Latest

ఓటు మీ హక్కు.. ఈ అవకాశం వదలొద్దు..
నాగర్కర్నూల్ జిల్లా ఓటర్లకు గుడ్ న్యూస్.. కలెక్టర్ హేమంత, కేశవ్ పాటిల్ సెప్టెంబర్ 5,6,12,13 తేదీల్లో ప్రత్యేక ప్రచార రోజులు నిర్వహిస్తున్నారు. కొత్త ఓటర్ల నమోదు, పేరు మార్పులు, చేర్పులు, తొలగింపులు కావాల్సినవారు వెంటనే మీ BLO ను కలవండి. ఎస్‌ఐఆర్ నోటీసులు అందుకున్న ఓటర్లు మాత్రం ధ్రువపత్రాలతో హియరింగ్ కు హాజరు కావాలని కలెక్టర్ సూచించారు. ఇప్పటివరకు జిల్లాలో 1 లక్ష నోటీసులు జారీ అయ్యాయి. ఈ స్పెషల్ డేస్ మిస్ అయితే, మళ్ళీ అవకాశం కష్టమే! ఓటు మీ రాజ్యాంగ హక్కు, దాన్ని వినియోగించుకోవడం మీ బాధ్యత.

ఓ అబ్బ!.. కేపీ కిల్లి పాటకు ఘన ప్రారంభం..!
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో సీనియర్ జర్నలిస్ట్ కేపీ (ఖాజా పాషా) నటించిన 'ఓ అబ్బ వేసుకున్న కిల్లి' పాట ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. పాత జాతీయ రహదారిపై ఉన్న మొబైల్ అడ్డా షాపులో జరిగిన ఈ ఈవెంట్‌కు స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి, శంకర్ ముఖ్య అతిథిగా హాజరై పాటను లాంచ్ చేశారు. ఆనాటి సూపర్ స్టార్స్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ పాటలను స్ఫూర్తిగా తీసుకుని వాటిని నేటి తరానికి అందించడం ఎంతో సంతోషంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు.కష్టాలను ఎదుర్కొంటూ జర్నలిజంలో మంచి పేరు సంపాదించిన కేపీ.. ఇప్పుడు కళారంగంలోనూ అడుగుపెట్టారు.

సీఎం సర్.. మా డబ్బులు మాకివ్వండి! DPలతో ఉద్యమం
AP రాష్ట్రంలో ఉద్యోగులు, పెన్షనర్లు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. పీ ఐకాస నేతలు బొప్పరాజు, వెంకటేశ్వర్లు, పలిశెట్టి, దామోదరరావు సోమవారం జిల్లా కలెక్టర్లకు నోటీసులు అందజేశారు. సెప్టెంబర్ 1 నుంచి 'సీఎం సర్.. మా డబ్బులు మాకు ఇవ్వండి' అనే నినాదాన్ని వాట్సాప్ డీపీగా పెట్టుకోవాలని పిలుపునిచ్చారు. 5వ తేదీ వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతామని, 15వ తేదీ నుంచి వర్క్ టు రూల్ చేపడతామని ప్రకటించారు.<br>తమ సమస్యల పరిష్కారం కోసం ఇది తొలిదశ కార్యాచరణ అని స్పష్టం చేశారు.

దేగామా చెరువు.. ప్రకృతి సోయగాల పండుగ!
ఆదిలాబాద్ జిల్లా, బజార్‌హత్నూర్ మండలం దేగామా గ్రామంలో చెరువు కళకళలాడుతోంది. వర్షాలతో నీటిమట్టం పెరగడంతో ఆ చెరువు సరికొత్త శోభను సంతరించుకుంది. చుట్టూ పచ్చని ప్రకృతి, నీటిలో ఆకాశం ప్రతిబింబం.. ఎంత అద్భుతమో కదా! ఉదయం, సాయంత్రం వేళల్లో ఇక్కడి వాతావరణం మరింత ఆహ్లాదకరంగా మారుతుంది. గ్రామస్తులు ఎంజాయ్ చేస్తూ, చెరువు పరిసరాల్లో సమయం గడుపుతున్నారు. ప్రకృతి ప్రేమికులకు ఇది హెవెన్ లాంటిది! "చెరువులు మన బతుకుకు ఆధారం" అంటూ, వాటి పరిరక్షణే ప్రతి ఒక్కరి బాధ్యత అని స్థానికులు చెబుతున్నారు.

