Latest

వరుసగా గాయపడుతున్న టాలీవుడ్ స్టార్స్!
Cinema· 31 Jul 2026

వరుసగా గాయపడుతున్న టాలీవుడ్ స్టార్స్!

టాలీవుడ్ స్టార్స్ వరుసగా గాయపడటం ఇప్పుడు హాట్ టాపిక్. రీసెంట్ గా హీరోయిన్ రష్మిక సాంగ్ షూట్ డాన్స్ లో గాయపడటంతో డాక్టర్లు 6 వీక్స్ రెస్ట్ తీసుకోమని చెప్పారు. దీంతో ఆమె నటిస్తున్న రణబాలి, మైసా సినిమాల షూటింగ్స్ డిలే అయ్యే ఛాన్స్ ఉంది. మరోవైపు బాలకృష్ణ, NTR, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ కూడా రీసెంట్ గా గాయపడి ట్రీట్మెంట్ తీసుకున్నారు. హీరోల ఇంజ్యురీస్ వల్ల ఈ బిగ్ మూవీస్ రిలీజ్ మరింత లేట్ అయ్యేలా ఉంది.

₹900 కోట్ల సినిమా కాపీ మిస్సింగ్?
World· 31 Jul 2026

₹900 కోట్ల సినిమా కాపీ మిస్సింగ్?

రిలీజ్ కాకముందే సినిమా కాపీ మాయమైతే..? అదే ఇప్పుడు Netflixను కోర్టు వరకు తీసుకెళ్లింది. Nicolas Cage నటించిన 'Fortitude' సినిమా అన్‌ఎన్‌క్రిప్టెడ్ డిజిటల్ కాపీ Netflix వద్ద నుంచి కనిపించకుండా పోయిందని నిర్మాతలు ఆరోపిస్తున్నారు. దీంతో సినిమా మార్కెట్ విలువ దెబ్బతిన్నట్లు చెబుతూ $105 మిలియన్ (సుమారు ₹900 కోట్లు) పరిహారం కోరుతూ కేసు వేశారు. అయితే ఈ ఆరోపణలను Netflix ఖండించింది. సినిమా కాపీని అవసరమైన సెక్యూరిటీ లేకుండానే నిర్మాతలే అందించారని, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని సంస్థ తెలిపింది.

గోదావరి పుష్కరాలకు ముహూర్తం కన్‌ఫర్మ్
Infotainment· 31 Jul 2026

గోదావరి పుష్కరాలకు ముహూర్తం కన్‌ఫర్మ్

AP: పవిత్ర గోదావరి నదీ పుష్కరాల నిర్వహణకు ముహూర్తం కన్‌ఫర్మ్ అయ్యింది. 2027 జూన్ 26 నుంచి జులై 7 వరకు మొత్తం 12 రోజుల పాటు గోదావరి పుష్కరాలు నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ముహూర్తానికి సంబంధించి టీటీడీ ఆస్థాన పండితులు ఏపీ దేవాదాయశాఖ కమిషనర్‌కు వివరాలు అందజేశారు. వాటిని పరిశీలించిన ప్రభుత్వం పుష్కరాల తేదీలను ఖరారు చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. గోదావరి పుష్కరాల్లో భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.

తొలిసారి ఐటమ్ సాంగ్‌లో కీర్తి సురేష్!
Cinema· 31 Jul 2026

తొలిసారి ఐటమ్ సాంగ్‌లో కీర్తి సురేష్!

నాని హీరోగా నటిస్తున్న 'ది పారడైస్' సినిమాలో కీర్తి సురేష్ స్పెషల్ సాంగ్‌లో కనిపించనున్నట్లు టాలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి.నానితో ఉన్న మంచి స్నేహం, 'నేను లోకల్', 'దసరా' వంటి హిట్ చిత్రాల అనుబంధం వల్లే కీర్తి ఈ ఆఫర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. సుమారు వెయ్యి మంది జూనియర్ ఆర్టిస్టులతో ఈ పాటను గ్రాండ్‌గా చిత్రీకరిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.

AP, కర్ణాటకలో రేపే మోడీ టూర్?
Politics· 31 Jul 2026

AP, కర్ణాటకలో రేపే మోడీ టూర్?

