Latest

బ్రేకింగ్ న్యూస్: జడ శ్రవణ్‌పై పోలీస్ కంప్లైంట్!
Politics· 7 Jul 2026

బ్రేకింగ్ న్యూస్: జడ శ్రవణ్‌పై పోలీస్ కంప్లైంట్!

AP: లాయర్ జడ శ్రవణ్‌పై అనకాపల్లి జిల్లా కొత్త కోట పోలీస్ స్టేషన్‌లో కేసు ఫైల్ అయింది. చోడవరం జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ P.V.S.N ఈ కంప్లైంట్ ఇచ్చారు. జడ శ్రవణ్ తన స్పీచ్‌లో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను తక్కువ చేసి మాట్లాడారని, ఆయన పరువు తీసేలా కామెంట్స్ చేశారని రాజు తన కంప్లైంట్‌లో పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో దారుణం.. లవర్ తో కలిసి భర్తను చంపిన భార్య!
Crime· 7 Jul 2026

హైదరాబాద్‌లో దారుణం.. లవర్ తో కలిసి భర్తను చంపిన భార్య!

హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఒక షాకింగ్ క్రైమ్ స్టోరీ బయటపడింది. సత్యవతి అనే మహిళ తన ప్రియుడితో కలిసి భర్త పెంతేష్ (45)ను మర్డర్ చేసింది. ఆ తర్వాత ఎవరికీ డౌట్ రాకుండా బాడీని తీసుకెళ్లి మహారాష్ట్ర బోర్డర్ దగ్గర పాతిపెట్టేసింది. లాస్ట్ నవంబర్‌లో తన భర్త కనిపించడం లేదంటూ తనే స్వయంగా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. కానీ, పోలీసులు కేసు ఫైల్ చేసి ఆమె కాల్ రికార్డ్స్, CCTV ఫుటేజ్ చెక్ చేయడంతో ఈ కిల్లర్ ప్లాన్ మొత్తం బయటపడింది.

బిగ్ ట్విస్ట్: హత్యకు ముందే ప్రియుడిని పెళ్లాడిన సియా గోయల్!
Crime· 7 Jul 2026

బిగ్ ట్విస్ట్: హత్యకు ముందే ప్రియుడిని పెళ్లాడిన సియా గోయల్!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుణె రియల్టర్ 'కేతన్ అగర్వాల్' మర్డర్ కేసులో మరో షాకింగ్ నిజం బయటపడింది. కేతన్‌ని మర్డర్ చేయడానికి ముందే.. నిందితురాలు సియా గోయల్ తన బాయ్‌ఫ్రెండ్ చేతన్ చౌదరిని సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నట్లు పోలీస్ ఇన్వెస్టిగేషన్‌లో తేలింది. వీరిద్దరూ ఎవరికీ తెలియకుండా దాదాపు నాలుగు నెలల క్రితమే పెళ్లి చేసుకున్నారని అధికారులు కన్ఫర్మ్ చేశారు. ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతూ సంచలనం సృష్టిస్తోంది.

మనవడి కోసం హాస్పిటల్‌కు వెళ్ళానున్నారు KCR!
News· 7 Jul 2026

మనవడి కోసం హాస్పిటల్‌కు వెళ్ళానున్నారు KCR!

KTR కొడుకు హిమాన్షు నిన్న సాయంత్రం స్పోర్ట్స్ ఆడుతుండగా ఒక చిన్న గాయం అయింది. ప్రస్తుతం ఆయన AIG హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈ విషయం తెలియడంతో తన మనవడు హిమాన్షును పరామర్శించడానికి, హెల్త్ కండిషన్ అడిగి తెలుసుకోవడానికి BRS అధినేత KCR హాస్పిటల్‌కు వెళ్తున్నారు.

కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ రిలీఫ్!
Politics· 7 Jul 2026

కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ రిలీఫ్!

ఢిల్లీ హైకోర్టులో కాక్రోచ్ జనతా పార్టీకి పెద్ద ఊరట లభించింది. గతంలో కొన్ని వివాదాల వల్ల బ్లాక్ చేసిన ఆ పార్టీ అఫీషియల్ 'ఎక్స్' అకౌంట్‌ను వెంటనే అన్‌బ్లాక్ చేయాలని ఢిల్లీ హైకోర్టు గవర్నమెంట్‌ను ఆదేశించింది. కోర్టు ఆర్డర్‌తో CJP లీడర్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇంకో 24 నుండి 48 గంటల్లో ఈ అకౌంట్ మళ్లీ యాక్టివేట్ అయ్యే ఛాన్స్ ఉంది.

