Latest

సందీప్ వంగాకు ప్రభాస్ క్రేజీ ప్రామిస్ !
Cinema· 4 Jul 2026

సందీప్ వంగాకు ప్రభాస్ క్రేజీ ప్రామిస్ !

బాస్, ప్రభాస్ 'యానిమల్' డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకు ఒక క్రేజీ ప్రామిస్ ఇచ్చాడు! "నువ్వు నాతో సినిమా తీస్తే 100% నీకు నచ్చినట్టే చేస్తా, అసలు నో చెప్పను" అంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చేశాడు. వంగా మార్క్ వైల్డ్ అండ్ రా క్యారెక్టరైజేషన్స్‌కి రెబల్ స్టార్ స్వాగ్ తోడైతే బాక్సాఫీస్ దగ్గర పూనకాలే. ఈ కాంబోలో రాబోయే 'స్పిరిట్' మూవీ కోసం ఫ్యాన్స్ ఇప్పుడే థియేటర్లలో రచ్చ చేయడానికి రెడీ అయిపోతున్నారు!

'ఆంటీ' కాదు.. కొత్త తరం ఐకాన్!
General· 4 Jul 2026

'ఆంటీ' కాదు.. కొత్త తరం ఐకాన్!

ఒకప్పుడు 'ఆంటీ' అనే పదాన్ని వ్యంగ్యంగా వాడేవారు. ఇప్పుడు 40+ మహిళలు ఆర్థిక స్వావలంబన, ఆత్మవిశ్వాసం, స్టైల్‌తో కొత్త గుర్తింపు తెచ్చుకుంటున్నారు. బెంగళూరుకు చెందిన టీచర్ సనా మిశ్రా తనను గర్వంగా 'ఆంటీ' అని పిలవమంటారు. నటి జీనత్ అమన్, కంటెంట్ క్రియేటర్ జర్నా గార్గ్, సెక్స్ ఎడ్యుకేటర్ సీమా ఆనంద్ కూడా వయసును కాదు, స్వేచ్ఛను సెలబ్రేట్ చేస్తూ కొత్త తరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

డార్క్ చాక్లెట్ డే స్పెషల్.. గిల్ట్ లేకుండా తీపి ఆస్వాదించండి!
Health· 4 Jul 2026

డార్క్ చాక్లెట్ డే స్పెషల్.. గిల్ట్ లేకుండా తీపి ఆస్వాదించండి!

జూలై 7న జరుపుకునే వరల్డ్ చాక్లెట్ డే సందర్భంగా చెఫ్స్ ప్రత్యేక కోకో వంటకాలను సూచించారు. బవేరియన్ చాక్లెట్ టోస్ట్, ఫ్లోర్‌లెస్ డార్క్ చాక్లెట్ కేక్, పెప్పర్‌కార్న్ చాక్లెట్ మూస్, డార్క్ డీడ్ XL కుకీ వంటి వినూత్న రెసిపీలు ఆకట్టుకుంటున్నాయి. కనీసం 70% కోకో ఉన్న డార్క్ చాక్లెట్‌లో యాంటీఆక్సిడెంట్లు, ఐరన్, మెగ్నీషియం, కాపర్ వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు మూడ్‌ను మెరుగుపరుస్తాయి. రోజుకు 20–30 గ్రాములు మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

గట్ హెల్త్ కి నాడీ వ్యవస్థే అత్యంత కీలకం !
Health· 4 Jul 2026

గట్ హెల్త్ కి నాడీ వ్యవస్థే అత్యంత కీలకం !

జీర్ణక్రియ మెరుగుపడటానికి చాలామంది ప్రోబయోటిక్స్, ఫైబర్ ఫుడ్స్ తీసుకుంటారు. అయితే, అసలు రహస్యం మన 'నెర్వస్ సిస్టమ్' (నరాల వ్యవస్థ) లో ఉందని న్యూట్రిషనిస్ట్ దీప్శిఖ జైన్ అంటున్నారు. దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల నరాల వ్యవస్థ దెబ్బతిని మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. మెదడు, జీర్ణాశయం 'గట్-బ్రెయిన్ యాక్సిస్' ద్వారా అనుసంధానమై ఉంటాయి. కాబట్టి, ప్రశాంతంగా తింటూ, ధ్యానం, శ్వాస వ్యాయామాలు (Diaphragmatic breathing) చేస్తూ నరాల వ్యవస్థను నియంత్రించుకుంటేనే జీర్ణక్రియ మెరుగవుతుంది.

కన్ను అదురుతోందని కొట్టుకున్నాడు- చూపే పోయింది !
News· 4 Jul 2026

కన్ను అదురుతోందని కొట్టుకున్నాడు- చూపే పోయింది !

కన్ను అదరడం అరిష్టానికి సంకేతమని నమ్మిన చైనాకు చెందిన ఒక వ్యక్తి వింత పని చేసి చూపు కోల్పోయాడు. ఎడమ కన్ను నిరంతరాయంగా అదరడంతో, అది చెడు జరుగుతుందనే సంకేతంగా భావించి ఆ అదరడాన్ని ఆపడానికి తన కనురెప్పపై గట్టిగా కొట్టుకున్నాడు. దురదృష్టవశాత్తూ, ఆ దెబ్బకు కంటి లోపల తీవ్రమైన రక్తస్రావం జరిగి, రెటీనా దెబ్బతింది. వైద్యులు అత్యవసర సర్జరీ చేసినప్పటికీ, అతను తన ఎడమ కంటి చూపును పూర్తిగా కోల్పోయాడని వైద్య నివేదికలు పేర్కొన్నాయి.

ఖమేనీ అంత్యక్రియలు:  చిన్నారి శవపేటిక విషాదం !
World· 4 Jul 2026

ఖమేనీ అంత్యక్రియలు: చిన్నారి శవపేటిక విషాదం !

ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ అధికారిక అంత్యక్రియలు టెహ్రాన్‌లో ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలో ఆయన శవపేటిక పక్కనే ఉంచిన ఒక చిన్న శవపేటిక, దానిపై ఉన్న 14 నెలల చిన్నారి ఫోటో అందరినీ కన్నీటిపర్యంతం చేసింది. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఖమేనీతో పాటు ఆయన చిన్న మనవరాలు 'జహ్రా మహమ్మది' కూడా ప్రాణాలు కోల్పోయింది. ఈ చిన్నారి శవపేటికే ఇప్పుడు ఇరాన్ జాతీయ శోకానికి ప్రతీకగా నిలిచింది.

మెట్రోలో సెన్సేషనల్ అవుతున్న  మీమ్ వార్ !
Viral· 4 Jul 2026

మెట్రోలో సెన్సేషనల్ అవుతున్న మీమ్ వార్ !

మెట్రో రైళ్లలో ఇప్పుడు సరికొత్త బుక్ వార్ నడుస్తోంది. మొన్న ఒక యువతి How to Kill Men and Get Away With It అనే బుక్ ను చదవడం సోషల్ మీడియాలో వైరల్ కాగానే మరో యువకుడు భార్యను బొంద పెట్టడం ఎలా ? - RGV బుక్ ను చదువుతు న్నట్లుగా వీడియోలు వైరల్ అవుతున్నాయి.అయితే అందరూ అనుకుంటున్నట్లు అలాంటి బుక్కే లేదు. ఫేక్ కవర్తో కూడిన బుక్ తో ఆ యువకుడు మెట్రో రైల్లో కనిపించడం వైరల్ అవుతోంది. భార్యా, భర్తల మధ్య హత్యలు ఎక్కువవుతున్న ప్రస్తుత పరిస్థితికి అద్దం పట్టేలా ఈ వీడియోలు ఉన్నా...ఇది భార్యా భర్తల రిలేషన్స్ లో దిగజారుతున్న విలువలకు సంకేతంగా నిపుణులు చెబుతున్నారు.

ఖమేనీ అంత్యక్రియల్లో వేలమంది చనిపోతారేమోనని ఇరాన్ భయం!
World· 4 Jul 2026

ఖమేనీ అంత్యక్రియల్లో వేలమంది చనిపోతారేమోనని ఇరాన్ భయం!

ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియల సందర్భంగా వేలాది మంది చనిపోయే అవకాశం ఉందని ఇరాన్ భయపడుతోంది. అయాతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల కోసం మిలియన్ల కొద్దీ జనం తరలివస్తున్నారు. అయితే, విపరీతమైన ఎండలు, తొక్కిసలాట జరిగితే దాదాపు 1,500 నుండి 3,000 మంది వరకు చనిపోయే అవకాశం ఉందని జర్మన్ వార్తాపత్రిక 'డై వెల్ట్' సంచలన నివేదిక ఇచ్చింది. ఇందుకోసం అధికారులు టెహ్రాన్ స్మశానవాటికలో వేలాది ముందస్తు సమాధులను సిద్ధం చేశారు.

నన్ను చంపి మాత్రమే అడ్డుకోగలరు- మమత
Politics· 4 Jul 2026

నన్ను చంపి మాత్రమే అడ్డుకోగలరు- మమత

నన్ను ఆపాలంటే నన్ను చంపేయండి అంటున్నారు బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ. ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ సంక్షోభంలో పడిపోయింది. రెబల్స్ సెపరేట్ గ్రూప్ అయిపోవడంతో ఆమె ఏకాకి అవుతున్నారు. ఆ నేపధ్యంలో ఆమె తీవ్రమైన అసహనంలో ఉన్నారు.. పార్టీ గుర్తు తమ వద్దే ఉంటుందని, లీగల్ ఫైట్‌కి సిద్ధమని స్పష్టం చేశారు. తన పట్ల లాయల్ గా ఉన్నవారికి మాత్రమే తృణమూల్ సింబల్ దక్కుతుందని మమత ఆవేశంగా అన్నారు. బెంగాల్ టీఎంసీ చీఫ్ చంద్రిమా భట్టాచార్య కూడా రాజీనామా చేయడంతో మమత స్వయంగా పార్టీ బాధ్యతలు చేపట్టారు.

డైలీ ఎక్సర్‌సైజ్ చేస్తే వచ్చే సూపర్ బెనిఫిట్స్ ఇవే!
Health· 4 Jul 2026

డైలీ ఎక్సర్‌సైజ్ చేస్తే వచ్చే సూపర్ బెనిఫిట్స్ ఇవే!

ఈ రోజుల్లో ఫిట్‌గా ఉండాలంటే డైలీ ఎక్సర్‌సైజ్ చేయడం చాలా ముఖ్యం. డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే. రెగ్యులర్ గా వర్కవుట్స్ చేయడం వల్ల బాడీలో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయి మెంటల్ స్ట్రెస్ తగ్గుతుంది. అంతేకాదు, ఎక్స్‌ట్రా కేలరీలు బర్న్ అయి వెయిట్ కంట్రోల్‌లో ఉంటుంది. హార్ట్ ప్రాబ్లమ్స్, బీపీ, షుగర్ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడంతో పాటు ఇమ్యూనిటీ, ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. రాత్రి నిద్ర పట్టని ప్రాబ్లం కూడా దూరమై రోజంతా ఫుల్ యాక్టివ్‌గా ఉంటారు.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల డేట్స్ ఫిక్స్!
News· 4 Jul 2026

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల డేట్స్ ఫిక్స్!

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల (Monsoon Session) షెడ్యూల్ ఫిక్స్ అయింది. ఈ ఏడాది సమావేశాలు జులై 20 నుంచి ఆగస్టు 13 వరకు జరగనున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు శనివారం అనౌన్స్ చేశారు. ప్రభుత్వం పంపిన సిఫారసులకు ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ డేట్స్‌ ఖరారయ్యాయి. దేశంలోని కీలక అంశాలపై అర్థవంతమైన చర్చలు, బిల్లులపై పరిశీలన జరగాలని కోరుతూ కిరణ్ రిజిజు X లో ట్వీట్ చేశారు.

అయోధ్య విరాళాల కౌంటింగ్‌లో కఠిన నిబంధనలు!
News· 4 Jul 2026

అయోధ్య విరాళాల కౌంటింగ్‌లో కఠిన నిబంధనలు!

అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ విరాళాల కౌంటింగ్ సిస్టమ్‌లో కఠిన రూల్స్ తెచ్చింది. విరాళాలు లెక్కించేటప్పుడు సిబ్బంది మొబైల్స్, కెమెరాలు, బ్యాగులు వాడటంపై పూర్తి నిషేధం విధించింది. సిబ్బంది కుర్చీల్లో కాకుండా నేలపైనే కూర్చుని లెక్కించాలని, జేబులు లేని డార్క్ బ్లూ యూనిఫామ్ మాత్రమే ధరించాలని డ్రెస్ కోడ్ పెట్టింది. SIT సూచనలతో కౌంటింగ్ హాల్‌లో 24 గంటలు CCTV నిఘా ఉంచడంతో పాటు, సిబ్బందికి రెండు సార్లు సెక్యూరిటీ స్క్రీనింగ్ చేయనున్నారు.

ఉల్లి రైతులకు కేంద్రం గుడ్ న్యూస్!
News· 4 Jul 2026

ఉల్లి రైతులకు కేంద్రం గుడ్ న్యూస్!

ఉల్లి రైతులకు కేంద్ర ప్రభుత్వం మంచి అవకాశం ఇచ్చింది. ఉల్లి కనీస మద్దతు ధరను ఏకంగా 13% పెంచింది. దీంతో క్వింటాల్‌ ఉల్లి ధర రూ.1,875 నుంచి రూ.2,125కు పెరిగింది. ఉల్లి నిల్వలను సేకరించడం స్లో అవ్వడంతో, రైతులకు లాభం చేకూర్చేలా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. మే నెల నుంచి ధరను దశలవారీగా పెంచుకుంటూ వచ్చి, ఇప్పుడు రూ.21కి చేర్చింది. ఈ కొత్త రేటు ఇమ్మీడియట్‌గా అమల్లోకి వస్తుందని కేంద్రం అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది.

5 కేజీలు తగ్గిన సోనమ్ వాంగ్‌చుక్!▶
News· 4 Jul 2026

5 కేజీలు తగ్గిన సోనమ్ వాంగ్‌చుక్!

సోనమ్ వాంగ్‌చుక్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష 7వ రోజుకు చేరింది. ఆయన ఇప్పటికే 5 కేజీల బరువు తగ్గారని, హెల్త్ కండిషన్ రోజురోజుకూ క్షీణిస్తోందని కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజీత్ దీప్కే ఆందోళన వ్యక్తం చేశారు. పేపర్ లీక్స్ వల్ల 20 మంది స్టూడెంట్స్ చనిపోయినా, ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవి నుంచి తొలగించడానికి ప్రధాని మోదీ ఎందుకు వెనకాడుతున్నారని, ఆయన ప్రధానికి అంత ముఖ్యామా అని అభిజీత్ దీప్కే ఘాటుగా ప్రశ్నించారు.

6వ అంతస్తు నుంచి దూకిన IIIT స్టూడెంట్!
News· 4 Jul 2026

6వ అంతస్తు నుంచి దూకిన IIIT స్టూడెంట్!

హైదరాబాద్ గచ్చిబౌలిలోని IIIT భవనం 6వ అంతస్తు నుంచి దూకి ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయిన స్టూడెంట్ ఖమ్మం జిల్లాకు చెందిన అభిరూప్ గా గుర్తింపు లభించింది. గత కొంతకాలంగా అభిరూప్ తీవ్ర అనారోగ్య సమస్యలతో పాటు, కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పాట్ కి చేరుకుని, డెడ్‌బాడీని హాస్పిటల్ కి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఉప్పల్‌లో షాకింగ్ మర్డర్
Crime· 4 Jul 2026

ఉప్పల్‌లో షాకింగ్ మర్డర్

TG: మేడ్చల్ జిల్లా ఉప్పల్ PS పరిధిలోని ఆదర్శనగర్‌లో సురేష్, జెస్సికా దంపతులు నివాసం ఉంటున్నారు. జెస్సికా స్థానిక ఓ ఆసుపత్రిలో నర్సుగా విధులు నిర్వహిస్తోంది. కొంతకాలంగా భార్య ప్రవర్తనపై భర్త సురేష్ అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయమై గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. శనివారం మరోసారి తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. సురేష్.. ఇంట్లో ఉన్న కత్తిని తీసుకుని జెస్సికా కడుపులో విచక్షణారహితంగా పొడవడంతో ఆమె స్పాట్‌లోనే చనిపోయింది. స్థానికుల సమాచారం మేరకు ఉప్పల్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

నా కొడుకును పోలీసులే చంపేశారు
AP· 4 Jul 2026

నా కొడుకును పోలీసులే చంపేశారు

AP: రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన సాయికృష్ణ కేసులో మెజిస్టీరియల్ విచారణ కొనసాగుతోంది. విజయవాడలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన విచారణకు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి, మేనమామ నాగేశ్వరరావు, మేనత్త హాజరై తమ వాంగ్మూలాలను సమర్పించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి సంచలన ఆరోపణలు చేశారు. తన కుమారుడు సాయికృష్ణను పోలీసులే చంపేసి, మృతదేహాన్ని మాయం చేశారని ఆరోపించారు. కృష్ణలంక PSలో సాయికృష్ణ ఉన్నట్లు సమాచారం రాగానే అక్కడికి వెళ్లామని విజయలక్ష్మి తెలిపారు. CI నాగరాజు తన కుమారుడిని చూడనీయకుండా వెనక్కి పంపించారని అన్నారు.

టీచర్ రాక.. చిన్నారులు చేపల వేట
Local· 4 Jul 2026

టీచర్ రాక.. చిన్నారులు చేపల వేట

TG: కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని రింగైట్ గిరిజన ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు విధులకు హాజరుకాకపోవడంతో బడికి తాళం పడింది. ఉదయాన్నే బడికి వెళ్లి చదువుకోవాల్సిన ఆ గిరిజన విద్యార్థులు స్కూల్‌ క్లోజ్ చేసి ఉండడంతో నిరాశగా వెనుదిరిగారు. పుస్తకాలు చేతబట్టాల్సిన ఆ పసి చేతులు సమీపంలోని వాగుల్లో చేపల వేటకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఘటనపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల నిర్వహణ, ఉపాధ్యాయుల హాజరుపై సంబంధిత అధికారుల పర్యవేక్షణ లోపించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రావణ్ సపోర్టర్లపై గుడ్లతో దాడి చేసిన జనసేన కార్యకర్తలు!▶
AP· 4 Jul 2026

రావణ్ సపోర్టర్లపై గుడ్లతో దాడి చేసిన జనసేన కార్యకర్తలు!

నక్కపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర సీన్ మరింత హీటెక్కింది. యూట్యూబర్ ప్రశ్న రావణ్‌కు సపోర్ట్ చేయడానికి వచ్చిన కొందరు నెటిజన్లపై జనసేన కార్యకర్తలు ఒక్కసారిగా గుడ్లతో ఎటాక్ చేశారు. తేనెటీగల గుంపులా ఒకేసారి రావణ్ సపోర్టర్లపై పడి గొడవకు దిగడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నా, జనసేన కార్యకర్తలు మాత్రం అస్సలు తగ్గడం లేదు.

ఫేక్ హెల్త్ సెంటర్ల గుట్టు రట్టు.. సీజ్
Health· 4 Jul 2026

ఫేక్ హెల్త్ సెంటర్ల గుట్టు రట్టు.. సీజ్

AP: అనంతపురం నగరంలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న నాలుగు హెల్త్ కేర్ సెంటర్‌లను DMHO ఈబీ దేవి సీజ్ చేశారు. అసిస్టెంట్ కలెక్టర్ సుయాస్ కుమార్, DMHO ఈబీ దేవి ఆధ్వర్యంలో నగరంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఎలాంటి మందులు వాడకుండా, కేవలం థెరపీల ద్వారా దీర్ఘకాలిక రోగాలు, మోకాళ్ల నొప్పులను పూర్తిగా నయం చేస్తామంటూ సోషల్ మీడియాలో మోసపూరిత ప్రచారాలు చేస్తున్న సెంటర్‌లపై అధికారులు చర్యలు తీసుకున్నారు. కైరో ప్రాక్టీస్ సెంటర్, ప్యూర్ కైరో సెంటర్, ట్రస్ట్ ఫిజియోథెరపీ సెంటర్, పెయిన్ ఫ్రీ లైఫ్ విత్ మై హెల్త్ కేర్ సెంటర్‌లను సీజ్ చేశారు.

ప్రశ్న రావణ్ పై దాడికి జనసేన ప్లాన్!▶
Politics· 4 Jul 2026

ప్రశ్న రావణ్ పై దాడికి జనసేన ప్లాన్!

అనకాపల్లి జిల్లా నక్కపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర జనసేన కార్యకర్తలు తీవ్ర హంగామా చేశారు. స్టేషన్ లో ఉన్న యూట్యూబర్ ప్రశ్న రావణ్‌ను తమకు అప్పగించాలంటూ గొడవకు దిగారు. "అతని చేతులు నరుకుతాం, నాలుక కోస్తాం" అంటూ పోలీసుల ముందే కర్రలతో వచ్చి ఓపెన్ వార్నింగ్స్ ఇచ్చారు. అయితే గొడవ చేస్తున్న జనసేన నాయకులతో పోలీసులు నవ్వుతూ మాట్లాడటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.