Latest
బాలయ్య గురుంచి కాజల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
నందమూరి బాలకృష్ణ నెక్స్ట్ మూవీ ‘NBK111’ లో హీరోయిన్‌గా నటిస్తున్న కాజల్ అగర్వాల్ ప్రెస్ ముందు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. ఈ సినిమాలో తన క్యారెక్టర్ చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతుందని అంటూ హ్యాపీనెస్ షేర్ చేసుకున్నారు. బాలయ్యతో కలిసి యాక్ట్ చేయాలనేది తన డ్రీమ్ అని, అది ఇప్పుడు నిజమైందని అన్నారు. షూటింగ్ సెట్స్‌లో బాలయ్య ఎనర్జీ వేరే లెవెల్‌లో ఉంటుందని, ఈ వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ తనకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని కాజల్ చెప్పారు.
వర్షంలో సచిన్ టెండూల్కర్ ఆటలు.. వీడియో వైరల్!
సచిన్ టెండూల్కర్ షేర్ చేసిన ఒక లేటెస్ట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. వర్షం పడుతుండగా సచిన్ బయటకు వచ్చి, వర్షంలో తడుస్తూ తన పెంపుడు కుక్కతో కలిసి సరదాగా ఆడుకున్నారు. ఆ బాల్‌ని అటు ఇటు విసురుతూ ఫుల్ ఎంజాయ్ చేశారు. ఎప్పుడూ బిజీగా ఉండే సచిన్. ఇలా వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ చాలా సింపుల్‌గా కనిపించడంతో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ క్యూట్ వీడియోకి తెగ లైక్స్ కొడుతున్నారు.

నిట్ట నిలువుగా చీలిన శివసేన- ఆరుగురు ఎంపీల జంప్
మహారాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠకు తెరదించుతూ, ఉద్ధవ్ థాకరే వర్గం తొమ్మిది మంది ఎంపీలలో ఆరుగురు సోమవారం సాయంత్రం ముంబైలో ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరిపోయారు. దాంతో మహారాష్ట్రలో రెండో అతిపెద్ద పార్టీ గా ఏక్ నాథ్ షిండే శివసేన వర్గం గుర్తింపు పొందింది. యాంటి డిఫెక్షన్ లా ముప్పు నుంచి వీరు తప్పించుకున్నట్లే. నియోజక వర్గాలకు నిధుల కొరత కారణంగానే షిండే వర్గంలోకి మారామని ఫిరాయించిన ఎంపీలు తెలిపారు. ఉద్ధవ్ వర్గం ఇప్పుడు మైనారిటీలో పడిపోయింది.
దువ్వాడ శ్రీనివాస్ కోసం మాధురి ధర్నా.. శ్రీకాకుళంలో టెన్షన్!
శ్రీకాకుళం జిల్లా కొత్తూరు సర్కిల్ పోలీస్ స్టేషన్ ముందు దువ్వాడ శ్రీనివాస్ కోసం మాధురి ధర్నాకు దిగారు. AP మంత్రి అచ్చెన్నాయుడు చేసిన రూ.75 కోట్ల ధాన్యం కుంభకోణాన్ని ప్రశ్నించినందుకే దువ్వాడ శ్రీనివాస్‌ను పోలీసులు టార్గెట్ చేసి హింసిస్తున్నారని ఆమె ఆరోపించారు. తప్పును ప్రశ్నించడం నేరమా అంటూ పోలీసులను నిలదీశారు. దువ్వాడ శ్రీనివాస్‌కు సపోర్ట్‌గా ఆమె పోలీస్ స్టేషన్ ముందే కూర్చోవడంతో అక్కడ కాసేపు తీవ్ర ఉద్రిక్తత, టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం ఈ ధర్నాకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.

