Latest

CM విజయ్ కోసం వెనక్కి తగ్గిన కొడుకు!
Cinema· 14 Jul 2026

CM విజయ్ కోసం వెనక్కి తగ్గిన కొడుకు!

తమిళనాడు CM విజయ్ కొడుకు జాసన్ సంజయ్ డైరెక్టర్‌గా పరిచయమవుతున్న ఫస్ట్ సినిమా ‘సిగ్మా’ రిలీజ్ పోస్ట్‌పోన్ అయినట్లు టాక్. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీని జూలై 31న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ విజయ్ మోస్ట్ అవేటెడ్ మూవీ ‘జన నాయగన్’ జూలై 24న వస్తుండటంతో, తండ్రి సినిమాకు లైన్ క్లియర్ చేయడానికి సంజయ్ తన సినిమాను ఆగస్టుకు వాయిదా వేసుకున్నట్లు సమాచారం. మరోవైపు సంజయ్ త్వరలోనే హీరోగా కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు కోలీవుడ్‌లో న్యూస్ వైరల్ అవుతోంది.

సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
Politics· 14 Jul 2026

సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం

తమిళనాడు ప్రభుత్వ వైద్య కేంద్రాల్లో 'అవుట్ పేషెంట్' నమోదు, అపాయింట్‌మెంట్‌లను వేగంవంతం చేసేందుకు సీఎం విజయ్ కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. 'నలం టిఎన్' అనే సమగ్ర డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను ఈరోజు ప్రారంభించారు. 9619222999 నంబర్‌తో ఏఐ వాట్సాప్ చాట్‌బాట్‌కు ‘Hi’ అని మెసేజ్ పంపితే బుకింగ్ ప్రక్రియ ప్రారంభించవచ్చని, దీంతో హాస్పిటల్లో క్యూల్లో నిలబడాల్సిన అవసరం ఉండదని వెల్లడించారు. చెన్నై, చెంగల్‌పట్టుతో సహా 22 జిల్లాల్లో ఈ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ పైలట్ ప్రాతిపదికన అందుబాటులో ఉందని ప్రభుత్వం తెలిపింది.

ఆస్ట్రేలియాలో భారతీయ ట్రక్ డ్రైవర్లపై జాత్యహంకారం
World· 14 Jul 2026

ఆస్ట్రేలియాలో భారతీయ ట్రక్ డ్రైవర్లపై జాత్యహంకారం

ఆస్ట్రేలియాలో భారతీయ ట్రక్ డ్రైవర్లను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విద్వేష వ్యాఖ్యలు చేసిన ఆడియో వైరల్‌గా మారింది. "భారతీయులను చంపాలి.. మహిళలను బానిసలుగా అమ్మాలి" వంటి వ్యాఖ్యలు తీవ్ర ఆగ్రహానికి దారితీశాయి. కొంతమంది డ్రైవర్లు రోజూ జాత్యహంకారాన్ని ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. భద్రత కోసం ఉపయోగించే UHF రేడియోలను కూడా చాలామంది ఆఫ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనపై భారతీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

హీరో నాని మూవీ మళ్లీ వాయిదా?
Cinema· 14 Jul 2026

హీరో నాని మూవీ మళ్లీ వాయిదా?

నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ది ప్యారడైజ్’ రిలీజ్ డేట్ మళ్లీ మారినట్లు టాక్. షూటింగ్ పెండింగ్ ఉండటం, ప్రమోషన్స్‌కి టైమ్ లేకపోవడంతో ఈ సినిమాను సెప్టెంబర్ 24కు వాయిదా వేసినట్లు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. గతంలో మార్చి, ఆ తర్వాత ఆగస్టు 21న రిలీజ్ అనుకున్నా కుదరలేదు. ఇందులో నాని ‘జడల్’ అనే పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో నటిస్తున్నారు. అయితే ఈ పోస్ట్‌పోన్‌పై మేకర్స్ నుండి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

నాగ్-సామ్ పాత యాడ్స్.. కొత్త మీమ్ వైరల్!
Cinema· 14 Jul 2026

నాగ్-సామ్ పాత యాడ్స్.. కొత్త మీమ్ వైరల్!

