Latest
తెలంగాణ అస్తిత్వంపై సాంగ్!
తెలంగాణ యాస, భాషపై జరుగుతున్న దాడిని తీవ్రంగా ఖండిస్తూ.. తెలంగాణ ఉద్యమ కవి, సింగర్ ముక్కపల్లి శ్రీనివాస్ ఒక పవర్‌ఫుల్ సాంగ్ పాడారు. "తెలంగాణ యాస మా ఆత్మగౌరవం. భాష మా అస్తిత్వం, దానిపై ఎలాంటి దాడినైనా సహించం" అంటూ ఆయన పాడిన ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. తెలంగాణ లాంగ్వేజ్ లవర్స్ ఈ వీడియోని విపరీతంగా షేర్ చేస్తూ సపోర్ట్ ఇస్తున్నారు.

యూట్యూబర్ 'ప్రశ్న రావణ్' అరెస్ట్!
డిప్యూటీ CM పవన్ కళ్యాణ్‌ని తన వీడియోస్‌లో ప్రశ్నిస్తున్నాడని యూట్యూబర్ 'ప్రశ్న రావణ్'ని పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో నిన్న అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్ట్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.

బండి భగీరథ్ పోక్సో కేస్ అప్డేట్!
బండి భగీరథ్ POCSO కేస్‌లో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. భగీరథ్ బెయిల్ కోసం పెట్టుకున్న అప్లికేషన్‌పై విచారణను కోర్టు జూలై 3కి వాయిదా వేసింది. ఈ బెయిల్ మ్యాటర్‌పై బాధిత బాలికకి నోటీసులు పంపాలని హైకోర్టు ఆదేశించింది. జూలై 3న జరిగే నెక్స్ట్ హియరింగ్‌లో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

అర్ధరాత్రి ఎలక్ట్రిక్ బస్సులో చెలరేగిన మంటలు
TG: కరీంనగర్ బస్ డిపో-2లో మంగళవారం అర్ధరాత్రి దాటాక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. డిపో ఆవరణలో పార్కింగ్ చేసిన TGSRTC ఎలక్ట్రికల్ ఎక్స్‌ప్రెస్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు బస్సు మొత్తానికి వ్యాపించి క్షణాల్లోనే వాహనం పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణికులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ బస్సుల్లో ఈ తరహా అగ్నిప్రమాదం జరగడం ఇది వరుసగా మూడోసారి.

గాదె సాయికృష్ణ కేస్: రిమాండ్ రిపోర్టులో షాకింగ్ నిజాలు!
గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసులో హెడ్‌కానిస్టేబుళ్లు అశోక్, నాని రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన విషయాలు బయటపెట్టారు. ఇన్వెస్టిగేషన్‌లో వాళ్ళు నిజాలు చెప్పలేదని, మొబైల్స్ అడిగితే నాగపూర్‌లో ఎవరో తెలియని వాళ్ళకి అమ్మేసామని అబద్ధాలు చెప్తున్నారని పోలీసులు వెల్లడించారు. మే 5న సాయికృష్ణ లొకేషన్ మార్కాపురంలో చూపించింది. కోర్టులో హాజరుపరిచే డేట్ కంటే ముందే నిందితుడిని బంధించారని, FIRలో ఉన్నవాళ్లంతా కలిసే సాయికృష్ణను మిస్ చేశారని రిపోర్టులో mention చేశారు. దీనిపై ఇంకా ఫుల్ ఎంక్వైరీ జరగాల్సి ఉంది.

భర్త శవం.. భార్యే విలన్!
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం అంబం గ్రామంలో దారుణం జరిగింది. భార్య స్వరూప తన లవర్ తో కలిసి భర్త మహిపాల్ (29)ని దారుణంగా మర్డర్ చేసింది. ఆ తర్వాత అది హార్ట్ ఎటాక్, ఉరి వేసుకుని చనిపోయాడంటూ అబద్దాలతో డ్రామాలు ఆడింది. కానీ, శవం మెడపై లోతైన గాయం ఉండటంతో గ్రామస్తులకి డౌట్ వచ్చి పోలీసులకి కంప్లైంట్ చేశారు. కేసు ఫైల్ చేసిన పోలీసులు ఇన్వెస్టిగేషన్‌లో అసలు నిజం బయటపెట్టారు. నిందితులను అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేస్తున్నారు.

వింత పురుగుల దాడి.. 19మంది స్టూడెంట్స్‌కు అస్వస్థత
AP: చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలం డీఎంపురం ZP ఉన్నత పాఠశాలలో చెట్టుపై నుంచి పడిన వింత పురుగులు కుట్టడంతో 19మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దద్దుర్లు, మంట రావడంతో విద్యార్థులను వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు. విద్యార్థులు చెట్ల కింద ఆడుకుంటుండగా ఈ ఘటన జరిగింది. అయితే కుట్టిన పురుగులు వింతగా ఉండటంతో ప్రజలు టెన్షన్ పడుతున్నారు. ఈ ఘటనతో పాఠశాలకు సెలవు ప్రకటించారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో యాసిడ్ పురుగులు రోవ్ బీటిల్స్ బెడద తీవ్రంగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే.

టుడే గోల్డ్ రేట్స్!
బంగారం కొనాలనుకునే వారికి గుడ్‌న్యూస్! మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. మంగళవారం ఉదయం 10 గంటల సమయానికి హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.1,40,780 కి చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,29,050 గా ఉంది. అయితే, గోల్డ్ రేట్స్ ఎప్పటికప్పుడు మారుతుంటాయి కాబట్టి, మీరు షాపింగ్‌కి వెళ్లే ముందు ఒకసారి కరెంట్ లైవ్ ప్రైస్ చెక్ చేసుకోవడం బెస్ట్.

KTRను కలిసిన జెన్-జీ యువతులు
TG: రాజకీయాలపై మక్కువతో, సమాజంలో మార్పు తీసుకురావాలనే సంకల్పంతో ఉన్న నలుగురు జెన్ జీ యువతులు KTRను కలిశారు. ఉన్నత చదువుల కోసం సిద్ధమవుతున్న నలుగురు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ను కలిసి మాట్లాడారు. లండన్‌లోని కింగ్స్ కాలేజీలో చదవనున్న సరయు, నల్సార్ లా యూనివర్సిటీకి చెందిన లాస్య, సింబయాసిస్ లా స్కూల్ విద్యార్థిని రేవతి, సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీకి చెందిన అశ్విని.. తాము భవిష్యత్తులో రాజకీయ నేతలుగా ఎదగాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు. సమాజంలో మార్పు కోసం నలుగురు ఆడబిడ్డలు రాజకీయాల్లోకి రావాలనుకోవడంపై KTR అభినందించారు.

ORR పై కాల్పుల కలకలం
TG: హైదరాబాద్ నగర శివారులోని ORRపై కాల్పుల ఘటన కలకలం రేపింది. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ శ్రీకాంత్ తన అనుచరులతో కలిసి రంగారెడ్డి జిల్లా బొంగులూరు గేట్ ఎగ్జిట్ నంబర్-12 వద్ద ఒక DCM వాహనంలో ఉన్నట్లు రికార్డు అయింది. నల్గొండ జిల్లా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ వింగ్ పోలీసులు శ్రీకాంత్‌ను పట్టుకునేందుకు వెళ్లగా, నిందితులు లొంగిపోవడానికి బదులుగా పోలీసులపై కత్తులతో దాడిచేశారు. ఒక CCS హెడ్ కానిస్టేబుల్ తలకు తీవ్ర గాయమైంది. ఆత్మరక్షణ కోసం గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి నిందితులను హెచ్చరించారు. అయినప్పటికీ వినకపోవడంతో శ్రీకాంత్ కాళ్లపై కాల్పులు జరిపి వారిని అరెస్ట్ చేశారు.
KV రెడ్డి అరెస్ట్‌పై కవిత ఫైర్
TG: జర్నలిస్ట్ KV రెడ్డి అరెస్ట్‌ను తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్రంగా ఖండించారు. AP పోలీసులు KV రెడ్డిని లాక్కొని వెళ్తుంటే హృదయ విదారకంగా ఏడుస్తున్న ఆయన భార్య, చిన్న పిల్లలను తెలంగాణ పోలీసులు అడ్డుకొని సహకరించడం సిగ్గుచేటు అని ఫైరయ్యారు. ఒకే కేసులో ఇది వరకే కేవీ రెడ్డిని అరెస్ట్ చేసిన AP పోలీసులు ఇప్పుడు మళ్లీ అదే కేసులో అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం అని అన్నారు. వెంటనే కేవీ రెడ్డిని విడుదల చేయాలని, ఆయన కుటుంబానికి తెలంగాణ రక్షణ సేన పార్టీ అండగా ఉంటుందన్నారు.
అర్ధరాత్రి జర్నలిస్టుల అరెస్ట్
TG: హైదరాబాద్‌లో అర్ధరాత్రి వేళ AP పోలీసులు తెలంగాణకు చెందిన జర్నలిస్టులు KV రెడ్డి, స్వతంత్ర జర్నలిస్ట్ ప్రశ్న రావణ్‌లను అరెస్ట్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, కుటుంబసభ్యులకు కనీస సమాచారం అందించకుండా జర్నలిస్టులను వారి ఇళ్ల నుంచి బలవంతంగా లాక్కెళ్లారు. KV రెడ్డిని అక్రమంగా అరెస్టు చేస్తుండగా అడ్డుకున్న భార్యతో పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. దీంతో ఆమె సరూర్‌నగర్ PSలో ఫిర్యాదు చేశారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేశాయి.

25రోజులైనా వీడని మిస్టరీ.. పోలీసుల స్పెషల్ ఆపరేషన్
AP: కాకినాడ జిల్లా తుని మండలం CH అగ్రహారం గ్రామానికి చెందిన చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి 25రోజుల క్రితం మిస్సైన విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఎలాంటి ఆచూకీ లభించలేదు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు ఏకంగా 12 ప్రత్యేక బృందాలతో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఎలాంటి క్లూ దొరకకపోవడం ఆందోళన కలిగిస్తోంది. చిన్నారి ఫోటోతో కూడిన వాల్ పోస్టర్ల ద్వారా చుట్టుపక్కల జిల్లాలతోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వీటిని అతికించారు. సమాచారం తెలిపిన వారికి రూ. లక్ష పారితోషికం ఇస్తామని ప్రకటించారు.

ఉచిత కరెంట్ కాంగ్రెస్ పార్టీ పేటెంట్
TG: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని CM రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 30నెలల పాలనలో రూ.1.75 లక్షల కోట్లు వెచ్చించి రైతులు ఆత్మగౌరవంతో బతికేలా చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ శిల్పకళావేదికలో సీఎం రైతుభరోసా నిధులు విడుదల చేసి మాట్లాడారు. వ్యవసాయాన్ని పండుగలా తీర్చిదిద్దామని, ఈ ప్రజా ప్రభుత్వాన్ని కంచె వేసి కాపాడుకునే బాధ్యత మీదేనని CM రైతులను ఉద్దేశించి అన్నారు. ఉచిత కరెంట్ కాంగ్రెస్ పార్టీ పేటెంట్. ఇప్పటి వరకు దీనికోసం రూ.30 వేల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు.

దేశంలోనే వైజాగ్ టాప్ ప్లేస్
AP: విశాఖపట్నం దేశంలోనే శ్రామికశక్తికి ప్రధాన కేంద్రంగా నిలిచిందని కేంద్రప్రభుత్వం నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైయింది. ఈ నగరంలో ఉన్న జనాభాలో 52.8% మంది శ్రామికశక్తే. ఏదో ఒక పనిచేస్తున్న వారే. దేశవ్యాప్త సగటు (49.8%)తో పోలిస్తే విశాఖలోనే పని చేస్తున్న వారు ఎక్కువ మంది ఉన్నారు. ఈ నగరంలో పని చేయడానికి సిద్ధంగా ఉన్న జనాభా కూడా 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాల సగటుతో పోలిస్తే ఎక్కువగానే ఉంది. విశాఖలో 56.2% మంది పని చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక్కడ క్యాజువల్ లేబర్ రోజువారీ వేతనం రూ.733 జాతీయ పట్టణ సగటు (రూ.624) కంటే ఎక్కువ.

భారీ ఖనిజ సంపద గుర్తింపు
AP: రాష్ట్రవ్యాప్తంగా 62,030 చదరపు కిలోమీటర్ల పరిధిలో మినరల్ మ్యాపింగ్ చేసినట్లు CM చంద్రబాబుకు గనుల శాఖ నివేదించింది. ఇందులో విలువైన 125 ఖనిజాలు లభ్యమయ్యే ప్రాంతాలు ఉన్నాయని వివరించింది. ఈ నివేదికపై సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మినరల్ మ్యాపింగ్‌పై CMకు ఆ శాఖ నివేదిక సమర్పించింది. దీనిప్రకారం క్రిటికల్, స్ట్రాటజిక్ మినరల్స్‌కు సంబంధించి 48, అధికవిలువ కలిగిన బల్క్ మినరల్స్‌కు సంబంధించి 47, మరో 30 అతివిలువైన ఖనిజాలు లభ్యమయ్యే మినరల్ పొటెన్షియల్ ఏరియాలు ఉన్నాయి.

యువతకు రాష్ట్రపతి స్ట్రాంగ్ మెసేజ్
AP: గ్రామీణ ప్రజలు సులభంగా పనిచేసుకుని, ఆర్థికంగా నిలదొక్కుకునేలా వారి జీవనోపాధుల మెరుగుదలకు యూనివర్సిటీలు వినూత్న ఆలోచనలు చేయాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లాలోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవం విశాఖపట్నంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గిరిజన వర్సిటీలు ఆ ప్రాంత ప్రజల సాధికారతకు కృషి చేయాలన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువత స్కిల్స్ పెంచుకోవాలని సూచించారు.
దువ్వాడ శ్రీనివాస్ మిస్సింగ్?
YCP MLC దువ్వాడ శ్రీనివాస్ సడన్‌గా కనిపించకుండా పోవడం AP పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. డిప్యూటీ CM పవన్ కళ్యాణ్‌పై చేసిన కామెంట్స్ కేసుకు సంబంధించి, విచారణ కోసం ఆయన కొత్తూరు పోలీస్ స్టేషన్‌కు బయలుదేరారు. కానీ మార్గమధ్యలోనే ఆయన ఫోన్ స్విచ్చాఫ్ అయింది. పోలీసులు పక్కా ప్లాన్‌తో ఆయన్ను అరెస్ట్ చేశారని దివ్వెల మాధురి ఆరోపిస్తుంటే. ఆయన అసలు PSకే రాలేదని, ఈ మ్యాటర్‌తో మాకు ఎలాంటి కనెక్షన్ లేదని పోలీసులు వాదిస్తున్నారు. ప్రస్తుతం ఈ మిస్సింగ్ మిస్టరీ సస్పెన్స్‌గా మారింది.

బిడ్డ చనిపోయినా దేశం కోసం ఆడాడు!
ఫిఫా వరల్డ్ కప్ 2026లో ఒక సాడ్ అండ్ హార్ట్ టచింగ్ ఇన్సిడెంట్ జరిగింది. నెదర్లాండ్స్ ఫుట్‌బాలర్ కూడీ హాక్పో పుట్టబోయే బిడ్డ మ్యాచ్‌కి మూడు రోజుల ముందే చనిపోయింది. ఆ పుట్టెడు దుఃఖంలోనూ మేనేజ్‌మెంట్ లీవ్స్ ఇస్తానన్నా వద్దు అనుకుని, దేశం కోసం మొరాకోతో జరిగిన నాకౌట్ మ్యాచ్ ఆడాడు. మ్యాచ్‌లో తను గోల్ కొట్టాక సెలబ్రేట్ చేసుకోకుండా మైదానంలోనే ఏడ్చేశాడు. ఇది చూసి అందరూ ఎమోషనల్ అయ్యారు. కానీ సాడ్ పార్ట్ ఏంటంటే ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ ఓడిపోయింది.

డెలివరీ బాయ్ వివాదంపై 'రాజు వెడ్స్ రాంబాయి' హీరో వీడియో!
డెలివరీ బాయ్‌తో జరిగిన గొడవపై 'రాజు వెడ్స్ రాంబాయి' హీరో అఖిల్ రాజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో క్లారిటీ ఇచ్చారు. అడ్రస్ మారి పక్కింటి పార్సిల్ తన ఇంటికి వచ్చిందని, దాన్ని తన అమ్మ ఓపెన్ చేసిందని చెప్పారు. అయితే ఆ డెలివరీ బాయ్ తాగి వచ్చి వాళ్ళ అమ్మను ‘ఫ్రీగా వస్తే తీసుకుంటారా?’ అని తిట్టడంతోనే తనకు కోపం వచ్చిందన్నారు. ఎదురింటి వాళ్లు తప్పుడు అడ్రస్ పెట్టడం వల్లే ఈ కన్ఫ్యూజన్ జరిగిందని, సోషల్ మీడియాలో తనపై వస్తున్న ట్రోల్స్ తప్పు అని చెప్తూ అఖిల్ క్లారిటీ ఇచ్చారు.
రైతు బంధు ఫండ్స్ రిలీజ్!
CM రేవంత్ రెడ్డి వానాకాలం సీజన్‌కు సంబంధించిన రైతు బంధు ఫండ్స్‌ను రిలీజ్ చేశారు. ఈ ఇన్వెస్ట్‌మెంట్ అసిస్టెన్స్‌ను ప్రభుత్వం దశల వారీగా అకౌంట్లలో డిపాజిట్ చేయనుంది. ఫస్ట్ ఫేజ్ కింద 2 ఎకరాల లోపు భూమి ఉన్న సుమారు 41.37 లక్షల మంది చిన్న, సన్నకారు రైతుల అకౌంట్లలోకి ఈ రోజే రూ.6,000 క్రెడిట్ అయ్యాయి. మిగిలిన రైతులకు కూడా త్వరలోనే మనీ ట్రాన్స్‌ఫర్ చేయనున్నారు.