కారు బీభత్సం.. వాహనాలపై దూసుకెళ్లిన కారు

AP: ప్రకాశం జిల్లా ఒంగోలులో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చిన కారు చెత్త సేకరించే వాహనాన్ని ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా సైకిల్‌పై వెళ్తున్న AR కానిస్టేబుల్‌ను, అనంతరం బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో కానిస్టేబుల్ మరియదాస్ ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఒంగోలు ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో కారును ఓ వైద్య విద్యార్థిని నడుపుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏఆర్ కానిస్టేబుల్ మృతిపై హోంమంత్రి అనిత సంతాపం వ్యక్తం చేశారు.



