Latest

ట్రాన్స్‌ఫార్మర్‌ దొంగలు అరెస్ట్‌
Local· 4d ago

ట్రాన్స్‌ఫార్మర్‌ దొంగలు అరెస్ట్‌

TG: నిర్మల్ జిల్లా భైంసా సబ్‌డివిజన్‌ పరిధిలో వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్ల చోరీలకు పాల్పడుతున్న ముఠాను ముధోల్‌ సర్కిల్‌ పోలీసులు పట్టుకున్నారు. ఎనిమిది నెలల్లో నమోదైన 33 ట్రాన్స్‌ఫార్మర్‌ చోరీ కేసులను పోలీసులు చాకచక్యంగా దర్యాప్తు చేసి ఛేదించారు. నిందితుల నుంచి సుమారు 250 కిలోల రాగి తీగలు, పలు ఎలక్ట్రికల్‌ వస్తువులు, రెండు ద్విచక్ర వాహనాలు, నాలుగు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

రాత్రి వేళ రోడ్లపై పశువులు.. ప్రమాదాల ముప్పు
Local· 4d ago

రాత్రి వేళ రోడ్లపై పశువులు.. ప్రమాదాల ముప్పు

TG: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో రోడ్లపై పశువుల సంచారం ప్రయాణికులకు ప్రమాదకరంగా మారింది. 5ఇంక్లైన్‌ నుంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు రాత్రి వేళల్లో పశువులు రహదారులపై సంచరిస్తుండటంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పశువులు అకస్మాత్తుగా రోడ్డుపైకి రావడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ రోడ్లపై పశువుల కారణంగా ప్రమాదాలు జరిగి పలువురు గాయపడటంతో పాటు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయని పేర్కొన్నారు.

దోమల నివారణకు ముమ్మర చర్యలు
Local· 4d ago

దోమల నివారణకు ముమ్మర చర్యలు

TG: జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం గోర్లఖాన్‌ దొడ్డిలో దోమల నివారణకు పంచాయతీ అధికారులు ముమ్మరంగా చర్యలు చేపట్టారు. గ్రామ సర్పంచ్‌ యు. సేకమ్మ ఆదేశాల మేరకు మంగళవారం అన్ని వార్డులు, మురికి కాలువలు, ప్రధాన వీధుల్లో దోమల నివారణ మందును పిచికారీ చేయించారు. వర్షాకాలంలో దోమల వ్యాప్తితో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు సర్పంచ్‌ తెలిపారు. ప్రజల ఆరోగ్యమే తమ ప్రాధాన్యత అని పేర్కొన్నారు.

ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలని వినతి
Local· 4d ago

ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలని వినతి

TG: జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల విడుదల కోసం ధర్మ సమాజ్‌ పార్టీ, బీసీ-ఎస్సీ-ఎస్టీ జేఏసీ సంయుక్తంగా ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశాయి. తెలంగాణలో సుమారు 30 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన రూ.14 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరుతూ మల్యాల MRO శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. బకాయిలు పేరుకుపోవడంతో విద్యార్థులు, ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన పేద విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని నాయకులు తెలిపారు.

విశాఖ ప్రజలకు గుడ్ న్యూస్!
AP· 4d ago

విశాఖ ప్రజలకు గుడ్ న్యూస్!

ఆసియాలోనే ఫేమస్ అయిన AIG హాస్పిటల్స్ ఇప్పుడు విశాఖపట్నంకి వస్తోంది. వైజాగ్ ఎండాడ వద్ద రూ. 2,000 కోట్ల భారీ ఇన్వెస్ట్‌మెంట్‌తో, 1,000 పడకల కెపాసిటీతో ఈ హాస్పిటల్‌ను నిర్మిస్తున్నారు. ఐటీ మినిస్టర్ నారా లోకేష్, ఏఐజీ ఛైర్మన్ డాక్టర్ డి. నాగేశ్వర్ రెడ్డి దీనికి శంకుస్థాపన చేశారు. ఈ మెగా ప్రాజెక్ట్‌తో విశాఖ రూపురేఖలు మారడమే కాకుండా, లోకల్ పీపుల్‌కి క్వాలిటీ మెడికల్ సర్వీసెస్ అందుబాటులోకి రానున్నాయి.

ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాలి
Local· 4d ago

ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాలి

TG: జగిత్యాల జిల్లా బుగ్గారం మండలంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల విడుదల కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ, ధర్మ సమాజ్‌ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశాయి. తెలంగాణలో సుమారు 30 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన దాదాపు రూ.14 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ మేరకు మంగళవారం బుగ్గారం మండలంలో ఎంఆర్‌ఓ అందుబాటులో లేకపోవడంతో డీటీ రాకేష్‌కు జేఏసీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.

24 గంటల కరెంటు కోసం రైతుల ధర్నా
Local· 4d ago

24 గంటల కరెంటు కోసం రైతుల ధర్నా

TG: జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలో రైతులకు 24 గంటల విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేస్తూ గట్టు సబ్‌స్టేషన్‌ వద్ద ధర్నా కొనసాగుతోంది. సాగునీటి కోసం నిరంతర విద్యుత్‌ సరఫరా అందించాలని డిమాండ్‌ చేస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. ధర్నాకు వివిధ రైతు సంఘాలు, అఖిలపక్ష నేతలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పంటలకు సాగునీరు అందాలంటే 24 గంటల విద్యుత్‌ సరఫరా ఎంతో అవసరమని పేర్కొన్నారు.

నీట్ ప్రొటెస్టర్స్‌కి బిగ్ రిలీఫ్..
Gen Z· 4d ago

నీట్ ప్రొటెస్టర్స్‌కి బిగ్ రిలీఫ్..

ప్రొటెస్టర్స్ పై ఫైల్ అయిన FIRలను డ్రాప్ చేయాలని, ఇకపై ఎలాంటి లీగల్ యాక్షన్ తీసుకోమని ఢిల్లీ పోలీస్ సుప్రీంకోర్టును కోరారు. ఇదే దారిలో అస్సాం, బీహార్, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్ స్టేట్స్ కూడా FIRలను క్వాష్ చేయడానికి ముందుకు వచ్చాయి. ప్రొటెస్ట్ చేసే రైట్ ఉపయోగించినందుకు ఏ ప్రొటెస్టర్ కోర్టు కేసులు ఫేస్ చేయకూడదని, అన్ని స్టేట్స్ ఇదే ప్రాసెస్ ఫాలో అయ్యేలా యూనియన్ గవర్నమెంట్ చూడాలని CJP లాయర్ రత్నా సింగ్ అన్నారు.

డ్రైవర్‌లెస్ కార్.. డైరెక్ట్‌గా పోలీస్ వ్యాన్‌కు ఢీ!
Viral· 4d ago

డ్రైవర్‌లెస్ కార్.. డైరెక్ట్‌గా పోలీస్ వ్యాన్‌కు ఢీ!

పాకిస్థాన్‌లో డ్రైవర్‌లెస్ కార్ డెమో కాస్తా మిస్‌ఫైర్‌గా మారింది. పార్క్ చేసి ఉన్న పోలీస్ వ్యాన్‌ను కారు ఢీకొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డీ-చౌక్ దగ్గర జరిగిన ఈ డెమోలో జర్నలిస్ట్ ముహమ్మద్ ఆలిజా కారులోనే ఉండి వీడియో రికార్డ్ చేశారు. కారు రిమోట్‌గా ఇంటర్నెట్, శాటిలైట్ కనెక్షన్‌తో ఆపరేట్ చేస్తున్న టైమ్‌లో కనెక్షన్‌లో ప్రాబ్లమ్ రావడంతో కంట్రోల్ తప్పినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో కొంత నష్టం జరగగా, ఎవరికీ గాయాలు కాలేదు.

