Latest

ఆర్థిక ఆరోగ్య సూచీలో తెలంగాణ అగ్రస్థానం
TG· 21 Jun 2026

ఆర్థిక ఆరోగ్య సూచీలో తెలంగాణ అగ్రస్థానం

ఆర్థిక ఆరోగ్య సూచీలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. AP ఆర్థిక స్థిరత్వం అంత బలంగా లేదని, తెలంగాణలో పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉందని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఫైనాన్స్‌ అండ్‌ పాలసీ (NIPFP) ప్రపంచ బ్యాంక్ నివేదిక తెలిపింది. బడ్జెట్‌తో నిమిత్తం లేకుండా తెలంగాణలో అత్యధిక అప్పులు చేసినా గత మూడేళ్లుగా ఈ అప్పులు తగ్గిపోతున్నాయని స్పష్టం చేసింది. ఇది మంచి పరిణామమని పేర్కొంది. తెలంగాణకు రుణాలు, హామీలు, ఇతర భారాలు ఆందోళనకరంగా ఉన్నా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే దానికి బలమైన ఆర్థిక సామర్థ్యం ఉందని నివేదికలో పేర్కొంది.

అల్జీమర్స్ కి ఫస్ట్ స్టేజ్‌లో డ్రగ్ వాడితేనే రిజల్ట్ అంటున్న నిపుణులు
Health· 21 Jun 2026

అల్జీమర్స్ కి ఫస్ట్ స్టేజ్‌లో డ్రగ్ వాడితేనే రిజల్ట్ అంటున్న నిపుణులు

మతిమరుపు వ్యాధి (అల్జీమర్స్) చికిత్సలో కొత్త ఔషధాలు అద్భుతాలు సృష్టిస్తున్నా.. అవి వ్యాధి ప్రారంభ దశలో ఉన్న రోగులపైనే అత్యంత సమర్థవంతంగా పనిచేస్తున్నాయని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మెదడులో కణాలు పూర్తిగా దెబ్బతినక ముందే, అంటే ‘ఎర్లీ స్టేజ్’లోనే ఈ డ్రగ్స్ ఇస్తే వ్యాధి తీవ్రతను విజయవంతంగా అడ్డుకోవచ్చని రీసెర్చ్‌లలో తేలింది. ముదిరిన తర్వాత వాడితే పెద్దగా ఫలితం ఉండదని, అందుకే ఫస్ట్ స్టేజ్‌లోనే గుర్తించడం కీలకమని హెచ్చరిస్తున్నారు.

ఏఐ సాయంతో ఐటీ రిటర్నులు డేంజర్ అంటున్న నిపుణులు
Politics· 21 Jun 2026

ఏఐ సాయంతో ఐటీ రిటర్నులు డేంజర్ అంటున్న నిపుణులు

ఐటి రిటర్నులు దాఖలు చేయడానికి ఏఐ హెల్ప్ తీసుకుంటున్నారా? అయితే మీరు కాస్త డేంజర్లో ఉన్నట్లే. ఎందుకంటే ఏఐ తో మేలుకన్నా చిక్కులే ఎక్కువ. ఏఐ వల్ల పన్ను డేటా భద్రతకు తీవ్ర ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. పైగా మల్టిపుల్ ఆదాయ వనరులు, అంతర్జాతీయ పన్నులు, సంక్లిష్టమైన నిబంధనలను అర్థం చేసుకోవడంలో ఏఐ తడబడుతుంది. దీనివల్ల తప్పుడు సమాచారంతో కూడిన ఐటీఆర్ దాఖలై, చిక్కుల్లో పడే అవకాశం ఉంది. వచ్చే జూలైలో ఐటీ రిటర్నులు (ITR) దాఖలు చేయడానికి చాట్‌జీపీటీ, క్లాడ్ వంటి ఏఐ టూల్స్ వాడేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వర్షాకాలంలో  రెయిన్ బో లాగా  మెరిసిపొండి !
General· 20 Jun 2026

వర్షాకాలంలో రెయిన్ బో లాగా మెరిసిపొండి !

