Latest
పారిస్ థియేటర్లను ఊపు ఊపేసిన ఈగ
దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి 14 ఏళ్ల క్రితం తీసిన ఈగ మూవీకి పారిస్ లో బ్రహ్మరథం పడుతున్నారు ఫ్రెంచ్ ఆడియన్స్.. విలన్ సుదీప్‌కు ఈగ వార్నింగ్ ఇచ్చే ఐకానిక్ సీన్ (నేను మళ్లీ వస్తా - "I will be back") స్క్రీన్‌పై రాగానే పారిస్ థియేటర్‌లోని ఫ్రెంచ్ ప్రేక్షకులు చప్పట్లు, ఈలలతో థియేటర్‌ను హోరెత్తిం చారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. పారిస్ లోని ప్రముఖ ఫిలిం ఇనిస్టిట్యూట్ లో రాజమౌళికి శాశ్వత స్థానం ఇస్తూ ప్రత్యేక గౌరవం కల్పించారు. 14 ఏళ్ల క్రితం వచ్చిన 'ఈగ' సినిమాకు కూడా పారిస్ లో ఇంతటి అద్భుతమైన స్పందన రావడం తెలుగు సినిమా స్థాయిని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది.

సీమలో సిరుల పంట - మరో చోట పసిడి ...
ఆంధ్రప్రదేశ్‌లో బంగారం నిక్షేపాలు ఒక్కొక్కటిగా బయటుకొస్తున్నాయి. ఇటీవల కర్నూలుజిల్లా జొన్నగిరిలో బంగారం గనులు ప్రారంభంకాగా.. చిత్తూరు జిల్లా కుప్పంలోనూ బంగారు గనులున్నాయని గుర్తించారు. తాజాగా సత్యసాయి జిల్లాలో బంగారం నిక్షేపాలు ఉన్నాయని తేలింది. రాష్ట్ర ప్రభుత్వం సత్యసాయి జిల్లాలోని ఎన్పీకుంట మండలం జౌకల ప్రాంతంలో ఖనిజాన్వేషణ ప్రక్రియను వేగవంతం చేసింది. గతంలోనే ఇక్కడ భారీగా బంగారం నిక్షేపాలు ఉన్నాయని పరిశోధనల్లో తేలింది. ఈ ప్రాంతంలో బంగారం ఎంతమేరకు ఉందో స్పష్టత కోసం రీసెర్చ్ చేసేందుకు సిద్ధమయ్యారు.

మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటే పెళ్లి జరిగినట్లు కాదు: గుజరాత్ హైకోర్
హిందూ వివాహ చట్టం ప్రకారం కేవలం వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మాత్రమే పెళ్లికి నిదర్శనం కాదని గుజరాత్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. శాస్త్రోక్తంగా సప్తపది (ఏడు అడుగులు), మంగళసూత్ర ధారణ వంటి సాంప్రదాయ ఆచారాలు జరిగితేనే ఆ వివాహం చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేసింది. కేవలం సర్టిఫికేట్ ఆధారంగా భార్యాభర్తలుగా చట్టబద్ధమైన హక్కులను క్లెయిమ్ చేయలేరని కోర్టు తేల్చిచెప్పింది.

'ఆల్ఫా' మూవీ రెమ్యూనరేషన్లో అందరినీ మించిపోయిన అలియా
బాలీవుడ్ ప్రతిష్టాత్మక యాక్షన్ చిత్రం 'ఆల్ఫా' నటీనటుల పారితోషికాలు ఇప్పుడు పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ఏకంగా ₹25 కోట్ల భారీ రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. కాగా, ఆమెతో కలిసి నటించిన కో-స్టార్ శర్వరీ వాగ్‌కు కేవలం ₹3 కోట్లు మాత్రమే దక్కాయి. దీంతో శర్వరీ కంటే ఆలియా దాదాపు 8 రెట్లు ఎక్కువ పారితోషికం అందుకున్నట్లయింది.

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర భారీగా తగ్గింపు!
పశ్చిమాసియా సంక్షోభం సర్దుమణగడంతో చమురు సంస్థలు వాణిజ్య వినియోగదారులకు భారీ ఉపశమనం అందించాయి. 19 కేజీల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరను రూ. 183.50 వరకు తగ్గించాయి. దీంతో ఢిల్లీలో దీని ధర రూ. 2,930కి చేరింది. హైదరాబాద్‌లో రూ. 176 తగ్గి రూ. 3,191గా నమోదైంది. ఈ తగ్గింపు హోటళ్లు, రెస్టారెంట్లకు పెద్ద ఊరట కానుంది. అయితే, 14.2 కేజీల గృహ వినియోగ (డొమెస్టిక్) సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.

యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డులో మెగాస్టార్ భార్యకు చోటు!
యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డులో మెగాస్టార్ భార్యకు చోటు! తెలంగాణ ప్రభుత్వం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి సరికొత్తగా 18 మందితో కూడిన పాలక మండలిని ప్రకటించింది. ఎంఎస్ఎన్ గ్రూప్ చైర్మన్ ఎం.సత్యనారాయణను ఈ బోర్డుకు చైర్మన్‌గా నియమించింది. ఈ బోర్డులో మంత్రి జి. వినోద్ వెంకటస్వామితో పాటు మెగాస్టార్ చిరంజీవి భార్య కొణిదెల సురేఖకు కూడా సభ్యురాలిగా చోటు దక్కింది. ఈ బోర్డు రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనుంది.

బాలీవుడ్ కొరియోగ్రాఫర్ బోస్కో మార్టిస్ కు అస్వస్థత
ఇటీవల 'తౌబా తౌబా', 'ఝూమే జో పఠాన్' వంటి సూపర్ హిట్ పాటలకు కొరియోగ్రఫీ చేసిన ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ బోస్కో మార్టిస్ గుండెల్లో అసౌకర్యం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కారణంగా ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు. బిజీ పని ఒత్తిడి వల్ల అస్వస్థతకు గురైన ఆయనను వైద్యులు పర్యవేక్షణలో ఉంచారు. ప్రస్తుతం పరీక్షల నివేదికలు సాధారణంగా రావడంతో, ఆయన కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

పాకిస్తాన్‌లో ఐసిస్ స్థావరాలపై తాలిబాన్ల దాడి!
పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉగ్రవాద అణచివేత చర్యలు తీవ్రరూపం దాల్చాయి. పాక్ భూభాగంలో ఉన్న అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ (ISIS) స్థావరాలపై తాలిబాన్ దళాలు అనూహ్య దాడులు జరిపాయి. ఈ వ్యూహాత్మక దాడుల్లో దాదాపు 28 మంది ఐసిస్ ఉగ్రవాదులు హతమవ్వగా, మరో 49 మంది తీవ్రంగా గాయపడినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ పరిణామంతో సరిహద్దు ప్రాంతాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

నొప్పి నివారణకు సరికొత్త డివైజ్ 'క్యూరాపాడ్'!
కండరాలు, కీళ్ల నొప్పుల నుంచి తక్షణ ఉపశమనం అందించేందుకు 'క్యూరాపాడ్' అనే సరికొత్త వేరబుల్ పరికరం దేశంలో అందుబాటులోకి వచ్చింది. ఫిజియోథెరపీ, హీట్ ప్యాక్ కలయికతో పనిచేసే ఈ డివైజ్ కేవలం వెల్‌నెస్ గ్యాడ్జెట్ మాత్రమే కాదు; ఇది CDSCO ఆమోదం మరియు US FDA Class II రిజిస్ట్రేషన్ పొందిన సురక్షితమైన వైద్య పరికరం. ఫోటోబయోమాడ్యులేషన్ సాంకేతికత ద్వారా పనిచేసే ఈ పరికరంతో ఇప్పుడు ఇంట్లోనే క్లినికల్ తరహా థెరపీ పొందవచ్చు.

CM రేవంత్ రెడ్డికి RSP ఓపెన్ ఛాలెంజ్!
TG: తెలంగాణలో జరిగిన ₹2000 కోట్ల గురుకుల కుంభకోణం ఆరోపణలపై రేపు (జూలై 2) సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో బహిరంగ చర్చకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిద్ధమయ్యారు. CM రేవంత్ రెడ్డి ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరిస్తూ తాము చర్చకు రెడీ అని ఆయన ప్రకటించారు. "మా తప్పు నిరూపిస్తే రాజీనామా చేస్తామన్న మంత్రులు సాక్ష్యాలతో చర్చకు రావాలి" అని ట్వీట్ చేశారు. మొదట ఉదయం 11 గంటలకు అనుకున్నా, ప్రెస్ క్లబ్ స్లాట్ బుకింగ్ ప్రాబ్లం వల్ల టైమింగ్‌ను మధ్యాహ్నం 12 గంటలకు మార్చారు.
జర్నలిస్ట్ KVR అరెస్ట్ అప్డేట్!
హైదరాబాద్‌లో నిన్న రాత్రి అరెస్ట్ అయిన తెలంగాణ జర్నలిస్ట్ KVR కేస్‌లో లేటెస్ట్ అప్‌డేట్! పోలీసులు ఆయన్ని విజయనగరం జిల్లాలోని బొబ్బిలి రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ KVR స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసిన తర్వాత, బొబ్బిలి గవర్నమెంట్ హాస్పిటల్‌లో మెడికల్ ఎగ్జామినేషన్స్ పూర్తి చేశారు. ఈ ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయాక, పోలీసులు ఆయన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయనున్నారు. ఈ అరెస్ట్ ఇప్పుడు మీడియా సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

