Latest

ఖమేనీ అంత్యక్రియలు: ఆ ‘మాస్క్ మ్యాన్’ మిస్టరీ వీడింది!
World· 13 Jul 2026

ఖమేనీ అంత్యక్రియలు: ఆ ‘మాస్క్ మ్యాన్’ మిస్టరీ వీడింది!

ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల్లో బ్లాక్ మాస్క్, క్యాప్ ధరించి మొదటి వరుసలో కూర్చున్న మిస్టరీ వ్యక్తి ఎవరనేది ఎట్టకేలకు తేలింది. ఆయన ఖమేనీ పెద్ద మనవడు మహ్మద్ జవాద్ ఖమేనీ అని ఇరాన్ ఇంటర్నేషనల్ మీడియా వెల్లడించింది. ఖమేనీ వారసుడిగా భావిస్తున్న ఆయన కుమారుడు మోజ్తబానే ఆ మాస్క్ మ్యాన్ అని మొదట ప్రచారం జరిగింది. కానీ, ఫిబ్రవరి నాటి వైమానిక దాడుల్లో మహ్మద్ జవాద్ ముఖానికి తీవ్ర గాయాలు, కాలిన గాయాలు కావడంతోనే ఆయన ముఖం కనపడకుండా మాస్క్ ధరించినట్లు స్పష్టమైంది.

6 ఏళ్ల మనవరాలితో డ్రైవింగ్.. SIపై కేస్ ఫైల్!
Legal· 13 Jul 2026

6 ఏళ్ల మనవరాలితో డ్రైవింగ్.. SIపై కేస్ ఫైల్!

హైదరాబాద్‌లోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. హైదరాబాద్ కమిషనరేట్‌లో SIగా పనిచేస్తున్న పూజారి తిరుపతి.. గంధంగూడ రోడ్డుపై తన 6 ఏళ్ల మనవరాలికి కార్ డ్రైవింగ్ నేర్పిస్తూ దొరికిపోయారు. గంధంగూడ రోడ్డుపై చిన్నపిల్లకి డ్రైవింగ్ నేర్పించడంతో లోకల్స్ కార్ ఆపి SIని నిలదీశారు. ఇది ఆటోమేటిక్ కార్ అని, కంట్రోల్ తన చేతుల్లోనే ఉందంటూ SI కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు SIపై కేస్ ఫైల్ చేశారు.

ఆమిర్ ఖాన్ మ్యారేజ్‌ 'లవ్ జిహాద్'! - మంత్రి సంచలనం
Politics· 13 Jul 2026

ఆమిర్ ఖాన్ మ్యారేజ్‌ 'లవ్ జిహాద్'! - మంత్రి సంచలనం

బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ మూడో పెళ్లిపై మహారాష్ట్ర మంత్రి నితేష్ రాణే చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఆమిర్ ఖాన్‌ను 'లవ్ జిహాద్‌కు బ్రాండ్ అంబాసిడర్' అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ సమాజం ఇలాంటి వాళ్ల సినిమాలను చూడాలా వద్దా అని ఆలోచించుకోవాలంటూ పిలుపునిచ్చారు. ఇటీవల ఆమిర్ ఖాన్, గౌరీ స్ప్రాట్‌ను మూడో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ఇష్యూపై సోషల్ మీడియాలో నెగెటివ్, పాజిటివ్ కామెంట్స్‌తో పెద్ద డిబేట్ నడుస్తోంది.

ఓటర్ అలర్ట్: కొత్త ఓటు రిజిస్ట్రేషన్‌కు 'సర్‌' రూల్స్ చేంజ్!
Legal· 13 Jul 2026

ఓటర్ అలర్ట్: కొత్త ఓటు రిజిస్ట్రేషన్‌కు 'సర్‌' రూల్స్ చేంజ్!

కొత్తగా ఓటు హక్కు కోసం అప్లై చేసుకునేవారికి ఎన్నికల సంఘం (EC) కొత్త రూల్ పెట్టింది. ఇకపై ఆన్‌లైన్ ఫామ్-6 దరఖాస్తులో ఒక అదనపు డిక్లరేషన్ తప్పనిసరి చేసింది. దీని ప్రకారం, గత ఓటర్ల సర్వే లో ఉన్న మీ లేదా మీ పేరెంట్స్ ఓటు వివరాలను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆన్‌లైన్ ఫామ్‌లో 3 ఆప్షన్లు ఇచ్చారు. ఒకవేళ గత సర్వేలో ఎవరి పేర్లు లేకపోతే మూడో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫేక్ ఓట్లను తొలగించడానికే EC ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రాసెస్ రన్ అవుతోంది.