రేపు ఆగస్ట్ 1న ప్రధాని నరేంద్ర మోడీ AP, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, రీసెర్చ్, కల్చర్ రంగాలకు చెందిన ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్‌లో ఆయన జాయిన్ కాబోతున్నారు. ట్రెడిషన్స్‌ని కాపాడుకుంటూనే, యూత్‌కి మంచి ఆపర్చ్యునిటీస్ క్రియేట్ చేయడానికి ఇవి హెల్ప్ అవుతాయని, 'వికసిత్ భారత్' వైపు ఇదొక బిగ్ స్టెప్ అని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

కమిషనర్‌ను వీలైనంత త్వరగా ట్రాస్ఫర్ చేయండి: హైకోర్టు
Legal· 31 Jul 2026

కమిషనర్‌ను వీలైనంత త్వరగా ట్రాస్ఫర్ చేయండి: హైకోర్టు

TG: హైడ్రాకు సంబంధించిన శాంతా శ్రీరామ్ కంపెనీ కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన జరిగిందని, వివాదాస్పద భూమిలో హైడ్రా చేపట్టిన చర్యలు చట్టవిరుద్ధమని కోర్టు స్పష్టం చేసింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను వీలైనంత త్వరగా బదిలీ చేసి, ఆయన స్థానంలో మరో అధికారిని నియమించాలని సీఎస్‌ను హైకోర్టు ఆదేశించింది. చట్టబద్ధమైన పాలనే కొనసాగాలని, వ్యక్తుల పాలన కాదని గుర్తు చేసింది. వ్యక్తుల ఆధిపత్యం కొనసాగితే అది ప్రజాస్వామ్యానికి మరణశాసనంగా మారుతుందని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది.

F-47 ఫైటర్ జెట్‌కి గ్రీన్ సిగ్నల్
World· 31 Jul 2026

F-47 ఫైటర్ జెట్‌కి గ్రీన్ సిగ్నల్

అమెరికా ఎయిర్ ఫోర్స్ అభివృద్ధి చేస్తున్న 6వ తరం F-47 ఫైటర్ జెట్ ప్రోగ్రామ్ కీలక దశలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం Engineering & Manufacturing Development (EMD) దశ ప్రారంభమైందని అధికారులు తెలిపారు. ఈ దశలో కొన్ని టెస్ట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు తయారు చేసి పరీక్షలు నిర్వహించనున్నారు. తొలి F-47 2028లో ఆకాశంలోకి ఎగరనుందని ఎయిర్ ఫోర్స్ వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న F-22 Raptor స్థానంలో కనీసం 185 F-47 జెట్లు కొనుగోలు చేయాలని అమెరికా ప్లాన్ వేసింది.

తల్లిపాలు: అమృతంతో సమానం..
Health· 31 Jul 2026

తల్లిపాలు: అమృతంతో సమానం..

తల్లిపాలు పట్టడం బిడ్డలకు, తల్లులకు ఎంతో ఆరోగ్యదాయకం, అలాగే ప్రాణ రక్షణ అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ (WHO)తెలిపింది. బిడ్డ పుట్టిన మొదటి 6 నెలల పాటు శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను తల్లిపాలు అందిస్తాయి. విరోచనాలు, న్యూమోనియా వంటి తీవ్రమైన వ్యాధుల నుండి కాపాడే శక్తివంతమైన ప్రోటీన్లు వీటిలో ఉంటాయి. తల్లిపాలు తాగిన పిల్లల్లో ఊబకాయం, దీర్ఘకాలిక రోగాలు వచ్చే ప్రమాదం తగ్గడమే కాకుండా వారు ఐక్యూ పరీక్షల్లోనూ, తెలివితేటల్లోనూ మెరుగ్గా ఉంటారు.

మొరాకో నుంచి వేలాది మంది జనం..ఎందుకంటే!
World· 31 Jul 2026

మొరాకో నుంచి వేలాది మంది జనం..ఎందుకంటే!