వర్షాకాలంలో ఈ తప్పులు చేయకండి!
వర్షాకాలం వచ్చేసింది కదా! ఈ సీజన్‌లో వాతావరణంలో తేమ వల్ల బ్యాక్టీరియా, వైరస్ చాలా ఫాస్ట్‌గా స్ప్రెడ్ అవుతాయి. దీనివల్ల జీర్ణ సమస్యలు, ఫుడ్ పాయిజనింగ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ. అందుకే రోడ్డు పక్కన అమ్మే చాట్, ముందే కట్ చేసిన ఫ్రూట్స్, పచ్చి సలాడ్స్, ఎక్కువ ఆయిల్ ఉన్న ఫుడ్స్‌ని అస్సలు ముట్టకండి. ఎప్పుడూ ఇంట్లో వండిన ఫ్రెష్ అండ్ హాట్ ఫుడ్ మాత్రమే తినండి. తినే ముందు హ్యాండ్ వాష్ మస్ట్! ఒకవేళ కడుపునొప్పి, వాంతులు, జ్వరం లాంటి సింప్టమ్స్ కనిపిస్తే అస్సలు లైట్ తీసుకోకుండా వెంటనే డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వండి. నీళ్లు బాగా తాగుతూ పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయండి.
MPపై గుడ్లు, కూరగాయలతో BJP కార్యకర్తలు దాడి!
పశ్చిమ బెంగాల్ నదియా జిల్లాలో TMC వర్కర్స్ మీటింగ్‌కు వెళ్లిన MP మహువా మోయిత్రాపై కొందరు నిరసనకారులు గుడ్లు, కూరగాయలతో దాడి చేశారు. ఈ దాడి వెనుక BJP హస్తం ఉందని, పోలీసుల ముందే వాళ్లు గూండాల్లా ప్రవర్తించినా పోలీసులు చూస్తూ ఊరుకున్నారని ఆమె తీవ్రంగా ఆరోపించారు. ఈ ఇన్సిడెంట్ వీడియోను మోయిత్రా సోషల్ మీడియాలో షేర్ చేయగా. ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో ఇది హాట్ టాపిక్‌గా మారింది.

ప్రశ్న రావణ్, KVR అరెస్ట్ అప్డేట్!
అరెస్ట్ అయిన యూట్యూబర్ 'ప్రశ్న రావణ్'ను ఇవాళ సాయంత్రం 6 గంటలకు మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. నిన్న అర్ధరాత్రి తన లైవ్ ముగించుకుని ఒంటరిగా ఇంటికి వెళ్తున్న టైంలో పోలీసులు అతన్ని చుట్టుముట్టి అరెస్ట్ చేశారు. అయితే ఇప్పటివరకు రావణ్‌కి సంబంధించిన ఎలాంటి ఫొటోస్, వీడియోస్ బయటకి రాలేదు. మరోవైపు జర్నలిస్ట్ KVR ఏ పోలీస్ స్టేషన్‌లో ఉన్నారనే దానిపై క్లారిటీ లేకపోవడంతో ఆయన ఫ్యామిలీ తీవ్ర భయాందోళనల్లో ఉంది.
కూటమి ప్రభుత్వంపై ప్రశ్న రావణ్ సీరియస్ కామెంట్స్
యూట్యూబర్ 'ప్రశ్న రావణ్' అరెస్ట్‌కి ముందే చేసిన ఒక పవర్‌ఫుల్ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆయన పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి సంచలన కామెంట్స్ చేశారు. "పవన్ కళ్యాణ్ ఐ స్టాండ్ ఆన్ మై వర్డ్స్! నేను మాట్లాడిన దాంట్లో ఒక్క అక్షరం కూడా వెనక్కి తీసుకోను. నన్ను భయపెట్టాలని చూస్తున్నారా? అరెస్ట్ చేస్తారా. చేసుకోండి, నేను దేనికైనా రెడీ" అంటూ ఓపెన్ ఛాలెంజ్ చేశారు. కూటమి ప్రభుత్వంపై కూడా ఆయన ఫుల్ ఫైర్ అయ్యారు.
తెలంగాణ అస్తిత్వంపై సాంగ్!
తెలంగాణ యాస, భాషపై జరుగుతున్న దాడిని తీవ్రంగా ఖండిస్తూ.. తెలంగాణ ఉద్యమ కవి, సింగర్ ముక్కపల్లి శ్రీనివాస్ ఒక పవర్‌ఫుల్ సాంగ్ పాడారు. "తెలంగాణ యాస మా ఆత్మగౌరవం. భాష మా అస్తిత్వం, దానిపై ఎలాంటి దాడినైనా సహించం" అంటూ ఆయన పాడిన ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. తెలంగాణ లాంగ్వేజ్ లవర్స్ ఈ వీడియోని విపరీతంగా షేర్ చేస్తూ సపోర్ట్ ఇస్తున్నారు.

యూట్యూబర్ 'ప్రశ్న రావణ్' అరెస్ట్!
డిప్యూటీ CM పవన్ కళ్యాణ్‌ని తన వీడియోస్‌లో ప్రశ్నిస్తున్నాడని యూట్యూబర్ 'ప్రశ్న రావణ్'ని పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో నిన్న అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్ట్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.

బండి భగీరథ్ పోక్సో కేస్ అప్డేట్!
బండి భగీరథ్ POCSO కేస్‌లో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. భగీరథ్ బెయిల్ కోసం పెట్టుకున్న అప్లికేషన్‌పై విచారణను కోర్టు జూలై 3కి వాయిదా వేసింది. ఈ బెయిల్ మ్యాటర్‌పై బాధిత బాలికకి నోటీసులు పంపాలని హైకోర్టు ఆదేశించింది. జూలై 3న జరిగే నెక్స్ట్ హియరింగ్‌లో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

అర్ధరాత్రి ఎలక్ట్రిక్ బస్సులో చెలరేగిన మంటలు
TG: కరీంనగర్ బస్ డిపో-2లో మంగళవారం అర్ధరాత్రి దాటాక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. డిపో ఆవరణలో పార్కింగ్ చేసిన TGSRTC ఎలక్ట్రికల్ ఎక్స్‌ప్రెస్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు బస్సు మొత్తానికి వ్యాపించి క్షణాల్లోనే వాహనం పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణికులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ బస్సుల్లో ఈ తరహా అగ్నిప్రమాదం జరగడం ఇది వరుసగా మూడోసారి.

గాదె సాయికృష్ణ కేస్: రిమాండ్ రిపోర్టులో షాకింగ్ నిజాలు!
గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసులో హెడ్‌కానిస్టేబుళ్లు అశోక్, నాని రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన విషయాలు బయటపెట్టారు. ఇన్వెస్టిగేషన్‌లో వాళ్ళు నిజాలు చెప్పలేదని, మొబైల్స్ అడిగితే నాగపూర్‌లో ఎవరో తెలియని వాళ్ళకి అమ్మేసామని అబద్ధాలు చెప్తున్నారని పోలీసులు వెల్లడించారు. మే 5న సాయికృష్ణ లొకేషన్ మార్కాపురంలో చూపించింది. కోర్టులో హాజరుపరిచే డేట్ కంటే ముందే నిందితుడిని బంధించారని, FIRలో ఉన్నవాళ్లంతా కలిసే సాయికృష్ణను మిస్ చేశారని రిపోర్టులో mention చేశారు. దీనిపై ఇంకా ఫుల్ ఎంక్వైరీ జరగాల్సి ఉంది.

భర్త శవం.. భార్యే విలన్!
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం అంబం గ్రామంలో దారుణం జరిగింది. భార్య స్వరూప తన లవర్ తో కలిసి భర్త మహిపాల్ (29)ని దారుణంగా మర్డర్ చేసింది. ఆ తర్వాత అది హార్ట్ ఎటాక్, ఉరి వేసుకుని చనిపోయాడంటూ అబద్దాలతో డ్రామాలు ఆడింది. కానీ, శవం మెడపై లోతైన గాయం ఉండటంతో గ్రామస్తులకి డౌట్ వచ్చి పోలీసులకి కంప్లైంట్ చేశారు. కేసు ఫైల్ చేసిన పోలీసులు ఇన్వెస్టిగేషన్‌లో అసలు నిజం బయటపెట్టారు. నిందితులను అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేస్తున్నారు.