ఉదయం నిద్రలేవగానే నీళ్లు ఎందుకు తాగాలి?
Health· 13 Jul 2026

ఉదయం నిద్రలేవగానే నీళ్లు ఎందుకు తాగాలి?

ఉదయం లేవగానే బెడ్ టీ లేదా కాఫీ తాగే అలవాటుందా? అయితే మార్చుకోండి. ఖాళీ కడుపుతో ఒక గ్లాస్ వాటర్ తాగడం వల్ల బాడీకి ఇన్స్టంట్ ఎనర్జీ అందుతుంది. రాత్రంతా నీరు లేకపోవడం వల్ల వచ్చే డీహైడ్రేషన్ తగ్గి, మెటబాలిజం బూస్ట్ అవుతుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా, వెయిట్ లాస్‌కు హెల్ప్ చేస్తుంది. బ్రెయిన్ ఫంక్షన్ యాక్టివ్ అయి కాన్సంట్రేషన్ పెరుగుతుంది. స్కిన్ గ్లో పెరగడానికి, తలనొప్పి తగ్గడానికి ఇది బెస్ట్. ఉదయాన్నే ఒకటి లేదా రెండు గ్లాసుల గోరువెచ్చని నీరు తాగడం హెల్త్ కు చాలా మంచిది.

పాలక్కాడ్ టు స్పేస్ :  ఒకే జిల్లా-ముగ్గురు ఆస్ట్రోనాట్లు
News· 13 Jul 2026

పాలక్కాడ్ టు స్పేస్ : ఒకే జిల్లా-ముగ్గురు ఆస్ట్రోనాట్లు

కేరళలోని పాలక్కాడ్ జిల్లా అంతర్జాతీయ స్సేస్ హిస్టరీలోనే ఒక అరుదైన మైలు రాయిని అందుకుంది. నాసా తరపున అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) వెళ్లనున్న భారత సంతతి డాక్టర్ అనిల్ మీనన్, స్పేస్-ఎక్స్ ‘పోలారిస్ డాన్’ మిషన్ ద్వారా స్పేస్‌లోకి వెళ్లిన ఆయన భార్య అన్నా మీనన్, భారత ‘గగన్‌యాన్’ మిషన్‌కు ఎంపికైన ఎయిర్ కమోడోర్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్.ఈ ముగ్గురూ పాలక్కాడ్ తో రిలేట్ అయినవారే. అమెరికా, రష్యా కాకుండా ఇంత స్పేస్ టాలెంట్, ట్రాక్ రికార్డ్ కలిగిన ఈ ముగ్గురి గురించి కేరళ ఇప్పుడు గ్రేట్ గా ఫీలవుతోంది.

మార్నింగ్ లేవగానే ఇలా అస్సలు చేయొద్దు
Health· 13 Jul 2026

మార్నింగ్ లేవగానే ఇలా అస్సలు చేయొద్దు

ఉదయం ఎలా ప్రారంభమవుతుందో, రోజంతా మన శరీరం, మనసు కూడా అలాగే స్పందిస్తాయి. మనం చేసే చిన్న తప్పులు శారీరక శక్తిని తగ్గించడమే కాకుండా మానసిక ఒత్తిడిని పెంచుతాయి. ఉదయం లేవగానే ఏ పని ఎప్పుడు చేయాలో ముందే ప్లాన్ లేకపోతే చివరి నిమిషంలో హడావుడి మొదలవుతుంది. ఇది మానసిక ఒత్తిడిని పెంచుతుంది. చాలామంది కళ్లు తెరవగానే ఫోన్ తీసుకుని సోషల్‌మీడియా, మెసేజ్‌లు, వార్తలు చూస్తుంటారు. రోజును ఇలా ప్రారంభించడం మనసుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. టిఫిన్ అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. ఎంత బిజీగా ఉన్నా అల్పాహారం తీసుకోవాలి

మహిళ పట్ల డెలివరీ బోయ్ అసభ్య ప్రవర్తన !
Crime· 12 Jul 2026

మహిళ పట్ల డెలివరీ బోయ్ అసభ్య ప్రవర్తన !

