Latest
కాలం చెల్లిన టియర్ గ్యాస్ షెల్స్ వాడారు !
చలో సంసద్ నిరసనల్లో పాల్గొన్న స్టూడెంట్స్ పై పోలీసులు కాలం చెల్లిన టియర్ గ్యాస్ షెల్స్ వాడారనే వార్తలు కలవరపెడుతున్నాయి. శివం పరాసర్ అనే ఇన్ స్టా అక్కౌంట్ హోల్డర్ ఒక వీడియో షేర్ చేస్తూ అక్కడున్న టియర్ గ్యాస్ షెల్ ను చూపించాడు. దానిపై ఆ టియర్ గ్యాస్ షెల్ 2022లో తయారయినదిగానూ, ఎక్స్ పైరీ డేట్ 2025తో ముగిసినట్లుగానూ ఉంది. వాడేసిన టియర్ గ్యాస్ షెల్స్ విడుదల చేసే టాక్సిన్స్ చాలా ప్రమాదకరమని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

కొత్త విద్యా మంత్రిగా ప్రహ్లాద్ జోషీ !
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో, కేంద్ర ప్రభుత్వం ప్రహ్లాద్ జోషిని కొత్త విద్యాశాఖ మంత్రిగా నియమించింది. నీట్ పరీక్షల వివాదం, వరుస నిరసనల నేపథ్యంలోనే ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. కీలక సమయంలో విద్యా రంగంలో సంస్కరణలు తేవడం, విద్యార్థుల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ప్రహ్లాద్ జోషికి ఈ ముఖ్యమైన బాధ్యతలను అప్పగించారు.

ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి అమిత్ షా!
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా అత్యవసరంగా భేటీ అయ్యారు. ఢిల్లీలోని పరిస్థితులు, క్యాబినెట్‌లో మార్పులపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం అమిత్ షా.. ప్రధాన్ నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. దేశ విద్యా వ్యవస్థలో ధర్మేంద్ర ప్రధాన్ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని, ఆయన సేవలు అభినందనీయమని ఈ సందర్భంగా హోంశాఖ మంత్రి ప్రశంసించారు.

గతంలో రాజీనామా చేసిన మంత్రులు వీరే!
నీట్ పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో స్టూడెంట్స్ ఆందోళనల దృష్ట్యా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. అయితే, దేశంలో ప్రమాదాలు, కుంభకోణాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రులు రాజీనామా చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో లాల్ బహదూర్ శాస్త్రి, మమతా బెనర్జీ, సురేష్ ప్రభు, నితీష్ కుమార్ (రైల్వే), శివరాజ్ పాటిల్ (హోమ్), టీటీ కృష్ణమాచారి (ఆర్థిక), వీకే కృష్ణమేనన్ (రక్షణ) వంటి నేతలు కూడా పదవుల నుంచి వైదొలిగారు.
CJPకి విదేశీ నిధులు? విదేశాంగ శాఖ బిగ్ క్లారిటీ!
కాక్రోచ్ జనతా పార్టీ (CJP)కి విదేశాల నుంచి ఫండింగ్ అందుతోందనే ప్రచారంపై కేంద్ర విదేశాంగ శాఖ స్పందించింది. జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆందోళనలకు విదేశీ నిధులు మళ్లుతున్నట్లు వస్తున్న ఆరోపణలపై తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. దీంతో CJPపై వస్తున్న రూమర్లకు చెక్ పడినట్లయింది.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై కేఏ పాల్ రియాక్షన్!
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ K.A పాల్ దేశ యువతకు అభినందనలు తెలిపారు. యువత అంతా ఒక్కటైతే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించారని ప్రశంసించారు. విద్యాశాఖ మంత్రి రాజీనామాను ఆమోదించి, విద్యార్థుల డిమాండ్లను విన్నందుకు ప్రధాని మోదీ, అమిత్ షాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, మంచి భవిష్యత్తు కోసం వేచి చూడాలని పిలుపునిచ్చారు.
Gen Zకి సోనాక్షి సిన్హా బిగ్ సెల్యూట్!
స్టూడెంట్స్ నిరసనలపై బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా ప్రశంసల వర్షం కురిపించారు. Gen Z పవర్ ఏంటో స్టూడెంట్స్ నిరూపించారని, మొదట్లో వారిని కాస్త తేలికగా తీసుకున్నందుకు క్షమాపణలు చెబుతున్నానని సరదాగా కామెంట్ చేశారు. వీరికి బిగ్ సెల్యూట్ కొడుతూ, తాను కూడా Gen Z లా మారాలనుకుంటున్నట్లు సంతోషం వ్యక్తం చేస్తూ ఒక వీడియోను షేర్ చేశారు.
ట్రాక్టర్ ఢీకొని ఇద్దరు పిల్లలకు గాయాలు
రాజస్థాన్‌లోని ఝలావార్ జిల్లా నయా తలాబ్ రోడ్డుపై ప్రమాదం జరిగింది. భారీ కరెంట్ స్తంభాలతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి పక్కనే ఉన్న దుకాణాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు గాయపడ్డారు. వాళ్లను వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసులపై చర్యలు తీసుకోవాలి: మాయావతి
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై BSP అధినేత మాయావతి స్పందించారు. దేశవ్యాప్తంగా స్టూడెంట్స్, యూత్ చేసిన ఉద్యమం వల్ల వచ్చిన ఈ నిర్ణయం సరైనదేనని, ఇది ఇంకా ముందే జరిగి ఉండాల్సిందన్నారు. జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా ప్రొటెస్ట్ చేసిన స్టూడెంట్స్‌పై బలప్రయోగం చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని, మహిళా నిరసనకారులతో అసభ్యంగా ప్రవర్తించిన పోలీసులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సికింద్రాబాద్ గార్డెన్ రెస్టారెంట్‌లో పరిశుభ్రత లోపాలు
TG: తెలంగాణ ఫుడ్ సేఫ్టీ ఫ్లయింగ్ స్క్వాడ్ సికింద్రాబాద్‌లోని గార్డెన్ రెస్టారెంట్‌ను చెక్ చేశారు. ఆ రెస్టారెంట్‌లో ఆహార భద్రత, పరిశుభ్రత లోపాలను గుర్తించింది. అపరిశుభ్రమైన వంటశాల, ఈగల బెడద, నిబంధనలకు విరుద్ధంగా ఆహార నిల్వ, పెస్ట్ కంట్రోల్ రికార్డులు లేవని అధికారులు గుర్తించారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ చట్టం–2006 ప్రకారం చర్యలు చేపట్టినట్లు ఫుడ్ సేఫ్టీ శాఖ తెలిపింది.

CJP దేశవ్యాప్త నిరసనలు బంద్..
కాక్రోచ్ జనతా పార్టీ (CJP) తమ దేశవ్యాప్త నిరసనలను వెంటనే విరమిస్తున్నట్లు ప్రకటించింది. NEET పేపర్ లీక్ ఆత్మహత్యల బాధితుల కుటుంబాలకు అత్యధిక పరిహారం, విద్యార్థులపై ఫైల్ అయిన FIRల రద్దుతో పాటు భవిష్యత్తులో ఎలాంటి చర్యలు ఉండవని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అలాగే CJP ప్రతిపాదించిన 5 పాయింట్ల ఎగ్జామ్ రిఫార్మ్స్ చార్టర్‌ను పరిశీలించేందుకు ప్రభుత్వం అంగీకరించడంతో స్టూడెంట్స్ తమ ఆందోళనలను ముగించారు.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా..చర్చలోకి రాజ్‌నాథ్ వ్యాఖ్యలు
'ఇది UPA ప్రభుత్వం కాదు. ఇది NDA ప్రభుత్వం. మేము రాజీనామాలు చేయము' అని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గతంలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రాజ్‌నాథ్ సింగ్ చేసిన అప్పటి వ్యాఖ్యలకు ప్రస్తుతం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు మధ్య పోలికలు చూపుతూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
మంత్రి రాజీనామా.. అభిజీత్ రియాక్షన్ ఇదే!
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో CJP నేత అభిజీత్ దీప్కే జంతర్ మంతర్ స్టేజ్ ముందు సంబరాలు చేసుకున్నారు. "DEMOCRACY WINS" అంటూ నిరసనకారులతో కలిసి విజయోత్సవ నినాదాలు చేశారు. పేపర్ లీక్స్ వివాదంలో విద్యార్థుల సుదీర్ఘ పోరాటానికి, ప్రజాస్వామ్యానికి ఇది దక్కిన విజయమని ఆయన ప్రకటించారు. ఫ్లెక్సీ పై ఆత్మహత్య చేసుకున్న స్టూడెంట్స్ ఫోటోలు ప్రదర్శిస్తూ విద్యావ్యవస్థలో మార్పు వచ్చే వరకు పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు.
కేసులు రద్దు.. జేపీ నడ్డా బిగ్ అనౌన్స్‌మెంట్!
కేంద్ర మంత్రులతో CJP స్పోక్స్ పర్సన్స్ భేటీ సక్సెస్ ఫుల్‌గా ముగిసింది. ఢిల్లీతో పాటు అన్ని రాష్ట్రాల్లో స్టూడెంట్స్‌పై ఫైల్ అయిన కేసులన్నింటినీ ఎత్తివేస్తామని కేంద్ర మంత్రి జేపీ నడ్డా హామీ ఇచ్చారు. భవిష్యత్తులో కేసుల పేరుతో స్టూడెంట్స్‌ని వేధించమని స్పష్టం చేశారు. అలాగే విద్యాశాఖలో త్వరలోనే కీలక మార్పులు తీసుకొస్తామని విద్యార్థి నేతలకు హామీ ఇచ్చారు

మూల్యం ఎవరు చెల్లిస్తారు?: కపిల్ సిబల్
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ స్పందించారు. "ప్రధాన్ రాజీనామా చేశారు. కానీ దానికి ఎంత మూల్యం చెల్లించాల్సి వచ్చింది?" అంటూ ప్రశ్నించారు. శాంతియుతంగా ప్రొటెస్ట్ చేసిన స్టూడెంట్స్‌పై లాఠీచార్జ్ జరిగిందని, చాలామంది గాయపడ్డారని, కొందరి కళ్లలో పెలెట్స్ దిగాయని, 23 రోజుల పాటు నిరాహార దీక్షలు చేశారని గుర్తుచేశారు. ఈ మూల్యం ఎవరు చెల్లిస్తారు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

యువత ప్రభుత్వాన్ని మోకరిల్లేలా చేయగలరు: నటుడు ప్రకాష్ రాజ్
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై నటుడు ప్రకాశ్ రాజ్ సోషల్ మీడియా 'ఎక్స్'లో స్పందించారు. 'నా ప్రియమైన కాక్రోచ్‌స్. ప్రియమైన సోనమ్ వాంగ్‌చుక్‌కి, యువతకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ అభినందనలు. మీరు ఒక ప్రభుత్వాన్ని మోకరిల్లేలా చేయగలరని నిరూపించారు' అంటూ ఆయన పోస్టు చేశారు.

హవ్వ..ధర్మేంద్ర ప్రధాన్‌కు అమిత్ షా ప్రశంసలు!
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నేపథ్యంలో దేశవ్యాప్తంగా సీజేపీ అభిమానులు, మద్దతుదారులు సంతోషంగా ఉండగా, మరోవైపు ధర్మేంద్ర ప్రధాన్‌కు ప్రశంసలు కురిపిస్తున్నారు బీజేపీ నేతలు. దేశ విద్యా వ్యవస్థలో ధర్మేంద్ర ప్రధాన్ చేసిన సేవలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశంసించారు. విద్యారంగంలో అనేక మార్పులు, సంస్కరణలు తీసుకువచ్చారని అన్నారు.
ఆందోళన విరమించిన సీజేపీ
కేంద్ర మంత్రులు జితేంద్ర సింగ్, జేపీ నడ్డాలతో సీజేపీ లీడర్లు జరిపిన చర్చలు ఫలించాయి. ప్రభుత్వం ఒప్పందాలను నిర్ణీత సమయంలోగా అమలు చేస్తుందనే నమ్మకంతో ఆందోళన విరమిస్తున్నట్లు సీజేపీ నేత సౌరవ్ దాస్ ప్రకటించారు. ఇరువర్గాల మధ్య పరస్పర ఒప్పందం కుదరింది.

Lavender Marriage అంటే ఏంటి?
లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్ తెలుసు.. మరి Lavender Marriage అంటే ఏంటో తెలుసా? లవ్ లేదా ఫిజికల్ అట్రాక్షన్ కంటే ఫ్యామిలీ ప్రెజర్, సమాజం లేదా ప్రైవసీ కోసం పరస్పర అంగీకారంతో చేసుకునే పెళ్లి. గతంలో LGBTQ+ వ్యక్తులు తమ సెక్సువల్ ఐడెంటిటీని దాచుకోవడానికి ఇలాంటి మ్యారేజ్‌లను ఎంచుకునేవారు. ఇప్పుడు ఫ్యామిలీ ప్రెజర్, కెరీర్, పర్సనల్ రీజన్స్ వల్ల కూడా కొందరు ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. ఇవి కూడా చట్టపరంగా సాధారణ మ్యారేజ్‌లాగే చెల్లుబాటు అవుతాయి.
విద్యార్థులు సాధించిన గొప్ప విజయం: మహేష్ కుమార్ గౌడ్
TG: సెంట్రల్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం విద్యార్థులు సాధించిన గొప్ప విజయమని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీతోపాటు ఇతర విపక్షాలు చేసిన పోరాటం ఫలితంగానే ఆయన రాజీనామా చేశారని గౌడ్ అన్నారు.
ఇంకా 2 డిమాండ్లు మిగిలే ఉన్నాయి- రాహుల్ గాంధీ
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై రాహుల్ గాంధీ స్పందిస్తూ.. విద్యార్థులందరికీ కంగ్రాట్స్ చెప్పారు. అయితే తమ పోరాటంలో ఇంకా రెండు డిమాండ్లు పెండింగ్‌లో ఉన్నాయని స్పష్టం చేశారు. విద్యార్థులకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలని, విద్యార్థులపై హింసకు పాల్పడిన వారిపై యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగబద్ధంగా పోరాడి భయాన్ని వీడాలని, ఈ ప్రభుత్వాన్ని సాగనంపే టైమ్ వచ్చిందని రాహుల్ పిలుపునిచ్చారు.