Latest

నీట్ ధర్నాలో మంత్రి కూతురు
Politics· 27 Jul 2026

నీట్ ధర్నాలో మంత్రి కూతురు

నీట్ పరీక్షపై జరిగిన ప్రొటెస్ట్ లో మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని స్టూడెంట్స్ ఆందోళన చేశారు. ఈ ధర్నాలో అస్సాం రెవెన్యూ శాఖ మంత్రి కేశబ్ మహంత కూతురు 'దిబిసా' కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కేశబ్ మహంత పై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీనిపై అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ స్పందిస్తూ. ఎదిగిన పిల్లల పనులకు తల్లిదండ్రులను తప్పుపట్టడం కరెక్ట్ కాదని చెప్పారు. నేటి తరానికి సొంత ఆలోచనలు ఉంటాయని, ఆమెను కలిసినప్పుడు దీని గురించి మాట్లాడుతానని సీఎం తెలిపారు.

AIకి మీ గురించి ఎంత తెలుసో తెలుసా..?
Technology· 27 Jul 2026

AIకి మీ గురించి ఎంత తెలుసో తెలుసా..?

ChatGPT, Gemini లాంటి AI chatbots మనం టైప్ చేసే ప్రతి ప్రశ్నను మాత్రమే కాదు.. మన లైక్స్, ఇంట్రెస్ట్స్, పర్సనాలిటీ, అలవాట్లు లాంటి విషయాలను కూడా అంచనా వేయగలవని The New York Times కథనం చెబుతోంది. టెక్ జర్నలిస్ట్ బ్రియన్ ఎక్స్. చెన్.. కేవలం నాలుగు promptsతో AI తన గురించి ఎంత తెలుసుకుందో టెస్ట్ చేయగా, తాను ఎప్పుడూ చెప్పని కొన్ని విషయాలను కూడా AI గుర్తించిందని వెల్లడించారు. AIతో ఎక్కువగా చాట్ చేసే యూజర్లు.. అది తమ గురించి ఎంత సమాచారం అర్థం చేసుకుంటుందో చెక్ చేసుకోవాలని ఎక్సపెర్ట్స్ చెబుతున్నారు.

మళ్ళీ పడిపోయిన గోల్డ్ రేట్స్!
Business· 27 Jul 2026

మళ్ళీ పడిపోయిన గోల్డ్ రేట్స్!

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ప్రైసెస్ కాస్త తగ్గాయి. సోమవారం ఉదయం హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ 10 గ్రామ్స్ గోల్డ్ రేట్ రూ.1,44,920 కి వచ్చింది. అలాగే 22 క్యారెట్ ధర రూ.1,32,840గా ఉంది. మరోవైపు, సిల్వర్ ప్రైస్ Kgకి వంద రూపాయలు తగ్గి రూ.2,39,900 కి చేరింది. అయితే ఈ రేట్స్ ఎప్పటికప్పుడు మారుతుంటాయి కాబట్టి కొనేముందు ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది.

పోలీస్‌పైకే కారెక్కిచ్చాడు!
News· 27 Jul 2026

పోలీస్‌పైకే కారెక్కిచ్చాడు!

హైదరాబాద్‌ ఆబిడ్స్‌లో డ్రగ్స్ సప్లై చేస్తున్న సాయిఫ్ అనే పెడ్లర్‌ను నార్కోటిక్ పోలీసులు పట్టుకునేందుకు యత్నించగా, కారుతో వారిపైకి దూసుకెళ్లాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్ మహేందర్ కాలు విరగగా, ఇన్స్‌పెక్టర్ శ్రీకాంత్, కానిస్టేబుల్ వంశీధర్‌లకు గాయాలయ్యాయి. పారిపోతున్న నిందితుడిని అఫ్జల్‌గంజ్ వద్ద పోలీసులు ఛేజ్ చేసి అరెస్ట్ చేశారు. గాయపడిన మహేందర్‌ను యశోద హాస్పిటల్‌కు తరలించి, నిందితుడిపై అటెంప్ట్ టు మర్డర్ కేస్ ఫైల్ చేశారు.

