Latest

వెండితెరపైకి బాలయ్య చిన్న కుమార్తె !
Cinema· 31 Jul 2026

వెండితెరపైకి బాలయ్య చిన్న కుమార్తె !

నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని త్వరలోనే నటిగా వెండితెరకు పరిచయం కాబోతున్నారనే వార్త సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తి రేపుతోంది. కమర్షియల్ చిత్రాలకు భిన్నంగా, యువతకు స్ఫూర్తినిచ్చే ఒక ప్రయోగాత్మక స్పోర్ట్స్ డ్రామా కథతో ఆమె ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆహా 'అన్‌స్టాపబుల్' టాక్ షోకి క్రియేటివ్ హెడ్‌గా, పలు సినిమాలకు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించిన ఆమె, కెమెరా ముందుకు రాబోతున్నారనే ప్రచారంతో నందమూరి అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

విద్యార్థుల అడ్మిషన్లపై SIR ఎఫెక్ట్ : RS ప్రవీణ్ కుమార్
News· 31 Jul 2026

విద్యార్థుల అడ్మిషన్లపై SIR ఎఫెక్ట్ : RS ప్రవీణ్ కుమార్

TG : EAPCET, NEET, CPGET కోర్సుల్లో అడ్మిషన్ల కౌన్సెలింగ్ కోసం కులం, ఆదాయం, నివాస ధృవీకరణ పత్రాలను సమర్పించడంలో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ నేత ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ అన్నారు. స్థానిక మండల రెవెన్యూ అధికారులు SIR ప్రక్రియలో బిజీగా ఉన్నామని సర్టిఫికెట్లు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దీనివల్ల విద్యార్థులు అడ్మిషన్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ కోల్పోయే ప్రమాదం ఉందని, వెంటనే సర్టిఫికెట్లు జారీ చేయాలని ‘ఎక్స్’లో రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీని డిమాండ్ చేశారు.

భార్య పాయల్‌తో CM ఒమర్ అబ్దుల్లా విడాకులు
News· 31 Jul 2026

భార్య పాయల్‌తో CM ఒమర్ అబ్దుల్లా విడాకులు

జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, అతని భార్య పాయల్‌కు సుప్రీంకోర్టు విడాకులు ఇచ్చింది. వీళ్లిద్దరూ తమ ఇష్టంతోనే విడిపోవాలని నిర్ణయించుకున్నారు. 1994లో వీరికి పెళ్లి కాగా, 2011 నుంచి వేరుగా ఉంటున్నారు. 2016లో ఒమర్ విడాకుల కోసం అడగగా ఫ్యామిలీ కోర్టు, ఢిల్లీ హైకోర్టు ఒప్పుకోలేదు. దీంతో ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఇద్దరూ మాట్లాడుకుని విడిపోవాలని నిర్ణయించుకోవడంతో కోర్టు వారికి విడాకులు ఇస్తామంది.

రేపే భోగాపురం ఎయిర్‌ పోర్ట్‌ ప్రారంభం
News· 31 Jul 2026

రేపే భోగాపురం ఎయిర్‌ పోర్ట్‌ ప్రారంభం

AP: రేపు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌ను పీఎం నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏవియేషన్ మినిస్టర్ కింజరాపు రామ్మోహన్ నాయుడుతో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. భోగాపురం ఎయిర్ పోర్ట్‌ ప్రారంభంతో ఉత్తరాంధ్రలో పారిశ్రామిక, పర్యాటక, వాణిజ్య రంగాలకు కొత్త ఊపు లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

రేషన్ కార్డు KYC పేరుతో వసూళ్లు
TG· 31 Jul 2026

రేషన్ కార్డు KYC పేరుతో వసూళ్లు

హైదరాబాద్ LBనగర్ నియోజకవర్గంలోని నాగోల్ డివిజన్ జైపురి కాలనీలో రేషన్ కార్డుల KYC పేరుతో కొందరు ఒక్కొక్కరి నుంచి రూ.200 వసూలు చేస్తున్నారని స్థానికులు ఆరోపించారు. ప్రభుత్వం కేవైసీ ప్రక్రియను పూర్తిగా ఉచితంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ, వాటిని పట్టించుకోకుండా డబ్బులు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బు చెల్లించిన తర్వాతే కేవైసీ పూర్తి చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు వెంటనే విచారణ జరిపి, కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

‘రామాయణ’లో సాయి పల్లవి పై బాలీవుడ్ ట్రోల్స్!
Cinema· 31 Jul 2026

‘రామాయణ’లో సాయి పల్లవి పై బాలీవుడ్ ట్రోల్స్!

