Latest

ఫుడ్ కూడా ఆపేస్తున్నారా? : రానా అయ్యూబ్
Politics· 25 Jul 2026

ఫుడ్ కూడా ఆపేస్తున్నారా? : రానా అయ్యూబ్

జర్నలిస్ట్ రానా అయ్యూబ్ జంతర్ మంతర్‌లో జరుగుతున్న CJP ఉద్యమంపై స్పందించారు. కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న కొన్ని న్యూస్ ఛానళ్లు ‘పాకిస్థాన్, చైనా నుంచి ఫుడ్ వస్తోంది’ అంటూ ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. మరోవైపు నిరసనకారుల కోసం వస్తున్న ఫుడ్ ప్యాకెట్లను దిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారని విమర్శించారు. ‘ఇది చాలా బాధాకరం’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

యువతను ఎవరూ ఆపలేరు: ప్రియాంక గాంధీ
Politics· 25 Jul 2026

యువతను ఎవరూ ఆపలేరు: ప్రియాంక గాంధీ

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా స్పందించారు. "దేశ యువత ఇప్పుడు మాట్లాడింది.. ఇక వాళ్ల గొంతును ఎవరూ అణిచివేయలేరు. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే" అంటూ ప్రియాంక వ్యాఖ్యానించారు. NEET-UG పేపర్ లీక్, ఎగ్జామ్ రిఫార్మ్స్ కోసం రాహుల్ గాంధీ రెండేళ్లుగా నిరంతరం పోరాడుతున్నారని, అదే సీజేపీకి స్ఫూర్తిగా మారిందన్నారు. స్టూడెంట్స్ రైట్స్ కోసం కాంగ్రెస్, NSUI, యూత్ కాంగ్రెస్ కలిసి దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని నిర్మించాయని చెప్పారు.

కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవి ఆయనకేనా!
Politics· 25 Jul 2026

కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవి ఆయనకేనా!

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవి ఎవరిని వరిస్తుందనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. కేంద్ర నాయకత్వం నుంచి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేలకు దిల్లీ నుంచి ఆహ్వానం అందినట్లు సమాచారం. ఫడ్నవిస్‌కు కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవి దక్కే అవకాశముందని, మహారాష్ట్రలో ముఖ్యమంత్రి మార్పు కూడా ఉండొచ్చని శివసేన(ఉద్ధవ్ ఠాక్రే వర్గం) నేత సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు.

E20 ఇథనాల్‌పై ఆగస్టు 4న రవాణాదారుల నిరసన
Politics· 25 Jul 2026

E20 ఇథనాల్‌పై ఆగస్టు 4న రవాణాదారుల నిరసన

సీజేపీ నిరసనలకు ఫలితం దక్కిన వేళ..దిల్లీ టాక్సీ, ట్రాన్స్‌పోర్టర్స్, టూర్ ఆపరేటర్ల సంఘాల నిరసనలు మొదలుకానున్నాయి. ఇథనాల్ కలిపిన పెట్రోల్ వినియోగాన్ని వ్యతిరేకిస్తూ ఆగస్టు 4న పార్లమెంటు వరకు పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించాయి. E20 ఇంధనం వల్ల మైలేజీ తగ్గడం, ఇంజిన్ పనితీరు దెబ్బతినడం, మెయింటెనెన్స్ ఖర్చులు పెరగడంపై వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు పెట్రోల్ ధరలు పెంచుతూ,మరోవైపు ఇథనాల్ కలిపిన ఇంధనాన్ని ఎందుకు ఇస్తున్నారంటూ రవాణాదారులు ఆవేదన చెందుతున్నారు

కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా: దిల్లీలో వేడెక్కిన రాజకీయం
Politics· 25 Jul 2026

కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా: దిల్లీలో వేడెక్కిన రాజకీయం

కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో దిల్లీ రాజకీయాల్లో పరిణామాలు మారనున్నాయి. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేకు దిల్లీ పెద్దల నుంచి పిలుపు వచ్చినట్లు సమాచారం. మరో గంటలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ దిల్లీకి చేరుకోనున్నారు. నేతలకు వరుసగా దిల్లీ నుంచి పిలుపులు రావడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ భేటీల అనంతరం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Gen Z పవర్.. జంతర్ మంతర్ లో వేడుకల హోరు!
Politics· 25 Jul 2026

Gen Z పవర్.. జంతర్ మంతర్ లో వేడుకల హోరు!

కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా వార్తతో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులు భారీగా వేడుకలు జరుపుకున్నారు. వేలాది మంది Gen Z విద్యార్థులు ఒకచోట చేరి డాన్సులు చేస్తూ, జాతీయ జెండాలు ఊపుతూ తమ సంతోషాన్ని పంచుకున్నారు. సుదీర్ఘ పోరాటం తర్వాత లభించిన ఈ విజయాన్ని స్టూడెంట్స్ పండగలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

ధర్మేంద్ర ప్రధాన్..గతంలోనూ వివిధ శాఖలు
Politics· 25 Jul 2026

ధర్మేంద్ర ప్రధాన్..గతంలోనూ వివిధ శాఖలు

విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్ గతంలో కేంద్రంలో వివిధ మంత్రిత్వ శాఖల్లో పనిచేశారు. పెట్రోలియం శాఖ, ఉక్కు శాఖ, నైపుణ్యాభివృద్ధి శాఖలకు మంత్రిగా ఉన్నారు. 2021 నుండి ఎడ్యుకేషన్ మినిస్టర్‌గా బాధ్యతలు చేపట్టి ఎన్టీఏ(NTA) మార్పులపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో నీట్ పరీక్షల ఏర్పాట్లపై వచ్చిన ఆరోపణలు ఆయన కెరీర్‌కు మచ్చగా మారాయి. తాజాగా ఆయన చేత రాజీనామా చేయించి సీజేపీ తన పోరాటానికి విజయాన్ని సాధించింది.

ఏబీవీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన ప్రధాన్
Politics· 25 Jul 2026

ఏబీవీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన ప్రధాన్

కొన్నాళ్లుగా దేశంలో ధర్మేంద్ర ప్రధాన్ పేరు వార్తల్లో నిలిచింది. ఆయన రాజీనామా చేయాలంటూ సీజేపీ దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టి, చివరకు సాధించింది. ధర్మేంద్ర ప్రధాన్ 1969 జూన్ 26న ఒడిశాలోని తాల్చేర్‌లో జన్మించారు. కళాశాలలో చదువుతున్నప్పుడే 1983లో ఏబీవీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 2000లో పల్లాహర నుండి ఎమ్మెల్యేగా గెలిచి, 2004లో డియోఘర్ నుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత బీజేవైఎం జాతీయ అధ్యక్షుడిగా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ముఖ్యమైన బాధ్యతలు చేపట్టారు.

ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్.. జంతర్ మంతర్ దగ్గర సెలబ్రేషన్స్!
Politics· 25 Jul 2026

ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్.. జంతర్ మంతర్ దగ్గర సెలబ్రేషన్స్!

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో విద్యార్థులు, CJP సభ్యులు పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ చేసుకున్నారు. మనం సాధించాం, ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేశారు అని అభిజిత్ మైక్‌లో ప్రకటిస్తూ సంతోషంతో నినాదాలు చేశారు. ఈ ప్రభుత్వంలో రాజీనామాలు ఉండవు అన్నవారికి సమాధానం చెప్పామని, పోరాడితే ఏదైనా సాధ్యమేనని స్పష్టం చేశారు.

బస్సులో యువతిపై లైంగిక వేధింపులు.. డ్రైవర్ రియాక్షన్
Crime· 25 Jul 2026

బస్సులో యువతిపై లైంగిక వేధింపులు.. డ్రైవర్ రియాక్షన్

బెంగళూరు పరిధిలో బీఎంటీసీ బస్సులో యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన జరిగింది. హెబ్బాల్ నుంచి మన్యతా టెక్ పార్క్ వైపు వెళ్తున్న బస్సులో ఈ ఘటన జరగగా.. యువతి ధైర్యంగా నిందితుడిని చితకబాదుతూ విషయాన్ని డ్రైవర్‌కు చెప్పింది. డ్రైవర్ ప్రవీణ్ వాహనాన్ని ఆపి ఆకతాయికి బుద్ధి చెప్పాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.

Gen Z విజయం.. సోనమ్ వాంగ్‌చుక్ సెన్సేషనల్ పోస్ట్!
Politics· 25 Jul 2026

Gen Z విజయం.. సోనమ్ వాంగ్‌చుక్ సెన్సేషనల్ పోస్ట్!