మబ్బుల వల్ల వర్షాకాలంలో వాతావరణ మంతా కాస్త డల్‌గా ఉంటుంది. అందుకే ఈ సీజన్‌లో మిమ్మల్ని బ్రైట్‌గా చూపించే కలర్ థెరపీ ఇక్కడుంది. నలుపు, తెలుపు రంగులను పక్కనపెట్టి.. వైబ్రెంట్ ఎల్లో, నియాన్ గ్రీన్, స్కై బ్లూ, పింక్ వంటి షేడ్స్ ట్రై చేయండి. దీనికి తోడు వాటర్‌ప్రూఫ్ ఫ్యాబ్రిక్స్ ఎంచుకో వడం, అలాగే మట్టి మరకలు పడకుండా డార్క్ బాటమ్స్ (ఫ్యాంట్లు) మ్యాచ్ చేయడం వల్ల మీ లుక్ మరింత పవర్‌ఫుల్‌గా, ట్రెండీగా మారుతుంది!

హర్ముజ్  జలసంధిని మళ్లీ మూసేసిన ఇరాన్ !
World· 20 Jun 2026

హర్ముజ్ జలసంధిని మళ్లీ మూసేసిన ఇరాన్ !

హర్ముజ్ జలసంధిని ఇరాన్ మళ్లీ మూసేసింది. లెబనాన్ పై ఇజ్రాయెల్ కంటిన్యుయస్ గా దాడులు చేయడాన్ని ఇరాన్ తప్పుబట్టింది. అమెరికా,ఇజ్రాయోల్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి నందున జలసంధిని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఇది తమ రియాక్షన్ లో మొదటి అడుగు మాత్రమేనని, ఇలాగే కొనసాగితే ఇంకా తీవ్రంగా స్పందిస్తామని ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. ఏ నౌకలు జలసంధి దగ్గరకు రావొద్దని వస్తే ముప్పు తప్పదని ఇరాన్ సూచించింది.

నీట్ రీ-టెస్ట్ ఎఫెక్ట్: 37 రోజుల్లో 12 మంది విద్యార్థుల ఆత్మహత్య!
Education· 20 Jun 2026

నీట్ రీ-టెస్ట్ ఎఫెక్ట్: 37 రోజుల్లో 12 మంది విద్యార్థుల ఆత్మహత్య!

పేపర్ లీక్ వివాదంతో మే 3న జరిగిన నీట్-యుజి (NEET-UG) పరీక్ష రద్దు కావడం, రేపు మళ్లీ రీ-టెస్ట్ నిర్వహించాల్సి రావడంతో విద్యార్థుల్లో తీవ్ర మానసిక ఆందోళన వ్యక్తమవుతోంది. పరీక్ష రద్దయిన ఈ 37 రోజుల్లోనే దేశవ్యాప్తంగా కనీసం 12 మంది మెడికల్ అభ్యర్థులు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది. పరీక్షలు రాసి సీటు వస్తుందనుకున్న తరుణంలో, మళ్లీ రాయాలనే భయం, నిరాశే ఈ ఘోరాలకు కారణమని తెలుస్తోంది.

సముద్రాన్ని చీల్చేస్తానంటూ బయల్దేరిన పాస్టర్ !▶
World· 20 Jun 2026

సముద్రాన్ని చీల్చేస్తానంటూ బయల్దేరిన పాస్టర్ !

నైజీరియాలో ఓ పాస్టర్ బైబిల్‌లోని మోసెస్‌లా సముద్రాన్ని చీల్చాలని ప్రయత్నించి వార్తల్లో నిలిచాడు. చేతిలో బైబిల్, కర్ర పట్టుకుని సముద్రంలోకి నడుచుకుంటూ వెళ్లగా, అద్భుతం జరుగుతుందని అనుచరులు ఆసక్తిగా గమనించారు. అయితే అకస్మాత్తుగా వచ్చిన భారీ అల ఆయనను ముంచెత్తడంతో కొద్దిసేపు ఆందోళన నెలకొంది. చివరకు ప్రాణాలతో ఒడ్డుకు చేరుకున్నాడు. ఈ ఘటనపై నెటిజన్లు సరదాగా స్పందిస్తూ, దేవుడి పేరుతో ఇలాంటి ప్రమాదకర విన్యాసాలు చేయొద్దని, ప్రకృతి శక్తిని తక్కువ అంచనా వేయకూడదని కామెంట్లు చేస్తున్నారు.

గంటల కొద్దీ క్యూలు.. బారక్‌పూర్ బిర్యానీ క్రేజ్!
News· 20 Jun 2026

గంటల కొద్దీ క్యూలు.. బారక్‌పూర్ బిర్యానీ క్రేజ్!

బెంగాల్‌లోని 'బారక్‌పూర్' ఇప్పుడు బిర్యానీ ప్రియుల పాలిట స్వర్గధామంగా మారింది. ఇక్కడి ప్రసిద్ధ 'దాదా బౌదీ' హోటల్ రుచులను ఆస్వాదించేందుకు జనాలు గంటల తరబడి ప్రయాణాలు చేసి, మండుటెండల్లో కూడా క్యూ లైన్లలో నిల్చుంటున్నారు. ఒక్క ముక్క నోట్లో పెట్టగానే కరిగిపోయే ఇక్కడి బిర్యానీ కోసం జరిగే ఈ 'బిర్యానీ యాత్రలు' ఇప్పుడు బెంగాల్‌లోనే హాట్ టాపిక్‌గా మారాయి.

హోరాహోరి 'బిర్యానీ వార్'.. పోటాపోటీగా కాపీ క్యాట్స్!
News· 20 Jun 2026

హోరాహోరి 'బిర్యానీ వార్'.. పోటాపోటీగా కాపీ క్యాట్స్!

ఒకే ఒక చిన్న బిర్యానీ షాప్ సక్సెస్.. ఒక ఊరినే 'బిర్యానీ టౌన్'గా మార్చేసింది! బారక్‌పూర్‌లో ఒరిజినల్ హోటల్ క్రేజ్ చూసి, కోల్‌కతాకు చెందిన పెద్ద పెద్ద రెస్టారెంట్ చైన్లు కూడా అక్కడ వాలాయి. అంతేకాదు, అదే పేరుతో బోలెడన్ని కాపీ షాపులు పుట్టుకొచ్చి కస్టమర్ల కోసం తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఈ మసాలా పోరుతో బారక్‌పూర్ వీధులన్నీ ఘుమ ఘుమలాడుతున్నాయి! బిర్యానీ లవర్స్ కి ఈ వార్తే బిర్యానీ తిన్నంతగా నోరూరుతోంది కదూ !

మెలోనీ పై ట్రంప్ రెండోసారి ఎదురు దాడి !
World· 20 Jun 2026

మెలోనీ పై ట్రంప్ రెండోసారి ఎదురు దాడి !

తనతో ఫోటో కోసం ఇటలీ ప్రధాని మెలోని వెంపర్లాడిందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ప్రకటించారు. ఈ కామెంట్ ను మెలోని ఖండించారు. తానేనాడూ ఫొటో కోసం పాకులాడలేదని క్లారిటీ ఇచ్చారు. కానీ ట్రంప్ మళ్లీ అదే కామెంట్ రిపీట్ చేశారు. మెలోని కు పాపులారిటీ రాను రాను తగ్గిపోతోందని అందుకే ఆమె తనతో ఫోటో కోసం క్రేజీగా వెంటపడుతున్నారని అన్నారు. ఇరాన్ అమెరికా వార్ నేపధ్యంలో అమెరికాతో మరింతగా రిలేషన్స్ పెంచుకోవాలని మెలోని భావిస్తున్నారన్నారు.

ఢిల్లీలో హై టెన్షన్: CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే!▶
Education· 20 Jun 2026

ఢిల్లీలో హై టెన్షన్: CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే!

ఢిల్లీలో జరుగుతున్న పీస్‌ఫుల్ ప్రొటెస్ట్‌కు టైమ్ ఎక్స్టెండ్ చేయాలన్న రిక్వెస్ట్‌ను పోలీసులు రిజెక్ట్ చేశారు. అంతేకాకుండా, CJP ఫౌండర్ అభిజీత్ దీప్కేను అరెస్ట్ చేయడానికి పోలీసులు రెడీ అవుతున్నారు. ఈ విషయం తెలియడంతో అభిజీత్ సోషల్ మీడియా ద్వారా ఒక అలర్ట్ మెసేజ్ షేర్ చేశారు. దేశంలోని ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుండాలని కోరుకునే స్టూడెంట్స్, పేరెంట్స్, ప్రతీ ఒక్క సిటిజన్ వెంటనే ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గరకు రావాలంటూ వారు రిక్వెస్ట్ చేస్తున్నారు. ప్రెజెంట్ ఈ ట్వీట్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.

అందం కోసం మిరాకిల్ డ్రగ్స్ వెంట అమెరికన్ల పరుగులు
World· 20 Jun 2026

అందం కోసం మిరాకిల్ డ్రగ్స్ వెంట అమెరికన్ల పరుగులు

బరువు తగ్గడం, యవ్వనంగా కనిపించడం, కండరాల పుష్టి కోసం అమెరికాలో 'పెప్టైడ్స్' వాడకం విపరీతంగా పెరిగింది. ఎలాంటి కఠినమైన ప్రభుత్వ నిబంధనలు (FDA నియంత్రణలు) లేకపోవడంతో, వీటిని 'మిరాకిల్ డ్రగ్స్'గా ప్రచారం చేస్తూ బ్లాక్ మార్కెట్, ఆన్‌లైన్ క్లినిక్స్‌లో విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. అయితే, క్లినికల్ ట్రయల్స్ లేని ఈ అన్‌రెగ్యులేటెడ్ ఇంజెక్షన్ల వల్ల ప్రాణాలకే ముప్పు ఉందని, యువత వీటి బారిన పడొద్దని వైద్య నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.

50 ప్లస్‌లోనూ ఫ్యాషన్ ఫైర్.. సోషల్ మీడియాలో సెన్సేషన్!
Entertainment· 20 Jun 2026

50 ప్లస్‌లోనూ ఫ్యాషన్ ఫైర్.. సోషల్ మీడియాలో సెన్సేషన్!

ఫ్యాషన్ అంటే కేవలం యూత్‌దే అనుకుంటే పొరపాటే. యాభై ఏళ్లు దాటినా ముసలితనాన్ని దరిచేరనీయకుండా, సరికొత్త ఫ్యాషన్ ట్రెండ్స్‌తో దుమ్మురేపుతున్నారు కొందరు సీనియర్స్. లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ, కుర్రకారు మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్‌లో స్టైలిష్ ఔట్‌ఫిట్స్‌తో అదరగొడుతున్నారు. ఏజ్ గ్యాప్‌ని బ్రేక్ చేస్తూ, తమ బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ లుక్స్‌తో డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్‌పై ట్రెండ్ సెట్ చేస్తున్నారు. జెన్ జీ సైతం స్టైల్ , లుక్ లో వీరితో పోటీ పడాల్సిందే ఇక !

ఫిలిం మేకింగ్ ను కొత్త పుంతలు తొక్కిస్తున్న యూట్యూబర్లు
Cinema· 20 Jun 2026

ఫిలిం మేకింగ్ ను కొత్త పుంతలు తొక్కిస్తున్న యూట్యూబర్లు

సోషల్ మీడియా, యూట్యూబ్ వేదికగా షార్ట్ ఫిలింలు, వెబ్ సిరీస్‌లతో గుర్తింపు తెచ్చుకున్న ‘యూట్యూబర్ డైరెక్టర్లు’ ఇప్పుడు వెండితెరపై సంచలనాలు సృష్టిస్తూ సినిమా రంగాన్ని శాసిస్తున్నారు. 'ది బ్యాక్‌రూమ్స్', 'అబ్సెషన్' వంటి చిత్రాల విజయాలే ఇందుకు నిదర్శనం. డిజిటల్ మీడియా ద్వారా నేర్చుకున్న మెళకువలతో, నేటి తరం ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా వైవిధ్యమైన కథలను తెరకెక్కిస్తూ వీరు ఇండస్ట్రీలో క్రేజీ దర్శకులుగా మారుతున్నారు.

తమిళనాడు పాలిటిక్స్‌లో ఊహించని ట్విస్ట్!
Politics· 20 Jun 2026

తమిళనాడు పాలిటిక్స్‌లో ఊహించని ట్విస్ట్!