నాగార్జున, సమంత నటించిన పాత డిటర్జెంట్ యాడ్స్‌ను కలిపి నెటిజన్లు ఫన్నీ వీడియో రూపొందించారు. "ఇక్కడే గొడవ మొదలైనట్టువుంది" అనే క్యాప్షన్‌తో ఈ మీమ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో సరదాగా చేసిందని, వారి వ్యక్తిగత జీవితంతో ఎలాంటి సంబంధం లేదని తెలుస్తోంది.

ఈ వారం OTTలో వినోదాల జాతర
Cinema· 14 Jul 2026

ఈ వారం OTTలో వినోదాల జాతర

జూలై 13 నుంచి 18 వరకు ఓటీటీ ప్రేక్షకులకు వినోదాల పండుగ కానుంది. ఈ వారం తెలుగు చిత్రం 'మా ఇంటి బంగారం'తో పాటు ఇతర భాషల సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కానున్నాయి. నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, జీ5, ప్రైమ్ వీడియో వేదికలపై రొమాంటిక్, థ్రిల్లర్, ఫ్యామిలీ డ్రామా, హారర్, కొరియన్ ఫాంటసీ కంటెంట్ విడుదల కానుంది. 'ది ఈస్ట్ ప్యాలెస్', 'ది డెవిల్', 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు', 'హార్ట్‌స్టాపర్ ఫరెవర్', 'రెడీ ఆర్ నాట్ 2' వంటి చిత్రాలు, సిరీస్‌లు ప్రేక్షకులను అలరించనున్నాయి. రమ్యకృష్ణ హోస్ట్‌గా 'సెకండ్ లవ్' రియాలిటీ షో కూడా ఈ వారమే స్ట్రీమింగ్ కానుంది.

కేతన్ హత్య..మోదీకి తల్లి లేఖ
India· 14 Jul 2026

కేతన్ హత్య..మోదీకి తల్లి లేఖ

పూణెలో జరిగిన రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలంటూ అతని తల్లి రాఖీ అగర్వాల్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. పెళ్లి ఇష్టం లేని కాబోయే భార్య సియా గోయల్ తన ప్రియుడితో కలిసి కేతన్‌ను లోహగడ్ కోటపై నుండి తోసి హత్య చేసిన సంగతి తెలిసిందే. తనకు సానుభూతి వద్దని, కేసు ఇన్వెస్టిగేషన్‌ను వేగవంతం చేసి చట్టప్రకారం న్యాయం చేయాలని ఆమె కోరారు. కొడుకు మరణంతో తమ ఫ్యామిలీ మొత్తం రోడ్డున పడిందని లేఖలో తెలిపారు.

తల్లీబిడ్డల అనుమానాస్పద మృతి
Crime· 14 Jul 2026

తల్లీబిడ్డల అనుమానాస్పద మృతి

AP: వినుకొండ మండలం విఠంరాజుపల్లిలో అదనపు కట్నం వేధింపుల కారణంగా ఒకే ఇంట్లో ముగ్గురు అనుమానాస్పదంగా మృతి చెందారు. భారతి(24) అనే మహిళతోపాటు ఆమె కుమారులు తేజేష్ రెడ్డి(6), హేమనాథ నాగిరెడ్డి(4) చనిపోయి పడి ఉన్నారు. పెళ్లయినప్పటి నుంచి భర్త, అత్తమామలు కట్నం కోసం ఆమెను వేధిస్తున్నట్లు సమాచారం. మంచంపై ఉన్న ఇద్దరు పిల్లలను ఊపిరాడకుండా చేసి చంపి, భారతి ఉరివేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మేనమామ కంప్లైంట్‌తో పోలీసులు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.