బెంగళూరులో దారుణం చోటు చేసుకుంది. ఓ డెలివరీ బోయ్ ఆర్డర్ ఇవ్వడానికి వచ్చి బలవంతంగా ఓ యువతి ఫ్లాట్ లోకి చొరబడి అడ్డుకుంటున్నా యూరినల్స్ అర్జెంట్ అంటూ డైరక్ట్ గా తోసుకుని లోపలికి వెళ్లి బాత్ రూమ్ లో దూరాడు. ఆపై బయటకొచ్చి తన ప్రైవేట్ పార్ట్ ను ఆ యువతికి చూపిస్తూ అసభ్యంగా బిహేవ్ చేసాడు. హడలి పోయిన బాధితురాలు అంత షాక్ లోనూ ఆ ఘటనను వీడియో తీసింది. ఈ దారుణంపై కన్నీరు మున్నీరవుతూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసింది. పోలీసులకు కంప్లైట్ చేస్తానని హెచ్చరించడంతో ఆ డెలివరీ బాయ్ అక్కడనుంచి జారుకున్నాడు. ఐటీ హబ్ బెంగళూరులో పట్టపగలు ఈ ఇన్సిడెంట్ మహిళలను భయపెడుతోంది.

నేపాల్ లో జెన్ జీ ఆగ్రహావేశాలు !
World· 12 Jul 2026

నేపాల్ లో జెన్ జీ ఆగ్రహావేశాలు !

నేపాల్‌లో యువత సపోర్ట్ తో అధికా రం లోకి వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు అదే 'జెన్-జీ' ఆగ్రహాన్ని ఫేస్ చేస్తోంది.అక్కడ జరుగుతున్న తీవ్ర నిరసనలు, ఆత్మహత్యా యత్నాలు దేశాన్ని కుదిపేస్తున్నాయి. వ్యవస్థ మారుతుందని ఆశించిన యువతకు రోజులు గడుస్తున్నా నిరాశే ఎదురవడంతో, నిరుద్యోగం, అవినీతిపై వారు రోడ్లపైకి వచ్చి పోరాడుతున్నారు. తాము నమ్మిన యువ నాయకులే తమను మోసం చేశారనే అసంతృప్తి వారిలో తీవ్రంగా ఉంది. ఈ పరిణామాలు నేపాల్ రాజకీయాల్లో పెద్ద సంక్షోభానికి దారితీస్తున్నాయి.

శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ గ్రూప్స్ మధ్య ఘర్షణ!
Cinema· 12 Jul 2026

శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ గ్రూప్స్ మధ్య ఘర్షణ!

పాపులర్ డ్యాన్స్ డైరక్టర్స్ శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ గ్రూపుల మధ్య ఘర్షణ చివరకు కొట్టుకోడానికి దారి తీసింది. డ్యాన్సర్స్ అసోసియేషన్ ఎన్నికలు, సభ్యత్వాల విషయంలో ఇరు వర్గాల మధ్య తలెత్తిన విభేదాలు చివరకు ఫైటింగ్ కి దారి తీశాయి. సభ్యుల సంక్షేమం, అంతర్గత నిర్ణయాల మీద రెండు వర్గాల మధ్య తీవ్రస్థాయిలో గొడవ రేగింది. ఇన్ఫర్మేషన్ అందుకున్న పోలీసులు వచ్చి ఇద్దరినీ విడ దీశారు.ఈ ఘర్షణతో ఒక్కసారిగా డ్యాన్సర్ల అసోసియేషన్ వాతావరణం వేడెక్కింది.!

భీకర దాడులతో దద్దరిల్లుతున్న పశ్చిమాసియా !
World· 12 Jul 2026

భీకర దాడులతో దద్దరిల్లుతున్న పశ్చిమాసియా !

ఇరాన్‌పై అమెరికా దాడులను ఉధృతం చేయడంతో పశ్చిమాసియా మళ్లీ యుద్ధ రంగంగా మారు తోం ది. తాత్కాలిక ఒప్పందం ముగిసిందని అమెరికా గత వారం ప్రకటించిన వెంటనే కువైట్, బహ్రెయిన్‌లపై ఇరాన్ విస్తృతంగా దాడు లకు తెగబడింది. తాజాగా ఆదివారం ఉదయం కువైట్, బహ్రెయిన్‌లతో పాటు ఖతార్, యూఏఈ దేశాలపై కూడా ఇరాన్ భారీ దాడులు జరిపినట్లు ఆయా దేశాలు అధికారికంగా ప్రకటించాయి. ఒమన్‌పై కూడా దాడులు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. గల్ఫ్ దేశాలలో అమెరికా సైనిక స్థావరాలు, రాడార్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడి చేసింది. ఇరాన్ కు అమెరికా చాలా గట్టిగా కౌంటర్ ఇచ్చింది.

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు  చంద్రబాబు పరామర్శ !
AP· 12 Jul 2026

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు చంద్రబాబు పరామర్శ !

ముంబై కోకిలాబెన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు. కుడి భుజానికి అత్యంత క్లిష్టమైన సర్జరీని నిపుణులు పూర్తి చేశారు. మూడు గంటల పాటు సాగిన ఈ ఆపరేషన్ విజయవంతమైందని వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం కోలుకుంటున్న పవన్ ను చంద్రబాబు ముంబై వెళ్లి పరామర్శించి వచ్చారు.

