← Back to news

కాళేశ్వరం కాల్వలో ప్లాట్లు.. కొనుగోలుదారులకు షాక్

By dk· 6 Aug 2026· మేడ్చల్ జిల్లా
కాళేశ్వరం కాల్వలో ప్లాట్లు.. కొనుగోలుదారులకు షాక్

TG: మేడ్చల్ మండలం రావల్‌కోల్ గ్రామ పంచాయతీ పరిధిలోని గూడెంగడ్డ తండాలో ఎలాంటి అనుమతులు లేకుండా SR వెంచర్ పేరుతో ప్లాట్లు విక్రయించి కోట్ల రూపాయల మోసం జరిగినట్లు బాధితులు ఆరోపించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి కల్లూరి సుభాష్‌రెడ్డి సుమారు 70మందికి ప్లాట్లు విక్రయించగా, వాటిలో సగానికి పైగా కాళేశ్వరం కాల్వ పరిధిలోకి వెళ్లాయని తెలిపారు. ప్రత్యామ్నాయ ప్లాట్లు ఇస్తానని హామీ ఇచ్చి ఆరు సంవత్సరాలుగా కాలయాపన చేస్తున్నాడని వాపోయారు. తమకు న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 8h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.