Latest

వెయిట్ లాస్ మందులతో జర భద్రం !
వెయిట్ లాస్ కోసం కొందరు వాడే GLP-1 రకం మందులు కొన్నిసార్లు ఈటింగ్ డిజార్డర్ అయిన అనోరెక్సియాకు (ఆకలి కాకపోవడం) దారితీసే ప్రమాదం ఉందని పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. బరువు తగ్గించే క్రమంలో ఇవి మెదడులోని ఆకలి సంకేతాలను అణిచివేయడం వల్ల కొందరిలో ఆహారం పట్ల తీవ్ర భయం, విరక్తి ఏర్పడుతున్నాయి.వీటి వాడకంలో సరైన గైడెన్స్ లేకపోతే ఇవి తీవ్రమైన శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

లివర్ ను దెబ్బ తీసే డేంజరస్ హాబిట్స్ ఇవే !
మన శరీరంలో ఎంతో కీలకమైన లివర్ (కాలేయం) ఆరోగ్యం కొన్ని లైఫ్ స్టైల్ సరిగా లేకపోతే దెబ్బతినే ప్రమాదం ఉంది. ఓవర్ గా ఆల్కహాల్ తీసుకోవడం, ప్రాసెస్ చేసిన ఫుడ్ తో వచ్చే ఫ్యాటీ లివర్, ఓవర్ వెయిట్ లివర్ ఫెయిల్యూర్‌కు దారితీస్తాయి. అలాగే డాక్టర్ సలహా లేకుండా వాడే పెయిన్ కిల్లర్లు, హెర్బల్ సప్లిమెంట్లు కూడా డేంజరే. హెపటైటిస్ వంటి వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల కూడా లివర్ పాడవుతుంది. కాబట్టి సరైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా మీ లివర్‌ను సేఫ్ గా ఉంచుకోవచ్చు

ఫుడ్ డెలివరీ బోయ్ కి సాహిత్య పురస్కారం !
ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తూనే కవితలు రాసిన 57 ఏళ్ల వాంగ్ జిబింగ్ చైనాలోనే అత్యున్నత లూ క్సున్ సాహిత్య పురస్కారాన్ని కైవసం చేసుకున్నారు. గిగ్ ఎకానమీలో డెలివరీ వర్కర్లు ఎదుర్కొంటున్న కష్టాలు, వారి జీవన పోరాటం ఆధారంగా ఆయన రాసిన 'లో ఫ్లైట్' (Low Flight) కవితల సంపుటికి ఈ అవార్డు లభించింది. 2019 నుంచి పగలు డెలివరీలు చేస్తూ రాత్రి వేళల్లో 6,000 పైగా కవితలు రాసిన ఆయన ప్రయాణం అందరినీ ఆకట్టుకుంటోంది. అవార్డు వచ్చినా తను డెలివరీ బాయ్‌గా కొనసాగుతానని ఆయన వెల్లడించారు.

ఉదయ్ కృష్ణా రెడ్డిది దారుణమైన ప్రవర్తన - సీపీ
మహిళా ట్రైనీ ఐపీఎస్ పై లైంగిక వేధింపులకు పాల్పడిన ట్రైనీ ఉదయ్ కృష్ణారెడ్డిపై షాకింగ్ వివరాలు బయటకొచ్చాయి. బాధితురాలిని ఆరు వారాల పాటు వేధించడమేకాక ఆమె ఫోన్ లాక్కుని పాస్ వర్డ్ అడగడం, గదిలో బంధించడం, జుట్టు పట్టుకు లాగడం, గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించడం,కత్తితో బెదిరించడం లాంటి దారుణాలకు పాల్పడ్డాడని సీపీ సజ్జనార్ తెలిపారు. ఆమె ప్రైవేట్ వీడియో రికార్డు చేసి భర్తకు పంపి బ్లాక్ మెయిల్ చేశాడని అన్నారు. పోలీస్ అకాడమీలో ఇలాంటివి జరగడం కలకలం రేపుతోంది.