‘రామాయణ’ చిత్రంలో సీత పాత్ర పోషిస్తున్న సాయి పల్లవిపై కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. ‘ఆదిపురుష్’లో కృతి సనన్ సీతగా మెరుగ్గా నటించిందని, ఈ పాత్రకు ఆమే సెట్ అవుతుందని కామెంట్లు చేస్తున్నారు. దీనిపై ప్రాంతీయ దురభిమానంతోనే సాయి పల్లవిని టార్గెట్ చేస్తున్నారని, ఆమె అద్భుతమైన నటనను తక్కువ చేసి మాట్లాడటం సరికాదని సౌత్ ఫ్యాన్స్ అంటున్నారు. ప్రస్తుతం ఈ వివాదం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

కంకర రాళ్లకు బంగారు పూతతో మోసం
Crime· 31 Jul 2026

కంకర రాళ్లకు బంగారు పూతతో మోసం

TG: నిజామాబాద్‌ హమాల్‌వాడీకి చెందిన రమేష్‌ దగ్గర శ్రీనివాస్ రూ.1.30 లక్షలు అప్పు తీసుకున్నాడు. డబ్బులు తిరిగి ఇవ్వాలని రమేష్‌ అడగడంతో, తనకు గుప్తనిధులు దొరికాయని శ్రీనివాస్ నమ్మించాడు. అప్పు కింద బంగారు రాళ్లు ఇస్తానని చెప్పి 'డిచ్‌పల్లి' దగ్గర ఉన్న ఘన్‌పూర్‌కు పిలిపించాడు. పైగా అదనంగా మరో రూ.32 వేలుతీసుకొని నాలుగు కుండల్లో నాలుగు రాళ్లు ఇచ్చాడు. తరువాత రమేష్ వాటిని చూసి అవి బంగారు రంగు వేసిన కంకర రాళ్లు అని గుర్తించాడు. తాను మోసపోయానని గ్రహించి డిచ్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఒలెక్ట్రా గ్రాండ్ మైలురాయి: 4,000 చేరుకున్న ఎలక్ట్రిక్ బస్సు
News· 31 Jul 2026

ఒలెక్ట్రా గ్రాండ్ మైలురాయి: 4,000 చేరుకున్న ఎలక్ట్రిక్ బస్సు

భారతీయ ఎలక్ట్రిక్ వాహన రంగంలో ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ (OGL) చారిత్రాత్మక మైలురాయిని అధిగమించింది. వివిధ రాష్ట్రాల రోడ్డు రవాణా సంస్థలకు అందించిన ఎలక్ట్రిక్‌-బస్సుల సంఖ్య 4,000కు చేరింది. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సింగ్‌కు 4,000వ బస్సును అందజేయడంతో ఈ ఘనత సాధ్యమైంది. హెచ్‌ఆర్‌టీసీకి ఒలెక్ట్రా మొత్తం 297 బస్సులను సరఫరా చేసింది.ఈ 4,000 ఎలక్ట్రిక్ బస్సులు ఇప్పటివరకు 73 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించి, 6.5 లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించింది.

ఏపీలో SIR ముసాయిదా ఓటర్ల లిస్ట్‌ విడుదల
Politics· 31 Jul 2026

ఏపీలో SIR ముసాయిదా ఓటర్ల లిస్ట్‌ విడుదల

AP: ఆంధ్రప్రదేశ్‌లో SIR ముసాయిదా ఓటర్ల లిస్ట్‌ను విడుదల చేసినట్లు రాష్ట్ర CEO వివేక్ యాదవ్ వెల్లడించారు. ఎన్యూమరేషన్ ఫామ్స్‌ను సమర్పించిన 3.71 కోట్ల మంది వివరాలను ముసాయిదా లిస్ట్‌లో చేర్చినట్లు తెలిపారు. ఇందులో 15.22 లక్షల మంది మరణించినట్లు, రెండు చోట్ల నమోదైన 7.37 లక్షల ఓట్లను గుర్తించామని చెప్పారు. ఆగస్టు 30 వరకు అభ్యంతరాలుంటే స్వీకరిస్తామని, అర్హులైన వారు <a href="https://www.ceodelhi.gov.in/WriteReadData/userfiles/file/Forms/FORM6.pdf">ఫామ్-6</a> ద్వారా ఓటరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సూచించారు. అక్టోబర్ 3న చివరి ఓటర్ల లిస్ట్‌ను విడుదల చేస్తామని సీఈవో స్పష్టం చేశారు.