ఒకేసారి మన ఊరికి వందలమంది వలసదారులు వస్తే ఎలా ఉంటుంది? ప్రస్తుతం అలాంటి పరిస్థితిలోనే ఉంది ఉత్తర ఆఫ్రికా ఎన్‌క్లేవ్ అయిన సియుటా. మొరాకో నుంచి వేలాది మంది ఇక్కడికి వస్తున్నారు. ఆర్థిక, రాజకీయ సంక్షోభాల కారణంగా మొరాకోను విడిచి, సముద్రంలో ఈదుతూ సరిహద్దు దాటి వస్తున్నారు. ఒక్క రోజులో పెద్ద సంఖ్యలో జనం రావడంతో రిసెప్షన్ సెంటర్లు నిండిపోయాయి. వందలాది మంది వీధుల్లో, పార్కుల్లో నిద్రపోయారు. స్పెయిన్ మొరాకో మధ్య సియుటా-మెలిల్లా ఎన్‌క్లేవ్‌లు, పశ్చిమ సహారా లాంటి అంశాలు ఉద్రిక్తతలకు కారణమవుతున్నాయి.

కన్న కూతురిపై తండ్రి దారుణం
Crime· 31 Jul 2026

కన్న కూతురిపై తండ్రి దారుణం

TG: వికారాబాద్ జిల్లాలో కన్న తండ్రే దారుణానికి ఒడిగట్టాడు. 9వ తరగతి చదువుతున్న తన కూతురిపై అత్యాచారం చేశాడు. ఫోన్‌లో అసభ్యకరమైన వీడియోలు చూపిస్తూ కొంతకాలంగా ఈ అరాచకానికి పాల్పడుతున్నాడు. అమ్మాయి స్కూల్‌లో ఇబ్బంది పడుతుండటంతో టీచర్లు అనుమానం వచ్చి ఆరా తీయగా అసలు విషయం బయటపడటంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు నిందితుడిని పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు.

CM విజయ్‌తో మీటింగ్ క్యాన్సిల్- కర్ణాటక CM
Politics· 31 Jul 2026

CM విజయ్‌తో మీటింగ్ క్యాన్సిల్- కర్ణాటక CM

తమిళనాడుకు కావేరి నీటిని విడుదల చేయాలన్న CWMI ఆదేశాలపై కర్ణాటకలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఆగస్టు 3న జరగాల్సిన మీటింగ్ ని వాయిదా వేసుకోవాలని తమిళనాడు CM విజయ్‌ని DK శివకుమార్ కోరారు. ఇరు రాష్ట్రాల మధ్య శాంతియుత వాతావరణం ఏర్పడ్డాకే సమన్వయంతో చర్చలు జరుపుతామని తెలిపారు. చట్టాన్ని గౌరవిస్తూ రాష్ట్రంలో ఎలాంటి బంద్‌లు నిర్వహించవద్దని, శాంతిభద్రతలను కాపాడాలని ఈ సందర్భంగా DK శివకుమార్ విజ్ఞప్తి చేశారు.

'సర్దార్ 2' రిలీజ్ డేట్‌పై సందేహాలకు చెక్..
Cinema· 31 Jul 2026

'సర్దార్ 2' రిలీజ్ డేట్‌పై సందేహాలకు చెక్..

కోలీవుడ్ స్టార్ కార్తీ హీరోగా పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ స్పై థ్రిల్లర్ 'సర్దార్ 2'. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 10న విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఇటీవల విడుదల చేసిన కొత్త పోస్టర్‌లో తేదీ ప్రస్తావించకపోవడంతో సినిమా వాయిదా పడుతోందనే ప్రచారం జరిగింది. ఎలాంటి మార్పూ లేదని స్పష్టం చేస్తూ, త్వరలోనే అప్‌డేట్‌తో రాబోతున్నట్లు చిత్రబృందం తెలిపింది. దీంతో రిలీజ్ డేట్‌పై ఉన్న సందేహాలన్నింటికీ పుల్‌స్టాప్ పడింది.

తెలంగాణ SIRలో 40 లక్షల ఓట్లు మిస్?
Politics· 31 Jul 2026

తెలంగాణ SIRలో 40 లక్షల ఓట్లు మిస్?

