Latest

ఇరాన్ సుప్రీం లీడర్ రివెంజ్ వార్నింగ్!
World· 11 Jul 2026

ఇరాన్ సుప్రీం లీడర్ రివెంజ్ వార్నింగ్!

అమెరికా-ఇరాన్ మధ్య టెన్షన్స్ పెరుగుతున్న వేళ ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ కీలక ప్రకటన చేశారు. తన తండ్రి, మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణానికి కారణమైన వారిపై కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని టెలిగ్రామ్‌లో మెసేజ్ పెట్టారు. ఫిబ్రవరిలో అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో అలీ ఖమేనీ చనిపోగా, జూలై 9న అంత్యక్రియలు జరిగాయి. ఈ దాడుల్లో గాయపడిన మొజ్తాబా వాటికి హాజరుకాలేదు. మరోవైపు ఒమన్‌లో అమెరికాతో ఇరాన్ బృందం చర్చలు జరుపుతోంది.

బోటు మునిగి 18 మంది మృతి!
News· 11 Jul 2026

బోటు మునిగి 18 మంది మృతి!

వియత్నాంలోని ఫేమస్ టూరిస్ట్ స్పాట్ 'హా లాంగ్ బే' లో భారీ ప్రమాదం జరిగింది. పర్యాటకులతో వెళ్తున్న ఒక టూరిస్ట్ బోటు అదుపుతప్పి సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో మొత్తం 18 మంది చనిపోయారు. మరణించిన వారిలో ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు ఉన్నట్లు సమాచారం. హాలిడే ట్రిప్ కోసం వెళ్లిన తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ ప్రమాదంలో చిక్కుకోవడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

జంతర్ మంతర్ వద్ద ప్రకాష్ రాజ్!
Education· 11 Jul 2026

జంతర్ మంతర్ వద్ద ప్రకాష్ రాజ్!

ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలని డిమాండ్ చేస్తున్న యువతకు సంఘీభావం తెలపడానికి నటుడు ప్రకాష్ రాజ్ వెళ్లారు. సోనమ్ వాంగ్‌చుక్ చేస్తున్న నిరసనకు ఆయన ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. ఈ సందర్భంగా యువతతో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేస్తూ, తన ఫేమస్ ట్యాగ్ '#justasking'ను యాడ్ చేస్తూ ట్వీట్ చేశారు.

అఖిల్‌కు కోసం దేవుడిని ఫస్ట్ టైమ్ అడిగా: నాగార్జున
Cinema· 11 Jul 2026

అఖిల్‌కు కోసం దేవుడిని ఫస్ట్ టైమ్ అడిగా: నాగార్జున

'లెనిన్' మూవీ సక్సెస్ మీట్‌లో కింగ్ నాగార్జున ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. నేను ఎన్నోసార్లు తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లానని, కానీ ఎప్పుడూ తన కోసం ఏమీ అడగలేదని చెప్పారు. ఫస్ట్ టైమ్ స్వామివారిని "మా వాడికి (అఖిల్‌కు) ఒక హిట్ ఇవ్వండి" అని కోరుకున్నట్లు ఎమోషనల్ అయ్యారు. సినిమాను హిట్ చేసినందుకు దేవుడికి థాంక్స్ చెప్పారు. అలాగే ఈ ఈవెంట్‌కు సపోర్ట్‌గా వచ్చిన 'మా పెద్ద అబ్బాయి' ఎన్టీఆర్ కి నాగ్ స్పెషల్ థాంక్స్ తెలిపారు.

యాదగిరిగుట్ట కొత్త ట్రస్ట్ బోర్డ్ ప్రమాణ స్వీకారం!
News· 11 Jul 2026

యాదగిరిగుట్ట కొత్త ట్రస్ట్ బోర్డ్ ప్రమాణ స్వీకారం!

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కొత్త ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకార మహోత్సవం గ్రాండ్‌గా జరిగింది. గవర్నమెంట్ విప్ బీర్ల అయిలయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రోగ్రామ్‌కు ఎండోమెంట్స్ మినిస్టర్ కొండా సురేఖ హాజరయ్యారు. భువనగిరి MP చామల కిరణ్ కుమార్ రెడ్డి చీఫ్ గెస్ట్‌గా విచ్చేసి, కొత్తగా ఏర్పాటైన ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్‌కి అభినందనలు తెలియజేశారు. ఆలయ అభివృద్ధి కోసం ఈ కమిటీ పని చేయనుంది.

మోస్ట్ పవర్‌ఫుల్ విమెన్ గా నారా బ్రాహ్మణి!
Business· 11 Jul 2026

మోస్ట్ పవర్‌ఫుల్ విమెన్ గా నారా బ్రాహ్మణి!

హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణికి ఇంటర్నేషనల్ లెవెల్‌లో రేర్ రికగ్నిషన్ దక్కింది. ప్రముఖ బిజినెస్ మ్యాగజైన్ 'ఫార్చ్యూన్ ఇండియా' అనౌన్స్ చేసిన 'మోస్ట్ పవర్‌ఫుల్ విమెన్ - 2026' లిస్ట్‌లో ఆమె చోటు సంపాదించుకున్నారు. ఢిల్లీలో జరిగిన సమ్మిట్‌లో బ్రాహ్మణి ఈ అవార్డును అందుకున్నారు. పాల ఉత్పత్తిలో లేటెస్ట్ టెక్నాలజీని వాడుతూ రైతులకు హెల్ప్ చేయడమే తమ మెయిన్ గోల్ అని ఆమె చెప్పారు.

ఆరుగురి హత్య ఘటన.. SI రమేష్ సస్పెండ్
TG· 11 Jul 2026

ఆరుగురి హత్య ఘటన.. SI రమేష్ సస్పెండ్

TG: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవలాగూడలో జరిగిన ఆరుగురి హత్య ఘటన బాధిత కుటుంబసభ్యులను ఎమ్మెల్యే కాలే యాదయ్య, కలెక్టర్ నారాయణరెడ్డి పరామర్శించారు. ఘటనతో అనాథగా మిగిలిన మానసిక వికలాంగురాలికి రూ.5 లక్షల ఆర్థికసాయం అందజేస్తామని ప్రకటించారు. కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కేసుకు సంబంధించి విధుల్లో నిర్లక్ష్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న SI రమేష్‌ను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఇతర పోలీసు సిబ్బందిపై కూడా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో ఘోరం!
Crime· 11 Jul 2026

బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో ఘోరం!

వైజాగ్‌కు చెందిన రాధా గాయత్రి (27), శ్రీచరణ్‌లకు గతేడాది మ్యారేజ్ అయింది. రీసెంట్‌గా బర్త్‌డే సెలబ్రేషన్స్ కోసం ముస్సోరీ హోమ్‌స్టేకి వెళ్లగా, అక్కడ గాయత్రి అపస్మారక స్థితిలో శవమై కనిపించింది. అల్లుడే తమ కూతురిని మర్డర్ చేశాడంటూ పేరెంట్స్ కంప్లైంట్ చేయడంతో కలెక్టర్ విచారణకు ఆర్డర్ ఇచ్చారు. దీంతో పోలీసులు శ్రీచరణ్‌ను అరెస్ట్ చేశారు. తమకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే పోస్ట్‌మార్టమ్ ఎందుకు చేశారని గాయత్రి పేరెంట్స్ ప్రశ్నిస్తున్నారు. పోలీసులు కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు.

ఎమ్మెల్యేపై దూసుకొచ్చిన నిరసనకారులు.. ఉద్రిక్తత
Politics· 11 Jul 2026

ఎమ్మెల్యేపై దూసుకొచ్చిన నిరసనకారులు.. ఉద్రిక్తత

TG: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో జరిగిన ఆరుహత్యల ఘటన తీవ్రంగా కలిచివేసింది. పోక్సో నిందితుడు రాజ్ కుమార్‌ను తమను అప్పగించాలని, కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు ధర్నా చేశారు. ధర్నా స్థలానికి వెళ్లిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడికి ఎందుకొచ్చావని నిలదీశారు. మూకుమ్మడిగా ఎమ్మెల్యే మీదకు నిరసనకారులు దూసుకువచ్చారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకుంది. పక్కనే ఉన్న గన్‌మెన్లు, పోలీసులు ఆయనను సురక్షితంగా బయటకు పంపించారు.

రాష్ట్రం పోక్సో కేసులకు అడ్డాగా మారింది
Politics· 11 Jul 2026

రాష్ట్రం పోక్సో కేసులకు అడ్డాగా మారింది

TG: రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రం పోక్సో కేసులకు అడ్డాగా మారిందని BRS పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి RS ప్రవీణ్‌కుమార్ ధ్వజమెత్తారు. అప్పుడు బండి భగీరథ్‌ను 9రోజులు అరెస్ట్ చేయలేదు, ఘటన జరిగి 55 రోజులైనా ఇప్పుడు రాజ్‌కుమార్‌ను అరెస్ట్ చేయలేదని ఫైరయ్యారు. రియల్ ఎస్టేట్ దందా చేసే రేవంత్ రెడ్డి తన బంధువులకే రక్షణ కల్పిస్తున్నారన్నారు. ఆరుగురి అమాయకుల హత్య ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. కాంగ్రెస్ పాలనలో అమ్మాయిలకు రక్షణ లేదన్నారు. వెంటనే నిందితుడు రాజ్ కుమార్‌ను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

మాజీ మంత్రులు అరెస్ట్
Politics· 11 Jul 2026

మాజీ మంత్రులు అరెస్ట్

TG: రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో జరిగిన ఆరుహత్యల ఘటనలో బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లున్న మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, పద్మా దేవేందర్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని చేవెళ్ల పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్తుంటే అడ్డుకోవడం బాధాకరం అని అన్నారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని, రాష్ట్రంలో పరిపాలనను గాలికి వదిలేసి, ప్రజల ప్రాణాలు, భద్రత పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఫైరయ్యారు.

అరగంట వ్యవధిలో తల్లీకొడుకు మృతి
AP· 11 Jul 2026

అరగంట వ్యవధిలో తల్లీకొడుకు మృతి

AP: బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామానికి చెందిన చిట్టూరి అపర్ణ(45) అనారోగ్యంతో బాధపడుతుంది. కుమారుడు సతీష్(18) తల్లిని అమ్మమ్మ సాయంతో ఆటో ఎక్కించి రావులపాలెంలోని ఓ హాస్పిటల్‌కు పంపాడు. మార్గమధ్యలో అపర్ణ మృతి చెందింది. ఈ విషయం తెలియని సతీష్ హాస్పిటల్‌కు వెళ్లి సపర్యలు చేద్దామని వెళ్తుండగా ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందాడు. అరగంట వ్యవధిలోనే తల్లీ కుమారుడు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

'లెనిన్' మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా?
Cinema· 11 Jul 2026

'లెనిన్' మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా?

మూడేళ్ల గ్యాప్ తర్వాత అక్కినేని అఖిల్ 'లెనిన్' మూవీతో థియేటర్స్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. మురళీ కిషోర్ అబ్బూరి డైరెక్షన్‌లో నాగార్జున, నాగవంశీ నిర్మించిన ఈ సినిమా జూలై 10న రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. వరల్డ్‌వైడ్‌గా ఫస్ట్ డేనే ఈ మూవీ ₹16.7 కోట్ల కలెక్షన్స్‌ సాధించడంతో మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. సెకండ్ డే కూడా బుకింగ్స్ జోరుగా ఉన్నాయి. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించిన ఈ ఎమోషనల్ అండ్ విలేజ్ డ్రామా జెన్-జీ ఆడియన్స్‌ను బాగా అట్రాక్ట్ చేస్తోంది

పవన్ కల్యాణ్‌కు సర్జరీ సక్సెస్!
AP· 11 Jul 2026

పవన్ కల్యాణ్‌కు సర్జరీ సక్సెస్!

AP ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కుడి భుజానికి ముంబైలో సర్జరీ విజయవంతంగా పూర్తయింది. తీవ్రమైన రొటేటర్ కఫ్ ఇంజ్యూరీ కారణంగా డాక్టర్లు శనివారం మూడున్నర గంటలపాటు ఈ ఆపరేషన్ చేశారు. గత ఎన్నికల ప్రచారంలో ఫ్యాన్స్ చేతులు పట్టి లాగడంతో పవన్ భుజాలకు గాయాలయ్యాయి. పెయిన్ తీవ్రత ఎక్కువగా ఉంటుందని మరో భుజానికి రెండు నెలల తర్వాత సర్జరీ చేయనున్నారు. పవన్ త్వరగా కోలుకోవాలని CM చంద్రబాబు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

గూగుల్ డ్రైవ్‌లో ఇవి పెడితే జైలే!
Legal· 11 Jul 2026

గూగుల్ డ్రైవ్‌లో ఇవి పెడితే జైలే!

గూగుల్ డ్రైవ్‌ను సేఫ్ అనుకుంటే పొరపాటే. UPకి చెందిన ఓ యువకుడు తన డ్రైవ్‌లో 15 మంది అమ్మాయిల ప్రైవేట్ వీడియోలను స్టోర్ చేశాడు. దీనిపై అలర్ట్ అయిన గూగుల్ టీమ్ వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. పోలీసులు IMEI నంబర్, IP అడ్రస్ ఆధారంగా నిందితుడిని ట్రాక్ చేసి అరెస్ట్ చేశారు. ఇలాంటి ఇల్లీగల్ కంటెంట్‌ను గూగుల్ అకౌంట్స్‌లో పెడితే జైలు శిక్ష తప్పదు. డిజిటల్ స్పేస్‌లో ప్రైవసి రూల్స్ బ్రేక్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయి.

నేరెళ్ల బాధితుడు కన్నుమూత
TG· 11 Jul 2026

నేరెళ్ల బాధితుడు కన్నుమూత

TG: రాజన్నసిరిసిల్ల జిల్లా నేరెళ్లలో 2017 జూలైలో జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇసుక లారీలు అడ్డుకున్న దళితులను పోలీసులు తీవ్రంగా హింసించి థర్డ్ డిగ్రీ ప్రయోగించడం, ఆ తర్వాత పరిణామాలు పెద్ద వివాదంగా మారాయి. ఈ ఘటనలో పోలీసుల థర్డ్ డిగ్రీకి గురైన ఎనిమిది మంది బాధితుల్లో ఒకరైన గంధం గోపాల్ అనారోగ్యంతో బాధపడుతూ శనివారం మృతి చెందారు. గోపాల్ మృతితో మిగిలిన బాధితులు మరోసారి న్యాయం కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఘటన జరిగి దాదాపు పదేళ్లు గడిచినా తమకు న్యాయం జరగలేదని, ప్రభుత్వాలు మారినా తమ పరిస్థితి మాత్రం మారలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

భారీగా తగ్గిన బంగారం ధరలు!
Politics· 11 Jul 2026

భారీగా తగ్గిన బంగారం ధరలు!

ఈరోజు గోల్డ్ రేట్స్ భారీగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై ₹490, 22 క్యారెట్లపై ₹450, 18 క్యారెట్లపై ₹370 చొప్పున ప్రైస్ తగ్గింది. ప్రెసెంట్ లేటెస్ట్ రేట్స్ చూస్తే, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ₹1,44,330 దగ్గర, 22 క్యారెట్లు ₹1,32,300 దగ్గర, అలాగే 18 క్యారెట్లు ₹1,08,250 గా ఉంది. షాపింగ్ ప్లాన్ చేసుకునే వారు మార్కెట్ రేట్స్ ఒకసారి రీచెక్ చేసుకోండి.

చోరీల డబ్బుతో హారర్ మూవీ.. షాకింగ్ ట్విస్ట్
Crime· 11 Jul 2026

చోరీల డబ్బుతో హారర్ మూవీ.. షాకింగ్ ట్విస్ట్

AP: కర్ణాటక రాష్ట్రంలోని చిక్‌మంగళూరు రేవులో వెల్డింగ్ పనులు చేసే ఆనంద్‌కు సినిమాలు చాలా ఇష్టం. ఎప్పటికైనా తానే ఓ మూవీ తీయాలనుకున్నాడు. దీంతో చోరీల బాటపట్టాడు. షాపింగ్ మాల్సే టార్గెట్‌గా అనంతపురంలోని డ్రెస్ సర్కిల్ మాల్‌లో నగదు చోరీ చేశాడు. ఇలా దోపిడీలు చేసి కూడగట్టిన రూ.2.5 కోట్లతో హీరో, దర్శకుడిగా రిటర్న్ బై ఆనంద్.. పేజీ నంబర్ 13 అనే హారర్ మూవీ తీశాడు. అప్పులు పెరగడంతో మళ్లీ చోరీలు చేస్తూ పోలీసులకు దొరికాడు. బెంగళూరు-అనంతపురం హైవేపై నిందితుడిని అరెస్ట్ చేశారు. లాడ్జిల్లో ఉంటే దొరుకుతానని కారులోనే తిరిగేవాడని పోలీసులు తెలిపారు.

తెలంగాణలో అసలు ప్రభుత్వం ఉందా..?
Politics· 11 Jul 2026

తెలంగాణలో అసలు ప్రభుత్వం ఉందా..?

TG: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో జరిగిన ఆరుహత్యల ఘటనపై TRS చీఫ్ కల్వకుంట్ల కవిత ట్విట్టర్ వేదికగా స్పందించారు. హైదరాబాద్ నగర శివారులో ఒకేరోజు ఆరుహత్యలు జరగడం రాష్ట్రంలో ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ ఉన్నాయా అనే అనుమానం కలుగుతోందన్నారు. పోక్సో కేసులో అరెస్ట్ అయి బెయిల్‌పై బయటకు వచ్చిన నిందితుడు ఇన్ని హత్యలు చేస్తున్నా నిఘా వ్యవస్థ, పోలీసులు నిందితుడిని ఆపలేకపోవడం సిగ్గుచేటు అన్నారు. రాష్ట్రంలో ఆరుగురి హత్యలకు కారణమైన రేవంత్ రెడ్డి.. CM, హోంమంత్రి పదవులకు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

రన్నింగ్ కారులో మంటలు.. జస్ట్ మిస్
TG· 11 Jul 2026

రన్నింగ్ కారులో మంటలు.. జస్ట్ మిస్

TG: రన్నింగ్ కారులో మంటలు చెలరేగి అదుపుతప్పి బైక్‌ను ఢీకొట్టడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ వైపు వెళ్తున్న కారు ఇంజన్‌లో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఇద్దరు గాయపడ్డారు. కారు డ్రైవర్ సహా, అందులో ఉన్నవారు వెంటనే కిందికు దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. చూస్తుండగానే కారు పూర్తిగా కాలి బూడిదైంది. వెంటనే క్షతగాత్రులను శంషాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కవితను అడ్డుకున్న అధికారులు.. సింగరేణిలో టెన్షన్
Politics· 11 Jul 2026

కవితను అడ్డుకున్న అధికారులు.. సింగరేణిలో టెన్షన్

TG: ఖమ్మం జిల్లా సత్తుపల్లి సింగరేణి JVR OC-2లో TRS చీఫ్ కల్వకుంట్ల కవిత చేపట్టిన బాయిబాట కార్యక్రమంలో ఉద్రిక్తత నెలకుంది. సింగరేణి అధికారులు కవితను లోపలికి అనుమతించలేదు. దీంతో TRS శ్రేణులతో గేట్ తాళాలు బద్దలు కొట్టి గేట్లు తోసుకుని లోపలికి వెళ్లారు. కార్మికుల సమస్యలపై ఆమె మాట్లాడారు. సత్తుపల్లి సింగరేణి యాజమాన్యం, కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల హక్కులను అణగదొక్కుతోందని, ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైందని కవిత అన్నారు.