ఉల్లి రైతులకు కేంద్రం గుడ్ న్యూస్!

ఉల్లి రైతులకు కేంద్ర ప్రభుత్వం మంచి అవకాశం ఇచ్చింది. ఉల్లి కనీస మద్దతు ధరను ఏకంగా 13% పెంచింది. దీంతో క్వింటాల్ ఉల్లి ధర రూ.1,875 నుంచి రూ.2,125కు పెరిగింది. ఉల్లి నిల్వలను సేకరించడం స్లో అవ్వడంతో, రైతులకు లాభం చేకూర్చేలా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. మే నెల నుంచి ధరను దశలవారీగా పెంచుకుంటూ వచ్చి, ఇప్పుడు రూ.21కి చేర్చింది. ఈ కొత్త రేటు ఇమ్మీడియట్‌గా అమల్లోకి వస్తుందని కేంద్రం అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది.



