Latest

యూనియన్ బ్యాంకులో 395 ఉద్యోగాల నోటిఫికేషన్
Jobs· 27 Jul 2026

యూనియన్ బ్యాంకులో 395 ఉద్యోగాల నోటిఫికేషన్

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 395 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. పోస్టు ప్రకారం డిగ్రీ, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, సీఏ, సీఎంఏ, ఎంటెక్ పాసై, బ్యాంకింగ్ రంగంలో అనుభవం ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు. వయసు 22 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి నెలకు రూ.64,820 నుంచి రూ.1,56,500 వరకు జీతం. ఆసక్తి ఉన్నవాళ్లు ఆగస్టు 10వ తేదీలోపు <a href="https://www.unionbankofindia.bank.in/en/common/recruitment">ఆన్‌లైన్‌</a>లో దరఖాస్తు చేసుకోవచ్చు.

మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ
News· 27 Jul 2026

మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ

TG: తెలంగాణలో రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేసేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేషన్ డీలర్ల పిటిషన్‌ను కొట్టివేయడంతో పౌరసరఫరాల శాఖ 64.80 లక్షల క్వింటాళ్ల బియ్యాన్ని విడుదల చేసింది. ఆగస్టు 1 నుంచి 15 వరకు రేషన్ పంపిణీ జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

షాకింగ్ వీడియో: బ్రిడ్జి పైనుంచి కిందపడ్డ లారీ!
News· 27 Jul 2026

షాకింగ్ వీడియో: బ్రిడ్జి పైనుంచి కిందపడ్డ లారీ!

మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా సిన్నార్ వద్ద ఘోర యాక్సిడెంట్ జరిగింది. MIDC బైపాస్ రోడ్డుపై వెళ్తున్న ఓ లారీ సడన్‌గా కంట్రోల్ తప్పి బ్రిడ్జి పైనుంచి కింద పడిపోయింది. ఈ రోడ్ యాక్సిడెంట్‌కి సంబంధించిన విజువల్స్ అక్కడే ఉన్న CCTV కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

విజయ్ బాటలోనే ధనుష్?
Politics· 27 Jul 2026

విజయ్ బాటలోనే ధనుష్?

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ పాలిటిక్స్‌లోకి వస్తున్నారనే టాక్ తమిళనాడులో గట్టిగా వినిపిస్తోంది. రీసెంట్‌గా చెన్నైలో జరిగిన బ్లడ్ డొనేషన్ క్యాంప్‌లో ధనుష్ ఫ్యాన్స్‌తో మాట్లాడారు. మన యూనిటీని కేవలం ఆడియో ఫంక్షన్లకే పరిమితం చేయకుండా చుట్టుపక్కల ప్రజలకు హెల్ప్ చేస్తూ వెల్ఫేర్ యాక్టివిటీస్ పెంచాలని పిలుపునిచ్చారు. విజయ్ ఆల్రెడీ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడంతో, ధనుష్ కామెంట్స్ చూస్తుంటే ఆయన కూడా త్వరలోనే రాబోతున్నారని చర్చ నడుస్తోంది.

బీహార్ నిరసనల్లో పోలీసు సస్పెండ్
Politics· 27 Jul 2026

బీహార్ నిరసనల్లో పోలీసు సస్పెండ్

నీట్ పేపర్ లీక్ పై జూలై 25న సివాన్ జిల్లాలో 'బీహార్ బంద్' జరిగింది. ఆ సమయంలో స్టూడెంట్స్ పై ఓ పోలీసు ఏకే-47 తో ఫైరింగ్ చేసిన వీడియో వైరల్ అయింది. వెంటనే ఉన్నతాధికారులు అతడిని సస్పెండ్ చేశారు. ఈ గొడవల్లో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిలో ఆరిఫ్ అనే 15ఏళ్ల కుర్రాడి మెడకి బుల్లెట్ తాకింది. డాక్టర్లు ఆపరేషన్ చేసి దాన్ని బయటకు తీశారు. ప్రస్తుతం గాయపడిన వాళ్లంతా సేఫ్ గానే ఉన్నారు. ఈ ఘటనపై ఎంక్వయిరీ చేస్తున్నామని, రూల్స్ పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు.