పరకాలలో DS పార్టీ ఆందోళన.. ₹14,000 కోట్లు కావాలి!
హన్మకొండ జిల్లా పరకాలలో ధర్మ సమాజ్ పార్టీ (DSP) నాయకులు ఆందోళనకు దిగారు. మంగళవారం తహసీల్దార్ విజయలక్ష్మి గారికి వినతిపత్రం అందజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ₹14,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా DSP నేత బొచ్చు, నాగరాజు మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 30 లక్షల మంది విద్యార్థుల నిధులు పెండింగ్ లో ఉండటం బాధాకరమన్నారు.ప్రభుత్వం ఫీజులు సకాలంలో చెల్లించకపోవడంతో BC, SC, ST నిరుపేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

మట్టపర్రు రోడ్డులో భారీ గొయ్యి..! డేంజర్ డేంజర్
డా.బి.ఆర్ అంబేడ్కర్, కోనసీమ జిల్లా, రాజోలు మండలంలోని చింతలపల్లి-మట్టపర్రు రోడ్డు ప్రమాదకరంగా మారింది. ఇటీవలే వేసిన ఈ రోడ్డు కృంగిపోయి, భారీ గొయ్యి ఏర్పడింది. దీంతో ఆ రోడ్డు మీదుగా వెళ్లే వాహనదారులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. "వెంటనే అధికారులు స్పందించి రోడ్డు మరమ్మత్తు చేయాలి" అని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది వాహనదారులు ఇక్కడ పడిపోయి గాయపడ్డారని, ఇది చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు.అధికారులు నిర్లక్ష్యం చేస్తే, ఇక్కడ పెద్ద ప్రమాదం జరగడం ఖాయమంటున్నారు.

డ్రగ్స్‌కు ‘నో’ చెప్పే నేర్పు నేర్చుకోండి!
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ లోని విజ్ఞాన్ డిగ్రీ కళాశాలలో సెప్టెంబర్ 1న డ్రగ్స్ అవేర్‌నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. పాలమూరు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సామ, రవీందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు. "ఎవరైనా డ్రగ్స్ తీసుకోమని ఒత్తిడి చేస్తే మొహమాటానికి పోకుండా ధైర్యంగా నో చెప్పండి" అని సూచించారు."ఒక్కసారి తీసుకుంటే ఏమీ కాదు" అనే ఆలోచనే ప్రమాదమని, అది ఆర్థిక, సామాజిక, కుటుంబ సమస్యలకు దారితీస్తుందని హెచ్చరించారు.

AI వల్ల ఫిల్మ్ ఇండస్ట్రీ చనిపోతుంది: RGV
AI వల్ల ఫిల్మ్ ఇండస్ట్రీ చనిపోతుందని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. “సినిమా భవిష్యత్తు చాలా బ్రైట్. కానీ దాని ధర ఫిల్మ్ ఇండస్ట్రీని చంపడమే” అని అన్నారు. 2026 డిసెంబర్ నాటికి వేల సంఖ్యలో AI ఏజెంట్లు అందుబాటులోకి వస్తాయని, ఇవి కేవలం స్క్రిప్ట్ రాయడమే కాకుండా కథ నుంచి చాలా వెర్షన్లు తయారు చేసి, ఏది బలంగా ఉందో, ఏది బలహీనంగా ఉందో చూసి మంచివి మాత్రమే ఉంచుతాయని రాశారు. పోస్ట్ ప్రొడక్షన్ కోసం నెలల తరబడి వేచి ఉండాల్సిన అవసరం ఉండదన్నారు.

