← Back to news

CM రేవంత్ రెడ్డి ఓట్ వివాదం.. క్లారిటీ ఇచ్చిన EC!

By sahani· 14 Jul 2026· Telangana
CM రేవంత్ రెడ్డి ఓట్ వివాదం.. క్లారిటీ ఇచ్చిన EC!

CM రేవంత్ రెడ్డి ఓటర్ నమోదుపై వస్తున్న వార్తలపై ECI క్లారిటీ ఇచ్చింది. ఒకే EPIC నంబర్‌తో రెండు చోట్ల పేరు ఉండటం కేవలం సాంకేతిక లోపం మాత్రమేనని స్పష్టం చేసింది. దీనివల్ల రెండు చోట్లా ఓటు హక్కు ఉన్నట్లు కాదని DEO తెలిపారు. కొండారెడ్డిపల్లిలో ఓటును తొలగించి, కొడంగల్‌లో ఓటర్ నమోదును కొనసాగించాలని CM కుటుంబం కోరింది. SIR ప్రక్రియ ద్వారా ఇలాంటి డూప్లికేట్, పాత ఎంట్రీల గుర్తింపు, తొలగింపు ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోందని తెలంగాణ CEO పేర్కొన్నారు.

More in Politics