కమిషనర్‌ను వీలైనంత త్వరగా ట్రాస్ఫర్ చేయండి: హైకోర్టు

TG: హైడ్రాకు సంబంధించిన శాంతా శ్రీరామ్ కంపెనీ కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన జరిగిందని, వివాదాస్పద భూమిలో హైడ్రా చేపట్టిన చర్యలు చట్టవిరుద్ధమని కోర్టు స్పష్టం చేసింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను వీలైనంత త్వరగా బదిలీ చేసి, ఆయన స్థానంలో మరో అధికారిని నియమించాలని సీఎస్‌ను హైకోర్టు ఆదేశించింది. చట్టబద్ధమైన పాలనే కొనసాగాలని, వ్యక్తుల పాలన కాదని గుర్తు చేసింది. వ్యక్తుల ఆధిపత్యం కొనసాగితే అది ప్రజాస్వామ్యానికి మరణశాసనంగా మారుతుందని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది.