M.S ధోనీకి Ex CM స్టాలిన్ బర్త్‌డే విషెస్!
News· 7 Jul 2026

M.S ధోనీకి Ex CM స్టాలిన్ బర్త్‌డే విషెస్!

టీమిండియా మాజీ కెప్టెన్, 'కెప్టెన్ కూల్' MS ధోనీ బర్త్‌డే సందర్భంగా తమిళనాడు Ex CM M.K స్టాలిన్ స్పెషల్ విషెస్ చెప్పారు. ఫీల్డ్‌లో ఉన్నా లేకపోయినా ధోనీ లీడర్‌షిప్, ఆయన క్రేజ్ మిలియన్ల మందికి ఇన్‌స్పిరేషన్ అని పొగిడారు. ధోనీని మళ్లీ గ్రౌండ్‌లో చూడాలని ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారని ట్వీట్ చేశారు. ధోనీ ఎప్పుడూ హెల్తీగా, హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ స్టాలిన్ పెట్టిన ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.

హెల్త్ అలర్ట్: ఈ చిన్న సింప్టమ్స్ ని లైట్ తీసుకోకండి!
Health· 7 Jul 2026

హెల్త్ అలర్ట్: ఈ చిన్న సింప్టమ్స్ ని లైట్ తీసుకోకండి!

మాట్లాడటంలో ఇబ్బంది, చేతులు, కాళ్లు సడన్‌గా పడిపోవడం, చూపు మసకబారడం వంటివి జరిగి కొన్ని నిమిషాల్లో తగ్గిపోతే దాన్ని ‘మినీ స్ట్రోక్’ అంటారు. ఇది ఫ్యూచర్‌లో వచ్చే పెద్ద స్ట్రోక్‌కి అడ్వాన్స్ వార్నింగ్. బ్రెయిన్‌కి కొద్దిసేపు బ్లడ్ సర్క్యులేషన్ ఆగడం వల్ల ఇది వస్తుంది. బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, స్మోకింగ్ అలవాటు ఉన్నవారికి మరియు 55 ఏళ్లు దాటిన వారికి ఈ రిస్క్ ఎక్కువ. ఇలాంటి సింప్టమ్స్ కనిపిస్తే టైమ్ వేస్ట్ చేయకుండా వెంటనే హాస్పిటల్‌కి వెళ్లాలి. డైలీ ఎక్సర్‌సైజ్, హెల్తీ ఫుడ్, రెగ్యులర్ చెకప్స్ ద్వారా దీన్ని నివారించవచ్చు.

మడిపాక్కంలో సరస్సు దగ్గర స్నాక్ స్టాల్‌కు అదమ్యమైన స్ఫూర్తి
General· 7 Jul 2026

మడిపాక్కంలో సరస్సు దగ్గర స్నాక్ స్టాల్‌కు అదమ్యమైన స్ఫూర్తి

మడిపాక్కంలో సరస్సు దగ్గర ఉన్న స్నాక్ స్టాల్‌ను ప్రభు ఎల్. మరియు ప్రియా ప్రభు దంపతులు నడుపుతున్నారు. వారి లోకోమోటర్ వైకల్యాలను లెక్కచేయకుండా వారు ధైర్యంగా వ్యాపారం చేశారు. వారి ప్రయత్నాలు ఫలించాయి, మడిపాక్కంలో వారికి మంచి ఆదరణ లభిస్తోంది.

పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ బర్త్‌డే!
News· 7 Jul 2026

పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ బర్త్‌డే!

ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్, MRPS ఫౌండర్, పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ పుట్టినరోజు ఈరోజు. సమాజంలో వెనుకబడిన వర్గాలకు సమ న్యాయం జరగాలని, మాదిగ రిజర్వేషన్ల కోసం ఆయన సుమారు 30 ఏళ్లుగా నిరంతరం పోరాటం చేస్తున్నారు. సామాజిక న్యాయం కోసం శ్రమిస్తున్న ఆయన బర్త్‌డే సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానులు, పలువురు ప్రముఖులు పెద్ద ఎత్తున విషెస్ చెప్తున్నారు.

బంగ్లాదేశ్ చైనా వైపు మొగ్గు: భారత్‌తో సామరస్యం కోరుతూ
General· 7 Jul 2026

బంగ్లాదేశ్ చైనా వైపు మొగ్గు: భారత్‌తో సామరస్యం కోరుతూ

చరిత్రాత్మకంగా దక్షిణాసియా నాయకుల తొలి విదేశీ పర్యటనకు భారత్‌నే ఎంచుకోవడం ఆనవాయితీ. అయితే పదవీ చ్యుత బంగ్లాదేశ్ నేత షేక్ హసీనాతో దిల్లీ కొనసాగించిన సన్నిహిత సంబంధాల నేపథ్యంలో రెహ్మాన్ చైనా పర్యటనను దిల్లీకి పంపిన రాజకీయ సందేశంగా భారత్‌లో కొందరు చూస్తున్నారు. భారత్‌తో సామరస్యం కోరుతూనే చైనా వైపు మొగ్గు చూపుతున్న బంగ్లాదేశ్ వైఖరి చర్చనీయాంశమైంది.

జనగాంలో విషాదం.. 20 పేజీల సూసైడ్ నోట్ కలకలం
Crime· 7 Jul 2026

జనగాంలో విషాదం.. 20 పేజీల సూసైడ్ నోట్ కలకలం

TG: 20పేజీల సూసైడ్ నోట్ రాసి రిటైర్డ్‌ టీచర్‌ ఆత్మహత్య చేసుకున్న ఘటన జనగామ పట్టణంలోని పూర్ణిమ కాలనీలో చోటు చేసుకుంది. రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ సకాలంలో అందకపోవడం, ఆర్థిక ఇబ్బందులతో ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తనకు రావాల్సిన రూ.10,77,528, 21నెలలు గడిచినా ప్రభుత్వం చెల్లించలేదు. పలువురు బంధువులు కూడా తీసుకున్న అప్పులు తిరిగి ఇవ్వకపోవడం, తను తీసుకున్న అప్పులకు వడ్డీలు కట్టలేక, వారి వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సుమారు 20 పేజీల సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు.

అయోధ్య రామ్ మందిర్‌లో CCTVలో దొరికిపోయిన స్టాఫ్!
News· 7 Jul 2026

అయోధ్య రామ్ మందిర్‌లో CCTVలో దొరికిపోయిన స్టాఫ్!

అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసులో SIT కీలక ఆధారాలు సేకరించింది. టెంపుల్‌లో విరాళాలు లెక్కించే కొందరు స్టాఫ్ మెంబర్స్ కరెన్సీ నోట్ల కట్టలను, చిల్లరను తమ బూట్లు, జేబుల్లో దాచిపెడుతూ CCTV కెమెరాలకు దొరికిపోయారు. నిందితులు దాదాపు 70 సార్లు ఈ దొంగతనాలకు పాల్పడినట్లు అధికారులు కన్ఫర్మ్ చేశారు. అక్కడ సెక్యూరిటీ, డాక్యుమెంటేషన్ లో ఉన్న లోపాలను వాడుకుని ఈ స్కామ్ కి పాల్పడ్డారు. దీనిపై మరింత ఇన్ఫర్మేషన్ కోసం లాస్ట్ ఐదేళ్ల అకౌంట్స్ ని అధికారులు పునః పరిశీలన చేస్తున్నారు.

యాదాద్రి జిల్లాలో విషాదం.. ఉద్యమ నేత ఇకలేరు
Politics· 7 Jul 2026

యాదాద్రి జిల్లాలో విషాదం.. ఉద్యమ నేత ఇకలేరు

TG: భువనగిరి మాజీ MLA, ప్రత్యేక తెలంగాణ ఉద్యమకారుడు కొమ్మిడి నర్సింహారెడ్డి(83) మంగళవారం కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు బుధవారం నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. కొమ్మిడి నర్సింహారెడ్డి ప్రజాచైతన్య వేదిక వ్యవస్థాపకుడిగా, గోదావరి జలాల సాధన ఉద్యమ నేతగా, మూసీ పరిరక్షణ కోసం ఉద్యమించారు. ఆయన మృతి పట్ల CM రేవంత్ రెడ్డి, పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

పోస్టర్ కాదు.. మొబైల్ మ్యాజిక్!
Cinema· 7 Jul 2026

పోస్టర్ కాదు.. మొబైల్ మ్యాజిక్!

సినిమా పోస్టర్లు ఇప్పుడు థియేటర్ గోడల కోసం కాదు.. స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ల కోసం డిజైన్ అవుతున్నాయి. వేగంగా స్క్రోల్ చేసే ప్రేక్షకుల దృష్టిని క్షణాల్లో ఆకర్షించేలా బోల్డ్ గ్రాఫిక్స్, అనిమే స్టైల్, కొరియన్ విజువల్ టచ్‌కు ప్రాధాన్యం పెరిగింది. AA23, సామవర్తి, డ్యూడ్ పోస్టర్లు ఈ ట్రెండ్‌కు ఉదాహరణలు. పోస్టర్‌తో ఆగకుండా టైటిల్ లోగోలు, మ్యూజిక్ ఆర్ట్, సోషల్ మీడియా కంటెంట్ వరకు ఒకే విజువల్ ఐడెంటిటీని క్రియేట్ చేస్తూ సినీ ప్రమోషన్ కొత్త రూపం దాల్చుతోంది.

గురుకులంలో ర్యాగింగ్ కలకలం
TG· 7 Jul 2026

గురుకులంలో ర్యాగింగ్ కలకలం

TG: కుమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లోని జ్యోతి బాపూలే గురుకుల పాఠశాల, కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది. దహెగాం మండలానికి చెందిన ఓ విద్యార్థిని గురుకుల పాఠశాలలో పదోతరగతి చదువుతోంది. రాత్రి భోజనం చేసిన తర్వాత బాలికను కొందరు విద్యార్థినులు అడ్డుకున్నారు. తమను గుర్తుపట్టకుండా ముఖంపై దుప్పటి కప్పి నోట్లో పెన్ను క్యాప్ వేసి బలవంతంగా నీళ్లు తాగించారు. క్యాప్ కడుపులోకి వెళ్లడంతో విద్యార్థిని ఎస్‌వోకు సమాచారం అందించడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్స్ క్యాప్‌ను బయటకు తీశారు. బాలిక ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండడంతో ఇంటికి తీసుకెళ్లారు.

తిరుమల బస్సులు బంద్
AP· 7 Jul 2026

తిరుమల బస్సులు బంద్

AP: తిరుమలకు వెళ్లే ఎలక్ట్రిక్ AC బస్సులను అలిపిరి డిపోలో నిలిపివేసి డ్రైవర్లు ఆందోళన చేశారు. ప్రతి డ్యూటీలో తప్పనిసరిగా 5 ట్రిప్పులు పూర్తి చేయాలని మేనేజ్మెంట్ నిబంధన పెట్టిందని, 5 ట్రిప్పులు పూర్తి చేయకపోతే నెలవారీ జీతానికి బదులుగా ట్రిప్పుల ఆధారంగా వేతనం చెల్లిస్తామని నిర్ణయించడంతో ఆందోళనకు దిగినట్లు వారు తెలిపారు. తిరుమలకు నడిచే ఎలక్ట్రిక్ AC బస్సుల నిర్వహణను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించే నిర్ణయాన్ని డ్రైవర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ మార్పు వలన రాబోయే రోజుల్లో APSRTC ప్రైవేటీకరణ వైపు వెళ్తుందని వారు ఆందోళన చెందుతున్నారు.

టెన్షన్ టెన్షన్.. 10వ రోజుకి చేరిన సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష!
Education· 7 Jul 2026

టెన్షన్ టెన్షన్.. 10వ రోజుకి చేరిన సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష!

ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలని డిమాండ్ చేస్తూ సోనమ్ వాంగ్‌చుక్ చేస్తున్న నిరాహార దీక్ష ఈరోజుతో 10వ రోజుకి చేరింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్న ఈ ప్రొటెస్ట్ లో ఆయన హెల్త్ కండిషన్ చాలా సీరియస్ గా మారింది. ప్రస్తుతం ఆయన బ్లడ్ ప్రెజర్ (BP) 102/61 కి, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ 68 కి పడిపోయాయి. ఈ 10 రోజుల్లో ఆయన ఏకంగా 7.3 కేజీల వెయిట్ లాస్ అయ్యారు. ఆయన హెల్త్ కండిషన్ పై ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరూ తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

APలో కొత్త స్కీమ్: పిల్లలు ఉంటే క్యాష్ గిఫ్ట్!
Politics· 7 Jul 2026

APలో కొత్త స్కీమ్: పిల్లలు ఉంటే క్యాష్ గిఫ్ట్!

AP గవర్నమెంట్ సరికొత్త స్కీమ్ తీసుకొచ్చింది. ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న పేరెంట్స్‌కి రూ.5 వేల క్యాష్ గిఫ్ట్ ఇవ్వనుంది. ఇందులో భాగంగా ప్రతి జిల్లాలో ముగ్గురు పిల్లలు ఉన్న మూడు జంటలను సెలెక్ట్ చేసి ఈ మనీ ఇస్తారు. అలాగే ఫస్ట్ చైల్డ్ కి, సెకండ్ చైల్డ్ కి మధ్య కనీసం రెండేళ్ల గ్యాప్ మెయింటైన్ చేసిన వారికి కూడా రూ.5 వేల రివార్డ్ ఇస్తారు. దీనిపై అవేర్‌నెస్ పెంచేందుకు ఈనెల 11 నుంచి 18 వరకు రాష్ట వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు జరగనున్నాయి.

సూసైడ్ కేసులో ట్విస్ట్..  CI నాగరాజుపై అట్రాసిటీ కేసు
AP· 7 Jul 2026

సూసైడ్ కేసులో ట్విస్ట్.. CI నాగరాజుపై అట్రాసిటీ కేసు

AP: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన క్రాంతికుమార్ సూసైడ్ కేసులో నిందితుడిగా ఉన్న సస్పెండెడ్ CI నాగరాజుపై SC, ST అట్రాసిటీ కేసు నమోదు చేశారు. క్రాంతికుమార్ ఆత్మహత్యకు పాల్పడటానికి ముందు రికార్డ్ చేసిన సెల్ఫీ వీడియో ఈ కేసులో కీలకంగా మారింది. తన చావుకు CI నాగరాజు కారణమని, ఆయన పెట్టిన టార్చర్ భరించలేకే ఈ నిర్ణయం తీసుకుంటున్నానని క్రాంతికుమార్ ఆ వీడియోలో పేర్కొన్నాడు. ఈ ఆధారాల పరిశీలన అనంతరం, అధికారులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కేసులో చేర్చారు. CIపై కఠిన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

మహిళల కెరీర్‌కి బ్రేక్ అసలు రీజన్ ఇదే ?
Politics· 7 Jul 2026

మహిళల కెరీర్‌కి బ్రేక్ అసలు రీజన్ ఇదే ?

దేశంలోని పెద్ద నగరాల్లో మహిళలు ఉద్యోగాలకు దూరమవడానికి చైల్డ్‌కేర్, ఇంటి పనులే మెయిన్ రీజన్స్. హౌరాలో 83%, సూరత్‌లో 81% మంది ఇదే రీజన్ చెప్పగా, హైదరాబాద్‌లో ఈ శాతం 58% గా ఉంది. మరోవైపు 16% మంది హయ్యర్ స్టడీస్ కోసం, 10% మంది హెల్త్ ఇష్యూస్ వల్ల జాబ్స్ వదిలేశారు. అలాగే జాబ్స్ క్వాలిటీ పెరిగినా, మహిళల శాలరీ పురుషుల కంటే యావరేజ్‌గా 23% తక్కువగానే ఉండటం గమనార్హం.

భర్త నరాల్లోకి హార్పిక్‌ ఎక్కించి హత్య
Crime· 7 Jul 2026

భర్త నరాల్లోకి హార్పిక్‌ ఎక్కించి హత్య

TG: నిజామాబాద్ జిల్లా మోపాల్‌ మండలం న్యాల్‌కల్‌కు చెందిన ప్రశాంత్‌(35), సంధ్య దంపతులు. ఉపాధి నిమిత్తం దుబాయ్‌కి వెళ్లిన ప్రశాంత్‌ గతనెల 27న తిరిగి వచ్చాడు. సంధ్యకు అనిల్‌తో వివాహేతర సంబంధముంది. భర్తను అడ్డు తొలగించుకోవాలని న్యాల్‌కల్‌ వాసి బంటితో సంధ్య ప్లాన్ వేసింది. మద్యం తాగించి భర్తను దాబా పైనుంచి తోసేశారు. కానీ ప్రశాంత్‌ గాయాలతో బయటపడడంతో హాస్పిటల్‌లో చికిత్స చేయించారు. భర్త ఎక్కడ కోలుకుంటాడోనని భావించిన సంధ్య, అతని చేతికి ఉన్న సెలైన్ బాటిల్ ద్వారా టాయిలెట్‌ క్లీనర్(హార్పిక్)‌ను ఎక్కించింది. ప్రశాంత్‌ కన్నుమూశాడు. పోలీసులు సంధ్య, బంటి, అనిల్‌ను అరెస్ట్ చేశారు.