తమిళనాడు రాజకీయాల్లో ఒక ఊహించని పరిణామం జరిగింది. DMK కూటమికి IUML పార్టీ బిగ్ షాక్ ఇచ్చింది. DMK అలయన్స్ నుంచి పూర్తిగా బయటకు వచ్చేస్తున్నట్లు IUML అనౌన్స్ చేసింది. ఈ ఊహించని డెసిషన్‌తో అక్కడ పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయి. DMK కూటమికి గుడ్ బై చెప్పిన IUML. ప్రెజెంట్ CM విజయ్ ఆద్వర్యంలోని అధికార TMK అలయన్స్‌లో జాయిన్ అవ్వడానికి రెడీ అయిపోయింది. ఈ పొలిటికల్ చేంజ్ ఇప్పుడు నెట్టింట ఫుల్ ట్రెండ్ అవుతోంది.

లవర్ కోసం కన్న కొడుకునే చంపేసిన తల్లి!
Crime· 20 Jun 2026

లవర్ కోసం కన్న కొడుకునే చంపేసిన తల్లి!

సిద్దిపేట జిల్లాకు చెందిన స్వామి, జ్యోతి దంపతులు తమ రెండేళ్ల కొడుకు హరికృష్ణతో కలిసి కీసర పోలీస్ స్టేషన్ దగ్గర్లో ఉంటున్నారు. అయితే జ్యోతికి నవీన్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడింది. భర్త ఇంట్లో లేని టైమ్‌లో ప్రియుడిని ఇంటికి పిలిచేది. వారు కలిసి ఉన్నప్పుడు బాబు ఏడుస్తుండడంతో నవీన్ చిరాకు పడ్డాడు. బాబును చంపేద్దామని నవీన్ అనడంతో జ్యోతి కూడా ఓకే చెప్పింది. ఇద్దరూ కలిసి బాబును కిందపడేసి కొట్టి చంపేశారు. ఫిట్స్ వచ్చి చనిపోయాడని నమ్మించారు. కానీ తండ్రికి డౌట్ రావడంతో 20 రోజుల తర్వాత ఈ నిజం బయటపడింది. ప్రెజెంట్ జ్యోతిని పోలీసులు అరెస్ట్ చేయగా, ప్రియుడు నవీన్ పరారీలో ఉన్నాడు.

క్లిన్ కారా ఫేస్ ఫస్ట్ టైమ్ రివీల్ చేసిన రామ్ చరణ్-ఉపాసన!
Cinema· 20 Jun 2026

క్లిన్ కారా ఫేస్ ఫస్ట్ టైమ్ రివీల్ చేసిన రామ్ చరణ్-ఉపాసన!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమ కూతురు క్లిన్ కారా ఫేస్‌ను ఫస్ట్ టైమ్ ప్రపంచానికి పరిచయం చేశారు. క్లిన్ కారా థర్డ్ బర్త్‌డే (3rd Birthday) సందర్భంగా చరణ్, ఉపాసన తమ అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా పాప ఫొటోను షేర్ చేశారు. ఇప్పటివరకు క్లిన్ కారా ఫొటోస్ ఎప్పుడు పెట్టినా ఫేస్ కనిపించకుండా జాగ్రత్త పడిన మెగా ఫ్యామిలీ.. బర్త్‌డే రోజే ఈ బిగ్ సర్ప్రైజ్ ఇవ్వడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రెజెంట్ ఈ పిక్ నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

స్టాక్ మార్కెట్ లో  ఈ షేరు దుమ్ము రేపుతుంది బాసు!
Business· 20 Jun 2026

స్టాక్ మార్కెట్ లో ఈ షేరు దుమ్ము రేపుతుంది బాసు!

రైల్వే రక్షణ వ్యవస్థ 'కవచ్' సెగ్మెంట్‌లో దుమ్మురేపుతున్న మల్టీబ్యాగర్ స్టాక్ Kernex Microsystems ప్రస్తుతం కాస్త నెమ్మదించింది. గత 3 నెలల్లో ఏకంగా 110% పైగా లాభాలతో ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించిన ఈ షేరు, రీసెంట్‌గా ప్రాఫిట్ బుకింగ్ (లాభాల స్వీకరణ) వల్ల 4% పైగా క్షీణించింది. ట్రెండ్ చూస్తే.. కేవలం నెల రోజుల్లోనే ఈ స్టాక్ 50% పెరిగి సెన్సెక్స్‌ను సైతం అవుట్‌పర్ఫామ్ చేసింది. సౌత్ ఇండియాలో 548 కిలోమీటర్ల మేర 'కవచ్ 4.0' సిస్టమ్‌ను విస్తరించాలని రైల్వే శాఖ భారీ ప్లాన్ చేస్తుండటంతో, రాబోయే రోజుల్లో ఈ స్టాక్‌లో మరిన్ని కదలికలు ఉండొచ్చని మార్కెట్ వర్గాల అంచనా!

హనుమాన్ టెంపుల్‌లో ఊహించని ప్రమాదం!▶
News· 20 Jun 2026

హనుమాన్ టెంపుల్‌లో ఊహించని ప్రమాదం!

మహారాష్ట్ర పర్బానీలోని యశ్వాడి అనే ఊరిలో ఒక ఘోర ప్రమాదం జరిగింది. అక్కడ ఉన్న హనుమాన్ టెంపుల్ మండపం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదం జరిగిన టైమ్ లో అక్కడ చాలా మంది భక్తులు ఉన్నారు. మండపం కూలిపోవడంతో ఆ శిథిలాల కింద దాదాపు 30 మంది వరకు చిక్కుకుపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ టీమ్స్ అక్కడికి చేరుకుని, లోపల ఉన్న వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రెజెంట్ అక్కడ ఫుల్ టెన్షన్ వాతావరణం నెలకొంది.

ప్రపంచంలోనే బెస్ట్ లీడర్ మోదీ: ట్రంప్▶
World· 20 Jun 2026

ప్రపంచంలోనే బెస్ట్ లీడర్ మోదీ: ట్రంప్

అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ఒక ఇంటర్వ్యూలో ఇండియా ప్రధాని నరేంద్ర మోదీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రపంచంలోనే ఇద్దరు గొప్ప లీడర్స్ ఎవరని ఒక జర్నలిస్ట్ అడగ్గా. అందులో ఒకరు చైనా ప్రెసిడెంట్ షీ జిన్‌పింగ్ కాగా, ఇంకొకరు ఇండియా ప్రధాని మోదీ అని ట్రంప్ చెప్పారు. మోదీ చాలా మంచి లీడర్ అని, ఇండియా నంబర్స్ కూడా చాలా బాగున్నాయని పొగిడారు. మోదీ యుద్ధాలకు దూరంగా ఉంటారని, అది చాలా స్మార్ట్ డెసిషన్ అని ట్రంప్ ప్రశంసించారు. ఇండియా ప్రపంచంలోనే చాలా పెద్ద దేశం అంటూ ట్రంప్ మోదీని పొగిడారు.

88 ఏళ్ల పర్సన్ కు ట్రంప్ పర్సనల్ సపోర్ట్!▶
World· 20 Jun 2026

88 ఏళ్ల పర్సన్ కు ట్రంప్ పర్సనల్ సపోర్ట్!

అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్‌లో ఒక ఇన్‌స్పైరింగ్ అవార్డు ప్రెజెంటేషన్ చేశారు. 88 ఏళ్ల రిటైర్డ్ US మెరైన్ జేమ్స్ కేపర్స్ జూనియర్ దేశానికి చేసిన సేవలను గుర్తిస్తూ, ట్రంప్ ఆయనకు స్వయంగా అమెరికా అత్యున్నత సైనిక పురస్కారం 'మెడల్ ఆఫ్ ఆనర్' (Medal of Honor) ఇచ్చి గౌరవించారు. జేమ్స్ కేపర్స్ జూనియర్‌కు ట్రంప్ పర్సనల్‌గా సపోర్ట్ చేస్తూ ఈ బిగ్గెస్ట్ అవార్డును ప్రెసెంట్ చేయడం నిజంగా ఒక అద్భుతమైన మూమెంట్.