యునెస్కో (UNESCO) జాబితాలో 'సారనాథ్‌'కు స్థానం
News· 27 Jul 2026

యునెస్కో (UNESCO) జాబితాలో 'సారనాథ్‌'కు స్థానం

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం వారణాసి సమీపంలోని ప్రాచీన బౌద్ధ క్షేత్రం 'సారనాథ్‌' యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు దక్కించుకుంది. దక్షిణ కొరియాలోని బుసాన్‌లో జరిగిన యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ 48వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో సారనాథ్ భారతదేశపు 45వ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. ఈ గుర్తింపు దేశ సాంస్కృతిక వారసత్వానికి అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు తీసుకువస్తుందని అధికారులు తెలిపారు.

కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన
News· 27 Jul 2026

కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన

AP: నారా భువనేశ్వరి కుప్పంలో తన నాలుగు రోజుల పర్యటనను ఈ రోజు మొదలుపెట్టారు. ఇందులో మొదటి రోజు రామకుప్పం మండలం విజిలాపురం జిల్లా పరిషత్ హైస్కూల్ కు వెళ్లి అక్కడి స్టూడెంట్స్ తో కాసేపు గడిపారు. స్కూల్లో చదువులు ఎలా సాగుతున్నాయి, మధ్యాహ్న భోజనం టేస్ట్ ఎలా ఉందో పిల్లలను అడిగి తెలుసుకున్నారు. కష్టపడి బాగా చదువుకుని ఫ్యూచర్ లో గొప్ప స్థాయికి ఎదగాలని ఆమె స్టూడెంట్స్ తో అన్నారు.

గ్రామీణ ఉపాధిలో మహిళల వాటానే ఎక్కువ
Jobs· 27 Jul 2026

గ్రామీణ ఉపాధిలో మహిళల వాటానే ఎక్కువ

దేశంలో అమలు చేస్తున్న విక్షత్ భారత్–గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్ (VB-GRAM G) పథకంలో మహిళల భాగస్వామ్యం గణనీయంగా పెరిగింది. ఈ పథకం ప్రారంభమైన తొలి 20 రోజుల్లో 63 శాతానికి పైగా మహిళలే పని చేసినట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. విస్తృతమైన, సమ్మళిత (Inclusive ) విధానాల వల్ల శారీరక శ్రమకు మించి కొత్త ఉపాధి అవకాశాలు అందుబాటులోకొచ్చాయి. దీంతో మహిళల భాగస్వామ్యం పెరిగిందని అధికారులు తెలిపారు.

మాట తప్పిన కేంద్రం- ప్రొటెస్టుల్లో పాల్గొన్న వారిపై కేసులు
News· 27 Jul 2026

మాట తప్పిన కేంద్రం- ప్రొటెస్టుల్లో పాల్గొన్న వారిపై కేసులు

స్టూడెంట్స్ దీక్ష విరమించి 24 గంటలు గడవక ముందే కేంద్రం తన నైజాన్ని బయటపెట్టింది. బీహార్ లో నీట్ పరీక్షల లీకేజీకి వ్యతిరేకంగా బంద్ లాఠీ చార్జికి దారి తీసింది. ర్యాలీ తీస్తున్న స్టూడెంట్స్ ను పోలీసులు చావబాదారు. పలు జిల్లాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సివాన్ లో ఏకంగా స్టూడెంట్స్ పై ఏకే 47 లతో విరుచుకు పడ్డారు. పరిస్థితిని సీజేపి లీడర్ అభిజిత్ దీప్కేకు వివరిస్తూ ఇన్ స్టాలో కంప్లయింట్లు పెరుగుతున్నాయి. నిరసనల్లో పాల్గొన్న వారిపై FIR లు కూడా నమోదవుతున్నాయి.

తొలి టెస్ట్ ట్యూబ్ బేబీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?
Science· 27 Jul 2026

తొలి టెస్ట్ ట్యూబ్ బేబీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

ఇప్పుడు IVF అంటే కామన్ అయిపోయింది. కానీ ఒకప్పుడు అదే ప్రపంచానికి పెద్ద మిరాకిల్. 1978 జూలై 25న ప్రపంచంలోనే తొలి టెస్ట్ ట్యూబ్ బేబీగా జన్మించిన లూయిస్ జాయ్ బ్రౌన్ ఇప్పుడు 48 ఏళ్లు పూర్తి చేసుకుంది. అప్పట్లో ఆమె పుట్టుకపై ఎన్నో సందేహాలు, విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఆమె పూర్తిగా ఆరోగ్యంగా ఉండటమే కాదు.. సహజంగానే ఇద్దరు పిల్లలకు తల్లి కూడా అయ్యింది. నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది దంపతులకు పేరెంట్ అయ్యే అవకాశం కల్పిస్తున్న IVF టెక్నాలజీకి లూయిస్ పుట్టుకే అసలు బిగినింగ్ అని చెప్పొచ్చు.

నీట్ ధర్నాలో మంత్రి కూతురు
Politics· 27 Jul 2026

నీట్ ధర్నాలో మంత్రి కూతురు

నీట్ పరీక్షపై జరిగిన ప్రొటెస్ట్ లో మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని స్టూడెంట్స్ ఆందోళన చేశారు. ఈ ధర్నాలో అస్సాం రెవెన్యూ శాఖ మంత్రి కేశబ్ మహంత కూతురు 'దిబిసా' కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కేశబ్ మహంత పై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీనిపై అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ స్పందిస్తూ. ఎదిగిన పిల్లల పనులకు తల్లిదండ్రులను తప్పుపట్టడం కరెక్ట్ కాదని చెప్పారు. నేటి తరానికి సొంత ఆలోచనలు ఉంటాయని, ఆమెను కలిసినప్పుడు దీని గురించి మాట్లాడుతానని సీఎం తెలిపారు.

AIకి మీ గురించి ఎంత తెలుసో తెలుసా..?
Technology· 27 Jul 2026

AIకి మీ గురించి ఎంత తెలుసో తెలుసా..?

ChatGPT, Gemini లాంటి AI chatbots మనం టైప్ చేసే ప్రతి ప్రశ్నను మాత్రమే కాదు.. మన లైక్స్, ఇంట్రెస్ట్స్, పర్సనాలిటీ, అలవాట్లు లాంటి విషయాలను కూడా అంచనా వేయగలవని The New York Times కథనం చెబుతోంది. టెక్ జర్నలిస్ట్ బ్రియన్ ఎక్స్. చెన్.. కేవలం నాలుగు promptsతో AI తన గురించి ఎంత తెలుసుకుందో టెస్ట్ చేయగా, తాను ఎప్పుడూ చెప్పని కొన్ని విషయాలను కూడా AI గుర్తించిందని వెల్లడించారు. AIతో ఎక్కువగా చాట్ చేసే యూజర్లు.. అది తమ గురించి ఎంత సమాచారం అర్థం చేసుకుంటుందో చెక్ చేసుకోవాలని ఎక్సపెర్ట్స్ చెబుతున్నారు.

మళ్ళీ పడిపోయిన గోల్డ్ రేట్స్!
Business· 27 Jul 2026

మళ్ళీ పడిపోయిన గోల్డ్ రేట్స్!