వాగులోకి దూసుకెళ్లిన సిలిండర్ల లారీ
AP· 31 Jul 2026

వాగులోకి దూసుకెళ్లిన సిలిండర్ల లారీ

AP: నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం తెడ్డుపాడు వద్ద నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఖాళీ గ్యాస్ సిలిండర్లతో కడప వైపు వెళ్తున్న లారీ అదుపుతప్పి పిల్లాపేరు వాగులోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో లారీలో ఉన్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడగా, స్థానికులు వెంటనే వారిని అంబులెన్స్ ద్వారా ఆస్పత్రికి తరలించారు. సిలిండర్లు చెల్లాచెదురుగా పడిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

నిరసనల తర్వాత మహిళలకు ఆన్‌లైన్ బెదిరింపులు
Crime· 31 Jul 2026

నిరసనల తర్వాత మహిళలకు ఆన్‌లైన్ బెదిరింపులు

ఇటీవల రోజుల్లో నిరసనల్లో పాల్గొన్న మహిళలను సోషల్ మీడియాలో కొందరు తీవ్రంగా బెదిరిస్తున్నారు. ప్రధానిని తిట్టారని ఒక మహిళ పేరు, ఊరు వివరాలు ఆన్‌లైన్‌లో పెట్టారు. అలాగే జంతర్ మంతర్ దగ్గర వీడియో తీసిన ఒక 23ఏళ్ల స్టూడెంట్ ఆవీడియో సోషల్ మీడియాలో పెట్టి డిలీట్ చేసి క్షమాపణలు చెప్పినా, ఆమెను చంపేస్తామని బెదిరిస్తున్నారు. కొన్ని సోషల్ మీడియా అకౌంట్లు పనికట్టుకుని మహిళల లొకేషన్లు, అడ్రస్‌లు, ఫోన్ నంబర్లు బయటపెడుతూ వారిని భయపెడుతున్నాయి.

తెలంగాణ నయాగరా ఉగ్రరూపం
TG· 31 Jul 2026

తెలంగాణ నయాగరా ఉగ్రరూపం

TG: భారీ వర్షాలతో ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని ప్రసిద్ధ కుంటాల జలపాతం జలకళను సంతరించుకుని ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరడంతో జలపాతం మరింత ఉగ్రరూపం దాల్చింది. ప్రకృతి అందాలను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నప్పటికీ, నీటి ప్రవాహం ప్రమాదకర స్థాయిలో ఉండటంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమై తాత్కాలికంగా సందర్శనను నిలిపివేసినట్లు తెలిపారు. పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే వరకు పర్యాటకులు కుంటాల జలపాతం వైపు రావద్దని సూచించారు.

Situationship  Vs  Relationship
Politics· 31 Jul 2026

Situationship Vs Relationship

"మేము రిలేషన్‌లో లేం... కానీ రోజూ గుడ్ మార్నింగ్, గుడ్ నైట్, కాల్స్, డేట్స్, పోజెసివ్ ఫైట్స్ అన్నీ ఉంటాయి!" ఇదే ఇప్పుడు Gen Zలో ఫుల్ ట్రెండ్ అవుతున్న Situationship. అంటే రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టే ఉంటారు... కానీ "నువ్వు నా గర్ల్‌ఫ్రెండ్/బాయ్‌ఫ్రెండ్ కదా?" అంటే వెంటనే "లేబుల్స్ ఎందుకు బ్రో?" అంటారు. 😭 సింపుల్‌గా చెప్పాలంటే, Relationship అంటే Love + Commitment ❤️, Situationship అంటే Love + Confusion + Unlimited Overthinking + "మనం అసలు ఏమిటి?" అనే డైలీ డౌట్! OTP రావడం ఈజీ Commitment రావడం కష్టం! 🤡

కన్నీళ్లు పెట్టిస్తున్న నటుడి పరిస్థితి!
News· 31 Jul 2026

కన్నీళ్లు పెట్టిస్తున్న నటుడి పరిస్థితి!

