Latest

నిన్న CM పక్కన సరదాగా మాట్లాడి.. నేడు అంతలోనే ఘోరం!
పోలవరం జిల్లాకు చెందిన 10వ తరగతి విద్యార్థిని ముర్రం శివాని ఆత్మహత్య తీవ్ర మనస్థాపానికి గురిచేసిందని CM చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల పేరెంట్స్-టీచర్స్ మీటింగ్‌లో CM పక్కన కూర్చుని మాట్లాడిన శివాని ఇంట్లో ఉరివేసుకుంది. “డాడీ మీ డ్రీమ్ నెరవేర్చలేకపోతున్నా” అని సూసైడ్ నోట్ రాసింది. ఆత్మహత్యకు స్పష్టమైన కారణాలు తెలియకపోవడంతో దీనిపై సమగ్ర విచారణకు CM ఆదేశించారు. ఎలాంటి సమస్యలొచ్చినా విద్యార్థులు ధైర్యంగా నిలబడాలని, ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.
E20కి వ్యతిరేకంగా దిల్లీలో ప్రోగ్రాం.. కేజ్రీవాల్ పిలుపు
దేశంలోని యువత ఏకమై గళం విప్పడంతో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చిందని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఇదే విధంగా E20కి వ్యతిరేకంగానూ ప్రజలు ఏకమై తమ గళాన్ని వినిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ శనివారం దిల్లీలో నిర్వహించే 'నేషనల్ టౌన్‌హాల్ అగైనెస్ట్ E20' కార్యక్రమంలో పాల్గొనాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అభిప్రాయాలు పంచుకోవాలని కోరుతూ కేజ్రీవాల్ 'ఎక్స్'లో పోస్ట్ చేశారు.
NEET OMR షీట్‌పై స్టూడెంట్ ఆరోపణ
కర్ణాటక రాష్ట్రం హావేరి జిల్లాకు చెందిన NEET-UG స్టూడెంట్ బిందుశ్రీ పవార్ తన OMR షీట్ సరైనది కాదని ఆరోపించింది. NTA ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసిన OMR షీట్ తనది కాదని, షీట్‌లో -14 మార్కులు ఉందని, ఫైనల్ రిజల్ట్‌లో -11 మార్కులు వచ్చాయని..ఇది తనది కాదని వివరించింది. దీనిపై NTA విచారించాలని కోరింది.

హైకోర్టుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షమాపణలు!
లతుకుంట భూముల వివాదంలో హైదరాబాద్ CP రంగనాథ్ హైకోర్టుకు క్షమాపణలు చెబుతూ అఫిడవిట్ దాఖలు చేశారు. పిటిషనర్ తప్పుడు ప్రచారం చేశారని, లతుకుంట సర్వే నంబర్ 1, 2లోని 40 ఎకరాల భూమిలో తాము జోక్యం చేసుకోలేదని అఫిడవిట్‌లో స్పష్టం చేశారు. అయితే కమిషనర్ రంగనాథ్‌పై ఏకంగా 63 కంటెమ్ట్ కేసులు ఉండటంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ, ఇన్ని కేసులు ఎందుకు నమోదయ్యాయని ప్రశ్నించింది.
కొండచరియలు పడి 13 మంది మృతి
హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో ఉదయ్‌పూర్-పాంగి మార్గంలో టాటా సుమోపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో సుమోలోని 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బ్యాంక్ మేనేజర్‌ను కొట్టిన మాజీ సీఎం కరుణానిధి మనవరాలు
తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి మనవరాలు కయల్విళి, చెన్నై అడయార్‌లోని ఎస్‌బిఐ బ్యాంక్ మేనేజర్‌ను చెంపదెబ్బ కొట్టిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. జూలై 20న ఈ ఘటన జరిగింది. ఆ బ్యాంకు ఉన్న బిల్డింగ్ కయల్విళిదే. అయితే అందులో లిఫ్ట్ పనిచేయకపోవడంతో ఆమె మేనేజర్ దగ్గరకు వెళ్లి తీవ్రంగా గొడవ పెట్టుకుంది. ఆయన స్టైల్‌ను ఎక్కిరిస్తూ కోపంతో చెంప మీద కొట్టింది. మేనేజర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కయల్విళిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

ఉద్యోగులను త్వరగా ఇంటికి పంపండి: సైబరాబాద్ పోలీసులు
TG: భారీ వర్షాల హెచ్చరికలతో సైబరాబాద్ పరిధిలోని ఐటీ కంపెనీలు, ఇతర సంస్థలు ఉద్యోగులకు విడతల వారీగా ముందుగానే లాగ్‌అవుట్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ పోలీసులు సూచించారు. దీంతో ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు అత్యవసర సేవలకు అంతరాయం ఉండదని తెలిపారు. కార్యాలయ స్థానం, ముందస్తు లాగ్‌అవుట్ సమయాల వివరాలను trfcord@scsc.in మెయిల్‌కు పంపించాలని సంస్థలను కోరారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించి, ప్రయాణికుల భద్రతకు, అత్యవసర సేవలకు అంతరాయం కలగకుండా చూడడమే ఈ చర్య ఉద్దేశమని తెలిపారు.

అరెస్టులు ఆపకపోతే ఊరుకోం: CJP ఆగ్రహం!
అస్సాం, వెస్ట్ బెంగాల్, బిహార్‌లలో ప్రొటెస్టర్లను అరెస్ట్ చేయడంపై CJP స్పోక్స్ పర్సన్ సౌరవ్ దాస్ తీవ్రంగా స్పందించారు. నిరసనకారులపై ఎలాంటి యాక్షన్ తీసుకోమని కేంద్రం హామీ ఇచ్చాకే ప్రొటెస్ట్ ఆపామని, ఇప్పుడు మాట తప్పడం నమ్మకద్రోహమని ఫైర్ అయ్యారు. డిటైన్ చేసిన వారిని మంగళవారంలోగా రిలీజ్ చేసి, ఫైల్ చేసిన FIRలను వెంటనే విత్‌డ్రా చేసుకోవాలని, లేదంటే నెక్స్ట్ యాక్షన్ తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. CJP లీగల్ టీమ్ ప్రొటెస్టర్లకు సపోర్ట్‌గా ఉందని స్పష్టం చేశారు.
ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ తర్వాత తొలిసారి పార్లమెంట్‌కు!
రాజీనామా చేసిన తర్వాత కేంద్ర మాజీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తొలిసారి పార్లమెంట్‌కు వచ్చారు. సంసద్ గేట్ వద్దే వెయిట్ చేస్తున్న NDA MPలు ఆయనకు ఘనంగా వెల్‌కమ్ చెప్పి మోరల్ సపోర్ట్ ఇచ్చారు. అయితే అదే టైమ్‌లో ఆపోజిషన్ MPలు ఆయనను చూసి నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ధర్మేంద్ర ప్రధాన్ పార్లమెంట్‌కు ఎంట్రీ ఇవ్వగానే, NDA లీడర్లు మాత్రం మద్దతుగా తమ యూనిటీని చూపించారు.
NEET ఉద్యమం.. ఇంకా ఆగలేదు!
NEET ఉద్యమం ముగిసిందనుకునేలోపే మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. బీహార్‌లో నిరసనల్లో పాల్గొన్న దాదాపు 200 మంది విద్యార్థులు ఇంకా పోలీస్ కస్టడీలోనే ఉన్నారని లాయర్లు చెబుతున్నారు. వీరిలో మైనర్లు కూడా ఉన్నట్లు సమాచారం. ఇదే సమయంలో బంద్ సందర్భంగా AK-47తో కాల్పులు జరిపిన ఓ పోలీస్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు. దీంతో "విద్యార్థులపై ఇంత కఠినంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు?" అన్న ప్రశ్నలు ఇప్పుడు మరింత గట్టిగా వినిపిస్తున్నాయి.
సొనమ్ వాంగ్‌చుక్ స్పెషల్ మెసేజ్!
సొనమ్ వాంగ్‌చుక్ గుర్గావ్‌లోని వేదాంత హాస్పిటల్ నుంచి ఈ రోజు డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం హెల్త్ బెటర్‌గా ఉందన్న ఆయన, సపోర్ట్ చేసిన అందరికీ అండ్ డాక్టర్స్ టీమ్‌కి థ్యాంక్స్ చెప్పారు. లదాఖ్ వెళ్లేముందు ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వెళ్ళి మహాత్మా గాంధీకి నివాళులర్పిస్తానని, గతంలోనూ ఉద్యమం ముందు రాజ్‌ఘాట్ వెళ్లానని వీడియోలో చెప్పారు. సపోర్ట్ చేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు.

యూనియన్ బ్యాంకులో 395 ఉద్యోగాల నోటిఫికేషన్
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 395 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. పోస్టు ప్రకారం డిగ్రీ, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, సీఏ, సీఎంఏ, ఎంటెక్ పాసై, బ్యాంకింగ్ రంగంలో అనుభవం ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు. వయసు 22 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి నెలకు రూ.64,820 నుంచి రూ.1,56,500 వరకు జీతం. ఆసక్తి ఉన్నవాళ్లు ఆగస్టు 10వ తేదీలోపు <a href="https://www.unionbankofindia.bank.in/en/common/recruitment">ఆన్‌లైన్</a>లో దరఖాస్తు చేసుకోవచ్చు.

మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ
TG: తెలంగాణలో రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేసేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేషన్ డీలర్ల పిటిషన్‌ను కొట్టివేయడంతో పౌరసరఫరాల శాఖ 64.80 లక్షల క్వింటాళ్ల బియ్యాన్ని విడుదల చేసింది. ఆగస్టు 1 నుంచి 15 వరకు రేషన్ పంపిణీ జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
షాకింగ్ వీడియో: బ్రిడ్జి పైనుంచి కిందపడ్డ లారీ!
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా సిన్నార్ వద్ద ఘోర యాక్సిడెంట్ జరిగింది. MIDC బైపాస్ రోడ్డుపై వెళ్తున్న ఓ లారీ సడన్‌గా కంట్రోల్ తప్పి బ్రిడ్జి పైనుంచి కింద పడిపోయింది. ఈ రోడ్ యాక్సిడెంట్‌కి సంబంధించిన విజువల్స్ అక్కడే ఉన్న CCTV కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
విజయ్ బాటలోనే ధనుష్?
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ పాలిటిక్స్‌లోకి వస్తున్నారనే టాక్ తమిళనాడులో గట్టిగా వినిపిస్తోంది. రీసెంట్‌గా చెన్నైలో జరిగిన బ్లడ్ డొనేషన్ క్యాంప్‌లో ధనుష్ ఫ్యాన్స్‌తో మాట్లాడారు. మన యూనిటీని కేవలం ఆడియో ఫంక్షన్లకే పరిమితం చేయకుండా చుట్టుపక్కల ప్రజలకు హెల్ప్ చేస్తూ వెల్ఫేర్ యాక్టివిటీస్ పెంచాలని పిలుపునిచ్చారు. విజయ్ ఆల్రెడీ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడంతో, ధనుష్ కామెంట్స్ చూస్తుంటే ఆయన కూడా త్వరలోనే రాబోతున్నారని చర్చ నడుస్తోంది.
బీహార్ నిరసనల్లో పోలీసు సస్పెండ్
నీట్ పేపర్ లీక్ పై జూలై 25న సివాన్ జిల్లాలో 'బీహార్ బంద్' జరిగింది. ఆ సమయంలో స్టూడెంట్స్ పై ఓ పోలీసు ఏకే-47 తో ఫైరింగ్ చేసిన వీడియో వైరల్ అయింది. వెంటనే ఉన్నతాధికారులు అతడిని సస్పెండ్ చేశారు. ఈ గొడవల్లో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిలో ఆరిఫ్ అనే 15ఏళ్ల కుర్రాడి మెడకి బుల్లెట్ తాకింది. డాక్టర్లు ఆపరేషన్ చేసి దాన్ని బయటకు తీశారు. ప్రస్తుతం గాయపడిన వాళ్లంతా సేఫ్ గానే ఉన్నారు. ఈ ఘటనపై ఎంక్వయిరీ చేస్తున్నామని, రూల్స్ పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు.

యునెస్కో (UNESCO) జాబితాలో 'సారనాథ్'కు స్థానం
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసి సమీపంలోని ప్రాచీన బౌద్ధ క్షేత్రం 'సారనాథ్' యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు దక్కించుకుంది. దక్షిణ కొరియాలోని బుసాన్‌లో జరిగిన యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ 48వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో సారనాథ్ భారతదేశపు 45వ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. ఈ గుర్తింపు దేశ సాంస్కృతిక వారసత్వానికి అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు తీసుకువస్తుందని అధికారులు తెలిపారు.

కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన
AP: నారా భువనేశ్వరి కుప్పంలో తన నాలుగు రోజుల పర్యటనను ఈ రోజు మొదలుపెట్టారు. ఇందులో మొదటి రోజు రామకుప్పం మండలం విజిలాపురం జిల్లా పరిషత్ హైస్కూల్ కు వెళ్లి అక్కడి స్టూడెంట్స్ తో కాసేపు గడిపారు. స్కూల్లో చదువులు ఎలా సాగుతున్నాయి, మధ్యాహ్న భోజనం టేస్ట్ ఎలా ఉందో పిల్లలను అడిగి తెలుసుకున్నారు. కష్టపడి బాగా చదువుకుని ఫ్యూచర్ లో గొప్ప స్థాయికి ఎదగాలని ఆమె స్టూడెంట్స్ తో అన్నారు.

గ్రామీణ ఉపాధిలో మహిళల వాటానే ఎక్కువ
దేశంలో అమలు చేస్తున్న విక్షత్ భారత్–గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్ (VB-GRAM G) పథకంలో మహిళల భాగస్వామ్యం గణనీయంగా పెరిగింది. ఈ పథకం ప్రారంభమైన తొలి 20 రోజుల్లో 63 శాతానికి పైగా మహిళలే పని చేసినట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. విస్తృతమైన, సమ్మళిత (Inclusive ) విధానాల వల్ల శారీరక శ్రమకు మించి కొత్త ఉపాధి అవకాశాలు అందుబాటులోకొచ్చాయి. దీంతో మహిళల భాగస్వామ్యం పెరిగిందని అధికారులు తెలిపారు.

మాట తప్పిన కేంద్రం- ప్రొటెస్టుల్లో పాల్గొన్న వారిపై కేసులు
స్టూడెంట్స్ దీక్ష విరమించి 24 గంటలు గడవక ముందే కేంద్రం తన నైజాన్ని బయటపెట్టింది. బీహార్ లో నీట్ పరీక్షల లీకేజీకి వ్యతిరేకంగా బంద్ లాఠీ చార్జికి దారి తీసింది. ర్యాలీ తీస్తున్న స్టూడెంట్స్ ను పోలీసులు చావబాదారు. పలు జిల్లాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సివాన్ లో ఏకంగా స్టూడెంట్స్ పై ఏకే 47 లతో విరుచుకు పడ్డారు. పరిస్థితిని సీజేపి లీడర్ అభిజిత్ దీప్కేకు వివరిస్తూ ఇన్ స్టాలో కంప్లయింట్లు పెరుగుతున్నాయి. నిరసనల్లో పాల్గొన్న వారిపై FIR లు కూడా నమోదవుతున్నాయి.

తొలి టెస్ట్ ట్యూబ్ బేబీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?
ఇప్పుడు IVF అంటే కామన్ అయిపోయింది. కానీ ఒకప్పుడు అదే ప్రపంచానికి పెద్ద మిరాకిల్. 1978 జూలై 25న ప్రపంచంలోనే తొలి టెస్ట్ ట్యూబ్ బేబీగా జన్మించిన లూయిస్ జాయ్ బ్రౌన్ ఇప్పుడు 48 ఏళ్లు పూర్తి చేసుకుంది. అప్పట్లో ఆమె పుట్టుకపై ఎన్నో సందేహాలు, విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఆమె పూర్తిగా ఆరోగ్యంగా ఉండటమే కాదు.. సహజంగానే ఇద్దరు పిల్లలకు తల్లి కూడా అయ్యింది. నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది దంపతులకు పేరెంట్ అయ్యే అవకాశం కల్పిస్తున్న IVF టెక్నాలజీకి లూయిస్ పుట్టుకే అసలు బిగినింగ్ అని చెప్పొచ్చు.