బిగ్ ట్విస్ట్: హత్యకు ముందే ప్రియుడిని పెళ్లాడిన సియా గోయల్!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుణె రియల్టర్ 'కేతన్ అగర్వాల్' మర్డర్ కేసులో మరో షాకింగ్ నిజం బయటపడింది. కేతన్‌ని మర్డర్ చేయడానికి ముందే.. నిందితురాలు సియా గోయల్ తన బాయ్‌ఫ్రెండ్ చేతన్ చౌదరిని సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నట్లు పోలీస్ ఇన్వెస్టిగేషన్‌లో తేలింది. వీరిద్దరూ ఎవరికీ తెలియకుండా దాదాపు నాలుగు నెలల క్రితమే పెళ్లి చేసుకున్నారని అధికారులు కన్ఫర్మ్ చేశారు. ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతూ సంచలనం సృష్టిస్తోంది.