దిల్లీలో పెద్ద సంఖ్యలో ఓటర్లు గల్లంతు
Current Affairs· 4d ago

దిల్లీలో పెద్ద సంఖ్యలో ఓటర్లు గల్లంతు

దిల్లీలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా వచ్చింది. మొత్తం 1.45 కోట్ల ఓటర్లలో దాదాపు 47.5 లక్షల మంది పేర్లు ఇప్పుడు జాబితాలో లేవు. అంటే ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతయ్యింది. 70 నియోజకవర్గాల్లో ఏడు చోట్ల ఒక్కో చోట లక్షకు పైగా పేర్లు తగ్గాయి. ఐదు నియోజకవర్గాల్లో 2025 ఎన్నికల్లో ఉన్న ఓటర్లలో 40 శాతానికి పైగా పేర్లు డ్రాఫ్ట్ జాబితాలో లేకపోవడం విచిత్రం. ఈ ఐదింటిలో మూడు ఆప్ గెలవడా, రెండు బీజేపీ గెలిచింది.

'వండర్ వుమన్' ఆగిపోయినట్టేనా?
Entertainment· 4d ago

'వండర్ వుమన్' ఆగిపోయినట్టేనా?

హాలీవుడ్ స్టార్ గాల్ గాడోట్ తన 'వండర్ వుమన్' రోల్‌కి గుడ్ బై చెప్పే ఛాన్స్ ఉంది. మూడో పార్ట్ గురించి డైరెక్టర్ జేమ్స్ గన్‌తో ఎలాంటి డిస్కషన్స్ జరగలేదని 41 ఏళ్ల ఈ యాక్టర్ ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగాలని, నెక్స్ట్ ఈ రోల్ చేసే యాక్టర్‌కి ఆల్‌ది బెస్ట్ అని తెలిపారు. ఇప్పటివరకు 2 సోలో మూవీస్‌తో సహా మొత్తం 6 డీసీ చిత్రాల్లో వండర్ వుమన్ సూపర్ హీరోగా మెప్పించి గ్లోబల్ రేంజ్‌లో హ్యూజ్ క్రేజ్ సొంతం చేసుకున్నారు.

నోటీసులు ఇచ్చారు.. కానీ అధికారులే రాలేదు!
Local· 4d ago

నోటీసులు ఇచ్చారు.. కానీ అధికారులే రాలేదు!

TG: నిర్మల్ జిల్లా నర్సాపూర్‌ (జి) మండల కేంద్రంలో అధికారుల తీరుపై గ్రామపంచాయతీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 9 గంటలలోపు గ్రామపంచాయతీ కార్యాలయానికి హాజరుకావాలని అధికారులు నోటీసులు జారీ చేయగా, నోటీసులు అందుకున్న సభ్యులు నిర్ణీత సమయానికి కార్యాలయానికి చేరుకున్నారు. అయితే 11 గంటలు దాటినా సంబంధిత అధికారులు కార్యాలయానికి హాజరుకాకపోవడంతో సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. అధికారులే సమయపాలన పాటించాలని సూచిస్తూ నోటీసులు ఇచ్చి, తామే కార్యాలయానికి ఆలస్యంగా రావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

లియోనెల్ మెస్సీ రిటైర్మెంట్ అనౌన్స్‌మెంట్
Sports· 4d ago

లియోనెల్ మెస్సీ రిటైర్మెంట్ అనౌన్స్‌మెంట్

ప్రముఖ అర్జెంటీనా ఫుట్‌బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీ 39 ఏళ్ల వయసులో అంతర్జాతీయ ఫుట్‌బాల్ నుంచి రిటైర్ అయ్యారు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్పానిష్ భాషలో చేతితో రాసిన నోట్‌బుక్ ఎంట్రీని పోస్ట్ చేస్తూ, అర్జెంటీనా జాతీయ జట్టు నుంచి రిటైర్ అవుతున్నట్లు తెలిపారు. పోస్ట్ చివర్లో “ఈ మాటలు జూలై 21న, ఫైనల్ తర్వాత రెండు రోజులకు రాశాను. నా తండ్రికి జరిగినది తర్వాత నేడు దాన్ని కన్ఫర్మ్ చేస్తున్నాను” అని కూడా రాశారు. మెస్సీ తండ్రి జార్జ్ మెస్సీ ఆగస్టు 8న రోసారియోలోని ఆసుపత్రిలో 68 ఏళ్ల వయసులో మరణించారు.

నిధులు మంజూరు చేయాలని వినతి
Local· 4d ago

నిధులు మంజూరు చేయాలని వినతి

TG: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మున్సిపల్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్‌ ఆధ్వర్యంలో మున్సిపల్‌ పాలకవర్గం మంత్రి శ్రీధర్‌బాబును కోరింది. మంగళవారం హైదరాబాద్‌లోని మినిస్టర్‌ క్వార్టర్స్‌లో మంత్రిని హుజురాబాద్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సుహాసిని, కౌన్సిలర్లు, కోఆప్షన్‌ సభ్యులు కలిసి వినతిపత్రం అందజేశారు. మున్సిపాలిటీలో మౌలిక వసతుల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన సౌకర్యాల కల్పనకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరారు.

UCO Bankలో జాబ్స్.. టెక్ ప్రొఫెషనల్స్‌కు గుడ్ న్యూస్!
Jobs· 4d ago

UCO Bankలో జాబ్స్.. టెక్ ప్రొఫెషనల్స్‌కు గుడ్ న్యూస్!

UCO Bankలో Specialist Officer పోస్టులకు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ వచ్చింది. మొత్తం 20 పోస్టులు ఉండగా.. Manager-AI/ML Engineer, Manager-Cyber Security పోస్టులు చెరో 10 ఉన్నాయి. ఆగస్ట్ 29 నుంచి <a href="https://onlineappl.ucoonline.bank.in/SPE_RCER/">అప్లికేషన్స్ స్టార్ట్</a> కాగా.. సెప్టెంబర్ 18, 2026తో ముగుస్తాయి. ఆయా ఫీల్డ్స్‌లో B.E./B.Tech, MCA, M.Tech/M.E. వంటి క్వాలిఫికేషన్‌తో పాటు మినిమమ్ 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ఏజ్ 25-35 ఏళ్లు (ఆగస్ట్ 1, 2026 నాటికి) ఉండాలి. SC/ST/PwBD వారికి రూ. 175, ఇతర క్యాండిడేట్స్‌కు రూ. 850 <a href="https://onlineappl.ucoonline.bank.in/SPE_RCER/">అప్లికేషన్</a> Fee ఉంటుంది.

హైదరాబాద్‌లో జోమాటో బిగ్ షాక్!
Current Affairs· 4d ago

హైదరాబాద్‌లో జోమాటో బిగ్ షాక్!

ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జోమాటో హైదరాబాద్‌లోని యూజర్ సపోర్ట్ ఆపరేషన్స్‌ను క్లోజ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో హైదరాబాద్ ఆఫీస్‌కు చెందిన దాదాపు 250 మంది ఎంప్లాయీస్‌ ఉద్యోగాలు కోల్పోనున్నారు. తమ కస్టమర్ సపోర్ట్ వర్క్‌ను గురుగ్రామ్ హెడ్ ఆఫీస్‌కు షిఫ్ట్ చేస్తున్నట్లు జోమాటో అనౌన్స్ చేసింది. జాబ్ పోగొట్టుకున్న ఎంప్లాయీస్‌కి ఆగస్టు సాలరీతో పాటు అదనంగా 4 నెలల పేమెంట్, మార్చి 31, 2027 వరకు మెడికల్ ఇన్సూరెన్స్ సపోర్ట్ అందిస్తామని కంపెనీ స్పష్టం చేసింది.

మెట్టూర్ డ్యామ్ నీరు విడుదల చేసిన సీఎం విజయ్
National· 4d ago

మెట్టూర్ డ్యామ్ నీరు విడుదల చేసిన సీఎం విజయ్

తమిళనాడు సీఎం సి.జోసఫ్ విజయ్ మెట్టూర్ డ్యామ్ నుంచి నీరు విడుదల చేశారు. సాధారణంగా జూన్ 12న ఈ డ్యామ్ తెరుస్తారు. ఈసారి నీళ్లు తక్కువగా ఉండడం వల్ల లేట్ అయింది. నైరుతి రుతుపవనాలు తక్కువగా పడడం, ఎల్ నినో ప్రభావం వల్ల ఇలా జరిగింది. సీఎం విజయ్ మాట్లాడుతూ కావేరీ నీటిపై తమిళనాడుకు ఉన్న హక్కుల విషయంలో రాజీపడం అని చెప్పారు. రైతులు నీటిని జాగ్రత్తగా వాడాలని, మధ్యస్థ కాలం పంటలు వేసుకోవాలని, నీరు ఆదా చేసే పద్ధతులు పాటించాలని కోరారు.

ల్యాబ్‌ టెక్నీషియన్‌ లేక తలుపులకు నోటీసు
Local· 4d ago

ల్యాబ్‌ టెక్నీషియన్‌ లేక తలుపులకు నోటీసు

TG: వరంగల్‌‌లోని ఎంజీఎం ఆసుపత్రిలో హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ పరీక్షల విభాగం వద్ద రోగులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. గది నంబర్‌ 103లో ల్యాబ్‌ టెక్నీషియన్‌ అందుబాటులో లేకపోవడంతో మంగళవారం పరీక్షలు నిర్వహించడంలేదని తెలుపుతూ తలుపులకు నోటీసు అంటించారు. దీంతో తెల్లవారుజామునే దూర ప్రాంతాల నుంచి బస్సుల్లో వచ్చిన రోగులు పరీక్షలు చేయించుకోకుండానే వెనుదిరగాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసర పరీక్షలు అవసరమైన సమయంలో ప్రత్యామ్నాయ సిబ్బందిని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పలువురు ప్రశ్నించారు.

మహాధర్నాకు కదిలిన సూర్యాపేట ఉపాధ్యాయులు
Local· 4d ago

మహాధర్నాకు కదిలిన సూర్యాపేట ఉపాధ్యాయులు

TG: సూర్యాపేట జిల్లా నుంచి పీఆర్‌టీయూ-టీఎస్‌ ఉపాధ్యాయులు హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌లో నిర్వహించే మహాధర్నాకు తరలివెళ్లారు. సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం (ఓపీఎస్‌)ను అమలు చేయాలని, పీఆర్సీ కమిషన్‌ నివేదికను వెంటనే తెప్పించి మెరుగైన ఫిట్‌మెంట్‌తో పీఆర్సీని అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ పీఆర్‌టీయూ-టీఎస్‌ ఆధ్వర్యంలో ఈ మహాధర్నా నిర్వహిస్తున్నారు. సూర్యాపేట జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హైదరాబాద్‌కు బయలుదేరారు.

ఇంటింటికీ వెళ్లి పింఛన్లు ఇచ్చిన ఎమ్మెల్యే
Local· 4d ago

ఇంటింటికీ వెళ్లి పింఛన్లు ఇచ్చిన ఎమ్మెల్యే

AP: తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇంటింటికీ వెళ్లి ఎన్టీఆర్‌ భరోసా సామాజిక పింఛన్లను పంపిణీ చేశారు. మంగళవారం కూటమి నాయకులు, అధికారులతో కలిసి గ్రామంలోని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లిన ఎమ్మెల్యే నేరుగా పింఛన్‌ సొమ్మును అందజేశారు. మండలంలో కొత్తగా మంజూరైన వితంతు పింఛన్లను కూడా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ దశలవారీగా నెరవేరుస్తుందని అన్నారు.

మహాధర్నాకు భారీగా తరలిన నల్లబెల్లి టీచర్లు
Local· 4d ago

మహాధర్నాకు భారీగా తరలిన నల్లబెల్లి టీచర్లు

TG: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలానికి చెందిన ఉపాధ్యాయులు పీఆర్‌టీయూ-టీఎస్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న మహాధర్నాకు తరలివెళ్లారు. సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం (ఓపీఎస్‌)ను అమలు చేయాలని, ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్‌ చేశారు. అలాగే పీఆర్సీని తక్షణమే అమలుచేసి ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌ వద్ద నిర్వహిస్తున్న మహాధర్నాలో పాల్గొనేందుకు నల్లబెల్లి మండలం నుంచి ఉపాధ్యాయులు తరలివెళ్లారు.