ఐఐటీ ఖరగ్ పూర్ లో హైదరాబాద్ ప్రొఫెసర్ ఆత్మహత్య
ఐఐటీ ఖరగ్‌పూర్‌లోని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న హైదరాబాద్‌కు చెందిన దీపక్ రెడ్డి పుల్లగురం (36) తన స్టాఫ్ క్వార్టర్స్‌లో అనుమానాస్పద రీతిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. ఎంతసేపటికీ తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది పోలీసుల సాయంతో తలుపు తెరవగా లోపల ఆయన సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు. ఘటనా స్థలంలో ఎటువంటి సూసైడ్ నోట్ లభించలేదని, కేసు నమోదు చేసి ఆత్మహత్య కోణంలో దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.

స్మార్ట్ వాచ్ లు, ఫిట్ నెస్ యాప్ ల డేటా తో రిస్క్ !
ఫిట్ నెస్ కోసం, హెల్త్ కోసం స్మార్ట్ వాచ్ లు, ఫిట్ నెస్ యాప్ లపై డిపెండ్ అయ్యేవారు జర జాగ్రత్త అంటున్నారు హెల్త్ ఎక్స్ పర్టులు. ఇవి అందించే కేలరీలు, నిద్ర, హార్ట్ బీట్ వివరాలు ఎప్పుడూ హండ్రెడ్ పర్సంట్ కరెక్ట్ గా ఉంటాయని చెప్పలేమంటున్నారు. ఈ డివైజ్ లిచ్చే డేటాపై డిపెండ్ అయితే అనవసరమైన స్ట్రెస్, టెన్షన్ పెరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి వాటిని కేవలం ఒక గైడ్ గా నే చూడాలి. మన బాడీ ఇచ్చే సంకేతాలు, డాక్టర్ల అడ్వైజ్ లనే మనం లెక్క లోకి తీసుకోవాలి.

మల్టీ టాస్కింగ్, అదిరిపోయే ఫీచర్లతో కొత్త ల్యాప్ టాప్స్
ప్రీమియం లుక్, పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ సమానంగా బ్యాలెన్స్ చేస్తూ కొత్త బిజినెస్ ల్యాప్‌టాప్‌లు మార్కెట్‌లోకి వస్తున్నాయి. ఇవి ఆఫీస్ ప్రొఫెషనల్స్ అవసరాలకు తగ్గట్టుగా స్లిమ్ డిజైన్, లైట్‌వెయిట్ బాడీతో పాటు మల్టీటాస్కింగ్ కోసం అధునాతన ప్రాసెసర్లతో రూపుదిద్దుకున్నాయి. రోజంతా వర్క్ చేసుకోవడానికి వీలుగా లాంగ్ బ్యాటరీ లైఫ్, డేటా రక్షణ కోసం అడ్వాన్స్డ్ AI సెక్యూరిటీ ఫీచర్లను అందిస్తున్నాయి. ట్రావెల్ చేస్తూ వర్క్ చేసేవారికి ఈ డివైజ్‌లు పర్ఫెక్ట్ ఛాయిస్‌గా మారుతున్నాయి.

SFI నేత కేసులో పోలీస్ దూకుడుకు కళ్లెం వేసిన పటియాలా కోర్ట్
ఢిల్లీలో SFI లీడర్ ఐషే ఘోష్ నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ పై పటియాలా కోర్టు స్టే ఇచ్చింది. అంతకుముందురోజు పోలీసులు ఆమెను అరెస్టు చేసేందుకు సీపీఐ(ఎం) ఆఫీస్ కు సివిల్ డ్రెస్ లో వెళ్లడం వివాదం రేపింది. సరైన యూనిపామ్ లేకుండా, ముందస్తు అనుమతి లేకుండా ఆఫీస్ లోకి చొరబడటంపై ఐషే ఘోష్ కోర్టును ఆశ్రయించగా కోర్టు ఊరట కల్పించింది. 2021 నాటి ఒక కేసులో విచారణకు తాను కొన్ని కారణాల వల్ల అటెండ్ కాలేకపోయానని ఆమె ఇచ్చిన వివరణతో కోర్ట్ కన్ విన్స్ అయింది. ఈసారి తప్పనిసరిగా అటెండ్ అవ్వాలని ఆదేశించింది.