ఒకప్పుడు మలయాళ చిత్రసీమలో హీరో, దర్శకుడు, నిర్మాత, రచయితగా గుర్తింపు పొందిన 'మోహన్ శర్మ'. ఇప్పుడు ఆయనకు 70 సంవత్సరాలు చెన్నై సమీపంలోని గుమ్మిడిపూండి వృద్ధాశ్రమంలో జీవిస్తున్నారు. కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, అప్పులు ఆయనను ఒంటరిని చేశాయి. జీవితాంతం మందులు అవసరమైన పరిస్థితిలో ఉన్న ఆయనకు వాటిని కొనుగోలు చేసే స్థోమత కూడా లేదు. తాను నిర్మించి, దర్శకత్వం వహించిన 'గ్రామం' చిత్ర శాటిలైట్ హక్కులు అమ్ముడైతే వచ్చే డబ్బుతో వైద్య ఖర్చులు భరిస్తానని ఆశిస్తూ సహాయం కోరుతున్నారు.

నేతకు వీడ్కోలు.. నర్సంపేటలో జనవెల్లువ
Politics· 31 Jul 2026

నేతకు వీడ్కోలు.. నర్సంపేటలో జనవెల్లువ

తెలంగాణ ఉద్యమ నేత, నర్సంపేట మాజీ MLA <a href="https://www.theclearcutnews.com/n/XCo6KYd">పెద్ది సుదర్శన్ రెడ్డి</a>కి అంతిమ వీడ్కోలు పలికేందుకు వేలాది మంది అభిమానులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు నర్సంపేటకు తరలివచ్చారు. ఆయన భౌతికకాయాన్ని చివరిసారి చూసేందుకు పెద్దఎత్తున జనం రావడంతో పట్టణమంతా శోకసంద్రంగా మారింది. ప్రధాన రహదారులన్నీ జనంతో నిండిపోవడంతో రెండు కిలోమీటర్లకు పైగా ట్రాఫిక్ స్తంభించింది. అభిమాన నేతకు కన్నీటి వీడ్కోలు పలుకుతూ ప్రజలు భావోద్వేగానికి గురయ్యారు. నాయకులు, కార్యకర్తలు ఆయన సేవలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు.

విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలొద్దు
Education· 31 Jul 2026

విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలొద్దు

TG: ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీసీ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు, నాయకులు నిరసన చేపట్టారు. బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పిలుపు మేరకు నిర్వహించిన ఈ ధర్నాలో, సుమారు 14 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన రూ.8వేల కోట్ల బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. బకాయిలు విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

టిఫిన్ బండి వ్యాపారిపై కేసు.. సోషల్ మీడియాలో చర్చ
Legal· 31 Jul 2026

టిఫిన్ బండి వ్యాపారిపై కేసు.. సోషల్ మీడియాలో చర్చ

TG: హైదరాబాద్‌లో అర్ధరాత్రి టిఫిన్ బండి నిర్వహిస్తున్న చిరు వ్యాపారిపై మల్కాజిగిరి పోలీసులు కేసు పెట్టారు. దీనికి రెండు రోజుల నార్మల్ జైలు శిక్షతో పాటు రూ.50 ఫైన్ కూడా వేశారు. ఈ వివరాలను మల్కాజిగిరి పోలీసులు తమ ఆఫీసియల్ 'X' అకౌంట్లో పోస్టు చేశారు. ఆ పోస్టుపై నెటిజన్ల నుంచి నెగటివ్ రెస్పాన్స్ రావడంతో పోస్టు డిలీట్ చేశారు. అప్పటికే ఆ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొందరు పోలీసుల పనిని సమర్దించగా, మరికొందరు ఆ వ్యాపారిపై ఈ శిక్ష అవసరమా అని ప్రశ్నిస్తున్నారు.