TG: తెలంగాణలో జరుగుతున్న SIR ప్రక్రియలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 40 లక్షల ఓట్లను అన్‌కలెక్టబుల్ ఓట్లుగా గుర్తించామని అధికారులు తెలిపారు. వాటిని ఓటర్ల లిస్ట్ నుంచి తొలగించే ప్రక్రియపై ఎన్నికల అధికారులు కసరత్తు చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా, ఇప్పటివరకు 76.72 శాతం మంది ఓటర్ల వివరాల డిజిటలైజేషన్ పూర్తైనట్లు అధికారులు తెలిపారు. దీంతో ఈ అంశంపై రాజకీయ పార్టీలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి.

'పైసా నక్కో' రూట్ మార్చిన నకిలీ పోలీస్!
News· 31 Jul 2026

'పైసా నక్కో' రూట్ మార్చిన నకిలీ పోలీస్!

తెలంగాణ బోర్డర్ చెక్ పోస్ట్ వద్ద లారీ డ్రైవర్‌ను నకిలీ పోలీసులు రూ.200 లంచం డిమాండ్ చేశారు. దానికి భయపడకుండా ఆ డ్రైవర్ తన స్మార్ట్‌ఫోన్‌తో స్పాట్‌లోనే రికార్డింగ్ స్టార్ట్ చేశాడు. సదరు వ్యక్తులకు కనీసం నేమ్‌ప్లేట్ కూడా లేకపోవడాన్ని పాయింట్ అవుట్ చేస్తూ, లంచం ఎందుకు ఇవ్వాలని గట్టిగా నిలదీశాడు. సీన్ రివర్స్ అవ్వడంతో షాక్ తిన్న ఆ వ్యక్తులు 'పైసా నక్కో' అంటూ మాట మార్చేశారు. హైవేలపై ఇలా ఐడీ కార్డ్, నేమ్‌ప్లేట్ లేకుండా మిమ్మల్ని ఎవరైనా ఆపి మనీ డిమాండ్ చేస్తే నకిలీ పోలీసులు కావచ్చు, అలర్ట్ గా ఉండండి.

"రాహుల్ చెప్పిందే చెప్పాలి!": BJP MP
Politics· 31 Jul 2026

"రాహుల్ చెప్పిందే చెప్పాలి!": BJP MP

"రాజకీయాల్లో స్క్రిప్ట్ మారొచ్చు.. కానీ బ్యాక్‌స్టోరీ మారదేమో!" అన్నట్టుగా BJP MP నిశికాంత్ దూబే చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తనకు చాలా ఏళ్ల నాటి ఫ్రెండ్ అని, ఇద్దరూ కలిసి ఒకప్పుడు RSS, ABVP కోసం పనిచేశామని చెప్పారు. "రేవంత్ రెడ్డి మైండ్‌సెట్ బాగుంటుంది. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్పిందే చెప్పాల్సిన పరిస్థితి" అంటూ కామెంట్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో "రాజకీయాల్లో పర్మనెంట్ ఫ్రెండ్స్ ఉంటారా.. లేక పర్మనెంట్ పార్టీలా?" అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
Politics· 31 Jul 2026

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

కేంద్ర కేబినెట్ ఇవాళ సమావేశమైంది. ప్రధాని సూర్య సరోవర్ యోజనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నీటిపై ఫ్లోటింగ్ సోలార్ ప్యానెల్స్, ఇంధన నిల్వ వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన పథకం ఇది. ఈ పథకం కోసం రూ.5070 కోట్లు కేటాయిస్తారు. దీనిద్వారా ఐదేళ్లలో 5 వేల మెగావాట్ల కరెంట్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతోపాటు ఖేలో ఇండియా పథకానికి రూ.29 వేల కోట్లు కేటాయించనున్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ఐదేళ్లకు పొడిగించి, దానికి రూ.3,15,614 కోట్లు కేటాయించారు.

ఏపీ-తెలంగాణకు కొత్త రైల్వే లైన్
Infotainment· 31 Jul 2026

ఏపీ-తెలంగాణకు కొత్త రైల్వే లైన్

ఆంధ్రప్రదేశ్‌లోని మాచర్ల నుంచి తెలంగాణలోని గద్వాల్ వరకు కొత్త రైల్వే లైన్‌ కోసం కేంద్ర రైల్వే శాఖ సర్వే సిద్ధం చేసింది. రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా ఆరు కొత్త రైల్వే లైన్లలో ఇది ఒకటి. ఈ మార్గం ఏర్పడితే తెలంగాణ, కర్ణాటక నుంచి ఏపీ పోర్టులకు సరుకు రవాణా వేగవంతం కానుంది. దీంతో పాటు పల్నాడు, నాగార్జునసాగర్ ప్రాంతాలకు రైలు కనెక్టివిటీ పెరగనుంది.

రోడ్డు పక్కన పానీపూరీ తింటున్నారా?
Health· 31 Jul 2026

రోడ్డు పక్కన పానీపూరీ తింటున్నారా?

TG : హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎలాంటి బోర్డు లేకుండా రహస్యంగా నిర్వహిస్తున్న ఒక ఫుడ్ సెంటర్ లో తీవ్ర అపరిశుభ్ర పరిస్థితుల్లో భారీగా పానీపూరీలు, సమోసాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. వీటిని నగరంలోని వివిధ రోడ్డు పక్కన ఉండే బండ్లకు సరఫరా చేస్తున్న ఈ అక్రమ తయారీ పై అధికారులు, కఠిన చర్యలు చేపట్టారు. రోడ్డు పక్కన దొరికే ఆహారం పట్ల ప్రజలు జాగ్రత్త వహించాలని సూచించారు.

పెళ్లి వద్దన్న గాయని జమునారాణి..రీజన్ అదేనా?
Cinema· 31 Jul 2026

పెళ్లి వద్దన్న గాయని జమునారాణి..రీజన్ అదేనా?

ఇవాళ మరణించిన సీనియర్ గాయని జమునారాణికి ఆమె అభిమానులు, కళాకారులు నివాళి అర్పిస్తున్నారు. ఐదు భాషల్లో సుమారు 6 వేలకు పైగా పాటలు పాడారామె. జీవితాంతం అవివాహితగానే ఉన్నారు. అందుకు కారణాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె వివరించారు. తోటి గాయనీమణుల వైవాహిక జీవితాలు, వారి కష్టాలు చూడటం వల్లనే ఆమె వివాహానికి దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది.

వెండితెరపైకి బాలయ్య చిన్న కుమార్తె !
Cinema· 31 Jul 2026

వెండితెరపైకి బాలయ్య చిన్న కుమార్తె !

నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని త్వరలోనే నటిగా వెండితెరకు పరిచయం కాబోతున్నారనే వార్త సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తి రేపుతోంది. కమర్షియల్ చిత్రాలకు భిన్నంగా, యువతకు స్ఫూర్తినిచ్చే ఒక ప్రయోగాత్మక స్పోర్ట్స్ డ్రామా కథతో ఆమె ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆహా 'అన్‌స్టాపబుల్' టాక్ షోకి క్రియేటివ్ హెడ్‌గా, పలు సినిమాలకు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించిన ఆమె, కెమెరా ముందుకు రాబోతున్నారనే ప్రచారంతో నందమూరి అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

విద్యార్థుల అడ్మిషన్లపై SIR ఎఫెక్ట్ : RS ప్రవీణ్ కుమార్
News· 31 Jul 2026

విద్యార్థుల అడ్మిషన్లపై SIR ఎఫెక్ట్ : RS ప్రవీణ్ కుమార్

TG : EAPCET, NEET, CPGET కోర్సుల్లో అడ్మిషన్ల కౌన్సెలింగ్ కోసం కులం, ఆదాయం, నివాస ధృవీకరణ పత్రాలను సమర్పించడంలో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ నేత ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ అన్నారు. స్థానిక మండల రెవెన్యూ అధికారులు SIR ప్రక్రియలో బిజీగా ఉన్నామని సర్టిఫికెట్లు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దీనివల్ల విద్యార్థులు అడ్మిషన్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ కోల్పోయే ప్రమాదం ఉందని, వెంటనే సర్టిఫికెట్లు జారీ చేయాలని ‘ఎక్స్’లో రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీని డిమాండ్ చేశారు.