Latest

హరీష్ రావు, విజయ్ దేవరకొండ సిద్దిపేటలో సందడి!▶
Viral· 4 Jul 2026

హరీష్ రావు, విజయ్ దేవరకొండ సిద్దిపేటలో సందడి!

మాజీ మంత్రి హరీష్ రావు, హీరో విజయ్ దేవరకొండ కలిసి సిద్దిపేట జిల్లా కొండపాకలోని శ్రీ సత్యసాయి సంజీవని చైల్డ్ హార్ట్ కేర్ అండ్ రీసెర్చ్ సెంటర్‌ను విజిట్ చేశారు. హాస్పిటల్‌లోని చిన్న పిల్లల హార్ట్ సర్జరీ వార్డులను పరిశీలించి, అక్కడ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న పిల్లల హెల్త్ కండిషన్ గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. హరీష్ రావు, విజయ్ దేవరకొండలను ఒకేసారి చూసేసరికి అక్కడ ఉన్నవాళ్లంతా ఫుల్ ఖుషీ అయ్యారు.

పిల్లలకు వీడియో కాల్ చేసి దంపతుల ఆత్మహత్య!
News· 4 Jul 2026

పిల్లలకు వీడియో కాల్ చేసి దంపతుల ఆత్మహత్య!

హైదరాబాద్ ఘట్‌కేసర్ పరిధిలో రవికుమార్, శిరీష దంపతులు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. రీసెంట్ గా రెడీమిక్స్ వెహికల్ కొని అప్పులు కావడం, ఇంట్లో గొడవలే దీనికి కారణం అని తెలుస్తోంది. చనిపోయే ముందు కన్న పిల్లలకు వీడియో కాల్ చేసి, "తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో.. గొడవ పడకండి" అని ఏడుస్తూ చెప్పారు. పిల్లలు కంగారుపడేలోపే రైలు కింద పడి ప్రాణాలు వదిలారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రాత్రికి రాత్రే భారీ చోరీ
Crime· 4 Jul 2026

రాత్రికి రాత్రే భారీ చోరీ

AP: తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం మడిబాక గ్రామానికి చెందిన రైతుల పొలాల్లో అమర్చిన విద్యుత్ మోటర్ స్టార్టర్లను దొంగలు చోరీ చేశారు. ఒకేరాత్రి 29 స్టార్టర్లు చోరీకి గురైనట్లు అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం పొలాలకు వెళ్లిన రైతులు స్టార్టర్ బాక్సులు ఖాళీగా ఉండడం, విడిభాగాలు పొలంలో చెల్లాచెదురుగా పడి ఉండడం చూసి కన్నీరు పెట్టుకున్నారు. రాత్రి వేళల్లో పోలీసు గస్తీ పెంచాలని, నిందితులను త్వరగా పట్టుకుని కఠినంగా శిక్షించాలని రైతులు కోరారు. బాధిత రైతులు ఫోన్‌లో ఏర్పేడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

భద్రకాళి ఆలయం వద్ద ఉద్రిక్తత.. నాయకులు అరెస్ట్
Politics· 4 Jul 2026

భద్రకాళి ఆలయం వద్ద ఉద్రిక్తత.. నాయకులు అరెస్ట్

TG: వరంగల్ భద్రకాళి ఆలయం వద్ద మరోసారి టెన్షన్ వాతావరణం నెలకుంది. రాజకీయ సవాళ్లు, ఆరోపణల కోసం BRS, కాంగ్రెస్ నేతలు పవిత్రమైన భద్రకాళి దేవాలయాన్ని వాడుకోవడంపై BJP నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తడిబట్టలతో వచ్చి ఆలయ పవిత్రతను దెబ్బతీశారని, ఆలయాన్ని రాజకీయాలతో అపవిత్రం చేశారని BJP నేతలు ఫైరయ్యారు. ఆలయ పరిసరాలను శుద్ధి చేయాలని నిరసన వ్యక్తం చేశారు. దీంతో నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు, బీజేపీ నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. పలువురు బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

ఒకే ఇంట్లో ముగ్గురు మహిళల సూసైడ్
Crime· 4 Jul 2026

ఒకే ఇంట్లో ముగ్గురు మహిళల సూసైడ్

AP: కృష్ణా జిల్లా గూడూరు మండలం అనంతయ్యపేట గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఒకే ఇంట్లో ముగ్గురు మహిళలు సూసైడ్ చేసుకున్నారు. హనుమకొండ రజిని, మధుబాల, గౌరీదేవి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులు ఒకే కుటుంబానికి చెందిన తల్లి, ఆమె ఇద్దరు కుమార్తెలుగా పోలీసులు గుర్తించారు. డెడ్‌బాడీలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, వ్యక్తిగత సమస్యలు లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే అంశాలపై గూడూరు పోలీసులు సమగ్ర విచారణ చేపట్టారు.

ఉద్యోగాల భర్తీలో కాంగ్రెస్ ఫెయిల్: KTR
Politics· 4 Jul 2026

ఉద్యోగాల భర్తీలో కాంగ్రెస్ ఫెయిల్: KTR

TG: ఏటా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్‌.. రెండున్నరేళ్లు దాటినా అమల్లో విఫలమైందని BRS వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ KTR ఫైరయ్యారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు వెంటనే 20,000 కానిస్టేబుల్‌ ఉద్యోగాలు భర్తీ చేయాలని CM రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. 17వేల పోలీసు పోస్టులు ఖాళీగా ఉన్నాయని RTI ద్వారా బహిర్గతమైందని, 12వేల ఖాళీలు ఉన్నట్టు పలుమార్లు సీఎం, మంత్రులు ప్రకటనలు చేశారని గుర్తుచేశారు. కానీ కేవలం 5వేల ఉద్యోగాల భర్తీకే నోటిఫికేషన్లు విడుదల చేయాలని నిర్ణయించడం దుర్మార్గమని మండిపడ్డారు.

రామమందిరం స్కామ్ దర్యాప్తులో బయటపడ్డ సంచలన నిజాలు!
News· 4 Jul 2026

రామమందిరం స్కామ్ దర్యాప్తులో బయటపడ్డ సంచలన నిజాలు!

అయోధ్య రామ మందిర విరాళాల దుర్వినియోగం కేసులో SIT దర్యాప్తు స్పీడందుకుంది. భక్తులు ఇచ్చిన విరాళాల నుండి నిందితులు రోజుకు రూ.6-8 లక్షలు కాజేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో ట్రస్ట్ బ్యాంకు అకౌంట్లలో రోజుకు రూ.16-18 లక్షలు మాత్రమే జమ అయ్యేవి. కానీ ఈ స్కామ్ వెలుగులోకి వచ్చాక రోజుకు రూ.24-26 లక్షలు డిపాజిట్ అవుతున్నాయి. దీనిపై ఆల్రెడీ 8 మంది ఉద్యోగులను అరెస్ట్ చేసిన పోలీసులు. ఆ డబ్బుతో కొన్న ఆస్తుల డీటెయిల్స్ చెక్ చేస్తున్నారు.

కుక్కల బండి చూశారా ఎప్పుడయినా!!▶
Viral· 4 Jul 2026

కుక్కల బండి చూశారా ఎప్పుడయినా!!

సోషల్ మీడియాలో ప్రజెంట్ ఒక వీడియో ఫుల్ వైరల్ అవుతోంది. జనరల్‌గా గుర్రపు బండ్లు చూస్తుంటాం, కానీ ఈ కుర్రాడు ఏకంగా నాలుగు కుక్కలపై ఒక చెక్క బోర్డు సెట్ చేసి 'డాగ్స్ కార్ట్' లాగా రెడీ చేశాడు. దానిపై కూర్చొని హాయిగా రోడ్డుపై వెళ్తున్న వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయింది. ఈ క్రేజీ సీన్ చూసి 'ఐడియా సూపర్' అంటూ నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు.

చోరీ కేసులో షాకింగ్ ట్విస్ట్.. వాచ్‌మన్ అరెస్ట్
Crime· 4 Jul 2026

చోరీ కేసులో షాకింగ్ ట్విస్ట్.. వాచ్‌మన్ అరెస్ట్

TG: మేడ్చల్ జిల్లా అల్వాల్ PS పరిధిలో నివాసం ఉంటున్న మేదిశెట్టి శ్యామ్‌రావు తమ ఇంటికి తాళం వేసి మెదక్‌కు వెళ్లి తిరిగి వచ్చేసరికి చోరీ జరిగింది. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంటికి ఎదురుగా ఉన్న అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మన్‌గా పనిచేస్తున్న కొల్లి లోవరాజు(38) ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకుని చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసి.. సుమారు రూ.20 లక్షల విలువైన 13.4 తులాల బంగారు ఆభరణాలు, 330 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

మళ్లీ పెరిగిన గోల్డ్ రేట్స్: లేటెస్ట్ ప్రైస్ డీటెయిల్స్ ఇవే!
Politics· 4 Jul 2026

మళ్లీ పెరిగిన గోల్డ్ రేట్స్: లేటెస్ట్ ప్రైస్ డీటెయిల్స్ ఇవే!

కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన గోల్డ్ రేట్స్ మళ్లీ యూటర్న్ తీసుకున్నాయి. వరుసగా మూడో రోజు కూడా బంగారం ధరలు పెరిగాయి. ప్రజెంట్ హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,010 కి చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,34,760 గా ఉంది. వీటితో పాటు సిల్వర్ రేట్ కూడా కేజీకి రూ.100 పెరిగి, ఇప్పుడు రూ.2,60,100 కి రీచ్ అయింది. మార్కెట్ ఒడిదుడుకుల వల్ల రేట్స్ ఎప్పటికప్పుడు మారుతుంటాయి కాబట్టి కొనేముందు ఒకసారి లైవ్ రేట్ చెక్ చేసుకోవడం బెస్ట్.

తిరుమలలో నకిలీ ఆధార్ ముఠా అరెస్ట్
Crime· 4 Jul 2026

తిరుమలలో నకిలీ ఆధార్ ముఠా అరెస్ట్

AP: నకిలీ ఆధార్ కార్డులతో TTD వసతి గదులను అక్రమంగా పొంది, వాటిని భక్తులకు అధిక ధరలకు విక్రయిస్తున్న నలుగురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠాను తిరుమల టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. తిరుమల CRO కార్యాలయం వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురిని TTD సిబ్బంది గుర్తించి పోలీసులకు అప్పగించారు. దీంతో అసలు విషయం వెలుగుచూసింది. వీరు మొబైల్ యాప్‌ల ద్వారా నకిలీ ఆధార్ కార్డులను సృష్టించి గదులు పొందుతున్నట్లు, ఆపై వాటిని భక్తులకు రూ.2వేల నుంచి రూ.3వేల వరకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. వీరి సమాచారంతో మరో నిందితుడిని కూడా అరెస్ట్ చేశారు.

ఫిర్యాదులో పేర్లు మాయం.. SIకి హైకోర్ట్ నోటీసులు
AP· 4 Jul 2026

ఫిర్యాదులో పేర్లు మాయం.. SIకి హైకోర్ట్ నోటీసులు

AP: కర్నూలు జిల్లా హొళగుంద SI దిలీప్ కుమార్‌కు AP హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నెరినికి గ్రామానికి చెందిన దళితుడు గిరి మల్లేష్ అనే వ్యక్తిపై అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు దాడి చేశారు. కులం పేరుతో తనను దూషిస్తూ తనపై అగ్రకులాల వారు దాడి చేసి గాయపరిచారని గిరి మల్లేష్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదులో కొందరి పేర్లు లేకుండా చేసిన SIపై కేసు నమోదు చేయాలని గిరి మల్లేష్ హైకోర్టుకు వినతి చేశాడు. దీంతో హైకోర్టు SIకి నోటిసులు జారీ చేసింది.

లాకప్‌డెత్ కేసు. . స్టేషన్ టెర్రస్‌పై షాకింగ్ వస్తువులు
AP· 4 Jul 2026

లాకప్‌డెత్ కేసు. . స్టేషన్ టెర్రస్‌పై షాకింగ్ వస్తువులు

AP: రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. కృష్ణలంక పోలీస్‌స్టేషన్ టెర్రస్‌పై అనుమానాస్పద మరకలున్న లాఠీతోపాటు ఎముకలు, బూడిద, స్టీల్ బ్రేస్‌లెట్, ఇతర వస్తువులను సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని తదుపరి పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ఇవి పోలీసు కస్టడీలో మరణించిన సాయికృష్ణకు చెందినవని సిట్ అధికారులు భావిస్తున్నారు. కోర్టుకు సమర్పించిన CI నాగరాజు కస్టడీ పిటిషన్‌లోనూ ఈ విషయాలను సిట్ ప్రస్తావించింది.

పాపికొండల టూర్ రీస్టార్ట్
AP· 4 Jul 2026

పాపికొండల టూర్ రీస్టార్ట్

AP: దాదాపు 20రోజుల విరామం తర్వాత పాపికొండల విహారయత్రకు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. శనివారం నుంచి విహారయాత్ర తిరిగి ప్రారంభించేందుకు పర్యాటక, పోలీస్ శాఖలు అనుమతులు మంజూరు చేశాయి. పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలోని గండిపోశమ్మ ఆలయ బోటింగ్ పాయింట్ నుంచి విహారయాత్రలు ప్రారంభం కానున్నాయి. గతనెల 14న గండిపోశమ్మ ఆలయం నుంచి గోదావరి నదిలో పాపికొండల వైపు బయలుదేరిన ఓ ప్రైవేట్ పర్యాటక బోటు సాంకేతిక లోపంతో నదిలోనే నిలిచిపోవడంతో పర్యాటకులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీంతో పాపికొండల విహారయాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు.

షాకింగ్.. కొబ్బరిబొండమే ఇద్దరి ప్రాణాలు తీసింది
AP· 4 Jul 2026

షాకింగ్.. కొబ్బరిబొండమే ఇద్దరి ప్రాణాలు తీసింది

AP: రాజమహేంద్రవరానికి చెందిన పురోహితుడు దువ్వురి హరిప్రసాద్(52) చిన్న కుమారుడి వివాహం హైదరాబాద్‌లో జరిగింది. వివాహ వేడుకలు ముగించుకుని హరిప్రసాద్ తన కారు వెనుక సీట్లో పూజాసామాగ్రితో రాజమహేంద్రవరం తిరుగు ప్రయాణమయ్యారు. గొల్లపూడి బైపాస్ రోడ్డు సమీపంలో కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టి, ఆపై రోడ్డు పక్కన ఆగి ఉన్న కంటైనర్ లారీని ఢీకొట్టింది. హరిప్రసాద్ స్పాట్‌లోనే మృతి చెందగా, బైక్‌పై ఉన్న వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయారు. కొబ్బరిబొండం డ్రైవింగ్ సీట్ కింద ఉన్న బ్రేక్, క్లచ్ పెడల్స్ మధ్య ఇరుక్కోవడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

రైల్‌లో బ్లేడ్ గ్యాంగ్ బీభత్సం.. అరెస్ట్
Crime· 4 Jul 2026

రైల్‌లో బ్లేడ్ గ్యాంగ్ బీభత్సం.. అరెస్ట్

AP: ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ రైల్‌లో ప్రయాణికులను బ్లేడ్‌తో భయపెట్టి, వారి వద్ద నుంచి నగదు, సెల్‌ఫోన్లు దోచుకున్న నలుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 2వ తేదీన బెంగళూరు నుంచి భువనేశ్వర్ వెళ్తున్న ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ రైలులో అన్నవరం స్టేషన్ వద్ద నలుగురు యువకులు జనరల్ కోచ్‌లోకి ఎక్కారు. గంజాయి మత్తులో రైలులోని ప్రయాణికులపై బ్లేడ్‌తో బెదిరించి వారి వద్ద ఉన్న నగదు, సెల్‌ఫోన్లను దోచుకున్నారు. అనంతరం రైలు స్లో కాగానే నిందితులు దూకి పారిపోయారు. ఆరుగురు బాధితులు విశాఖపట్నం రైల్వేపోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో నిందితులను అరెస్ట్ చేశారు.

అప్పుల లెక్కలపై హైటెన్షన్ పాలిటిక్స్
Politics· 4 Jul 2026

అప్పుల లెక్కలపై హైటెన్షన్ పాలిటిక్స్

TG: BRS ప్రభుత్వం అధికారంలో ఉండగా చేసిన అప్పులపై చెలరేగిన వివాదం పీక్స్‌కు చేరింది. తొలిరోజు KTR చేసిన బహిరంగ చర్చ సవాల్‌తో వివాదం ప్రారంభం కాగా, రెండో రోజు గన్‌పార్క్, తెలంగాణ భవన్ వేదికగా రచ్చ రచ్చ అయ్యింది. మంత్రివర్గ భేటీలోనూ అప్పుల వ్యవహారం చర్చనీయాంశమైంది. అప్పులపై అధికార పక్ష నాయకులు, ప్రతిపక్ష నాయకులు లేఖాస్త్రాలు సంధించుకున్నారు. తాను చెప్పిన అప్పు లెక్కలకు కట్టుబడి ఉన్నానంటూ మంత్రి జూపల్లి కృష్ణారావు మరోసారి BRS నేతలకు లేఖలు రాశారు. మంత్రి జూపల్లి లేఖలపై స్పందించిన మాజీ మంత్రి హరీశ్ రావు తాను కూడా ఆయనకు ఒక లేఖ రాశారు.

మరో కేసులో ప్రశ్న రావణ్ అరెస్ట్
AP· 4 Jul 2026

మరో కేసులో ప్రశ్న రావణ్ అరెస్ట్

AP: ప్రముఖ యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్‌ను మరో కేసులో పోలీసులు అరెస్టు చేశారు. CM చంద్రబాబు నాయుడు, డిప్యూటీ CM పవన్ కళ్యాణ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసుల్లో ఆయన మూడు రోజుల వ్యవధిలో వరుసగా మూడుసార్లు అరెస్టయ్యారు. తొలుత పిఠాపురం పోలీసులు అతన్ని హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా బెయిల్ మంజూరైంది. విడుదలైన వెంటనే సర్పవరం పోలీసులు 2025 నాటి మరో కేసులో అదుపులోకి తీసుకోగా, ఆ కేసులోనూ కోర్టు బెయిల్ ఇచ్చింది. బెయిల్ రాగానే మరో కేసులో రావణ్‌ను అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పోలీసులు అరెస్ట్ చేశారు.

ACBకి పట్టుబడిన DSP కేసులో కొత్త ట్విస్ట్
TG· 4 Jul 2026

ACBకి పట్టుబడిన DSP కేసులో కొత్త ట్విస్ట్

TG: ACBకి పట్టుబడ్డ DSP భీమ్‌రెడ్డికి చెందిన సుమారు రూ.200 కోట్ల ఆస్తుల వ్యవహారంపై ED, IT శాఖలు దృష్టిపెట్టాయి. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో భీమ్‌రెడ్డి భారీగా కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలు, కేసు ఫైళ్ల కాపీలను తమకు అందజేయాలని ACBని ED అధికారులు కోరారు. ఏసీబీ గుర్తించిన 18 స్థిరాస్తుల్లో 75శాతం బినామీల పేరిటే ఉన్నాయని తేలింది. మరోవైపు DSP భీమ్‌రెడ్డిని అరెస్టు చేయకుండా వదిలిపెట్టడంపై పోలీసుశాఖలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఆయన అస్వస్థతకు గురవడంతో వైద్యపరీక్షలు చేయించి వదిలిపెట్టామని, విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చామని ACB అధికారులు తెలిపారు.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్
TG· 4 Jul 2026

నిరుద్యోగులకు గుడ్ న్యూస్

TG: పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న 5వేల పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించి ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 5,000 పోస్టుల్లో సివిల్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ 148, ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ 14, తెలంగాణ స్పెషల్‌ పోలీస్‌ రిజర్వ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ 12, ఎస్‌ఏఆర్‌ సీపీఎల్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ 3, అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ 23 పోస్టులు ఉన్నాయి. సివిల్‌ కానిస్టేబుల్‌ 3,697, ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ కానిస్టేబుల్‌ 1,052, SAR CPL కానిస్టేబుల్‌ 24, డ్రైవర్‌ కానిస్టేబుల్‌ 20, మెకానిక్‌ కానిస్టేబుల్‌ 7 పోస్టులు ఉన్నాయి.

దశాబ్దాల కల నేడు నిజమైంది: CM
AP· 4 Jul 2026

దశాబ్దాల కల నేడు నిజమైంది: CM

AP: రాయలసీమకు నవశకం మొదలైందని CM చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణ పనులను కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, JSW సంస్థ చైర్మన్‌ సజ్జన్‌ జిందాల్‌తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... రాయలసీమ చరిత్రలోనే ఇది ఒక మైలురాయి అని, దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న అందరి కల ఈరోజు నిజమైందని అన్నారు. ఇక్కడ లభించే ఖనిజ సంపదను ఇక్కడే సంపద సృష్టికి వినియోగిస్తామని ప్రకటించారు.