← Back to news

మాజీ మంత్రులు అరెస్ట్

By DK· 11 Jul 2026· రంగారెడ్డి జిల్లా

TG: రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో జరిగిన ఆరుహత్యల ఘటనలో బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లున్న మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, పద్మా దేవేందర్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని చేవెళ్ల పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్తుంటే అడ్డుకోవడం బాధాకరం అని అన్నారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని, రాష్ట్రంలో పరిపాలనను గాలికి వదిలేసి, ప్రజల ప్రాణాలు, భద్రత పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఫైరయ్యారు.

More in Politics