బోటు ప్రమాదంపై ప్రత్యక్ష సాక్షులు ఏమన్నారంటే?
News· 12 Jul 2026

బోటు ప్రమాదంపై ప్రత్యక్ష సాక్షులు ఏమన్నారంటే?

వియత్నాంలో నిన్న జరిగిన బోటు ప్రమాదంలో 15 మంది ఇండియన్స్ మరణించడంపై ప్రత్యక్ష సాక్షులు కీలక విషయాలు వెల్లడించారు. 'స్పీడ్ బోట్లో 36 మంది ప్రయాణిస్తున్నాం. అది క్లోజ్డ్ బోట్. 3 నిమిషాలు కాగానే పెద్ద అలతో బోటు తిరగబడింది. ముందర భాగంలో కూర్చున్న 20 మంది విండో నుంచి బయటకు దూకేసి బయటపడ్డాం. వెనక కూర్చున్న వారు లోపల చిక్కుకుపోయి బయటకు రాలేకపోయారు' అని తెలిపారు. ఈ ఘటనలో మరణించిన 15 మంది మృత దేహాలను భారత్ పంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

మహిళా నేతపై ఊగిపోయిన యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్
Politics· 12 Jul 2026

మహిళా నేతపై ఊగిపోయిన యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్

TG: యాదగిరిగుట్ట పాలకమండలి సభ్యురాలు ఈశ్వరమ్మ యాదవ్‌పై తెలంగాణ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ జక్కిడి శివచరణ్ రెడ్డి బూతు పురాణం ఆడియా తీవ్ర కలకలం రేపింది. ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మా నాన్న ఫోటో ఫ్లెక్సీలో ఎందుకు పెట్టలేదంటూ ఈశ్వరమ్మపై అసభ్యంగా తిట్టారని శివచరణ్ రెడ్డిపై BC సంఘాలు ఫైరవుతున్నాయి. ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని బీసీ నాయకులు హెచ్చరించారు. శివశరణ్ రెడ్డిపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చిన్న నిర్లక్ష్యం.. క్షణాల్లో పెను ప్రమాదం
TG· 12 Jul 2026

చిన్న నిర్లక్ష్యం.. క్షణాల్లో పెను ప్రమాదం

TG: క్షణకాలపు అజాగ్రత్త జీవితకాలపు ఆవేదనకు దారితీస్తుందనడానికి ఈ CCTV దృశ్యాలే సజీవ సాక్ష్యం. వాహనం ఆపి, ఇంజిన్ రన్ అవుతుండగానే పిల్లలను దానిపై వదిలేయడం లేదా వారు పక్కనే ఉన్నప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంతటి పెను ప్రమాదానికి దారితీస్తుందో ఈ ఘటన చూస్తే అర్థమవుతుంది. వాహనం స్టార్ట్ చేసి ఉన్నప్పుడు వారు తెలియక చేసే ఆ చిన్న పొరపాటే క్షణాల్లో ఊహించని ప్రమాదంగా మారి ప్రాణాల మీదికి తెస్తుంది. అందుకు కనీస జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలని హైదరాబాద్ CP వీసీ సజ్జనార్ ఈ వీడియోను తన ట్విట్టర్‌‌లో పోస్ట్ చేసి అవగాహన కల్పించారు.

ఆకులో అమరిన గానకోకిల
Cinema· 12 Jul 2026

ఆకులో అమరిన గానకోకిల

TG: తన మధుర గానంతో కోట్లాది సంగీతాభిమానుల హృదయాల్లో నిలిచిన గానకోకిల S.జానకి మృతి పట్ల సినీ అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌కు చెందిన శివకుమార్ వినూత్నంగా రావి ఆకుపై చేతితో చెక్కిన లీఫ్ ఆర్ట్‌ను రూపొందించి నివాళులర్పించారు. సాధారణ రావి ఆకును ప్రత్యేక పద్ధతిలో సిద్ధంచేసి, అత్యంత సూక్ష్మంగా చేతితో చెక్కుతూ S.జానకి చిత్రాన్ని కళాత్మకంగా మలిచారు. ఈ లీఫ్ ఆర్ట్ ఆమెపై ఉన్న గౌరవం, అభిమానం, సంగీతానికి ఆమె చేసిన విశిష్ట సేవలకు గుర్తుగా రూపొందించినట్లు శివకుమార్ తెలిపారు.

హైవేపై ఘోర ప్రమాదం.. పెళ్లి ఇంట్లో తీరని శోకం
AP· 12 Jul 2026

హైవేపై ఘోర ప్రమాదం.. పెళ్లి ఇంట్లో తీరని శోకం

AP: మర్కాపురం జిల్లా కంభం సమీపంలోని అమరావతి-అనంతపురం నేషనల్ హైవేపై అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి వేడుక కోసం ఆటోలో వెళ్తున్న ఒకే కుటుంబానికి చెందిన బంధువులను లారీ ఢీకొట్టింది. కొందరు ఆటోలో కూర్చోగా.. అదే సమయంలో వెనుక నుంచి అతివేగంతో దూసుకొచ్చిన లారీ, రోడ్డు పక్కన ఆగి ఉన్న ఆటోను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ ఓ చిన్నారి మృతి చెందింది.

మెకానిక్ షెడ్డులో మంటలు
AP· 12 Jul 2026

మెకానిక్ షెడ్డులో మంటలు

AP: విజయవాడ ఆటోనగర్‌లోని మెకానిక్ షెడ్డులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు క్షణాల్లోనే షెడ్ మొత్తం వ్యాపించి మరమ్మతుల కోసం నిలిపి ఉంచిన పలు ప్రైవేట్ బస్సులు అగ్నికి ఆహుతయ్యాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగ అలుముకుంది. దీంతో స్థానికులు, వాహనదారులు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. బ్యాటరీ టెర్మినల్స్ వద్ద లేదా షెడ్డులోని వైరింగ్‌లో సంభవించిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ప్రాథమికంగా అంచనా వేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

విద్యార్థులకు పురుగుల అన్నం
Education· 12 Jul 2026

విద్యార్థులకు పురుగుల అన్నం

AP: కర్నూలు జిల్లా గూడూరు మండలం పెంచికలపాడు వద్దనున్న విశ్వభారతి మెడికల్ కాలేజీ హాస్టల్ విద్యార్థులకు పురుగుల అన్నం పెట్టడం కలకలం రేపింది. చాలారోజుల నుంచి ఎలాంటి శుభ్రత పాటించకుండా కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని హాస్టల్ విద్యార్థులు అధికారులకు కంప్లైంట్ ఇచ్చారు. దీంతో ఫుడ్ సేఫ్టీ అండ్ కంట్రోల్ అధికారులు కాలేజీ హాస్టల్‌లో తనిఖీలు నిర్వహించారు. పురుగులు పట్టిన 200 KGల బియ్యాని సీజ్ చేసినట్లు, రిపోర్టులు వచ్చాక కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారి రాజగోపాల్ రావు తెలిపారు.

జైలు నుంచి పోక్సో నిందితుడు ఎస్కేప్
Crime· 12 Jul 2026

జైలు నుంచి పోక్సో నిందితుడు ఎస్కేప్

TG: వనపర్తి జిల్లా అమరచింత మండలం నందిమల్ల గ్రామానికి చెందిన కిశోర్‌‌కుమార్‌ రెడ్డి సమీప బంధువైన బాలికను ప్రేమ వివాహం చేసుకున్నాడు. తమ కూతురు మైనర్‌ అని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కిశోర్‌పై పోక్సో కేసు నమోదు చేశారు. జూన్‌ 12న అతన్ని మహబూబ్‌నగర్ జైలుకు తరలించారు. అయితే కిశోర్‌ ఈ నెల 6న జైలు గోడ దూకి పారిపోయాడు. ఖైదీ పారిపోవడానికి జైలు సూపరింటెండెంట్‌ శశికాంత్‌ నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా గుర్తించారు. శశికాంత్‌ను చంచల్‌గూడ కేంద్ర కారాగారానికి బదిలీ చేశారు. ఇద్దరు వార్డెన్లను సస్పెండ్‌ చేసి మరికొందరికి ఛార్జ్‌ మెమోలు ఇచ్చారు.

కారు బీభత్సం.. వాహనాలపై దూసుకెళ్లిన కారు
AP· 12 Jul 2026

కారు బీభత్సం.. వాహనాలపై దూసుకెళ్లిన కారు

AP: ప్రకాశం జిల్లా ఒంగోలులో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చిన కారు చెత్త సేకరించే వాహనాన్ని ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా సైకిల్‌పై వెళ్తున్న AR కానిస్టేబుల్‌ను, అనంతరం బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో కానిస్టేబుల్ మరియదాస్ ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఒంగోలు ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో కారును ఓ వైద్య విద్యార్థిని నడుపుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏఆర్ కానిస్టేబుల్ మృతిపై హోంమంత్రి అనిత సంతాపం వ్యక్తం చేశారు.