రూ. 5 కోట్ల రిటైర్మెంట్ ఫండ్ సరిపోదా? షాకింగ్ నిజాలు!
మీరు రూ. 5 కోట్లు దాచుకుంటే లైఫ్ సెటిల్ అనుకుంటున్నారా? అయితే పప్పులో కాలేసినట్టే! సగటున 6% ద్రవ్యోల్బణం (Inflation) లెక్కగడితే, మరో 30 ఏళ్లలో (2056 నాటికి) ఈ రూ. 5 కోట్ల కొనుగోలు శక్తి కేవలం రూ. 87 లక్షలకే పడిపోతుంది. అదే 40 ఏళ్లకైతే (2066 నాటికి) దీని విలువ కేవలం రూ. 49 లక్షలకే పరిమితం కానుంది! ఇక 10-12% పెరిగే వైద్య ఖర్చుల గురించి చెప్పక్కర్లేదు. అందుకే కేవలం సేవింగ్స్ నమ్ముకోకుండా, ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తూ మీ ఫండ్‌ను పెంచుకోవడం అత్యంత కీలకం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మగవారికీ ఛైల్డ్ కేర్ లీవ్స్ - జీవో 70 సవరించిన ఏపీ ప్రభుత్వం
వివాహితులైన మహిళలతో పాటు, పురుషులు కూడా ఛైల్డ్ కేర్ లీవ్ కు అర్హులేనంటూ ఏపీ ప్రభుత్వం జీవోను సవరించింది. అవివాహిత పురుషులు, భార్య చనిపోయినవారు, ఒంటరి పురుషులు సైతం, ఈ లీవును వాడుకోడానికి అర్హులే. అర్హులైన ప్రతి ఉద్యోగి తమ మొత్తం సర్వీస్ కాలంలో గరిష్టంగా 180 రోజులు (6 నెలలు) చైల్డ్ కేర్ లీవ్‌ను వాడుకోవచ్చు. గరిష్టంగా ఇద్దరు పిల్లల సంరక్షణ కోసం మాత్రమే ఈ సెలవులను అనుమతిస్తారు. జీవో 70 ప్రకారం పిల్లల సంరక్షణలో వయో పరిమితి నిబంధనలను ఎత్తేశారు. ఈ 180 రోజుల సెలవును గరిష్టంగా పది విడతల్లో వాడుకోవచ్చు

SBI లో భారీ నోటిఫికేషన్.. లక్షల్లో జీతం!
బ్యాంక్ జాబ్స్ కోసం చూస్తున్న యూత్‌కి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా 1,500 ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఏదైనా డిగ్రీ పాసైన వాళ్లు ఈ జాబ్స్ కి ఎలిజిబుల్. సెలెక్ట్ అయిన వారికి మెట్రో సిటీస్ లో ఏడాదికి దాదాపు రూ.22 లక్షల వరకు ప్యాకేజీ ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూల ద్వారా సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది. అప్లై చేయడానికి జూలై 8 లాస్ట్ డేట్. జనరల్ అభ్యర్థులకు రూ.750 ఫీజు ఉండగా, ఎస్సీ, ఎస్టీలకు ఫ్రీ.

గోదావరి పుష్కరాలకు భారీ ఏర్పాట్లు
వచ్చే ఏడాది జూన్ 26నుంచి జులై 7 వరకూ జరిగే గోదావరి పుష్కరాలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. 12 మంది మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీని వేస్తున్నామన్నారు. పుష్కరాల దృష్ట్యా 162 ఆలయాల్లో రూ. 71.60 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని వచ్చే ఏడాది మార్చికల్లా వాటిని కంప్లీట్ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.

వాహనదారులకు షాకిచ్చిన కియా
ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా ఇండియా దేశంలో విక్రయించే తన అన్ని మోడళ్ల ధరలను పెంచాలని నిర్ణయించింది. వచ్చే జులై 1, 2026 నుంచి భారతదేశంలో విక్రయించే అన్ని కియా కార్ల ధరలను 2 శాతం వరకు పెంచనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. కారు మోడల్, వేరియంట్‌ను బట్టి ఈ ధరల పెంపులో మార్పు ఉంటుంది.

కిల్లర్ రోబోలు వచ్చేశాయ్ !
యుద్ధరంగంలో 'కిల్లర్ రోబోలు' ఇప్పుడు నిజమయ్యాయి. మనుషుల ప్రమేయం లేకుండానే శత్రువులను గుర్తించి మట్టుబెట్టే సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. ఈ రోబోలకు ఫీడ్ చేసి వదిలి పెడితే యుద్ధరంగంలో శత్రువును మట్టుపెట్టేస్తాయి. అయితే, ఈ ప్రాణాంతక యంత్రాలను యుద్ధాల్లో అనుమతించాలా? లేదా మానవాళి మనుగడకే ముప్పుగా భావించి నిషేధించాలా? అనే కీలకమైన నిర్ణయాన్ని తేల్చుకోవాల్సింది మాత్రం ప్రపంచ దేశాలే.

