← Back to news

ఐఐటీ ఖరగ్ పూర్ లో హైదరాబాద్ ప్రొఫెసర్ ఆత్మహత్య

By DS· 29 Jul 2026· The indian express· Bengal
ఐఐటీ ఖరగ్ పూర్ లో హైదరాబాద్ ప్రొఫెసర్ ఆత్మహత్య

ఐఐటీ ఖరగ్‌పూర్‌లోని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న హైదరాబాద్‌కు చెందిన దీపక్ రెడ్డి పుల్లగురం (36) తన స్టాఫ్ క్వార్టర్స్‌లో అనుమానాస్పద రీతిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. ఎంతసేపటికీ తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది పోలీసుల సాయంతో తలుపు తెరవగా లోపల ఆయన సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు. ఘటనా స్థలంలో ఎటువంటి సూసైడ్ నోట్ లభించలేదని, కేసు నమోదు చేసి ఆత్మహత్య కోణంలో దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.

More in News