రోడ్డుపై TGPSC OMR షీట్లు!
Politics· 27 Jul 2026

రోడ్డుపై TGPSC OMR షీట్లు!

PVNR ఎక్స్‌ప్రెస్‌వే పై 2018 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్ ఒరిజినల్ OMR షీట్లు రోడ్డుపై కుప్పలుగా పడిపోవడం TGPSC నిర్లక్ష్యాన్ని బయటపెట్టింది. అభ్యర్థుల హాల్ టికెట్ నంబర్లు ఉన్న పేపర్లను ముక్కలు చేయకుండానే రీసైక్లింగ్ కోసం విజయవాడకు తీసుకెళ్తుండగా కిందపడిపోయాయి. పోలీసులు పేపర్లను స్వాధీనం చేసుకున్నారు. పత్రాలను ఇలా రోడ్డుపై పడేయడంపై నిరుద్యోగులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఘటనపై 3 రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలని SIని ఆదేశించిన TGPSC బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపింది.

కొమురవెల్లికి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్
News· 27 Jul 2026

కొమురవెల్లికి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్

TG: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న ఆలయం తెలంగాణలోని ప్రసిద్ధ శైవక్షేత్రాల్లో ఒకటి. ఈ రైల్వే స్టేషన్‌ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. రూ.6 కోట్ల వ్యయంతో ఈ స్టేషన్‌ను నిర్మించినట్లు ఆయన తెలిపారు. ఈ స్టేషన్ ద్వారా స్వామివారి ఆలయానికొచ్చే భక్తులకు మెరుగైన రైలు రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని అన్నారు.

తిరుపతిలో మొదటి కరోనా కేసు
News· 27 Jul 2026

తిరుపతిలో మొదటి కరోనా కేసు

AP: తిరుపతిలో ఫస్ట్ కరోనా కేసునమోదయ్యింది. ఎస్టీవీ నగర్‌కు చెందిన 65 ఏళ్ల మహిళకు ఆరోగ్య సమస్యలు ఉండటంతో ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు వెళ్లారు. అక్కడ డాక్టర్లు టెస్ట్ చేస్తే కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని డీఎంహెచ్‌వో చెప్పారు.

సోయా చాప్ తినేముందు ఈ వీడియో చూడండి
Viral· 27 Jul 2026

సోయా చాప్ తినేముందు ఈ వీడియో చూడండి

సోయా చాప్ తయారీకి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియోలో ఓ వ్యక్తిని సోయా చాప్ పిండిలా కనిపిస్తున్న మిశ్రమంలో ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు చూసి చాలామంది 'ఇక సోయా చాప్ తినలేం' అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. ఈ వీడియో నోయిడాలో తీసిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నా, దానికి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక కన్ఫర్మేషన్ లేదు. కొన్ని రిపోర్ట్స్ మాత్రం ఇది ఆగ్రాలో తీసిన పాత వీడియో అని చెబుతున్నాయి.

నోలన్‌కు నచ్చిన సత్యజిత్ రే సినిమాలు
Cinema· 27 Jul 2026

నోలన్‌కు నచ్చిన సత్యజిత్ రే సినిమాలు

హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టఫర్ నోలన్‌కు మన దేశానికి చెందిన సత్యజిత్ రే సినిమాలు బాగా నచ్చాయంట. నోలన్ రీసెంట్‌గా న్యూయార్క్‌లోని క్రైటీరియాన్ క్లోజెట్‌కు వెళ్లారు. అక్కడి సినిమాల కలెక్షన్ నుంచి నోలన్ సత్యజిత్ రే తీసిన ‘ది అపూ ట్రైలాజీ’ని ప్రత్యేకంగా ఎంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ 'సత్యజిత్ రే తీసిన ‘పథేర్ పాంచాలి’ సినిమా చూసి నేను ఆశ్చర్యపోయాను. ఆ ట్రైలాజీలో ఉన్న మిగతా రెండు సినిమాలు నేను ఇంకా చూడలేదు. ఆ రెండు సినిమాలను ఇంటికి తీసుకెళ్లి మొత్తం కథను పూర్తిగా చూస్తాను' అని ఒక వీడియోలో చెప్పారు.