డబుల్ మిలియన్ మైల్ స్టోన్ దాటిన మా ఇంటి బంగారం..
సమంత లీడ్ రోల్‌లో నటించిన క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'మా ఇంటి బంగారం' బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేటను కొనసా గిస్తోంది. ఈ చిత్రం తాజాగా డబుల్ మిలియన్ మైల్‌స్టోన్ (2 మిలియన్ డాలర్లు/వ్యూస్) మార్కును క్రాస్ చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.సామ్ పవర్‌ప్యాక్డ్ పర్ఫార్మెన్స్‌కు తోడు స్ట్రాంగ్ కంటెంట్ ఉండటంతో ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ అరుదైన ఘనతతో ట్రేడ్ వర్గాల్లో 'మా ఇంటి బంగారం' రేంజ్ మరింత పెరిగింది. బాక్సాఫీస్ వద్ద సామ్ వన్‌మెన్ షోతో దూసుకుపోతోంది.
యోగా లో బాబా రాందేవ్‌తో పోటీపడుతున్న నారా లోకేష్..
నిన్న జూన్ 21st ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ అందరినీ షాక్‌కి గురిచేశారు. యోగా గురు బాబా రాందేవ్‌తో కలిసి ఆయన ఒకే స్టేజ్‌పై యోగా ఆసనాలు వేశారు. బాబా రాందేవ్ వేగంగా ఆసనాలు వేస్తుంటే, లోకేష్ కూడా అంతే స్పీడ్‌తో, పర్‌ఫెక్ట్‌గా వేయడానికి ట్రై చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
చెరువు పైన పందిరి.. రోల్ మోడల్‌గా నిలిచిన రైతు!
ఒడిశాలోని సుందర్‌గఢ్‌కు చెందిన ఒక రైతు వినూత్నంగా ఆలోచించి అందరికీ రోల్ మోడల్‌గా నిలిచారు. తనకున్న చెరువు పైన ఒక పందిరి సెటప్ చేసి సొరకాయలతో పాటు ఇతర తీగజాతి కూరగాయలను పండిస్తున్నారు. అదే సమయంలో కింద ఉన్న చెరువు నీటిలో చేపల పెంపకం కూడా చేస్తున్నారు. ఇలా ఒకే ప్లేస్‌లో అటు భూమిని, ఇటు నీటిని వేస్ట్ చేయకుండా వాడుకుంటూ డబుల్ ఇన్కమ్ సంపాదిస్తున్నారు. ఈ వినూత్నమైన అగ్రికల్చర్ ఐడియా ఇప్పుడు చాలా మందికి ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తోంది.

హైదరాబాద్ లో ఈరోజు IT ఎంప్లాయ్స్ ఎర్లీ లాగౌట్స్!
హైదరాబాద్‌లో ఈరోజు సాయంత్రం భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో సైబరాబాద్ పోలీసులు అలర్ట్ అయి ఐటీ కంపెనీలు, స్కూళ్లు, కాలేజీలకు ఒక ఇంపార్టెంట్ నోటీస్ ఇచ్చారు. ట్రాఫిక్ జామ్స్ అవ్వకుండా ఉండటానికి ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటల నుంచే ఎంప్లాయ్స్‌కి షిఫ్టుల వారీగా ఎర్లీ లాగౌట్స్ ఇవ్వాలని కంపెనీలకు చెప్పారు. ఆఫీసులన్నీ ఒకేసారి కాకుండా గ్యాప్ ఇస్తూ వదిలితే రోడ్లపై ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవని పోలీసులు తెలిపారు.

పిల్లలు అడిగిందల్లా ఇస్తున్నారా? దీని వల్ల కలిగే నష్టాలు ఇవే!
పిల్లలు అడిగిన ప్రతిదాన్ని వెంటనే కొనిపెట్టడం ప్రేమ అనుకుంటే పొరపాటే. ఇలా చేయడం వల్ల వారి ఫ్యూచర్ పాడవుతుంది. ఏది అడిగినా వెంటనే వారికి దొరికేయడం వల్ల పిల్లల్లో ఓర్పు నశిస్తుంది. దేనికోసం వెయిట్ చేయడం వారికి అస్సలు నచ్చదు. అలాగే ఏ కష్టం లేకుండా అన్నీ వచ్చేస్తుంటే, వస్తువుల విలువతో పాటు వాటి వెనుక ఉన్న పేరెంట్స్ కష్టం కూడా వారికి అస్సలు తెలియదు. దీనివల్ల పిల్లల్లో మొండితనం, స్వార్థం పెరిగిపోయి ఎప్పుడూ తమ గురించే ఆలోచిస్తారు. అందుకే పిల్లలకు ప్రేమతో పాటు క్రమశిక్షణ నేర్పడం, హద్దులు పెట్టడం, అవసరమైనప్పుడు 'కాదు' అని చెప్పడం పేరెంటింగ్‌లో చాలా ఇంపార్టెంట్.