విద్యార్థుల సక్సెస్‌పై సోనమ్ వాంగ్‌చుక్ స్పందిస్తూ.. "ఇది పక్కా ప్రజాస్వామ్య విజయం" అని చెప్పారు. వీధుల్లో శాంతి, ఓర్పుతో పోరాడిన Gen Z విద్యార్థులకు, CJP కి బిగ్ కంగ్రాట్స్ చెప్తూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. భయాన్ని పక్కనపెట్టి దేశం నలుమూలల నుంచి నిలబడిన ప్రతి ఒక్కరిదే ఈ విక్టరీ అని అన్నారు. ప్రభుత్వం నుండి జవాబుదారీతనం సాధించాం, ఇక నెక్స్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో రిఫార్మ్స్ రావడమే టార్గెట్ అని స్పష్టం చేశారు.

భారత విద్యా వ్యవస్థ ఎలా నడుస్తుంది?
Infotainment· 25 Jul 2026

భారత విద్యా వ్యవస్థ ఎలా నడుస్తుంది?

భారతదేశంలో విద్యా వ్యవస్థ కేంద్ర–రాష్ట్రాల సమన్వయంతో కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానాలను రూపొందించి విద్యా ప్రమాణాలను నిర్ణయిస్తుంది. NCERT, CBSE, UGC వంటి సంస్థల ద్వారా విద్యావ్యవస్థను బలోపేతం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాలల నిర్వహణ, ఉపాధ్యాయుల నియామకం, రాష్ట్ర సిలబస్ అమలు వంటి బాధ్యతలు నిర్వహిస్తాయి. విద్య ప్రస్తుతం రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితా(Concurrent List)లో ఉండటంతో కేంద్రం, రాష్ట్రాలు కలిసి విద్యా వ్యవస్థను నడిపిస్తున్నాయి.

రాజీనామా చాలదు.. ₹1 కోటి ఇవ్వాల్సిందే!
Politics· 25 Jul 2026

రాజీనామా చాలదు.. ₹1 కోటి ఇవ్వాల్సిందే!

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై CJP నేత అభిజీత్ దీప్కే స్పందిస్తూ.. ఇది ప్రజాస్వామ్య విజయమని ప్రకటించారు. అయితే తమ పోరాటం ఇక్కడితో ఆగదని, పేపర్ లీక్స్ వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే జులై 20న విద్యార్థులపై లాఠీఛార్జ్ చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని, నమోదైన కేసులన్నీ ఉపసంహరించుకోవాలని స్పష్టం చేశారు.

తహసీల్దార్ కార్యాలయం ముట్టడి
TG· 25 Jul 2026

తహసీల్దార్ కార్యాలయం ముట్టడి

TG: రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని మొండి గౌరెల్లి గ్రామంలో అసైన్డ్ భూముల సేకరణపై రైతులు ఆందోళన చేపట్టారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట గ్రామ సర్పంచ్ కొలన్ రమాదేవి నేతృత్వంలో ధర్నా నిర్వహించారు. 677 ఎకరాలకు సర్వే చేసిన అధికారులు భూపరిహారంపై స్పష్టత ఇవ్వడం లేదని ఫైరయ్యారు. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా నకిలీలను ఏరి వేయకుండా అధికారులు ముందుకు వెళుతున్నారని ఆరోపించారు. నకిలీ లబ్ధిదారులను తొలగించి, భూ నష్టపరిహారంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

5వ అంతస్తు నుంచి దూకిన PG మెడికో
Crime· 25 Jul 2026

5వ అంతస్తు నుంచి దూకిన PG మెడికో

TG: హైదరాబాద్‌ శివారు నాగారంలో విషాద ఘటన చోటుచేసుకుంది. MBSS పూర్తి చేసి బెంగళూరు సమీపంలోని సిద్ధార్థ మెడికల్ కాలేజీలో PG (ఆప్తాల్మాలజీ) మొదటి సంవత్సరం చదువుతున్న దీక్షిత(26) అపార్ట్‌మెంట్ ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తీవ్ర గాయాలతో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇటీవలే సెలవులకు ఇంటికి వచ్చిన ఆమె ఈ నిర్ణయం తీసుకోవడం కుటుంబంలో తీవ్ర విషాదం నెలకుంది. చదువు ఒత్తిడి కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

CJPకి విజయం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
India· 25 Jul 2026

CJPకి విజయం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా

కాక్రోచ్ జనతా పార్టీ చేసిన ఉద్యమం ఫలించింది. యువత చేసిన పోరాటానికి కేంద్రం దిగొచ్చింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ప్రధాని మోదీకి పంపారు. తాను వ్యక్తిగత భేషజాలకు పోవడం లేదని, యువత ఆకాంక్షలను గౌరవిస్తున్నాని ఆ లేఖలో పేర్కొన్నారు. నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు.

నాకు టికెట్ ఇచ్చింది AICC.. రాజ్‌గోపాల్ కాదు
Politics· 25 Jul 2026

నాకు టికెట్ ఇచ్చింది AICC.. రాజ్‌గోపాల్ కాదు

TG: మునుగోడు MLA కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తుంగతుర్తి MLA మందుల సామెల్ తీవ్రంగా స్పందించారు. తనకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది AICC అని, రాజ్‌గోపాల్‌రెడ్డి కాదని స్పష్టం చేశారు. తాను రాజ్‌గోపాల్‌రెడ్డి కంటే ముందే కాంగ్రెస్‌లో చేరానని గుర్తుచేశారు. తన గెలుపుకు అన్ని వర్గాల ప్రజలే కారణమని, కేవలం ఒకే వర్గంతో రాజకీయాలు నడవవని అన్నారు. మునుగోడులో రాజ్‌గోపాల్‌రెడ్డిని గెలిపించేందుకు తన క్యాడర్ కూడా పనిచేసిందని, అయినా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని చెప్పారు.

రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని TUలో నిరసన
Education· 25 Jul 2026

రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని TUలో నిరసన

TG: నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లిలో ఉన్న తెలంగాణ యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద ABVP ఆధ్వర్యంలో నాయకులు నిరసన చేపట్టారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని CM రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనానికి యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకుని దిష్టిబొమ్మను స్వాధీనం చేసుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.11 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బకాయిలు విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, ప్రజాప్

పెరిగిన బంగారం ధరలు!
Business· 25 Jul 2026

పెరిగిన బంగారం ధరలు!

శనివారం బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్, విజయవాడల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.600 పెరిగి రూ.1,44,930 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ గోల్డ్ రేట్ రూ.550 పెరిగి రూ.1,32,850 కి చేరింది. మరోవైపు వెండి ధర కిలోకు ఏకంగా రూ.5,000 పెరిగి రూ.2,40,000 గా ఉంది. గోల్డ్, సిల్వర్ రేట్స్ మార్కెట్‌లో ఎప్పటికప్పుడు మారుతుంటాయి కాబట్టి షాపింగ్ చేసేముందు లైవ్ రేట్స్ చెక్ చేసుకోవడం మంచిది.

Perfect Match కోసం.. Loveలోకి AI ఎంట్రీ!
Technology· 25 Jul 2026

Perfect Match కోసం.. Loveలోకి AI ఎంట్రీ!

డేటింగ్ ప్రపంచంలో ఇప్పుడు AI కొత్త గేమ్ స్టార్ట్ చేసింది. Wavelength, Tinder, Bumble, Hinge లాంటి Appsలో AI bots.. మీ లైక్స్, ఇంట్రెస్ట్స్, పర్సనాలిటీ, లైఫ్‌స్టైల్ చూసి మీకు సూట్ అయ్యే పర్ఫెక్ట్ మ్యాచ్‌ని సజెస్ట్ చేస్తున్నాయి. అంతేకాదు.. ఫ్లర్టింగ్ టిప్స్, చాట్ స్టార్టర్స్, డేట్ ప్లానింగ్లో కూడా హెల్ప్ చేస్తున్నాయి. లవ్, ట్రస్ట్, కెమిస్ట్రీ లాంటి విషయాలను AI పూర్తిగా అర్థం చేసుకోలేదని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.

మహారాష్ట్రలో భారీ వర్షాలు.. తెలంగాణకు పెరుగుతున్న వరద
News· 25 Jul 2026

మహారాష్ట్రలో భారీ వర్షాలు.. తెలంగాణకు పెరుగుతున్న వరద

TG: మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నాసిక్ జిల్లాలోని సైకెడా ప్రాంతంలో వరద నీరు పంట పొలాలు, ఇళ్లను ముంచెత్తింది. అధికారులు జలాశయాల గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. జయక్వాడి ప్రాజెక్టు పూర్తిగా నిండితే తెలంగాణలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద నీళ్లు చేరనున్నాయి. మేడిగడ్డ బ్యారేజీ వద్ద ప్రస్తుతం సుమారు 1.15 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైంది.