Latest

పలాస విద్యుత్ శాఖ కార్యాలయంలో ఉద్యోగి ఆత్మహత్య
పలాస విద్యుత్ శాఖ కార్యాలయంలో అవుట్‌సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న సంతోష్ కుమార్(28) ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. కార్యాలయ టెర్రస్‌పై ఉన్న సోలార్ ప్యానెల్‌కు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంతోష్ ఆత్మహత్యకు కారణమేంటని కాశీబుగ్గ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఆ కామెంట్స్ వాక్ స్వాతంత్ర్యం కిందకు రావు: బాంబే హైకోర్టు
శ్రీరాముడి గురించి MIM నాయకుడు, తెలంగాణ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన అభ్యంతరకరమైన కామెంట్స్‌పై ఫైల్ అయిన కేసు కొట్టివేయాలని ఆయన వేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టు తిరస్కరించింది. ఒవైసీ 2011లో మహారాష్ట్రలోని నాందేడ్ ఎన్నికల ప్రసంగంలో ఈ కామెంట్స్ చేశారు. దీనిపై బీజేపీ ఎమ్మెల్యే టి.రాజా 2013లో కంప్లైంట్ చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతినేలా ఉన్న కామెంట్స్ వాక్ స్వాతంత్ర్యం కిందకు రావని కోర్టు అభిప్రాయపడింది. ఎమ్మెల్యేలు సాధారణ పౌరుల కంటే ఎక్కువ బాధ్యతగా ఉండాలని చెప్పింది.

జెండర్ పే గ్యాప్‌పై టాప్ హీరోయిన్స్ కామెంట్స్!
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో జెండర్ పే గ్యాప్‌పై సమంత, కృతి సనన్, దీపికా పదుకొణే, కంగనా రనౌత్ లాంటి టాప్ హీరోయిన్స్ ఓపెన్‌గా మాట్లాడారు. సమాన శ్రమ ఉన్నప్పుడు రెమ్యూనరేషన్‌లో ఈ డిఫరెన్స్ ఏంటని ప్రొడ్యూసర్లను ప్రశ్నించారు. ప్రస్తుతం టాప్ హీరోలకు ₹100 నుండి ₹300 కోట్లు ఇస్తుంటే, టాప్ హీరోయిన్లకు కేవలం ₹15 నుండి ₹30 కోట్లు మాత్రమే ఇస్తున్నారు. బాక్సాఫీస్ కలెక్షన్ల వల్లే ఈ తేడా అని నిర్మాతలు అంటున్నా, మహిళా ప్రధాన సినిమాలు సక్సెస్ అవుతుండటంతో రాబోయే రోజుల్లో ఈ గ్యాప్ తగ్గుతుందని ఆశిస్తున్నారు.

ప్రజా సమస్యలను పరిష్కరించండి
గద్వాల మండలంలో ప్రజల ఎదుర్కొంటున్న ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ.వెంకటస్వామి డిమాండ్ చేశారు. గద్వాల మండల MRO కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, ప్రజా సమస్యలపై తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు. గ్రామాలలో ప్రజలు ఎదుర్కొంటున్న విద్య, వైద్యరంగ, ఇతర సమస్యలపై సిపిఎం ఆధ్వర్యంలో అధ్యయనం చేసినట్టు తెలిపారు. వాటిని సత్వరం పరిష్కరించాలన్నారు.

హైదరాబాద్‌లో సెప్టెంబర్ 4న బిగ్ ఈవెంట్!
హైదరాబాద్ బుక్ ట్రస్ట్, బార్సి (BARC) సంస్థల ఆధ్వర్యంలో సెప్టెంబర్ 4న బంజారాహిల్స్ లమకాన్‌లో 'దళిత కథ ఎవరిది?' అనే స్పెషల్ ఈవెంట్ జరగనుంది. ఈ ప్రోగ్రామ్‌లో ఎం. సుగుణరావు రాసిన 'పునరుత్థానం' దళిత కథల పుస్తకావిష్కరణతో పాటు 'వెతుకులాట' అనే నాటకాన్ని ప్రదర్శించనున్నారు. ఆ తర్వాత గోగు శ్యామల, ఎం. సుగుణరావు, చరణ్ పరిమిలతో 'దళిత కథ అంటే ఏంటి?' అనే టాపిక్‌పై ప్యానెల్ డిస్కషన్ ఉండనుంది.