మోదీని తొలిగిస్తేనే ప్రజాస్వామ్యం బాగుపడుతుంది: సిద్దరామయ్య
Politics· 27 Jul 2026

మోదీని తొలిగిస్తేనే ప్రజాస్వామ్యం బాగుపడుతుంది: సిద్దరామయ్య

ధర్మేంద్ర రాజీనామా చేసినంత మాత్రాన దేశ విద్యావ్యవస్థ బాగుపడదని కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య అన్నారు. రాజకీయాల నుంచి విద్య వరకు ప్రతి వ్యవస్థను కమర్షియల్ చేసిన ప్రధాని మోదీని తొలగిస్తేనే విద్య, ప్రజాస్వామ్యం బాగుపడుతుందని విమర్శించారు. ప్రజా వ్యతిరేక, అవినీతి పాలనకు వ్యతిరేకంగా విద్యార్థులు వారి ఉద్యమాన్ని కొనసాగించాలని ఆయనన్నారు.

వైరల్ అవ్వడం కోసం ప్రాణాలతో ఆట
Viral· 27 Jul 2026

వైరల్ అవ్వడం కోసం ప్రాణాలతో ఆట

సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో ఓ యువకుడు బైక్‌పై చేసిన డేంజరస్ స్టంట్ నెటిజన్లను షాక్‌కు గురిచేస్తోంది. వైరల్ వీడియోలో అతడు బైక్‌ను హై స్పీడ్‌లో జిగ్‌జాగ్‌గా నడుపుతుండగా, వెనుక కూర్చున్న మహిళ బ్యాలెన్స్ కోల్పోయినట్లు కనిపించింది. వీడియో చూసిన నెటిజన్లు "వైరల్ కోసం ప్రాణాలతో ఆట ఎందుకు?", "ఒక్క సెకండ్ తేడా అయితే పెద్ద ప్రమాదమే" అంటూ ఫైర్ అవుతున్నారు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందనే విషయంపై స్పష్టత లేదు.

బ్యాడ్మింటన్ అకాడమీ సమీపంలో కాల్పులు కలకలం
Crime· 27 Jul 2026

బ్యాడ్మింటన్ అకాడమీ సమీపంలో కాల్పులు కలకలం

AP: కర్నూలు జోహరపురంలోని వీఆర్ఎస్ బ్యాడ్మింటన్ అకాడమీ సమీపంలో నిన్న రాత్రి తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. ఒక వాహనంలో వచ్చిన ఇద్దరు వ్యక్తులు గాలిలోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. సమాచారం అందుకున్న కర్నూలు మూడో టౌన్ పోలీసులు వెంటనే స్పందించి ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఘటనలో ఉపయోగించిన తుపాకీని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ముద్రగడ పద్మనాభం కొడుకు ఎమోషనల్!
Politics· 27 Jul 2026

ముద్రగడ పద్మనాభం కొడుకు ఎమోషనల్!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కుమారుడు గిరిబాబు YS జగన్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటామని ఎమోషనల్ అయ్యారు. తన తండ్రి హాస్పిటల్‌లో ఉన్నప్పటి నుంచి చివరివరకు జగన్ నిరంతరం డాక్టర్లతో మాట్లాడుతూ కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించారని గుర్తుచేసుకున్నారు. రాజకీయ లబ్ధి కోసం కాకుండా, ఒక కుమారుడిలా ఆఖరి గౌరవం ఇస్తూ జగన్ స్వయంగా పాడె మోశారని, ఆ క్షణాన్ని తమ కుటుంబం ఎప్పటికీ మర్చిపోలేదన్నారు. కష్టకాలంలో తమకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

అమెరికాలో అయితే ఏకంగా కాల్చి చంపేస్తారు- BJP MP
Politics· 27 Jul 2026

అమెరికాలో అయితే ఏకంగా కాల్చి చంపేస్తారు- BJP MP

ప్రొటెస్టర్లపై పోలీస్ యాక్షన్‌ను బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సపోర్ట్ చేశారు. పార్లమెంట్ వైపు దూసుకొచ్చినప్పుడు పోలీసులు లాఠీఛార్జ్ చేయడం తప్పు కాదని అన్నారు. అమెరికా లాంటి కంట్రీస్‌లో అయితే ఇలాంటి సిట్యుయేషన్‌లో డైరెక్ట్‌గా గన్స్‌తో షూట్ చేస్తారని చెప్పారు. ఈ బీజేపీ ఎంపీ కామెంట్స్‌పై మీ ఓపీనియన్ ఏంటో కామెంట్స్‌లో చెప్పండి!

పెల్లెట్ గన్ ఫైరింగ్: రూల్స్ బ్రేక్ చేసి కాల్పులు జరిపారు!
Politics· 27 Jul 2026

పెల్లెట్ గన్ ఫైరింగ్: రూల్స్ బ్రేక్ చేసి కాల్పులు జరిపారు!

ఢిల్లీ ప్రొటెస్ట్‌లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) పెల్లెట్ గన్స్ వాడటంపై వివాదం నడుస్తోంది. జులై 20న నిబంధనలకు విరుద్ధంగా ఏడు రౌండ్ల ఫైరింగ్ జరిగిందని, అందులో స్టూడెంట్‌తో పాటు జర్నలిస్ట్‌కి దెబ్బలు తగిలాయని ఇంటర్నల్ రివ్యూలో తేలింది. దీనిపై RAF ఇన్స్‌పెక్టర్ జనరల్ సీమా ధుండియా స్పందిస్తూ... పద్ధతి ప్రకారం హెచ్చరికలు ఇచ్చిన తర్వాతే లారీఛార్జ్ లేదా కన్నీటివాయువు వాడాలని, పరిమితి దాటి ఫోర్స్ వాడకూడదని జవాన్లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

మాజీ మంత్రి రోజాకి పోలీసు నోటీసులు?
Politics· 27 Jul 2026

మాజీ మంత్రి రోజాకి పోలీసు నోటీసులు?

YCP నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజాకి తిరుపతి ఈస్ట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 30న విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. దీనిపై స్పందించిన రోజా, కూటమి ప్రభుత్వం పొలిటికల్ రివేంజ్‌లో భాగంగానే తనపై అక్రమ కేసులు పెట్టిందని విమర్శించారు. జగన్ గారి కుటుంబ మహిళలపై అబద్ధాలు రాసిన పేపర్‌ను నిరసనగా తగలేస్తే కేసు పెట్టడం ఏంటని మండిపడ్డారు. బెదిరింపులకు బెదిరేది లేదని రోజా స్పష్టం చేశారు.

మంత్రులను మార్చాలి: MLA అనిరుధ్ రెడ్డి!
Politics· 27 Jul 2026

మంత్రులను మార్చాలి: MLA అనిరుధ్ రెడ్డి!

మంత్రుల పదవులపై జడ్చర్ల కాంగ్రెస్ MLA అనిరుధ్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. కార్పొరేషన్ ఛైర్మన్ల పదవీ కాలం రెండేళ్లు పూర్తయ్యాక మారుస్తున్నట్లే, మంత్రుల పదవులు కూడా రెండేళ్లు పూర్తయ్యాయి కాబట్టి వాళ్లను మార్చాలని డిమాండ్ చేశారు. తమలాంటి ఇంజనీర్లు, డాక్టర్లు ఉన్న యంగ్ ఎంబిషియస్ MLAలకు అవకాశం ఇవ్వాలని అన్నారు. అయితే ఈ విషయంలో పార్టీ అధిష్ఠానం, రేవంత్ రెడ్డి గారి నిర్ణయానికే కట్టుబడి ఉంటానని చెప్పారు. Video Credits - Zee Telugu News

జయకృష్ణ ఎంట్రీపై మహేష్ బాబు రియాక్షన్!
Cinema· 27 Jul 2026

జయకృష్ణ ఎంట్రీపై మహేష్ బాబు రియాక్షన్!

సూపర్ స్టార్ మహేష్ బాబు తన అన్న రమేష్ బాబు కొడుకు జయకృష్ణ గ్రాండ్ ఎంట్రీపై రియాక్ట్ అయ్యారు. 'శ్రీనివాస మంగపురం' సినిమాతో డెబ్యూ చేస్తున్న జయకృష్ణ, రాషా తడానీలకు బెస్ట్ విషెస్ చెప్పారు. టీజర్, సాంగ్స్ చాలా బాగున్నాయని, వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో ఇంట్రడ్యూస్ అవ్వడం వాళ్ల లక్ అని కామెంట్స్ చేశారు. జులై 30న రిలీజ్ అవుతున్న ఈ మూవీ బిగ్ హిట్ అవ్వాలని విష్ చేశారు.

ఆసుపత్రికి మెగా ఫ్యామిలీ!
Cinema· 27 Jul 2026

ఆసుపత్రికి మెగా ఫ్యామిలీ!

రామ్ చరణ్ రీసెంట్‌గా కొయంబత్తూర్ ఆసుపత్రికి వెళ్లారు. 'పెద్ది' మూవీ షూటింగ్‌లో రెజ్లర్లతో ఫైట్ సీన్ చేస్తుండగా హ్యాండ్ మణికట్టు (wrist)కి గట్టిగా దెబ్బ తగిలింది. షూటింగ్ డిస్టర్బ్ అవ్వకూడదని పెయిన్ ఉన్నా అలాగే కంటిన్యూ చేయడంతో ప్రాబ్లం సీరియస్ అయింది. ఈ హ్యాండ్ సర్జరీ కోసం ఆదివారం ఫ్యామిలీ మెంబర్స్ చిరంజీవి, సురేఖ, ఉపాసనలతో కలిసి చరణ్ కొయంబత్తూర్ బయలుదేరి వెళ్లారు. చరణ్ త్వరగా రికవర్ అవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

'రాయన్' నేషనల్ అవార్డు వివాదం: ధనుష్ షాకింగ్ రియాక్షన్!
Cinema· 27 Jul 2026

'రాయన్' నేషనల్ అవార్డు వివాదం: ధనుష్ షాకింగ్ రియాక్షన్!

నేషనల్ అవార్డ్స్ వివాదంపై తమిళ స్టార్ హీరో ధనుష్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తన 'రాయన్' కంటే బెటర్ సినిమాలు ఉన్నాయని ఆయన ఒప్పుకున్నారు. అయితే గతంలో తన 'పుదుపేట్టై, వడ చెన్నై, కర్ణన్' లాంటి క్లాసిక్ సినిమాలకు అవార్డులు రానప్పుడు ఎవరూ మాట్లాడలేదని, ఇప్పుడు తనకు అవార్డు వస్తే 90% మంది విమర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చిన అవార్డును గుర్తించి ప్రోత్సహించాలని ధనుష్ ఫ్యాన్స్ మీట్‌లో కామెంట్స్ చేశారు.

బాలయ్యను పరామర్శించిన CM చంద్రబాబు!
Politics· 27 Jul 2026

బాలయ్యను పరామర్శించిన CM చంద్రబాబు!

సినిమా షూటింగ్‌లో గాయపడిన బాలకృష్ణకు హైదరాబాద్ గచ్చిబౌలిలోని AIG ఆసుపత్రిలో మోకాలికి సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హాస్పిటల్‌లో కోలుకుంటున్న ఆయనను AP CM చంద్రబాబు నాయుడు ఆదివారం పరామర్శించారు. డాక్టర్లతో మాట్లాడి బాలయ్య హెల్త్ కండిషన్‌పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా AIG హాస్పిటల్ ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి కూడా వారి వెంటే ఉన్నారు. బాలకృష్ణ త్వరలోనే డిశ్చార్జ్ అయ్యే ఛాన్స్ ఉంది.