Latest

కార్గో షిప్స్ పై టోల్ ప్రపోజల్ వెనక్కి- ట్రంప్
హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే కార్గో షిప్్సపై 20%టోల్ ఫీజు కలెక్ట్ చేయాలనే ప్రపోజల్ ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విత్ డ్రా చేసుకున్నారు. గల్ఫ్ దేశాల నేతలతో చర్చల తర్వాత , టోల్ ఫీజుకు బదులుగా ఆయా దేశాలతో అమెరికాలో భారీ పెట్టుబడులు, వాణిజ్య ఒప్పందాలు చేసుకోనున్నట్లు ఆయన ప్రకటించారు. అమెరికా సైన్యం ఇచ్చే రక్షణకు ప్రతిఫలంగా గల్ఫ్ దేశాలు ఈ ఒప్పందాలకు అంగీకరించాయి.

RAW NTR సంస్థతో సంబంధం లేదు - ఎన్టీఆర్ టీమ్
జూనియర్ ఎన్టీఆర్ ఈనెల 18న రాజకీయ అరంగేట్రం చేస్తారంటూ వచ్చిన వార్తలను ఎన్టీఆర్ కార్యాలయం ఖండించింది. ఎన్టీఆర్ అభిమాన సంఘాల ద్వారా ముందు ప్రజా సేవ , సహాయ కార్యక్రమాలు ప్రారంభి స్తారంటూ RAW NTR అనే సంస్థ చేసిన ప్రకటనలకు తమకు సంబంధం లేదని జూనియర్ కార్యాలయం క్లారిటీ ఇచ్చింది.ఎన్టీఆర్ పేరుతో ప్రకటనలు చేయడానికి గానీ, కార్యక్రమాలు చేపట్టడానికి గానీ RAW NTRసంస్థకు ఎలాంటి అధికారాలు లేవని స్పష్టం చేసింది.ఎన్టీఆర్ కి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ అధికారిక టీమ్ ద్వారానే అనౌన్స్ అవుతాయని ప్రకటించింది.

ఢిల్లీలో ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ధరలు
ఢిల్లీ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఒక్క సారిగా భారీగా తగ్గాయి. స్థానిక జువెలర్స్, పారిశ్రామిక కొనుగోలుదారుల నుంచి డిమాండ్ తగ్గడమే దీనికి ప్రధాన కారణం. బంగారం 10 గ్రాములకు రూ. 700 తగ్గి, 99.9% స్వచ్ఛమైన బంగారం ధర రూ. 1,46,300 కి చేరింది. వెండి కిలోపై ఏకంగా రూ. 8,900 స్లంప్ అయి, రూ. 2,26,100 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో రేట్లు నిలకడగా ఉన్నప్పటికీ, స్థానిక మార్కెట్ ఒత్తిడి వల్ల ఈ ధరల తగ్గుదల నమోదైంది.

స్పేస్ లోకి దూసుకెళ్లిన భారత సంతతి ఆస్ట్రోనాట్ అనిల్ మీనన్ !
ఆస్ట్రోనాట్ డాక్టర్ అనిల్ మీనన్ తన తొలి స్పేస్ టూర్ ను విజయవంతంగా ప్రారంభించారు. కజకిస్తాన్‌లోని బైకనూర్ కాస్మోడ్రోమ్ నుండి ఇద్దరు రష్యా వ్యోమగాములతో కలిసి సోయుజ్ MS-29 నౌక ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) ఆయన దూసుకెళ్లారు. ఎనిమిది నెలల పాటు సాగే ఈ మిషన్‌లో భాగంగా ఆయన మైక్రోగ్రావిటీలో రక్త ప్రసరణ, అంతరిక్ష వైద్యం మరియు సెమీకండక్టర్ల తయారీపై కీలక పరిశోధనలు చేయనున్నారు.

CM రేవంత్ రెడ్డి ఓట్ వివాదం.. క్లారిటీ ఇచ్చిన EC!
CM రేవంత్ రెడ్డి ఓటర్ నమోదుపై వస్తున్న వార్తలపై ECI క్లారిటీ ఇచ్చింది. ఒకే EPIC నంబర్‌తో రెండు చోట్ల పేరు ఉండటం కేవలం సాంకేతిక లోపం మాత్రమేనని స్పష్టం చేసింది. దీనివల్ల రెండు చోట్లా ఓటు హక్కు ఉన్నట్లు కాదని DEO తెలిపారు. కొండారెడ్డిపల్లిలో ఓటును తొలగించి, కొడంగల్‌లో ఓటర్ నమోదును కొనసాగించాలని CM కుటుంబం కోరింది. SIR ప్రక్రియ ద్వారా ఇలాంటి డూప్లికేట్, పాత ఎంట్రీల గుర్తింపు, తొలగింపు ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోందని తెలంగాణ CEO పేర్కొన్నారు.

సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్షకు మాజీ CM సపోర్ట్!
ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయాలంటూ సోనమ్ వాంగ్చుక్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 17 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు, అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్న CJP నిరసనకారులకు గుజరాత్ Ex CM శంకర్‌సింగ్ వాఘేలా తన సంఘీభావం ప్రకటించారు. వాంగ్చుక్ పోరాటంలో తాను కూడా భాగస్వామిని అవుతున్నట్లు స్పష్టం చేశారు. ఈ మాజీ CM ఎంట్రీతో ఈ నిరసనపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుండగా, మరోవైపు వాంగ్చుక్ హెల్త్ కండిషన్‌పై అందరిలో తీవ్ర ఆందోళన మొదలైంది.
ఓటరు సవరణలో KTR.. ఫ్యామిలీతో కలిసి ఫామ్స్ సబ్మిట్!
ఓటర్ల జాబితా స్పెషల్ ఇన్ టెన్సివ్ రివిజన్ (SIR) డ్రైవ్‌లో భాగంగా, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR మంగళవారం ఆయన తన ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి ఓటు వివరాలను ఎన్యూమరేషన్ ఫారంలో నింపారు. అనంతరం ఆ పత్రాలను సంబంధిత అధికారులకు అందజేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటూ కీలకమేనని, అందుకే పౌరులంతా ఈ వెరిఫికేషన్ ప్రాసెస్‌లో యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేసి తమ ఓటు హక్కును భద్రపరుచుకోవాలని KTR పిలుపునిచ్చారు.

సింపుల్ వర్కౌట్.. షాకింగ్ హెల్త్ బెనిఫిట్స్!
స్కిప్పింగ్ వల్ల బాడీకి ఎన్నో అమేజింగ్ బెనిఫిట్స్ ఉన్నాయి. రోజువారీ స్కిప్పింగ్ వల్ల బాడీ కోఆర్డినేషన్ పెరగడమే కాకుండా, యాంకిల్ ఇంజూరీస్ రిస్క్ తగ్గుతుంది. ఇది మేజర్ క్యాలరీస్‌ను బర్న్ చేస్తూ వెయిట్ లాస్‌కు సూపర్ హెల్ప్ అవుతుంది. బోన్ డెన్సిటీ, బ్రీతింగ్ కెపాసిటీని ఇంప్రూవ్ చేయడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వీటన్నింటికీ మించి మెంటల్ హెల్త్‌ను బూస్ట్ చేసి స్ట్రెస్ తగ్గిస్తుంది. సో, ఈ సింపుల్ ఎక్సర్‌సైజ్‌ను మీ డైలీ రొటీన్‌లో యాడ్ చేసుకోండి.

బ్రేకింగ్: ముద్రగడ పద్మనాభం కన్నుమూత!
ప్రముఖ రాజకీయ నాయకుడు, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం (73) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్‌లోని సింధు హాస్పిటల్‌లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ముద్రగడ మృతి పట్ల AP, తెలంగాణ రాజకీయ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.

మహేష్ బాబు ఇంట పెళ్లి సందడి!
సూపర్‌స్టార్ మహేశ్ బాబు మేనల్లుడు, మాజీ MP గల్లా జయదేవ్ చిన్న కుమారుడు సిద్ధార్థ్ గల్లా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. తన కొరియన్ గర్ల్‌ఫ్రెండ్ హ్యే-ఇన్ కిమ్ తో సిద్ధార్థ్ ఎంగేజ్‌మెంట్ ఇటలీలో గ్రాండ్‌గా జరిగింది. ఇరు కుటుంబాల సమక్షంలో జరిగిన ఈ నిశ్చితార్ధ వేడుకకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నమ్రతా శిరోద్కర్ ఈ బ్యూటిఫుల్ పిక్స్‌ను షేర్ చేస్తూ కొత్త జంటకు బెస్ట్ విషెస్ చెప్పారు.

స్టాండప్ కమెడియాన్ సమయ్ రైనాకు భారీ జరిమానా
స్టాండప్ కమెడియాన్ సమయ్ రైనాకు రూ.10 లక్షల జరిమానా విధించారు. సమయ్ రైనా షో 'ఇండియాస్ గాట్ లేటెంట్' రెండవ సీజన్‌లో 'స్పైనల్ మస్కులర్ అట్రోఫి'(SMA)తో బాధపడుతున్న రెండు నెలల పసికందుకు రూ.16 కోట్ల ఇంజెక్షన్ అవసరమా అని మాట్లాడాడు. షోతోపాటు సమయ్ రైనాపై క్యూర్ SMA ఫౌండేషన్ పిటిషన్ వేయగా కోర్టు SMA బాధితులకు అండగా ఉండాలని ఆదేశించింది. తాను అండగా ఉన్నానని తప్పుడు వాంగ్మూలం ఇవ్వగా సుప్రీంకోర్టు అతనికి రూ.10 లక్షల జరిమానా విధించింది.