టెట్ ఫలితాల్లో ప్రభుత్వ టీచర్లు ఫెయిల్
TG· 14 Jul 2026

టెట్ ఫలితాల్లో ప్రభుత్వ టీచర్లు ఫెయిల్

TG: నిన్న విడుదలైన తెలంగాణ టెట్ ఫలితాల్లో ప్రభుత్వ టీచర్లు 37.29 శాతం అర్హత సాధించారు. పరీక్షకు హాజరైన 23,623 వేల మంది ఉపాధ్యాయుల్లో 14,814 వేల మంది ఫెయిలయ్యారు. ఆగస్ట్‌లోపు టెట్‌లో ఉత్తీర్ణత సాధించపోతే వారి ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది. దీంతో ఇన్ సర్వీస్ టీచర్లలో టెన్షన్ మొదలైంది.

వాహనాలలో రక్షణగా ట్రాకింగ్ డివైజర్లు
Infotainment· 14 Jul 2026

వాహనాలలో రక్షణగా ట్రాకింగ్ డివైజర్లు

ఊరెళ్ళడానికి జీపు, మినీ బస్సు లాంటి వాహనాల్లో ప్రయాణిస్తుంటే అందులో ప్రయాణికులు ఎక్కువగా లేకపోయినా..వాహన సిబ్బంది ప్రవర్తన ఇబ్బందిగా ఉన్నా టెన్షన్‌గా ఫీలవుతాం. ఆ టైంలో పోలీసులు, రవాణాశాఖ అధికారులను అప్రమత్తం చేయడానికి వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైజర్ ఉపయోగపడుతుంది. దాన్ని నొక్కితే పోలీసులకు, రవాణాశాఖ అధికారులకు తెలిసి, వారిని అప్రమత్తం చేస్తుంది.

లూలూ మాల్‌లో గన్ కలకలం
TG· 14 Jul 2026

లూలూ మాల్‌లో గన్ కలకలం

TG: హైదరాబాద్‌లోని KPHBలోని లూలూమాల్‌లో తుపాకీతో ఒక వ్యక్తి హల్‌చల్ చేశాడు. ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పార్కింగ్ స్థలంలో రెండు కుటుంబాల మధ్య వచ్చిన వివాదంలో ఒకరి వద్ద గన్ ఉండటంతో మాల్‌లోని కస్టమర్లు టెన్షన్ పడ్డారు. జూలై 12న రెండు కుటుంబాలకు మధ్య వాగ్వాదం జరిగింది. మహ్మద్ సిద్దిఖీ అనే వ్యక్తి జేబులో తుపాకీ ఉండటాన్ని గమనించిన ఓ కస్టమర్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సిద్ధిఖీని అదుపులోకి తీసుకున్నారు. భద్రతా నిబంధనలను ఉల్లంఘించినందుకు లూలూమాల్‌పై కేసు నమోదు చేశారు.

సోనమ్ వాంగ్‌చుక్ దీక్షపై AAP MP పవర్‌ఫుల్ పోస్ట్!
Education· 14 Jul 2026

సోనమ్ వాంగ్‌చుక్ దీక్షపై AAP MP పవర్‌ఫుల్ పోస్ట్!

సోనమ్ వాంగ్‌చుక్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష 17వ రోజుకు చేరింది. దీనిపై AAP MP సంజయ్ సింగ్ రియాక్ట్ అవుతూ, PM మోదీ, మీడియా మౌనాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. X ప్లాట్‌ఫామ్‌లో ఒక పవర్‌ఫుల్ పోయం షేర్ చేస్తూ, "పోరాటం ఇంకా ముగియలేదు, ఈ టైమ్‌లో సైలెంట్‌గా ఉండేవాళ్లు కూడా దోషులే" అని విమర్శించారు. ఆయన ప్రాణాలకేదైనా రిస్క్ వచ్చే వరకు వెయిట్ చేస్తున్నారా అంటూ ఘాటుగా ప్రశ్నించారు.

