్కాలు వేసుకుని నిరసన తెలిపామని అన్నారు. మేకెదాటు డ్యామ్‌కు నీళ్లు ఇవ్వం అని క్లారిటీ ఇచ్చిందని, సీఎం విజయ్‌ని కర్ణాటకకు రావద్దని కూడా చెప్పారని అన్నారు. ఈ విషయంపై అన్ని పార్టీల సమావేశం పెట్టాలని కోరారు.

బాలీవుడ్ యాక్టర్‌కు భారీ షాక్.. ఆస్తుల వేలం
బాలీవుడ్ యాక్టర్ రాజ్‌పాల్ యాదవ్‌కు ఫైనాన్సియల్, లీగల్ ఇబ్బందులు ఎదురయ్యాయి. రూ.16.61 కోట్ల లోన్ కట్టకపోవడంతో ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో ఉన్న ఆయన ఆస్తులను వేలం వేయాలని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. సెప్టెంబర్ 9న ఆన్‌లైన్‌లో ఈ-వేలం నిర్వహించనున్నారు. 'అటా పటా లాపటా' సినిమా కోసం తీసుకున్న లోన్‌కు భార్య రాధా యాదవ్, తల్లి గోదావరి యాదవ్ ఆస్తులను కూడా తాకట్టు పెట్టినట్లు అధికారులు తెలిపారు.

మంత్రులు ఎందుకు తప్పించుకుంటున్నారు?: మల్లికార్జున ఖర్గే
‘దేశంలోని 140 కోట్ల ప్రజలకు సంబంధించి ప్రశ్నలు అడుగుతున్నాం. హోం మంత్రి, ప్రధాన మంత్రి హౌస్‌కు రావాలని కోరుతున్నాం. ఛైర్ హోం మంత్రిని స్టేట్‌మెంట్ ఇవ్వాలని ఆదేశించాలని కోరుతున్నాం. చర్చకు మేము సిద్ధం. అయినా నిజమైన ప్రశ్నలు వచ్చినప్పుడు ప్రభుత్వం తప్పించుకుంటోంది’ అని కాంగ్రెస్ పార్లమెంట్ సభాపక్షనేత మల్లికార్జున ఖర్గే అన్నారు. ‘డిస్రప్షన్ కూడా పార్లమెంటరీ డెమోక్రసీలో భాగమే’ అని గతంలో బీజేపీ మాజీ మంత్రి అరుణ్ జైట్లీ చెప్పిన మాటలను గుర్తు చేశారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.

బోనాల్లో ఈవ్‌టీజర్లకు షాక్.. 678 మందిపై కేసులు
TG: హైదరాబాద్ బోనాల ఉత్సవాల్లో మహిళల సేఫ్టీ కోసం షీటీమ్స్ స్పెషల్ ఫోకస్ పెట్టాయి. గుళ్ల దగ్గర మహిళలను వేధించిన 678 మంది ఈవ్‌టీజర్లను సీసీటీవీ ఫుటేజ్, వీడియో ప్రూఫ్స్‌తో గుర్తించి కేసులు బుక్ చేశారు. ఇంక్వైరీ తరువాత నిందితులను కోర్టులో ప్రవేశపెట్టి శిక్షలు వేశారు. 36 మందికి జైలు శిక్షతో పాటు రూ.1,050 ఫైన్ వేసింది. మరో 26 మందికి ఫైన్‌తో పాటు సోషల్ సర్వీస్ చేయాలని కోర్టు ఆదేశించింది. మహిళలను హరాసింగ్ చేస్తే కఠిన శిక్షలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
యూత్ ప్రొటెస్ట్‌లు మోదీని బలహీనపరిచాయి: సోనమ్ వాంగ్చుక్
ఇటీవల యువత నాయకత్వంలో జరిగిన ప్రొటెస్ట్‌లు ప్రధాని నరేంద్ర మోదీని బలహీనపరిచాయని సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ అన్నారు. నిరాహార దీక్ష సమయంలో 11 కిలోలు తగ్గానని, ఇప్పుడు 6 కిలోలు పెరిగానని చెప్పారు. దీక్ష చివరి ఆరు రోజులు తనను బలవంతంగా ఆసుపత్రికి తీసుకెళ్లారని వివరించారు. ప్రస్తుతం దేశ వాతావరణం మారిపోయిందని, యువత ఇప్పుడు దేశంలో మార్పు తీసుకురాగలదని చెప్పారు. దేన్నీ భరించాల్సిన అవసరం లేదని అన్నారు.

అనామిక ఖన్నా ఫ్యాషన్ మ్యాజిక్
ఇండియన్ ఫ్యాషన్ డిజైనర్ అనామిక ఖన్నా తన 'AK|OK' బ్రాండ్‌తో ఇంటర్నేషనల్ లెవెల్‌లో గుర్తింపు తెచ్చుకున్నారు. లండన్‌లోని ఫేమస్ సెల్ఫ్రిడ్జెస్ (Selfridges) స్టోర్‌లో తన ఫస్ట్ ఇంటర్నేషనల్ 'రిజార్ట్ 2027' కలెక్షన్‌ను లాంచ్ చేశారు. ట్రావెలింగ్, టూర్ల టైంలో కంఫర్ట్‌గా ఉండేలా కాటన్, సిల్క్, లైట్ క్రాఫ్ట్ డిజైన్స్‌తో తయారు చేసిన ఈ బట్టలు ఇంటర్నేషనల్‌గా అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మన ఇండియన్ ట్రెడిషనల్ ఆర్ట్‌ని గ్లోబల్ ట్రెండ్‌కి తగ్గట్టు మార్చి అనామిక ఖన్నా ఒక కొత్త ఫ్యాషన్ ట్రెండ్‌ని స్టార్ట్ చేశారు.