ఓటర్ల గడువు పొడిగింపు
AP: ఏపీలో ఓటర్ల లిస్ట్ సవరణ గడువు నేటితో ముగియనుండగా ఎలక్షన్ కమిషన్ గడువు తేదీని జులై 24 వరకు పొడిగించింది. కొన్ని చోట్ల ఇంకా పని పెండింగ్ ఉండటంతో ఏపీ ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ చేసిన రిక్వెస్ట్ మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త షెడ్యూల్ ప్రకారం జూలై 31న డ్రాఫ్ట్ ఓటర్ల లిస్ట్ వస్తుంది. ఆగస్టు 30 వరకు లిస్ట్‌పై అభ్యంతరాలు చెప్పొచ్చు. అక్టోబర్ 3న ఫైనల్ ఓటర్ల లిస్ట్ రిలీజ్ చేస్తారు.

కడియం శ్రీహరిపై ఢిల్లీకి చేరిన కొండా సురేఖ ఫిర్యాదు!
తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, స్టేషన్ ఘన్‌పూర్ MLA కడియం శ్రీహరిల మధ్య గ్యాప్ మరింత పెరిగింది. తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ కడియం వివాదాల్లోకి లాగుతున్నారంటూ పార్టీ స్టేట్ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌కు సురేఖ కంప్లైంట్ చేశారు. ఆల్రెడీ CM రేవంత్, PCC చీఫ్‌లకు కంప్లైంట్ చేసిన సురేఖ, రీసెంట్ గా ఢిల్లీ లెవెల్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ ఇష్యూ హాట్ టాపిక్‌గా మారింది. అయితే చిన్న విషయాలను లైట్ తీసుకోవాలని సురేఖకు నటరాజన్ సజెస్ట్ చేశారు.
ప్రశ్న రావణ్ కేసు: సగం విజయం సాధించాం!
యూట్యూబర్ రావణ్ కేసులో సగం విజయం దక్కిందని ఆయన తరఫు లాయర్ పొన్నవోలు సుధాకర్ సంచలన కామెంట్స్ చేశారు. రావణను శుక్రవారం ట్రయల్‌కు హాజరుపరచాలంటూ అపోజిషన్ వేసిన పిటిషన్‌ను వారే వెనక్కి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. పాత పిటిషన్‌తో లాభం లేదని గ్రహించే ఈ కొత్త పిటిషన్ డ్రామాలు ఆడుతున్నారని, తన కెరీర్‌లో ఇలా పిటిషన్ వేసి, ఆర్గ్యుమెంట్స్ అయ్యాక విత్ డ్రా చేసుకోవడం ఇదే ఫస్ట్ టైమ్ అని ఆయన సెటైర్స్ వేశారు. త్వరలోనే పూర్తి విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు.

CM విజయ్ కోసం వెనక్కి తగ్గిన కొడుకు!
తమిళనాడు CM విజయ్ కొడుకు జాసన్ సంజయ్ డైరెక్టర్‌గా పరిచయమవుతున్న ఫస్ట్ సినిమా ‘సిగ్మా’ రిలీజ్ పోస్ట్‌పోన్ అయినట్లు టాక్. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీని జూలై 31న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ విజయ్ మోస్ట్ అవేటెడ్ మూవీ ‘జన నాయగన్’ జూలై 24న వస్తుండటంతో, తండ్రి సినిమాకు లైన్ క్లియర్ చేయడానికి సంజయ్ తన సినిమాను ఆగస్టుకు వాయిదా వేసుకున్నట్లు సమాచారం. మరోవైపు సంజయ్ త్వరలోనే హీరోగా కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు కోలీవుడ్‌లో న్యూస్ వైరల్ అవుతోంది.

సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
తమిళనాడు ప్రభుత్వ వైద్య కేంద్రాల్లో 'అవుట్ పేషెంట్' నమోదు, అపాయింట్‌మెంట్‌లను వేగంవంతం చేసేందుకు సీఎం విజయ్ కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. 'నలం టిఎన్' అనే సమగ్ర డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను ఈరోజు ప్రారంభించారు. 9619222999 నంబర్‌తో ఏఐ వాట్సాప్ చాట్‌బాట్‌కు ‘Hi’ అని మెసేజ్ పంపితే బుకింగ్ ప్రక్రియ ప్రారంభించవచ్చని, దీంతో హాస్పిటల్లో క్యూల్లో నిలబడాల్సిన అవసరం ఉండదని వెల్లడించారు. చెన్నై, చెంగల్‌పట్టుతో సహా 22 జిల్లాల్లో ఈ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ పైలట్ ప్రాతిపదికన అందుబాటులో ఉందని ప్రభుత్వం తెలిపింది.
ఆస్ట్రేలియాలో భారతీయ ట్రక్ డ్రైవర్లపై జాత్యహంకారం
ఆస్ట్రేలియాలో భారతీయ ట్రక్ డ్రైవర్లను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విద్వేష వ్యాఖ్యలు చేసిన ఆడియో వైరల్‌గా మారింది. "భారతీయులను చంపాలి.. మహిళలను బానిసలుగా అమ్మాలి" వంటి వ్యాఖ్యలు తీవ్ర ఆగ్రహానికి దారితీశాయి. కొంతమంది డ్రైవర్లు రోజూ జాత్యహంకారాన్ని ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. భద్రత కోసం ఉపయోగించే UHF రేడియోలను కూడా చాలామంది ఆఫ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనపై భారతీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

హీరో నాని మూవీ మళ్లీ వాయిదా?
నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ది ప్యారడైజ్’ రిలీజ్ డేట్ మళ్లీ మారినట్లు టాక్. షూటింగ్ పెండింగ్ ఉండటం, ప్రమోషన్స్‌కి టైమ్ లేకపోవడంతో ఈ సినిమాను సెప్టెంబర్ 24కు వాయిదా వేసినట్లు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. గతంలో మార్చి, ఆ తర్వాత ఆగస్టు 21న రిలీజ్ అనుకున్నా కుదరలేదు. ఇందులో నాని ‘జడల్’ అనే పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో నటిస్తున్నారు. అయితే ఈ పోస్ట్‌పోన్‌పై మేకర్స్ నుండి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.
నాగ్-సామ్ పాత యాడ్స్.. కొత్త మీమ్ వైరల్!
నాగార్జున, సమంత నటించిన పాత డిటర్జెంట్ యాడ్స్‌ను కలిపి నెటిజన్లు ఫన్నీ వీడియో రూపొందించారు. "ఇక్కడే గొడవ మొదలైనట్టువుంది" అనే క్యాప్షన్‌తో ఈ మీమ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో సరదాగా చేసిందని, వారి వ్యక్తిగత జీవితంతో ఎలాంటి సంబంధం లేదని తెలుస్తోంది.

ఈ వారం OTTలో వినోదాల జాతర
జూలై 13 నుంచి 18 వరకు ఓటీటీ ప్రేక్షకులకు వినోదాల పండుగ కానుంది. ఈ వారం తెలుగు చిత్రం 'మా ఇంటి బంగారం'తో పాటు ఇతర భాషల సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, జీ5, ప్రైమ్ వీడియో వేదికలపై రొమాంటిక్, థ్రిల్లర్, ఫ్యామిలీ డ్రామా, హారర్, కొరియన్ ఫాంటసీ కంటెంట్ విడుదల కానుంది. 'ది ఈస్ట్ ప్యాలెస్', 'ది డెవిల్', 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు', 'హార్ట్‌స్టాపర్ ఫరెవర్', 'రెడీ ఆర్ నాట్ 2' వంటి చిత్రాలు, సిరీస్‌లు ప్రేక్షకులను అలరించనున్నాయి. రమ్యకృష్ణ హోస్ట్‌గా 'సెకండ్ లవ్' రియాలిటీ షో కూడా ఈ వారమే స్ట్రీమింగ్ కానుంది.

కేతన్ హత్య..మోదీకి తల్లి లేఖ
పూణెలో జరిగిన రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలంటూ అతని తల్లి రాఖీ అగర్వాల్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. పెళ్లి ఇష్టం లేని కాబోయే భార్య సియా గోయల్ తన ప్రియుడితో కలిసి కేతన్‌ను లోహగడ్ కోటపై నుండి తోసి హత్య చేసిన సంగతి తెలిసిందే. తనకు సానుభూతి వద్దని, కేసు ఇన్వెస్టిగేషన్‌ను వేగవంతం చేసి చట్టప్రకారం న్యాయం చేయాలని ఆమె కోరారు. కొడుకు మరణంతో తమ ఫ్యామిలీ మొత్తం రోడ్డున పడిందని లేఖలో తెలిపారు.