HMDA చీఫ్ ఇంజినీర్ ఇంట్లో ACB దాడులు
TG· 14 Jul 2026

HMDA చీఫ్ ఇంజినీర్ ఇంట్లో ACB దాడులు

TG: హైదరాబాద్‌లో HMDA చీఫ్ ఇంజినీర్ రవీందర్ ఇంట్లో ACB అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని ఆరోపణలు రావడంతో అధికారులు ఆయన ఇల్లు, కార్యాలయం, సన్నిహితుల ఇళ్లలోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. నగరంలో 15 ప్రాంతాల్లో ఒకేసారి సోదాలు చేపట్టారు. ఇప్పటికే ఆయన ఇంట్లో నోట్ల కట్టలు, వివిధ ఆస్తి పత్రాలు గుర్తించినట్లు సమాచారం. ఇటీవల DSP భీమ్ రెడ్డి అక్రమాస్తులకు సంబంధించి సోదాల సమయంలో సుమారు రూ.300 కోట్లకు పైగా ఆస్తులు, పెట్టుబడులు, బంగారు నగలు, నగదు బయటపడిన సంగతి తెలిసిందే.

కేజ్రీవాల్ సంచలన ట్వీట్!
Politics· 14 Jul 2026

కేజ్రీవాల్ సంచలన ట్వీట్!

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద లడఖ్ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు అరవింద్ కేజ్రీవాల్ మద్దతు ప్రకటించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. "వాంగ్‌చుక్ గారు, మీరు దేశానికి ఒక హెరిటేజ్. దయచేసి మీ హంగర్ స్ట్రైక్ ముగించండి" అని కేజ్రీవాల్ రిక్వెస్ట్ చేశారు. అలాగే, జూలై 16 సాయంత్రం 5 గంటలకు స్వయంగా జంతర్ మంతర్‌కు వెళ్లి వాంగ్‌చుక్‌ను కలిసి తన సపోర్ట్ అందిస్తానని ట్విట్టర్ (X)లో ట్వీట్ చేశారు.

అమెరికా శాస్త్రవేత్తల ఘనత
Science· 14 Jul 2026

అమెరికా శాస్త్రవేత్తల ఘనత

అమెరికా శాస్త్రవేత్తలు రసాయనాలతో 'స్పుద్‌సెల్‌' అనే సజీవ కృత్రిమ కణాన్ని సృష్టించారు. ఇది ఆహారం తీసుకుంటూ ఐదు తరాల వరకు కణ విభజన చెందగలదు. 90 కేబీపీ చిన్న జీనోమ్‌ కలిగిన ఈ కణానికి జీవభద్రత ముప్పులు లేవు. భవిష్యత్తులో ఈ సాంకేతికత ద్వారా క్యాన్సర్ వంటి వ్యాధులకు సమర్థవంతమైన ఔషధాల తయారీ, పారిశ్రామిక రసాయనాల ఉత్పత్తి, బయోఎకానమీ బలోపేతానికి మార్గం సులువు కానుంది.

జాతీయ పక్షికి అరుదైన గౌరవంతో వీడ్కోలు
Viral· 14 Jul 2026

జాతీయ పక్షికి అరుదైన గౌరవంతో వీడ్కోలు

ఢిల్లీ నరేలా పార్కులో కుక్కల దాడిలో మరణించిన జాతీయ పక్షి నెమలికి పోలీసులు అరుదైన గౌరవం కల్పించారు. ఎస్‌ఐ సురేంద్ర మాలిక్ బృందం నెమలి కళేబరాన్ని జాతీయ జెండాతో చుట్టారు. స్థానికుల సాయంతో పార్కులోనే నెమలికి అంత్యక్రియలు నిర్వహించారు. రాత్రి విధుల్లో ఉంటూనే మూగజీవి పట్ల పోలీసులు చూపిన మానవత్వానికి సంబంధించిన వీడియో నెట్‌లో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి.

గ్రామాల్లో పన్ను..ఏకంగా రూ.1200
TG· 14 Jul 2026

గ్రామాల్లో పన్ను..ఏకంగా రూ.1200

TG: గ్రామ పంచాయతీలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు, గ్రామాల్లో హోల్డింగ్ పన్ను, ఇతర స్థానిక పన్నులను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ ప్రతిపాదన కింద ప్రతి ఇంటి నుండి రూ.1200 పన్ను వసూలు చేస్తారు. దీంతో గ్రామాల్లో తాగునీరు, పారిశుద్ధ నిర్వహణ, వీధి దీపాలలాంటి సౌకర్యాలు కల్పిస్తారు. ఇప్పటికే ఏడాదికి రూ.100 నుండి రూ.300 ఇంటి పన్ను ఉండగా, ఒక్కసారిగా రూ.1200 వరకు పెంచితే ప్రజల నుండి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మార్పులు చేయనుంది.

నోటి పుండ్లు ఎందుకు వస్తాయి?
Health· 14 Jul 2026

నోటి పుండ్లు ఎందుకు వస్తాయి?

ఒంటి మీద పుండునే తట్టుకోలేం! ఇక నోట్లో పుండ్లను భరించగలమా? ఇవి పెదవులు, బుగ్గల లోపల తెల్లగా, గుండ్రగా మొదలై వాటి నుండి రక్తం కూడా వస్తుంది. కారం, ఉప్పు, పులుపు దానికి తగిలితే ఆ నొప్పి భరించలేం. ఇవి రావడానికి ముఖ్యంగా పొగతాగడం, ఎక్కువ కారం, పులుపు ఉన్న పదార్థాలు తీసుకోవడం, దంతాల చికిత్స (ఎత్తు పళ్ళను సరిచేసేందుకు పెట్టె బ్రెసెస్ సరిగ్గా పట్టకపోవడం), నొప్పి మందులు తరచుగా వాడడం కారణాలు.

హోర్ముజ్ జలసంధిలో దాడి..భారత నౌకదళా సిబ్బంది మృతి
World· 14 Jul 2026

హోర్ముజ్ జలసంధిలో దాడి..భారత నౌకదళా సిబ్బంది మృతి

హోర్ముజ్ జలసంధిలో యూఏఈకి చెందిన రెండు చమురు ట్యాంకర్లపై ఇరాన్ క్షిపణి దాడి చేసింది. ఈ ఘటనలో ఓ భారతీయ నౌకదళా సిబ్బందిలో ఒకరు మృతి చెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెంచిన ఈ ఘటనపై అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది.

సోనమ్ వాంగ్‌చుక్ ప్రాణాలు పోతున్నా.. గవర్నమెంట్ సైలెంట్!
Education· 14 Jul 2026

సోనమ్ వాంగ్‌చుక్ ప్రాణాలు పోతున్నా.. గవర్నమెంట్ సైలెంట్!

ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలని సోనమ్ వాంగ్‌చుక్ చేస్తున్న నిరాహార దీక్ష 17వ రోజుకు చేరింది. సుదీర్ఘ ఉపవాసం వల్ల ఆయన కండరాల క్షీణతతో తీవ్ర నొప్పితో బాధపడుతున్నారు. దీక్ష ఆపాలని CJP ఫౌండర్ అభిజిత్ దీప్కేతో పాటు అందరూ రిక్వెస్ట్ చేయగా, "నన్ను దీక్ష ఆపమని అడగొద్దు, చర్చలు జరపడానికి కూడా సిద్ధంగా లేని ప్రభుత్వాన్ని ప్రశ్నించండి" అంటూ ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం సోనమ్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. సోషల్ మీడియాలో నెటిజన్లు ఆయనకు సపోర్ట్‌గా పోస్టులు పెడుతున్నారు.

అమెరికా ఆంక్షల మధ్య యథావిధిగా ఇరాన్ చమురు ఎగుమతులు
World· 14 Jul 2026

అమెరికా ఆంక్షల మధ్య యథావిధిగా ఇరాన్ చమురు ఎగుమతులు

అమెరికా 60 రోజుల ఆంక్షల మినహాయింపును రద్దు చేసినప్పటికీ ఇరాన్ చమురు ఎగుమతులు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగుతాయని ఆ దేశ ఇంధనశాఖ మంత్రి మొహ్సెన్ పాక్‌నెజాద్ తెలిపారు. ఆంక్షలను ఎదుర్కొనే వ్యవస్థ ఇప్పటికే రెడీగా ఉండటంతో ఎగుమతులపై ప్రభావం ఉండదని స్పష్టం చేశారు.