ఓహో! రికార్డు బొగ్గు ఉత్పత్తి..!
పెద్దపల్లి జిల్లా రామగుండంలో సింగరేణి సంచలనం సృష్టించింది. ఏరియా-1లో ఆగస్టు నెలలో 124% బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు జీఎం లలిత్, కుమార్ తెలిపారు. RG-1 పరిధిలోని గనులు, ఉపరితల ప్రాజెక్టుల్లో ఈ రికార్డు వచ్చింది. అదేవిధంగా GDK-1,3 గనుల్లో 64%, GDK-2,2A లో 71%, GDK-1A లో 298% ఉత్పత్తి సాధించినట్లు చెప్పారు. భద్రతా ప్రమాణాలు పాటిస్తూ ఉత్పత్తి కొనసాగిస్తున్నామని, కార్మికుల రక్షణకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. పరిశ్రమలకు బొగ్గు రవాణా వేగంగా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

Oracle ఉద్యోగుల్లో మళ్లీ లేఆఫ్స్ టెన్షన్!
కంపెనీ నుంచి వచ్చే మెయిల్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి, Oracle ఉద్యోగుల్లో టెన్షన్ పెరుగుతోంది. కంపెనీ మరో రౌండ్ లేఆఫ్స్‌కు సిద్ధమవుతున్నట్లు తాజా రిపోర్టులు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 7,000 నుంచి 10,000 వరకు ఉద్యోగాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని అంచనా. భారత్‌లో ఎంతమంది ప్రభావితమవుతారో ఇంకా ఖచ్చితంగా తెలియదు. ఖర్చులు తగ్గించుకోవడం, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, AIపై భారీ పెట్టుబడులు ఈ నిర్ణయం వెనుక కారణాలుగా కనిపిస్తున్నాయి. Oracle మాత్రం కొత్త లేఆఫ్స్‌ను ఇంకా కన్ఫర్మ్ చేయలేదు.

తియ్యగా ఉంటుంది.. తీరిగ్గా ప్రాణాలు తీస్తుంది
Chewing gum, Toothpaste, Jam, Yoghurts and Ice-cream..ఇలాంటి ఉత్పత్తుల్లో ఎక్కువగా వాడే ఒక స్వీటనర్ స్ట్రోక్, హార్ట్ అటాక్ ప్రమాదాన్ని పెంచుతోందని కొత్త స్టడీ చెబుతోంది. ఈ స్వీటనర్ పేరు ‘Xylitol’(జైలిటాల్). ఇది కొన్ని ఆహారాల్లో చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. కానీ ఫుడ్, డ్రింక్స్, ఓరల్ కేర్ ప్రొడక్ట్స్‌లో స్వీట్‌నెస్ కోసం దీన్ని వేల రెట్లు ఎక్కువగా కలుపుతున్నారు. బ్లడ్‌లో జైలిటాల్ స్థాయి ఎక్కువగా ఉన్నవాళ్లకు హార్ట్ అటాక్, స్ట్రోక్ ప్రమాదాలు పెరిగినట్టు తేలింది.

మీరు Ambivert or Omnivert?
ఇంట్రోవర్ట్, ఎక్స్ట్రోవర్ట్ కాకుండా మధ్యలో ఉండే వాళ్లలో 'యాంబివర్ట్', 'ఓమ్నివర్ట్' అని రెండు రకాలుంటాయి! యాంబివర్ట్ (Ambivert) అంటే సందర్భాన్ని బట్టి సైలెంట్‌గా లేదా ఫ్రెండ్లీగా ఉండే బ్యాలెన్స్డ్ పర్సనాలిటీ. కానీ ఓమ్నివర్ట్ (Omnivert) అలా కాదు. ఒకరోజు ఫుల్ ఎనర్జీతో పార్టీ లైఫ్ ఎంజాయ్ చేస్తే, మరుసటి రోజే ఎవరితోనూ మాట్లాడకుండా సైలెంట్ మోడ్‌లోకి వెళ్తారు. మూడ్‌ను బట్టి వీరు ఎక్స్‌ట్రీమ్ ఇంట్రోవర్ట్‌గా లేదా ఎక్స్‌ట్రోవర్ట్‌గా మారిపోతారు. మరి మీది ఏ టైప్ పర్సనాలిటీ?