భారీగా పెరిగిన బంగారం ధరలు!
గోల్డ్ లవర్స్‌కి అలర్ట్! గురువారం మార్కెట్‌లో బంగారం ధరలు మళ్ళీ పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.3,980 పెరిగి రూ.1,49,730 కి చేరగా, 22 క్యారెట్ల రేట్ రూ.3,650 పెరిగి రూ.1,37,250 వద్ద ఉంది. అలాగే 18 క్యారెట్ల ధర రూ.1,12,300 గా నమోదైంది. మార్కెట్‌లో రేట్స్ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతాయి, కాబట్టి షాపింగ్ ప్లాన్ చేసే ముందు లైవ్ ప్రైసెస్ చెక్ చేసుకోవడం బెటర్!

కాళేశ్వరం కాల్వలో ప్లాట్లు.. కొనుగోలుదారులకు షాక్
TG: మేడ్చల్ మండలం రావల్‌కోల్ గ్రామ పంచాయతీ పరిధిలోని గూడెంగడ్డ తండాలో ఎలాంటి అనుమతులు లేకుండా SR వెంచర్ పేరుతో ప్లాట్లు విక్రయించి కోట్ల రూపాయల మోసం జరిగినట్లు బాధితులు ఆరోపించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి కల్లూరి సుభాష్‌రెడ్డి సుమారు 70మందికి ప్లాట్లు విక్రయించగా, వాటిలో సగానికి పైగా కాళేశ్వరం కాల్వ పరిధిలోకి వెళ్లాయని తెలిపారు. ప్రత్యామ్నాయ ప్లాట్లు ఇస్తానని హామీ ఇచ్చి ఆరు సంవత్సరాలుగా కాలయాపన చేస్తున్నాడని వాపోయారు. తమకు న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

YSRCP దీక్షలో ఉద్రికత్త..టెంట్ తొలగింపు
AP: DSC అక్రమాలపై బాధ్యత వహించి మంత్రి నారా లోకేశ్ రిజైన్ చేయాలంటూ YSRCP రిలే నిరాహార దీక్షలు చేపట్టింది. గుంటూరు, అనంతపురం జిల్లా, విజయవాడ సెంట్రల్ ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. రోడ్డుపై పర్మిషన్లు లేకుండా టెంట్ ఏర్పాటు చేశారని ఆరోపిస్తూ TDP నాయకులు టెంట్‌లను తొలగించారు. రెండు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. సీఎం చంద్రబాబు, లోకేశ్‌లపై కామెంట్స్ చేస్తే ఊరుకునేది లేదని విజయవాడ ఎమ్మెల్యే బోండా ఉమా హెచ్చరించారు.

ఆసుపత్రిలో ఫోన్ ఛార్జింగ్ కష్టాలు
TG: నల్గొండ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (GGH)లో రోగుల సహాయకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వార్డుల్లో ఉన్న మొబైల్ ఛార్జింగ్ పాయింట్లకు ఆసుపత్రి సిబ్బంది స్టిక్కర్లు వేసి మూసివేయడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫోన్లు ఛార్జ్ చేసుకునే అవకాశం లేక అత్యవసర సమయంలో వైద్యులను, కుటుంబ సభ్యులను సంప్రదించలేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. రోగుల సేవలో ఉండే తమకు కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని వాపోతున్నారు. వెంటనే స్పందించి ప్రత్యేక మొబైల్ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయాలని కోరారు.
మెడికోపై కారు ఎక్కించిన యువకులు
AP: రాజమండ్రిలోని అప్పారావు రోడ్డులో జీఎస్‌ఎల్ మెడికల్ కాలేజీ స్టూడెంట్‌ని ఇద్దరు యువకులు కారుతో ఢీకొట్టారు. కిందపడిన ఆమెపై నుంచే కారు పోనిచ్చారు. దీంతో యువతి తీవ్రంగా గాయపడింది. మెడికోను స్థానిక ఆసుపత్రికి తరలించగా, బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు తెలిపారు. నామవరానికి చెందిన ఇద్దరు యువకులు తప్పతాగి స్పీడ్‌గా కారు నడుపుతుండగాఈ యాక్సిడెంట్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

గాయంతో భీమవరంలో వరుణ్ తేజ్ జోరు!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సినిమా ‘కొరియన్ కనకరాజు’ ప్రమోషన్లలో స్పీడు పెంచారు. వరుణ్ కాలికైన గాయం ఇంకా తగ్గకపోయినా, భీమవరంలోని ఒక కాలేజీలో జరిగిన ప్రమోషనల్ ఈవెంట్‌కి వచ్చి సందడి చేశారు. 2018లో ‘తొలిప్రేమ’ ఈవెంట్ ఇక్కడే జరిగిందని, అప్పటి మ్యాజిక్ ఈ సినిమాతో మళ్లీ రిపీట్ అవుతుందని నమ్మకంగా చెప్పారు. మేర్లపాక గాంధీ డైరెక్షన్‌లో, రితీకా నాయక్ హీరోయిన్‌గా, థమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఆగస్టు 7న థియేటర్లలోకి వస్తోంది.