Latest

కల్వకుర్తిలో గంజాయి వ్యాపారి అరెస్ట్!
నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో పోలీసులు గంజాయి వ్యాపారంపై ఉక్కుపాదం మోపారు. రంగాపూర్ గ్రామానికి చెందిన ఆలే, సత్యనారాయణ (సత్తి)ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఛత్తీస్గఢ్ లోని సుకుమా ప్రాంతం నుంచి గత మూడేళ్లుగా గంజాయి తెచ్చి, చిన్న ప్యాకెట్లుగా ప్యాక్ చేసి యువతకు అమ్ముతున్నాడని పోలీసులు తెలిపారు. ఈ కేసులో మరెవరైనా ఉంటే వారి కోసం ఆరా తీస్తున్నారు. ఇకపై ఎవరైనా గంజాయి కొనుగోలు, అమ్మకాలు, వినియోగానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడిగా నవీన్కుమార్
పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారుల సంఘం నూతన అధ్యక్షుడిగా శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ వడ్లకొండ నవీన్ కుమార్ ఎన్నికయ్యారు. సోమవారం RGM పోలీస్ కమిషనరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో CP అంబర్ కిషోర్ ఝూ పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించారు. ప్రత్యర్థి AR హెడ్ కానిస్టేబుల్ రామ్ చందర్ పై ఐదు ఓట్ల తేడాతో నవీన్ కుమార్ విజయం సాధించారు.

MPHA క్యాండిడేట్లకు అలర్ట్.. మెరిట్ లిస్ట్ రిలీజ్
TG: స్టేట్ హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో 1,931 Multi-Purpose Health Assistant (MPHA)పోస్టుల రిక్రూట్‌మెంట్ ఫైనల్ స్టేజ్‌కు చేరుకుంది. ఈ పోస్టులకు సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయింది. క్యాండిడేట్లను 1:1.25 రేషియోలో షార్ట్‌లిస్ట్ చేసి సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు సెలెక్ట్ చేశారు. షార్ట్‌లిస్ట్ అయిన క్యాండిడేట్లకు ఈనెల 16 నుంచి 26 వరకు వెరిఫికేషన్ జరగనుంది. హైదరాబాద్ వెంగల్‌రావునగర్‌లోని IIFHWలో ఈ ప్రాసెస్ నిర్వహిస్తారు. ఈ తేదీల్లో అటెండ్ కాని వారికి సెప్టెంబర్ 28న మరో ఛాన్స్ ఇచ్చారు.

మనం నెగెటివ్ న్యూస్‌ని ఎందుకు ఎక్కువగా చూస్తాం?
రోజంతా మంచి వార్తలు కనిపించినా.. ఒక్క నెగెటివ్ న్యూస్ మాత్రం మన ఫోకస్‌ను వెంటనే లాగేస్తుంది. దీనికి మన మెదడులోని “Negativity Bias” ఒక కారణం. ప్రమాదం, భయం, నష్టం లాంటి విషయాలను మెదడు ముందుగా గుర్తించి ఎక్కువగా గుర్తుపెట్టుకుంటుంది. అందుకే అలాంటి వార్తలను మళ్లీ మళ్లీ ఓపెన్ చేస్తాం. సోషల్ మీడియా ఆల్గారిథమ్స్ కూడా మన ఆసక్తిని బట్టి ఇలాంటి కంటెంట్‌ను మరింత చూపించొచ్చు. అంటే మనం చెడ్డ వార్తలనే కోరుకుంటున్నామని కాదు.. మన మెదడు వాటిని ఎక్కువగా గమనించేలా తయారైంది.

అమరజీవికి ఘన నివాళి! 28వ వర్ధంతి వేడుక
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలం నాయుడుపేటలో అమరజీవి కామ్రేడ్ దొండపాటి, వెంకట సుబ్బారావు 28వ వర్ధంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. సీపీఎం శాఖ కార్యదర్శి చెనుబోయిన, బ్రహ్మయ్య అధ్యక్షతన సభ జరిగింది. ఆయన స్మారక స్థూపం వద్ద సీపీఎం మండల కార్యదర్శి మోరంపూడి, శ్రీనివాసరావు పార్టీ జెండా ఎగురవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీపీఎం మాజీ జిల్లా కమిటీ సభ్యులు దొడ్డా, లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, ఆయన మార్క్సిస్టు సిద్ధాంతాన్ని నమ్మి రైతులు, కార్మికుల కోసం పోరాడారని గుర్తు చేశారు.

పిచ్చికుక్క హడల్! ఇద్దరికి గాయాలు
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలోని అంగడి బజార్ ప్రాంతంలో మంగళవారం ఓ పిచ్చి కుక్క హడలెత్తించింది. ఆ కుక్క పలువురిపై దాడి చేయడంతో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గాయపడిన ఇద్దరి పరిస్థితి నిలకడగానే ఉందని, చికిత్స కొనసాగుతోందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్శ్రీ నివాస్ తెలిపారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పట్టణంలో పిచ్చికుక్కల సంచారాన్ని అధికారులు అదుపు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

చల్లని నీళ్లు తాగితే జలుబు వస్తుందా?
“చల్లని నీళ్లు తాగొద్దు.. జలుబు వస్తుంది!” చిన్నప్పటి నుంచి ఈ మాట ఎన్నిసార్లు విన్నాం! కానీ నిజంగా చల్లని నీళ్లు తాగితే జలుబు వస్తుందా? అసలు విషయం ఏంటంటే, జలుబుకు కారణం చల్లని నీళ్లు కాదు, వైరస్‌లు. చల్లని నీరు కొంతమందిలో గొంతు లేదా ముక్కులో తాత్కాలిక అసౌకర్యం కలిగించొచ్చు. దాంతో జలుబు వచ్చినట్టుగా అనిపించవచ్చు. పైగా, ఇప్పటికే శరీరంలో వైరస్ ఉంటే అదే సమయంలో లక్షణాలు మొదలవ్వొచ్చు. అందుకే చల్లని నీళ్లు తాగిన వెంటనే జలుబు వచ్చిందంటే.. నీళ్లే కారణమని అనుకోవడం సరైంది కాదు.

రోడ్లపై గుంతలు.. బురదలోనే నిరసన
TG: హైదరాబాద్‌లో రోడ్ల కండిషన్‌పై ఓ వ్యక్తి డిఫరెంట్‌గా నిరసన తెలిపారు. ఇమ్లీబన్-పుత్లీబౌలి వంటి మెయిన్ రోడ్లపై గుంతలు, బురదతో ప్రజలు, వెహికల్ యూజర్లు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఏకంగా బురదలో కూర్చొని ప్రొటెస్ట్ చేశారు. వర్షాకాలంలో సిట్యుయేషన్ మరీ వరస్ట్ కాకముందే అధికారులు యాక్షన్ తీసుకోవాలని కోరారు. రోడ్లపై గుంతలు, బురద కారణంగా ప్రమాదాల ముప్పు పెరుగుతోందని తెలిపారు. వెంటనే రోడ్లను రిపేర్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

కార్మికుల ధర్నా.. సర్కారు ఆసుపత్రి ఎదుట!
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఎదుట మంగళవారం కాంట్రాక్ట్ శానిటేషన్ కార్మికులు ధర్నా చేశారు. కనీస వేతనాలు ఇవ్వాలని, తమ శ్రమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. TUCIA సత్తుపల్లి ఏరియా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో జిల్లా కోశాధికారి అమర్లపూడి, శరత్ మాట్లాడుతూ, కార్మికుల శ్రమను కాంట్రాక్టర్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. ఈ నెల 6న ఖమ్మం నగరంలోని రామనర్సయ్య భవనంలో TUCIA రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు జరగనున్నాయని, అందులో కార్మిక సమస్యలపై పోరాట రూపకల్పన చేస్తామన్నారు.

గంజాయి వేటలో.. నార్కోటిక్ డాగ్స్!
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం కాల్ టెక్స్ ప్రాంతంలో పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. 2 టౌన్ SI తిరుపతి ఆధ్వర్యంలో నార్కోటిక్ డాగ్స్ సహాయంతో మంగళవారం విస్తృత తనిఖీలు చేశారు. అనుమానిత ప్రాంతాలను, నిర్మానుష్య ప్రదేశాలను ఈ డాగ్స్ ద్వారా క్షుణ్ణంగా పరిశీలించారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల నిల్వ, రవాణాపై పోలీసులు నిఘా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో ఎలాంటి అక్రమాలు బయటపడ్డాయన్న వివరాలు మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. మీ ప్రాంతంలోనూ ఇలాంటి తనిఖీలు జరగాలని అనుకుంటే కామెంట్ చేయండి.

జీఓ 97 రద్దుకి.. విద్యార్థుల రాస్తారోకో!
మంచిర్యాల జిల్లా నస్పూర్ లోని సీసీసీ కార్నర్ దగ్గర సింగరేణి పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళనకు దిగారు.<br>జీఓ 97 ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డు మధ్యలో కూర్చుని, పెద్దపెట్టున నినాదాలు చేశారు.<br>దీంతో ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.మంచిర్యాల ఎసీపీ ప్రకాష్ అక్కడికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. వారి డిమాండ్ ను ప్రభుత్వానికి చేరవేస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. జీఓ 97 నిజంగా రద్దు కాకపోతే, మళ్లీ పెద్ద ఉద్యమమే వస్తుందని విద్యార్థులు హెచ్చరించారు.

బాలాఘాట్‌లో చిన్నారుల వరుస మరణాలు
మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లా బిర్సా ప్రాంతంలోని మారుమూల గిరిజన గ్రామాల్లో చిన్నారుల వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. 24–25 మంది వరకు పిల్లలు మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రభుత్వ రికార్డుల్లో నమోదైన మరణాల సంఖ్య దీనికంటే తక్కువగా ఉంది. మలేరియా, మీజిల్స్, మాల్ న్యూట్రీషియన్, అంటువ్యాధులు ఈ మరణాలకు కారణమని అనుకుంటున్నా, అన్ని మరణాలకూ ఒకే కారణమేదీ ఇప్పటివరకు కన్ఫర్మ్ కాలేదు. ప్రభావిత గ్రామాల్లో వైద్య పరీక్షలు, టీకాలు, మలేరియా నివారణ చర్యలు కొనసాగుతున్నాయి.

సముద్రం నీరు ఉప్పగా ఎందుకు ఉంటుంది?
సముద్రం నీరు ఉప్పగా ఉండటం వెనుక పెద్ద రహస్యం ఏమీ లేదు.. కోట్ల ఏళ్లుగా జరుగుతున్న ఒక సహజ ప్రక్రియే దీనికి కారణం. వర్షం భూమిపై పడినప్పుడు రాళ్లలోని చిన్న చిన్న ఖనిజాలను కరిగిస్తుంది. నదులు వాటిని సముద్రంలోకి తీసుకెళ్తాయి. సముద్రపు నీరు ఆవిరై మేఘాలుగా మారినా.. అందులోని ఉప్పు, ఖనిజాలు మాత్రం అక్కడే మిగిలిపోతాయి. ఇలా ఏళ్ల తరబడి అవి సముద్రంలో చేరుతూనే ఉంటాయి. అంతేకాదు, సముద్రపు అడుగున జరిగే అగ్నిపర్వత చర్యలు, రసాయన మార్పులు కూడా కొంత ఉప్పును కలుపుతాయి. అందుకే సముద్రం నీరు మనకు ఉప్పగా రుచి ఇస్తుంది.

నల్ల బ్యాడ్జీలతో పెన్షన్ విద్రోహం! చలో కలెక్టరేట్ విజయం
పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులు నల్ల బ్యాడ్జీలతో విద్రోహ దినాన్ని నిర్వహించారు. టీజీఈజేసీ (TGEJAC) పిలుపు మేరకు ఈ ధర్నా జరిగిందని, అది విజయవంతమైందని జిల్లా చైర్మన్ బొంకూరి, శంకర్ తెలిపారు.తెలంగాణ సాధనలో ఉద్యోగులు కీలక పాత్ర పోషించినా, నేడు వారి హక్కులు నిర్లక్ష్యం కావడం బాధాకరమన్నారు. ఇది కేవలం పెన్షన్ సమస్య కాదని, ఉద్యోగుల గౌరవం, భద్రతకు సంబంధించిన ఉద్యమమని చెప్పారు. ప్రభుత్వం స్పందించకపోతే సెప్టెంబర్ 10న హైదరాబాద్ లో మహాధర్నా చేస్తామన్నారు.

AP ఓటర్లకు బిగ్ అప్‌డేట్.. SIR డెడ్‌లైన్ Extend!
AP: రాష్ట్రంలో ఓటర్ లిస్ట్ SIR ప్రాసెస్‌కు Election Commission of India (ECI) డెడ్‌లైన్ ఎక్స్‌టెండ్ చేసింది. ఓటర్ లిస్ట్‌లో పేరు లేకపోయినా, పేరు/అడ్రస్ వంటి వివరాల్లో తప్పులున్నా సెప్టెంబర్ 10 వరకు క్లెయిమ్స్, అబ్జెక్షన్స్ పెట్టుకోవచ్చు. వచ్చిన క్లెయిమ్స్‌ను వెరిఫై చేసి అక్టోబర్ 5 వరకు సాల్వ్ చేయనున్నారు. SIR పూర్తయ్యాక అక్టోబర్ 9న ఫైనల్ ఓటర్ లిస్ట్ రిలీజ్ చేయనున్నారు. ఓటర్లు లిస్ట్‌లో తమ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలని అధికారులు తెలిపారు.

భోగాపురం ఎయిర్‌పోర్ట్ నిర్వాసితుల ఆందోళన
AP: విజయనగరం కలెక్టరేట్ వద్ద భోగాపురం ఎయిర్‌పోర్ట్ నిర్వాసితులు ఆందోళన చేపట్టారు. తమ పొలాలకు రోడ్డు సౌకర్యం లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఎయిర్‌పోర్ట్ నిర్మాణ సంస్థకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమకు న్యాయం చేయాలని కలెక్టర్ కార్యాలయం ఎదుట డిమాండ్ చేశారు. ఎయిర్‌పోర్ట్ వస్తే తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని భూములు ఇచ్చామని, అయితే ప్రభుత్వం ఇచ్చిన హామీలేవీ అమలు కాలేదని తెలిపారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
భూమిపూజై 2 ఏళ్లు.. రోడ్డు పని Start కాలేదు
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో రోడ్డు నిర్మాణం పేరుకే పరిమితమైంది. మంత్రి పొన్నం, ప్రభాకర్ శంకుస్థాపన చేసి రెండేళ్లయినా అధికారులు పని మొదలుపెట్టలేదు. ఈ నిర్లక్ష్యంతో సర్పంచ్ కుమారస్వామి ఆధ్వర్యంలో గ్రామస్తులంతా రోడ్డెక్కి ధర్నా చేశారు. మహిళలు రోడ్డుపై నాట్లు వేస్తూ, "రోడ్డు లేక మా ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి" అంటూ నిరసన తెలిపారు. భీమదేవరపల్లి నుంచి వంగర వరకు ఈ రోడ్డు చాలా అవసరమని, వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఇష్యూపై కలెక్టర్ స్పందించకపోతే, ప్రజల ఆందోళన మరింత పెరుగనుంది.

పిల్లాణ్ని చూసుకోమని చెప్తే.. దారుణానికి పాల్పడ్డాడు
ఆసుపత్రి క్యాంటీన్‌లో ఓ మహిళ తన ఒకటిన్నరేళ్ల కొడుకును 15 నిమిషాలు చూసుకోమని 20 ఏళ్ల యువకుడిని అడిగింది. అతను పిల్లవాడిని ఆసుపత్రి వెనుకకు తీసుకెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఇన్సిడెంట్ మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్‌లో జరిగింది. నిందితుడు పరిచయస్తుడే కావడంతో బాలుడి తల్లి నమ్మి అతనికి బిడ్డను అప్పగించింది. ఆ తర్వాత తన బిడ్డ కనిపించకపోవడంతో వెతికింది. చివరకు ఆసుపత్రి వెనక భాగంలో జరిగిన దారుణాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అతణ్ని అరెస్ట్ చేశారు.

ఇప్పపువ్వు సారాకు చట్టబద్ధత..! ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్
మహబూబ్ నగర్ జిల్లా, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మరోసారి సంచలనం రేపారు.మంగళవారం మిడ్జిల్ మండలంలోని ఈదులబాయి తండాతో పలు గ్రామాల్లో నూతన రేషన్ కార్డుల పంపిణీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "ఇప్పపువ్వు సారా తయారీని చట్టబద్ధం చేయడానికి కృషి చేస్తాను" అని హామీ ఇచ్చారు. గిరిజనులు ఈ సారానే జీవనాధారంగా చేసుకున్నారని, వారికి ఇబ్బంది కలగకూడదని స్పష్టం చేశారు. ఇదే అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించినట్లు గుర్తు చేశారు. ప్రభుత్వం త్వరలో సమగ్ర ప్రణాళిక రూపొందించాలని, ఆ దిశగా ప్రయత్నిస్తానని చెప్పారు.

Nov 17న సామూహిక సెలవుకు సిద్ధం! పాత పెన్షన్ ఇవ్వండి
జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. CPS రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తీసుకురావాలంటూ సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేస్తోంది. సెప్టెంబర్ 1న జిల్లావ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలతో నిరసనలు వ్యక్తం చేశారు. కాంగ్రెస్ తన మానిఫెస్టో లో ప్రకటించిన దానినే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని, అందుకే నవంబరు 17న సామూహిక లీవ్ పెట్టాలని యూనియన్ నాయకులు పిలునిచ్చారు. ఆ రోజున ఉద్యోగులంతా ఏకమై ఆందోళనను విజయవంతం చేయాలని కోరారు.

పెన్షన్‌కు గడువు పెంపు! ఈ 15లోగా దరఖాస్తు చేయండి
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువును ప్రభుత్వం పొడిగించింది. రాయుడుపాలెం గ్రామం సర్పంచ్ ఇందిరమ్మ మరియు పంచాయతీ కార్యదర్శి వేణు ఈ విషయం వెల్లడించారు. అర్హులైన లబ్ధిదారులు ఈ నెల 15వ తేదీ వరకు అప్లై చేసుకునేందుకు అవకాశం ఉందని తెలిపారు. ఇంకా దరఖాస్తు చేయని వారు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని సర్పంచ్ చెప్పారు. స్థానికులు సంతోషంగా, "మళ్లీ అవకాశం ఇవ్వడం మంచిది" అంటున్నారు. ఎవరైనా అర్హులు దరఖాస్తు చేసుకోకపోతే వారే నష్టపోతారు. మీకు పెన్షన్ కావాలా? వెంటనే పంచాయతీ కార్యాలయానికి వెళ్లండి.