Vivo, iQOOపై భారీ ధరల పెంపు!
ఫోన్ కొనాలనుకుని బడ్జెట్ ఫిక్స్ చేసుకున్నారా? అయితే ఈ న్యూస్ మీ ప్లాన్‌ను మార్చొచ్చు. Vivo T5x, iQOO Z11x ధరలు సెప్టెంబర్ 1 నుంచి భారత్‌లో మరోసారి పెరిగాయి. 6GB+128GB వేరియంట్ ₹24,999 నుంచి ₹27,999కి చేరగా, 8GB+256GB మోడల్ ₹30,999 నుంచి ₹34,999కి వెళ్లింది. అంటే టాప్ వేరియంట్‌పై ఏకంగా ₹4,000 అదనం. రెండు ఫోన్ల హార్డ్‌వేర్‌లో మార్పు లేకపోయినా ధర పెరగడం గమనార్హం. ఈ ఏడాది వీటి ధరలు చాలాసార్లు మారాయి. ర్యామ్, స్టోరేజ్ ఖర్చుల ఒత్తిడి కూడా మార్కెట్‌పై ప్రభావం చూపుతోంది. కాబట్టి కొనేవారు జాగ్రత్త.

ఆశా వర్కర్ల ఆగ్రహం! ANM సస్పెన్షన్ డిమాండ్
వనపర్తి జిల్లా, పాన్గల్ మండల కేంద్రంలో ఆశా వర్కర్లు ఆందోళనకు దిగారు. అంబేద్కర్ చౌరస్తా నుంచి సబ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి, ANM సుమిత్రపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో విధులు నిర్వహిస్తున్న ఆశా వర్కర్లను ఆమె వేధిస్తున్నారని, కించపరుస్తున్నారని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు ఆరోపించారు. బిల్లులు క్లియర్ చేయకుండా జీరో బిల్లు వేయడం, పనుల్లో అవాంతరాలు సృష్టించడం వంటి ఇబ్బందులున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు., DMHO భాస్కర్ నాయక్ కు వినతిపత్రం ఇచ్చారు. విచారణ జరపాలన్నారు.

న్యూయార్క్‌లో షాకింగ్ ఘటన.. మహిళపై పోలీసుల కాల్పులు
అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇద్దరు వ్యక్తులపై కత్తులతో దాడి చేసిన 49 ఏళ్ల మహిళను పోలీసులు కాల్చి చంపారు. కత్తులు కింద పడేయాలని పోలీసులు పలుమార్లు వార్నింగ్ ఇచ్చినా ఆమె వినకుండా పోలీసులపైకి దూసుకెళ్లింది. ఆమెను కంట్రోల్ చేసేందుకు టేజర్ గన్స్ వాడినా ఫలితం లేకపోయింది. దీంతో సెల్ఫ్ డిఫెన్స్‌లో పోలీసులు ఫైర్ చేయగా, ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. <a href="https://x.com/rajtweets10/status/2094706125686157339">వీడియో లింక్</a>

తాడేపల్లిలో గంజాయి వేట..! 3 మంది అరెస్ట్
గుంటూరు జిల్లా తాడేపల్లిలో పోలీసులు గంజాయి వ్యాపారులపై ఉక్కుపాదం మోపారు. కాలేజీ విద్యార్థులకు గంజాయి అమ్ముతున్న ముగ్గురు నిందితులను తాడేపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు ఛానల్ లాకుల వద్ద విశ్వసనీయ సమాచారంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారి చేతిలో 3.3 KG గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై NDPS Act కింద కేసు నమోదు చేశారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు. "ఇంకా ఎంతమంది ఇలాంటి వ్యాపారం చేస్తున్నారో" అని తాడేపల్లి వాసులు ఆందోళన పడుతున్నారు.

కరీంనగర్‌లో AITUC మహాసభలు..!
కరీంనగర్ జిల్లా కేంద్రంలో AITUC తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు సెప్టెంబర్ 6,7,8 తేదీల్లో జరగనున్నాయి. ఈరోజు మంథనిలో మహాసభల కరపత్రాలను జిల్లా జనరల్ సెక్రటరీ కడారి, సునీల్ ఆవిష్కరించారు. ఉద్యమాలకు, విప్లవాలకు కరీంనగర్ ఊపిరిగా ఉందని, ఇక్కడి నుంచే మార్పు మొదలవుతుందని ఆయన చెప్పారు. ఈ మహాసభల్లో భవిష్యత్ పోరాట ప్రణాళిక రూపొందిస్తామన్నారు. సెప్టెంబర్ 6న మధ్యాహ్నం 12 గంటలకు అంబేద్కర్ స్టేడియం నుంచి సర్కస్ గ్రౌండ్ వరకు భారీ ప్రదర్శన ఉంటుందని తెలిపారు. 33 జిల్లాల నుంచి ప్రతినిధులు హాజరుకానున్నారు.