చికెన్ ముక్కల వివాదం..స్నేహితుడి హత్య
కర్ణాటక రాష్ట్రం బెలగావి జిల్లాలో ఒక పార్టీలో చికెన్ ముక్కలు ఎక్కువ తిన్నందుకు ఫ్రెండ్స్ మధ్య జరిగిన గొడవ హత్యకు కారణమైంది. యూపీకి చెందిన సీతారామ్ ముదలగి తాలూకాలోని హునష్యాల్ పీజీ గ్రామంలో ప్రియా స్టీల్ కంపెనీలో పని చేస్తున్నాడు. అతని స్నేహితుడు అరుణ్ కుమార్ కూడా అదే కంపెనీలో పని చేస్తున్నాడు. రాత్రి ఇద్దరూ కలిసి పార్టీ చేసుకున్నారు. ఒకరు చికెన్ ముక్కలు ఎక్కువ తిన్నారని గొడవ మొదలైంది. గొడవ తీవ్రమై అరుణ్ కుమార్ కత్తితో సీతారామ్ ఛాతీపై పొడిచాడు. హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు.

నేపాల్ వరదలు: సద్గురు కామెంట్స్!
నేపాల్ వరద బాధితులకు సద్గురు జగ్గీ వాసుదేవ్ రూ. 1 కోటి సాయం ప్రకటించారు. హిమాలయ ప్రాంతాల రక్షణ కోసం ఇండియా, చైనా, పాకిస్తాన్, నేపాల్, భూటాన్‌లతో ఒక స్పెషల్ బోర్డ్ ఏర్పాటు చేయాలని చెప్పారు. నేపాల్ ఒక్కటే ఈ డిజాస్టర్‌ను హ్యాండిల్ చేయలేదని, అన్ని దేశాలు కలవాలని పిలుపునిచ్చారు. కాగా, ఈ ఫ్లాష్ ఫ్లడ్స్‌లో ఈషా ఫౌండేషన్‌కు చెందిన 77 మంది టూరిస్టులు, 3 వాలంటీర్లు మిస్ అయ్యారు.

దేవదాయ భూముల రక్షణకు హెచ్చరిక బోర్డు
తాడేపల్లి మండలం గుండిమెడ గ్రామ పరిధిలోని దేవదాయ ధర్మాదాయశాఖకు చెందిన రూ.30 కోట్ల విలువైన భూముల పరిరక్షణకు అధికారులు చర్యలు చేపట్టారు. ఎండోమెంట్స్ ట్రిబ్యునల్‌లో కేసు తీర్పు పెండింగ్‌లో ఉండగానే కొందరు భూములను విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించారు. ఆర్.ఎస్. నంబర్లు 260/1, 260/2 లోని భూముల్లో ఎలాంటి క్రయవిక్రయాలు చేయకూడదని హెచ్చరిస్తూ అధికారులు బోర్డు ఏర్పాటు చేశారు. ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ప్రజావాణిలో 64 దరఖాస్తుల స్వీకరణ: కలెక్టర్
నాగర్‌కర్నూల్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ప్రజల నుంచి 64 ఫిర్యాదులు, వినతిపత్రాలు స్వీకరించారు. దరఖాస్తులను సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి నిబంధనల మేరకు సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం, జాప్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చెన్నయ్య, దేవసహాయం, డీఆర్వో పాండు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

వన్యప్రాణుల, పర్యావరణ పరిరక్షణపై కమిటీ సమావేశం
TG: తెలంగాణ శాసనసభ సచివాలయంలో 2026–27 సంవత్సరానికి ఏర్పాటు చేసిన వన్యప్రాణులు, పర్యావరణ పరిరక్షణ కమిటీ సమావేశం జరిగింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చైర్మన్‌గా ఉన్న కమిటీలో వన్యప్రాణుల సంరక్షణ, అటవీ పరిరక్షణ, పర్యావరణ సమతుల్యత, అడవుల అభివృద్ధిపై చర్చించారు. వన్యప్రాణులు, పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం చర్యలను మరింత బలోపేతం చేయాలని ఎమ్మెల్యేలు సూచించారు.

మంత్రిని కలిసిన షుగర్ ఫ్యాక్టరీ పరిరక్షణ సమితి ప్రతినిధులు
రేగిడి మండలం సంకిలి షుగర్ ఫ్యాక్టరీ పరిరక్షణ సమితి ప్రతినిధులు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని కలిశారు. చెరుకు రైతుల సమస్యను ఫ్యాక్టరీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఎల్ నినో ప్రభావం వల్ల 202-28 క్రాషింగ్ సీజన్‌ను మూసేస్తున్నట్టు సంకిలి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్ణయించడంతో రైతులు పడుతున్న ఇబ్బందిని వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి వెంటనే సంకిలి షుగర్ ఫ్యాక్టరీ జి.ఎంకు ఫోన్ చేసి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

కాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్ఎస్ కార్యక్రమాలు
కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ కార్యక్రమాలు చేపట్టనుంది. ఏడు రోజుల పాటు నియోజకవర్గవ్యాప్తంగా ప్రభుత్వ వైఫల్యాలపై కార్యక్రమాలు నిర్వహించాలని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళలు, విద్యార్థులు, రైతుల సమస్యలను ప్రధానంగా తీసుకుని గ్రామస్థాయి నుంచి నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

లోకేష్ విశాఖ పర్యటన- ఐద్వా నాయకుల నిర్బంధం
AP: విద్యాశాఖ మంత్రి లోకేష్ విశాఖ పర్యటన సందర్భంగా ఐద్వా నాయకులను హౌస్ అరెస్ట్లు చేశారు. మారకవలస గురుకుల పాఠశాల వివాదం నేపథ్యంలో మంత్రి లోకేష్ స్థానికంగా పర్యటించారు. ఈ గురుకుల పాఠశాల తరలించకూడదని ఐద్వా SFI, DYFI ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. నిన్న చంద్రబాబు పాడేరు పర్యటనలో ఈ పాఠశాల తరలింపుపై హామీ ఇచ్చి మళ్లీ యూటర్న్ తీసుకోవడంతో వివాదం మొదటికి వచ్చింది. దీంతో ఈ సంఘాల నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు.

ప్రభుత్వ పథకాలపై అపోహలు సృష్టిస్తున్నారు: ఎమ్మెల్యే
ప్రభుత్వ పథకాల విషయంలో ప్రతిపక్షాల నాయకులు లేనిపోని అపోహలు సృష్టించి ప్రజలను గందరగోళంలో పడేస్తున్నారని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. షాద్‌నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 150 మందికి రూ. 50 లక్షల విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను అందించారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల విషయంలో ఉన్న ఇబ్బందులను పరిష్కరించి, త్వరలోనే అందజేస్తామని హామీ ఇచ్చారు. పురపాలక చైర్మన్ బసవేశ్వర్, వైస్ చైర్మన్ అందె మోహన్ పాల్గొన్నారు.

భారీ వర్షంలో జార్ఖండ్ స్టూడెంట్స్ యాత్ర!
JSSC-JPSC రిక్రూట్‌మెంట్ సిస్టమ్‌లో మార్పులు తేవాలని డిమాండ్ చేస్తూ <a href="https://x.com/DevendraNathMa9/status/2094354224150954479?s=20">దేవేంద్ర నాథ్ మహతో</a> ఆధ్వర్యంలో చేపట్టిన యాత్ర దేవ్‌ఘర్ చేరుకుంది. భారీ వర్షం పడుతున్నప్పటికీ విద్యార్థులు, యువత వెనకడుగు వేయకుండా పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జార్ఖండ్ యువత తమ హక్కుల కోసం, రిక్రూట్‌మెంట్ వ్యవస్థలో మార్పులు సాధించే వరకు పోరాటం ఆపేది లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఉద్యోగాల భర్తీలో పారదర్శకత కోసం దేవ్‌ఘర్ వేదికగా యువత అంతా ఏకమై ప్రతిజ్ఞ చేశారు.

రూ.12 వేల కోట్ల స్కాలర్షిప్ ఫీజు బకాయిలు విడుదల చేయాలి
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న రూ.12 వేల కోట్ల స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సంగనమోని బంగారు బాబు డిమాండ్ చేశారు. నాగర్‌కర్నూల్‌లోని MRO కార్యాలయం ఎదుట ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ఆందోళన నిర్వహించారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. అనంతరం ఏబీవీపీ నాయకులు డిప్యూటీ MROకు వినతిపత్రం అందజేశారు.