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ప్రైసెస్ కాస్త తగ్గాయి. సోమవారం ఉదయం హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ 10 గ్రామ్స్ గోల్డ్ రేట్ రూ.1,44,920 కి వచ్చింది. అలాగే 22 క్యారెట్ ధర రూ.1,32,840గా ఉంది. మరోవైపు, సిల్వర్ ప్రైస్ Kgకి వంద రూపాయలు తగ్గి రూ.2,39,900 కి చేరింది. అయితే ఈ రేట్స్ ఎప్పటికప్పుడు మారుతుంటాయి కాబట్టి కొనేముందు ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది.

పోలీస్‌పైకే కారెక్కిచ్చాడు!
News· 27 Jul 2026

పోలీస్‌పైకే కారెక్కిచ్చాడు!

హైదరాబాద్‌ ఆబిడ్స్‌లో డ్రగ్స్ సప్లై చేస్తున్న సాయిఫ్ అనే పెడ్లర్‌ను నార్కోటిక్ పోలీసులు పట్టుకునేందుకు యత్నించగా, కారుతో వారిపైకి దూసుకెళ్లాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్ మహేందర్ కాలు విరగగా, ఇన్స్‌పెక్టర్ శ్రీకాంత్, కానిస్టేబుల్ వంశీధర్‌లకు గాయాలయ్యాయి. పారిపోతున్న నిందితుడిని అఫ్జల్‌గంజ్ వద్ద పోలీసులు ఛేజ్ చేసి అరెస్ట్ చేశారు. గాయపడిన మహేందర్‌ను యశోద హాస్పిటల్‌కు తరలించి, నిందితుడిపై అటెంప్ట్ టు మర్డర్ కేస్ ఫైల్ చేశారు.

రోడ్డుపై TGPSC OMR షీట్లు!
Politics· 27 Jul 2026

రోడ్డుపై TGPSC OMR షీట్లు!

PVNR ఎక్స్‌ప్రెస్‌వే పై 2018 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్ ఒరిజినల్ OMR షీట్లు రోడ్డుపై కుప్పలుగా పడిపోవడం TGPSC నిర్లక్ష్యాన్ని బయటపెట్టింది. అభ్యర్థుల హాల్ టికెట్ నంబర్లు ఉన్న పేపర్లను ముక్కలు చేయకుండానే రీసైక్లింగ్ కోసం విజయవాడకు తీసుకెళ్తుండగా కిందపడిపోయాయి. పోలీసులు పేపర్లను స్వాధీనం చేసుకున్నారు. పత్రాలను ఇలా రోడ్డుపై పడేయడంపై నిరుద్యోగులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఘటనపై 3 రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలని SIని ఆదేశించిన TGPSC బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపింది.

కొమురవెల్లికి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్
News· 27 Jul 2026

కొమురవెల్లికి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్

TG: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న ఆలయం తెలంగాణలోని ప్రసిద్ధ శైవక్షేత్రాల్లో ఒకటి. ఈ రైల్వే స్టేషన్‌ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. రూ.6 కోట్ల వ్యయంతో ఈ స్టేషన్‌ను నిర్మించినట్లు ఆయన తెలిపారు. ఈ స్టేషన్ ద్వారా స్వామివారి ఆలయానికొచ్చే భక్తులకు మెరుగైన రైలు రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని అన్నారు.

తిరుపతిలో మొదటి కరోనా కేసు
News· 27 Jul 2026

తిరుపతిలో మొదటి కరోనా కేసు

AP: తిరుపతిలో ఫస్ట్ కరోనా కేసునమోదయ్యింది. ఎస్టీవీ నగర్‌కు చెందిన 65 ఏళ్ల మహిళకు ఆరోగ్య సమస్యలు ఉండటంతో ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు వెళ్లారు. అక్కడ డాక్టర్లు టెస్ట్ చేస్తే కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని డీఎంహెచ్‌వో చెప్పారు.

సోయా చాప్ తినేముందు ఈ వీడియో చూడండి
Viral· 27 Jul 2026

సోయా చాప్ తినేముందు ఈ వీడియో చూడండి

సోయా చాప్ తయారీకి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియోలో ఓ వ్యక్తిని సోయా చాప్ పిండిలా కనిపిస్తున్న మిశ్రమంలో ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు చూసి చాలామంది 'ఇక సోయా చాప్ తినలేం' అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. ఈ వీడియో నోయిడాలో తీసిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నా, దానికి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక కన్ఫర్మేషన్ లేదు. కొన్ని రిపోర్ట్స్ మాత్రం ఇది ఆగ్రాలో తీసిన పాత వీడియో అని చెబుతున్నాయి.

నోలన్‌కు నచ్చిన సత్యజిత్ రే సినిమాలు
Cinema· 27 Jul 2026

నోలన్‌కు నచ్చిన సత్యజిత్ రే సినిమాలు

హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టఫర్ నోలన్‌కు మన దేశానికి చెందిన సత్యజిత్ రే సినిమాలు బాగా నచ్చాయంట. నోలన్ రీసెంట్‌గా న్యూయార్క్‌లోని క్రైటీరియాన్ క్లోజెట్‌కు వెళ్లారు. అక్కడి సినిమాల కలెక్షన్ నుంచి నోలన్ సత్యజిత్ రే తీసిన ‘ది అపూ ట్రైలాజీ’ని ప్రత్యేకంగా ఎంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ 'సత్యజిత్ రే తీసిన ‘పథేర్ పాంచాలి’ సినిమా చూసి నేను ఆశ్చర్యపోయాను. ఆ ట్రైలాజీలో ఉన్న మిగతా రెండు సినిమాలు నేను ఇంకా చూడలేదు. ఆ రెండు సినిమాలను ఇంటికి తీసుకెళ్లి మొత్తం కథను పూర్తిగా చూస్తాను' అని ఒక వీడియోలో చెప్పారు.

మోదీని తొలిగిస్తేనే ప్రజాస్వామ్యం బాగుపడుతుంది: సిద్దరామయ్య
Politics· 27 Jul 2026

మోదీని తొలిగిస్తేనే ప్రజాస్వామ్యం బాగుపడుతుంది: సిద్దరామయ్య

ధర్మేంద్ర రాజీనామా చేసినంత మాత్రాన దేశ విద్యావ్యవస్థ బాగుపడదని కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య అన్నారు. రాజకీయాల నుంచి విద్య వరకు ప్రతి వ్యవస్థను కమర్షియల్ చేసిన ప్రధాని మోదీని తొలగిస్తేనే విద్య, ప్రజాస్వామ్యం బాగుపడుతుందని విమర్శించారు. ప్రజా వ్యతిరేక, అవినీతి పాలనకు వ్యతిరేకంగా విద్యార్థులు వారి ఉద్యమాన్ని కొనసాగించాలని ఆయనన్నారు.

వైరల్ అవ్వడం కోసం ప్రాణాలతో ఆట
Viral· 27 Jul 2026

వైరల్ అవ్వడం కోసం ప్రాణాలతో ఆట

సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో ఓ యువకుడు బైక్‌పై చేసిన డేంజరస్ స్టంట్ నెటిజన్లను షాక్‌కు గురిచేస్తోంది. వైరల్ వీడియోలో అతడు బైక్‌ను హై స్పీడ్‌లో జిగ్‌జాగ్‌గా నడుపుతుండగా, వెనుక కూర్చున్న మహిళ బ్యాలెన్స్ కోల్పోయినట్లు కనిపించింది. వీడియో చూసిన నెటిజన్లు "వైరల్ కోసం ప్రాణాలతో ఆట ఎందుకు?", "ఒక్క సెకండ్ తేడా అయితే పెద్ద ప్రమాదమే" అంటూ ఫైర్ అవుతున్నారు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందనే విషయంపై స్పష్టత లేదు.