అంజనగిరిలో డ్రై రన్‌కు రెడీ..! కలెక్టర్ ఆదేశాలు
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్, అంజనగిరి రిజర్వాయర్‌లో మిషన్ భగీరథ పంప్‌హౌస్ పనులు వేగంగా సాగుతున్నాయి. మంగళవారం కలెక్టర్ హేమంత, కేశవ్ పాటిల్ ఆ పనులను పరిశీలించి, ఈ నెల 7న జరిగే డ్రై రన్ కు సిద్ధం కావాలని ఆదేశించారు. అన్ని సాంకేతిక, విద్యుత్ పనులను పూర్తి చేయాలని అధికారులకు డైరెక్ట్ ఇచ్చారు. 6 పంపుల్లో 4 పనులు తుది దశకు వచ్చాయని అధికారులు నివేదించారు. డ్రై రన్ అయ్యాక వెట్ రన్ కు కూడా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ పనులు పూర్తయితే నీటి సమస్య తీరుతుందని స్థానికుల ఆశ.

🚀 కాన్ఫిడెన్స్ పెంచే 3 సింపుల్ ట్రిక్స్!
స్టేజ్ ఎక్కాలన్నా, ఇంటర్వ్యూకి వెళ్లాలన్నా కంగారుగా ఉందా? కాన్ఫిడెన్స్ అంటే భయం లేకపోవడం కాదు... భయమున్నా ధైర్యంగా ముందడుగు వేయడమే! ప్రెజెంటేషన్ ముందు మీకు ఇష్టమైన మ్యూజిక్ వింటే వెంటనే మంచి బూస్ట్ దొరుకుతుంది. అలాగే "నా వల్ల కాదు" అని ఆగిపోకుండా "ప్రయత్నిస్తే నేర్చుకోవచ్చు" అనే మైండ్‌సెట్ పెంచుకోవాలి. క్రికెట్‌లో ప్రతి బాల్‌కీ సిక్స్ కొట్టలేం కదా! అలాగే జీవితంలో కూడా పొరపాట్లు సహజమని గుర్తించి వాటి నుండి నేర్చుకుంటూ ముందుకు సాగితే మీ కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా పెరుగుతుంది!

కల్వకుర్తిలో గంజాయి వ్యాపారి అరెస్ట్!
నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో పోలీసులు గంజాయి వ్యాపారంపై ఉక్కుపాదం మోపారు. రంగాపూర్ గ్రామానికి చెందిన ఆలే, సత్యనారాయణ (సత్తి)ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఛత్తీస్గఢ్ లోని సుకుమా ప్రాంతం నుంచి గత మూడేళ్లుగా గంజాయి తెచ్చి, చిన్న ప్యాకెట్లుగా ప్యాక్ చేసి యువతకు అమ్ముతున్నాడని పోలీసులు తెలిపారు. ఈ కేసులో మరెవరైనా ఉంటే వారి కోసం ఆరా తీస్తున్నారు. ఇకపై ఎవరైనా గంజాయి కొనుగోలు, అమ్మకాలు, వినియోగానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడిగా నవీన్కుమార్
పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారుల సంఘం నూతన అధ్యక్షుడిగా శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ వడ్లకొండ నవీన్ కుమార్ ఎన్నికయ్యారు. సోమవారం RGM పోలీస్ కమిషనరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో CP అంబర్ కిషోర్ ఝూ పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించారు. ప్రత్యర్థి AR హెడ్ కానిస్టేబుల్ రామ్ చందర్ పై ఐదు ఓట్ల తేడాతో నవీన్ కుమార్ విజయం సాధించారు.