జెన్ జీ ప్రొటెస్ట్స్- సింగిల్ FIR తో వేలమందిపై కేసులు
పాట్నాలోని గాంధీ మైదాన్ పోలీస్ స్టేషన్‌లో ఒకే ఒక్క FIRలో 144 మంది నిరసనకారులు, మరొక 5,000 మంది అపరిచితులపై ఏకంగా 'హత్యాయత్నం' కేసులు మోపారు. వీరిలో దాదాపు 50 మంది మైనర్లు ఉన్నారు. పరీక్షా పేపర్ల లీకేజీలకు వ్యతిరేకంగా, ఉపాధి హక్కుల కోసం శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థులపై నాన్-బెయిలబుల్ కేసులు పెట్టడం వారి భవిష్యత్తును తీవ్రంగా దెబ్బతీస్తుందని విద్యార్థి సంఘాలు, కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చెన్నై మెట్రోలో CM విజయ్ సందడి!
చెన్నై మెట్రో రైలులో తమిళనాడు CM విజయ్ హఠాత్తుగా ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యపరిచారు. ఓమందూరార్ స్టేషన్ నుంచి నందనం వరకు సాధారణ ప్రయాణికుడిలా టికెట్ కొనుక్కొని మెట్రోలో ప్రయాణించారు. రైలులో ఉన్న తోటి ప్రయాణికులతో మాట్లాడి వారిని పలకరించారు. అంతకుముందు మెట్రో హెడ్‌క్వార్టర్స్‌ను విసిట్ చేసి, ఆఫీసర్స్ తో మాట్లాడారు. విజయ్ మెట్రోలో ప్రయాణించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

యూత్ ఉద్యమాలపై రిపబ్లిక్ టీవీ కాన్స్పిరసీ థియరీలు
రిపబ్లిక్ టీవీ కేవలం ఒక్క వారంలోనే 25 బ్రాడ్‌కాస్ట్‌లు, 58,941 పదాల ద్వారా దేశంలోని యూత్ఉద్యమాలపై రకరకాల కాన్స్పిరసీ థియరీలను ప్రచారం చేసిందని ది వైర్ సెన్సేషనల్ రిపోర్ట్ ఇచ్చింది.. విదేశీ హస్తం, ప్రతిపక్షాల కుట్రలు ఉన్నాయంటూ నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ప్రధాన సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ప్రయత్నించిందని ఈ రిపోర్ట్ తెలిపింది. మీడియా బాధ్యతను పక్కనపెట్టి, ప్రజాస్వామ్య నిరసనలను లక్ష్యంగా చేసుకుని సంచలన కథనాలను సృష్టించారని ది వైర్కామెంట్ చేసింది.

తెలంగాణలో 7,437 పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ !
తెలంగాణ నిరుద్యోగులకు ప్రభుత్వం బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. పోలీస్, ఫైర్, జైళ్లు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగాల్లో 7,437 పోస్టుల భర్తీకి TSLPRB నోటిఫికేషన్స్ రిలీజ్ చేసింది. ఇందులో సివిల్ కానిస్టేబుల్స్ 3,697, AR 1,052, SPF కానిస్టేబుల్స్ 1,380, ఫైర్ ఫైటర్స్ 751 తో పాటు SI పోస్టులు కూడా ఉన్నాయి. ఆన్‌లైన్ అప్లికేషన్ డేట్స్ త్వరలో అనౌన్స్ చేయనున్నారు. అప్లై చేసే కాండిడేట్స్ ఏప్రిల్ 1, 2026 తర్వాత తీసుకున్న EWS, నాన్-క్రీమీ లేయర్ లాంటి సర్టిఫికెట్స్ రెడీగా పెట్టుకోవాలని బోర్డు అలర్ట్ చేసింది.

ఆటో డ్రైవర్.. పిక్ వైరల్!
సోషల్ మీడియాలో ఒక ఆటో డ్రైవర్‌కి సంబంధించిన ఫోటో విపరీతంగా వైరల్ అవుతోంది. తన ఆటో ఫ్రంట్ గ్లాస్‌పై హిందూ, క్రిస్టియన్, ముస్లిం మతాలకు చెందిన ఓం, క్రాస్, నక్షత్రం విత్ నెలవంక సింబల్స్‌ని పక్కపక్కనే స్టిక్కర్‌గా అంటించాడు. దేశంలో కులమతాల పేరుతో గొడవలు జరిగే ఈ రోజుల్లో, అందరూ కలిసిమెలిసి ఉండాలని మెసేజ్ ఇస్తున్న ఈ డ్రైవర్ ఆలోచనను నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు. రియల్ ఇండియా అంటే ఇదేనని, మనస్తత్వానికి మతం లేదని ఈ ఫోటో నిరూపిస్తోంది, మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్‌లో రాయండి.
ఫోన్ ముందు కూర్చుంటే GenZ కనెక్ట్ అవ్వరు- రాహుల్ గాంధీ
ఫోన్ ముందు కూర్చుని వీడియోలు చేస్తే GenZ కి కనెక్ట్ అయిపోలేరని ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ సెటైర్లు వేశారు. ప్రాబ్లమ్ ఇమేజ్ గురించి కాదని, స్టూడెంట్స్ ఫ్యూచర్, ఎకానమీని డ్యామేజ్ చేయడమే అసలైన సమస్య అని రాహుల్ మండిపడ్డారు. ఈ సిట్యుయేషన్‌లో స్టూడెంట్స్ చూపించిన కరేజ్ చాలా గ్రేట్ అని, పేరెంట్స్‌కి కూడా లేని డేర్ చూపించి పోరాడిన స్టూడెంట్స్‌కి తాను రియల్‌గా థ్యాంక్స్ చెబుతున్నానని రాహుల్ గాంధీ ప్రశంసించారు.
కంగనా రనౌత్ కామెంట్స్‌పై సోనుసూద్ ఫైర్
జంతర్ మంతర్‌లో నిరసన తెలుపుతున్న GenZ విద్యార్థులపై నటి, ఎంపీ కంగనా రనౌత్ చేసిన వివాదాస్పద ‘గట్టర్ జనరేషన్’ కామెంట్స్‌ని బాలీవుడ్ నటుడు సోనుసూద్ తీవ్రంగా విమర్శించారు. ఆ మాటల్ని ‘అవమానకరం’ అని ఆయన అన్నారు. యాక్టర్స్ సక్సెస్ యువత మీదే ఆధారపడి ఉందని, కంగనా ఇలాంటి కామెంట్స్ చేసే ముందు బాగా ఆలోచించాలని సలహా ఇచ్చారు.
లోక్‌సభలో నాకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వట్లేదు- రాహుల్ గాంధీ
లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న తనకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వడం లేదంటూ రాహుల్ గాంధీ సీరియస్ అయ్యారు. సభను ఆర్డర్‌లో పెట్టి తనకు చాన్స్ ఇవ్వాలని స్పీకర్‌ను చాలాసార్లు రిక్వెస్ట్ చేసినా పట్టించుకోలేదని చెప్పారు. అమిత్ షా గురించి మాట్లాడినందుకే తన వాయిస్ నొక్కేస్తున్నారని మండిపడ్డారు. క్షమాపణ చెప్తేనే మాట్లాడనిస్తామని అంటున్నారని, కానీ BJPకి కానీ RSSకి కానీ తాను లైఫ్‌లో సారీ చెప్పేదే లేదని రాహుల్ గాంధీ చాలా స్ట్రాంగ్‌గా స్పష్టం చేశారు.
మళ్లీ ప్రొటెస్ట్ స్టార్ట్ చేస్తా- అభిజీత్ దీప్కే
ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర 37 రోజులు ప్రొటెస్ట్ చేసిన CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే ఫైనల్‌గా ఇంటికి రావడం చాలా హ్యాపీగా ఉందన్నారు. ఇన్నాళ్లకు ప్రశాంతంగా నిద్రపోతున్నానని, నార్మల్ లైఫ్‌లోకి వెళ్తానని చెప్పారు. ఎగ్జామ్ రూల్స్ ఎన్ని మారినా మనుషుల ఆలోచనలు మారకపోతే వేస్ట్ అని, పేపర్ లీక్స్ కేసు ఫస్ట్ కోర్టు విచారణే వాయిదా పడటంపై ఆయన ఫైర్ అయ్యారు. స్టూడెంట్స్‌పై పెట్టిన కేసులను వెంటనే రద్దు చేయకపోతే, నెక్స్ట్ టైమ్ ఇంకా పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ స్టార్ట్ చేస్తామని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.
ఇండియాలో లేడు.. కానీ కేసులో మాత్రం ఉన్నాడు! ఎలా?
"నేను రష్యాలో ఉంటే.. నిరసనకు ఎలా వస్తా?" అంటూ అధికారులను ప్రశ్నిస్తున్నాడు బీహార్‌కు చెందిన మహ్మద్ సదాఖత్. "గత 4 నెలలుగా నేను రష్యాలోనే ఉన్నాను.. అయినా NEET నిరసన కేసులో నా పేరు పెట్టారు" అంటూ ఆయన వీడియో విడుదల చేశారు. దీంతో వీడియో వైరల్ కావడంతో "అసలు కేసు పెట్టే ముందు ఎవర్నైనా వెరిఫై చేస్తారా లేదా..?" అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు అసలు ప్రశ్న ఒక్కటే, రష్యాలో ఉన్న వ్యక్తి పేరు కేసులో ఎలా చేరింది? అయితే సదాఖత్ చెప్పిన విషయాన్ని అధికారులు ఇంకా కన్‌ఫర్మ్ చేయలేదు.