అటానమస్ డ్రోన్లతో సైనికులను మట్టు పెట్టొచ్చు
యుద్ధరంగంలో చరిత్రలోనే తొలిసారిగా పూర్తిగా స్వయంప్రతిపత్తితో పనిచేసే డ్రోన్లు సైనికులను మట్టుబెట్టాయి. ఉక్రెయిన్ రక్షణ రంగానికి చెందిన ఒక సీనియర్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. రెండేళ్ల క్రితం ఒక నిర్దిష్ట ప్రాంతంలో శత్రువులను గుర్తించి, నాశనం చేసేందుకు నిర్వహించిన డ్రోన్ పరీక్షల్లో సైనికులు మరణించినట్లు నిర్ధారణ అయింది. ఈ ఘోర ఘటనా వివరాలు 'న్యూ సైంటిస్ట్' పత్రిక ద్వారా తాజాగా వెలుగులోకి వచ్చాయి.

ఫేక్ ప్రచారాల విషయంలో జాగ్రత్త: సీఎం చంద్రబాబు
AP: పీజీఆర్ఎస్ అర్జీలను మానవీయ కోణంలో పరిష్కరించాలని అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. ఇవాళ రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. అర్జీదారుల స్థానంలో ఉండి ఫిర్యాదులను పరిష్కరించే దిశగా దృష్టి సారించాలని ఆదేశించారు. ఉద్యోగులు, అధికారులు సాఫ్ట్ స్కిల్స్ అలవరచుకోవాలన్నారు.
కోచింగ్ సెంటర్‌లో మంటలు.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన స్టూడెంట్స్!
ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఒక భయంకరమైన ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అక్కడ ఉన్న ఒక కోచింగ్ సెంటర్‌లో ఒక్కసారిగా భారీగా మంటలు వచ్చాయి. దాంతో లోపల ఉన్న స్టూడెంట్స్ ప్రాణాలు కాపాడుకోవడానికి బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందకు దూకేశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే స్పాట్‌కి వచ్చి మంటలను కంట్రోల్ చేశారు.
10 ఏళ్లలో ఆరుగురు PMలు రిజైన్!
బ్రిటన్ PM కీర్ స్టార్మర్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రిజైన్ చేయబోతున్నారంటూ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అనౌన్స్ చేసిన 24 గంటల్లోనే ఈ డెసిషన్ వచ్చింది. 2024లో PM అయిన స్టార్మర్, ఇంత ఫాస్ట్‌గా తప్పుకుంటారని ఎవరూ ఊహించలేదు. గత పదేళ్లలో బ్రిటన్‌లో ఇలా ఆరుగురు ప్రధానులు వరుసగా రాజీనామా చేయడం నిజంగా ఒక షాకింగ్ రికార్డ్.
కూతురి కోసం ఓ తండ్రి ఆవేదన.. ఈ వీడియో చూస్తే కన్నీళ్ళు ఆగవు!
మధ్యప్రదేశ్‌లోని విదిశాలో ఒక హార్ట్ బ్రేకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. జస్ట్ కొంచెం లేట్ అవ్వడం, బయోమెట్రిక్ ప్రాబ్లమ్స్ రావడం, అలాగే అడ్మిట్ కార్డులో మిస్టేక్స్ ఉండటంతో ముగ్గురు అమ్మాయిలు Re-NEET ఎగ్జామ్ రాయలేకపోయారు. తన కూతురిని ఎలాగైనా లోపలికి పంపించాలని ఒక తండ్రి ఎగ్జామ్ సెంటర్ ముందే కిందపడి బోరున ఏడ్చారు. అయినా సరే రూల్స్ అంటూ అధికారులు ఆ స్టూడెంట్స్‌ని అస్సలు అలౌ చేయలేదు. ఇయర్ అంతా కష్టపడి చదివిన ఎగ్జామ్ రాయలేకపోయినందుకు ఆ స్టూడెంట్స్, పేరెంట్స్ అక్కడే కిందపడి ఏడ్చేశారు. దీనికి సంబంధించిన ఎమోషనల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.

మాస్కోపై ఉక్రెయిన్ డ్రోన్ల వర్షం
రష్యా రాజధాని మాస్కోను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ మరోసారి డ్రోన్లతో దాడులు చేసింది. ఉక్రెయిన్‌కు చెందిన డ్రోన్లు మాస్కో వైపు దూసుకొస్తుండగా, రష్యా వైమానిక రక్షణ వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. 60 డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా అధికారులు ప్రకటించారు. దీంతో మాస్కోలోని నాలుగు ప్రధాన విమానాశ్రయాల్లో రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు.