← Back to news

దేవదాయ భూముల రక్షణకు హెచ్చరిక బోర్డు

By epuri rajaratnam· 4d ago
దేవదాయ భూముల రక్షణకు హెచ్చరిక బోర్డు

తాడేపల్లి మండలం గుండిమెడ గ్రామ పరిధిలోని దేవదాయ ధర్మాదాయశాఖకు చెందిన రూ.30 కోట్ల విలువైన భూముల పరిరక్షణకు అధికారులు చర్యలు చేపట్టారు. ఎండోమెంట్స్‌ ట్రిబ్యునల్‌లో కేసు తీర్పు పెండింగ్‌లో ఉండగానే కొందరు భూములను విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించారు. ఆర్‌.ఎస్‌. నంబర్లు 260/1, 260/2 లోని భూముల్లో ఎలాంటి క్రయవిక్రయాలు చేయకూడదని హెచ్చరిస్తూ అధికారులు బోర్డు ఏర్పాటు చేశారు. ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

More in Local