పిల్లలతో మసాజ్ చేయించుకుంటున్న ప్రభుత్వ టీచర్
AP: శ్రీ సత్యసాయి జిల్లా నంబులపూలకుంట KGBV స్కూల్‌లో టీచర్ 'రూపరాణి' క్లాసులో పిల్లలకు పాఠాలు చెప్పవలసింది పోయి వాళ్లతో తల మసాజ్, కాళ్లు పాటించుకోడం వంటివి చేస్తుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చి వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనతో స్థానికులు, పిల్లల తల్లిదండ్రులు ఆమె తీరుపై మండిపడుతున్నారు. స్కూల్‌కు చెడ్డపేరు తెచ్చిన ఆ టీచర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని వాళ్ళు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.

సుప్రీంకోర్టు తీర్పుతో సాగునీటి ప్రాజెక్టులకు బిగ్ రిలీఫ్
TG: తెలంగాణలోని పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్, గౌరవెల్లి రిజర్వాయర్ లాంటి సాగునీటి ప్రాజెక్టులకు సుప్రీంకోర్టు రిలీఫ్ ఇచ్చింది. 2021లో కేంద్ర పర్యావరణ శాఖ జారీ చేసిన ఆఫీస్ మెమోరాండాన్ని రద్దు చేసినా, దాని ఆధారంగా ఇప్పటికే మంజూరైన పర్యావరణ అనుమతులు చెల్లుబాటులోనే ఉంటాయని తెలిపింది. ఈ తీర్పు భవిష్యత్తు ప్రాజెక్టులకు మాత్రమే వర్తిస్తుందని, కొత్త ప్రాజెక్టులకు ముందస్తు అనుమతులు తప్పనిసరి అని చెప్పింది. తెలంగాణలో కొనసాగుతున్న ప్రాజెక్టుల నిర్మాణాలకు చట్టపరమైన అడ్డు ఉండదనే స్పష్టత వచ్చింది.
మెడలోతు నీళ్లలో తండ్రి పోరాటం..
అసోంలో వర్షాల వల్ల వరదలు రావడంతో ఊళ్లన్నీ నీళ్లలో మునిగిపోయాయి. ఈ టైమ్‌లో ఓ తండ్రి తన ముగ్గురు పిల్లలను కాపాడుకునేందుకు చేసిన సాహసం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. మెడలోతు వాటర్‌లో కుండపోత వర్షం పడుతున్నా, పిల్లలను ఒక ప్లాస్టిక్ టబ్‌లో కూర్చోబెట్టి సేఫ్ ప్లేస్‌కి తీసుకెళ్లాడు. పిల్లలు భయంతో ఏడుస్తున్నా తన ప్రాణాలను రిస్క్‌లో పెట్టడం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఫాదర్స్ లవ్ అండ్ సాక్రిఫైస్‌కి ఈ వీడియో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు.