ఫేక్ హెల్త్ సెంటర్ల గుట్టు రట్టు.. సీజ్

AP: అనంతపురం నగరంలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న నాలుగు హెల్త్ కేర్ సెంటర్‌లను DMHO ఈబీ దేవి సీజ్ చేశారు. అసిస్టెంట్ కలెక్టర్ సుయాస్ కుమార్, DMHO ఈబీ దేవి ఆధ్వర్యంలో నగరంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఎలాంటి మందులు వాడకుండా, కేవలం థెరపీల ద్వారా దీర్ఘకాలిక రోగాలు, మోకాళ్ల నొప్పులను పూర్తిగా నయం చేస్తామంటూ సోషల్ మీడియాలో మోసపూరిత ప్రచారాలు చేస్తున్న సెంటర్‌లపై అధికారులు చర్యలు తీసుకున్నారు. కైరో ప్రాక్టీస్ సెంటర్, ప్యూర్ కైరో సెంటర్, ట్రస్ట్ ఫిజియోథెరపీ సెంటర్, పెయిన్ ఫ్రీ లైఫ్ విత్ మై హెల్త్ కేర్ సెంటర్‌లను సీజ్ చేశారు.