నూతన కల్యాణ మండపం ప్రారంభం
విజయనగరం జిల్లా రాజాంలోని వాసవి కన్యకాపరమేశ్వరి కళింగ వైశ్య సంఘ సభ్యుల ఆధ్వర్యంలో కొత్త కల్యాణ మండపాన్ని ప్రారంభించారు. రాజాం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇంచార్జి డా. తలే రాజేష్ , రాజాం టౌన్ పార్టీ అధ్యక్షుడు పాలవలస శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో సంఘం మరింత అభివృద్ధి చెందాలని, సభ్యులందరూ ఐకమత్యంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

RSS చీఫ్ మాటలు వినండి: అభిజీత్ దిప్కే?
CJP ఫౌండర్ అభిజీత్ దిప్కే BJP నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. వరుసగా 12 ఏళ్లు అధికారంలో ఉండటంతో BJP నేతలు తమను తాము RSS కంటే పెద్దగా భావిస్తున్నారని కామెంట్స్ చేశారు. మోహన్ భగవత్ మాటలను కూడా BJP లీడర్లు వినడం లేదని, GenZ నిరసనకారులను దేశద్రోహులుగా చూడకూడదని భగవత్ చెబితే.. ప్రధానమంత్రి మాత్రం వారిని 'దిమాగీ నక్సల్స్' అని పిలవడం దారుణమన్నారు. తమ మాటలు వినకపోయినా, కనీసం BJP అధికారంలోకి రావడానికి కారణమైన మోహన్ భగవత్ సలహాలనైనా వినాలని ఆయన సలహా ఇచ్చారు.

డాక్టర్ల AI కూడా తప్పులు చేస్తుందా?
డాక్టర్లు వాడుతున్న AI టూల్స్ కూడా తప్పులు చేస్తున్నాయట. NHSలో డాక్టర్లతో మాట్లాడే సమయంలో నోట్స్ తయారు చేసే AI టూల్స్ కొన్ని మందుల పేర్లు, వ్యాధుల వివరాలను తప్పుగా రాస్తున్నట్టు Healthwatch England తాజా పరిశీలనలో గుర్తించింది. కొన్ని తప్పులను డాక్టర్లు గుర్తించకపోయినా.. పేషెంట్లు వాటిని గుర్తించిన సందర్భాలు కూడా ఉన్నాయి. AI నోట్స్ పని సులభం చేస్తున్నా.. వాటిని డాక్టర్లు తప్పనిసరిగా చెక్ చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.

మాలల ఛలో సెక్రటేరియట్ ఉద్రిక్తం
రోస్టర్ విధానాన్ని సవరించి మాలలకు 20 పాయింట్లలోపు రెండు రోస్టర్ పాయింట్లు కేటాయించాలని, జీవో నంబర్ 99ను రద్దు చేయాలని మాల సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన చలో సెక్రటేరియట్ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. నిరసనకారులు పోలీసుల నిర్బంధాలను అధిగమించి సెక్రటేరియట్ ముట్టడికి ప్రయత్నించడంతో పలువురిని పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. పోలీసుల తోపులాటలో జాతీయ అధికార ప్రతినిధి దార సత్యంకు గాయాలయ్యాయని, రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ అస్వస్థతకు గురయ్యారని నిర్వాహకులు తెలిపారు.

జాబ్ పోయింది.. ఆరు కోళ్లతో బిజినెస్ మొదలైంది!
Amazonలో జాబ్ పోయిన తర్వాత మళ్లీ మరో ఉద్యోగం వెతుక్కోవడమే సాధారణం. కానీ హైదరాబాద్‌కు చెందిన మారియా హర్షిత మాత్రం ఊహించని దారి ఎంచుకున్నారు. మార్చి 2026లో ఉద్యోగం కోల్పోయిన ఆమెకు వరుసగా జాబ్ రిజెక్షన్లు రావడంతో.. భర్తతో కలిసి ఆరు కోళ్లతో పెంపకం మొదలుపెట్టారు. తర్వాత కోళ్ల సంఖ్య పెరిగి గుడ్లు రావడంతో.. వాటిని అమ్మడం మొదలుపెట్టారు. అలా ఇంటి అవసరాల కోసం మొదలైన పని ఇప్పుడు చిన్న బిజినెస్‌గా మారింది. జాబ్ పోయినా కొత్తగా ఏదైనా మొదలుపెట్టొచ్చని ఆమె కథ చూపిస్తోంది.