20 ఏళ్ల తర్వాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్
India· 31 Jul 2026

20 ఏళ్ల తర్వాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్

బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ రెండు దశాబ్దాల తర్వాత కోల్‌కతాకు వచ్చారు. రవీంద్ర సదన్‌లో మత ఛాందసవాదానికి వ్యతిరేకంగా జరిగే కార్యక్రమంలో ఆమె పాల్గొననున్నారు. వివాదాస్పద పుస్తకం ‘ద్విఖండితో’పై జరిగిన నిరసనల కారణంగా 2007లో ఆమె నగరాన్ని విడిచి వెళ్లవలసి వచ్చింది. ఆమె కోల్‌కతాలో బహిరంగంగా కనిపించడం ఇదే మొదటిసారి. మతపరమైన మనోభావాలను దెబ్బతీసిందనే ఆరోపణలతో 2003లో అప్పటి సీపీఎం నేతృత్వంలోని బెంగాల్ ప్రభుత్వం ఆమె పుస్తకాన్ని నిషేధించింది. 63 ఏళ్ల ఆమె ప్రస్తుతం దిల్లీలో ఉంటున్నారు.

చాలా రోజుల గ్యాప్ తర్వాత లడఖ్‌ లో సోనమ్ వాంగ్‌చుక్..
News· 31 Jul 2026

చాలా రోజుల గ్యాప్ తర్వాత లడఖ్‌ లో సోనమ్ వాంగ్‌చుక్..

సోనమ్ వాంగ్‌చుక్ మళ్లీ తన SECMOL క్యాంపస్‌కి తిరిగొచ్చారు. చాలా రోజుల గ్యాప్ తర్వాత క్యాంపస్‌కి వచ్చిన ఆయనకు స్టూడెంట్స్, స్టాఫ్ అందరూ కలసి లడఖ్ ట్రెడిషనల్ తెల్లని శాలువాలతో చాలా ఆత్మీయంగా, గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పారు. స్టూడెంట్స్ అందరూ ఆయనను హగ్ చేసుకుంటూ వెల్‌కమ్ చెప్పిన ఈ క్యూట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

నా మాటలు నచ్చకపోతే మీ ఇష్టం- కంగనా రనౌత్
Politics· 31 Jul 2026

నా మాటలు నచ్చకపోతే మీ ఇష్టం- కంగనా రనౌత్

తనపై వస్తున్న విమర్శలపై BJP MP కంగనా రనౌత్ స్పందించారు. తనకు సక్సెస్, సమాజంలో హోదా, పేరు తెచ్చిపెట్టిన విషయాలనే అందరికీ చెబుతానని కామెంట్స్ చేశారు. సొంత ఇంట్లో పిల్లలకు ఒకలా, బయటి పిల్లలకు ఇంకోలా చెప్పే డబుల్ స్టాండర్డ్స్ తనకు ఉండవన్నారు. ఈ ప్రిన్సిపల్స్ నచ్చితే ఫాలో అవ్వొచ్చని, లేదంటే ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చంటూ ఆమె ఆన్సర్ ఇచ్చారు. రీసెంట్గా Gen Z ని మురికివారు అనడంతో CJP ప్రతినిధి సౌరవ్ దాస్, ఆమెని సొంత పార్టీనే పట్టించుకోదు అన్నాడు. దీంతో కంగనా ట్రోల్ అవుతున్నారు.

ఫ్రెండ్‌ను ఇరికించబోయి బుక్కయ్యాడు
Crime· 31 Jul 2026

ఫ్రెండ్‌ను ఇరికించబోయి బుక్కయ్యాడు

TG: కరీంనగర్‌లో కానిస్టేబుల్ అధికార దుర్వినియోగానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఈగల్ విభాగానికి చెందిన కానిస్టేబుల్ నాగరాజు తన ఫ్రెండ్‌ను అక్రమ కేసులో ఇరికించేందుకు అతడి ఇంట్లో గంజాయి ప్యాకెట్లు ఉంచి పోలీసులతో దాడులు చేయించాడు. అయితే విచారణలో అనుమానాలు తలెత్తడంతో పోలీసులు CCTV దృశ్యాలు, ఇతర ఆధారాలను పరిశీలించగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది. గంజాయిని స్వయంగా నాగరాజే ఇంట్లో ఉంచినట్లు నిర్ధారణ కావడంతో ఆయనను సస్పెండ్ చేశారు.