Latest

మూవీ సీన్‌ను తలపించేలా బంగారం చోరీ
Crime· 21 Jun 2026

మూవీ సీన్‌ను తలపించేలా బంగారం చోరీ

AP: మోతిలాల్ అనే వ్యక్తి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో నంద్యాల జిల్లా డోన్ హైవేపై శనివారం అర్థరాత్రి భారీ మొత్తంలో బంగారంతో ప్రయాణిస్తున్నాడు. విషయాన్ని ముందే పసిగట్టిన దొంగల ముఠా స్కార్పియో కారులో ఆ ప్రైవేట్ బస్సును ఫాలో చేస్తూ వచ్చింది. బస్సు డోన్ హైవేపై ఉన్న భారత్ డాబా దగ్గర ఆగడంతో బంగారం ఉన్న బ్యాగ్ అపహరించుకుని స్కార్పియోలో పరారయ్యారు. బస్సు జడ్చర్ల చేరుకున్న తర్వాత మోతిలాల్ బ్యాగ్‌ కన్పించకపోవడంతో డోన్ PSలో ఫిర్యాదు చేశాడు. 2.750 కిలోల బంగారం చోరీ చేశారని, దానివిలువ రూ.4.50 కోట్లు ఉంటుందని బాధితుడు తెలిపాడు.

వర్షాకాలంలో జుట్టు రాలకుండా ఈ టిప్స్ ట్రై చేయండి
Politics· 21 Jun 2026

వర్షాకాలంలో జుట్టు రాలకుండా ఈ టిప్స్ ట్రై చేయండి

వర్షాల వల్ల వచ్చే హ్యుమిడిటీ (తేమ) కి జుట్టు జిడ్డుగా మారి, విపరీతంగా రాలిపోతోందా? అయితే ఈ సింపుల్ టిప్స్ మీ కోసమే: వర్షంలో తడిస్తే వెంటనే వాష్: వర్షపు నీటిలో ఉండే కాలుష్యం స్కాల్ప్‌ను పాడు చేస్తుంది. అందుకే తడిస్తే వెంటనే మైల్డ్ షాంపూతో తలస్నానం చేయండి. స్కాల్ప్ డ్రైగా ఉంచండి: తలస్నానం తర్వాత జుట్టును పూర్తిగా ఆరనివ్వండి. తడి జుట్టుతో ముడి వేస్తే ఫంగల్ ఇన్ఫెక్షన్లు వస్తాయి. కండిషనర్ మస్ట్ : వర్షాకాలంలో జుట్టు ఫ్రిజ్జీగా (గరుకుగా) మారకుండా ఉండటానికి వారానికి రెండుసార్లు మంచి కండిషనర్ లేదా హెయిర్ సీరమ్ వాడండి.

నరసాపురంలో యువతి దారుణ హత్య
Crime· 21 Jun 2026

నరసాపురంలో యువతి దారుణ హత్య

AP: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ఓ యువతిని(31) మార్గాని రమేశ్ అనే వ్యక్తి అతి దారుణంగా హత్య చేశాడు. నరసాపురం రైల్వేస్టేషన్ నుంచి సఖినేటిపల్లికి కారులో వెళ్తున్న యువతిపై నిందితుడు కత్తితో పలుమార్లు పొడిచి చంపాడు. అడ్డుకోబోయిన కారు డ్రైవర్ సురేశ్‌పైనా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యువతి డెడ్‌బాడీని స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు. గాయపడిన సురేశ్‌కి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సిట్ ఏర్పాటు
AP· 21 Jun 2026

సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సిట్ ఏర్పాటు

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విజయవాడ సాయికృష్ణ మిస్సింగ్ కేసు దర్యాప్తుపై AP ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును త్వరగా ఛేదించేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT)ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేసులో ఉన్న ప్రాధాన్యత, సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకొని అత్యున్నత పోలీస్ అధికారులతో 'సిట్' బృందాన్ని ఏర్పాటు చేశారు. సాయికృష్ణ మిస్సింగ్ కేసును అన్ని కోణాల్లోనూ సమగ్రంగా దర్యాప్తు చేసేందుకు ఏర్పాటుచేసిన ఈ ప్రత్యేక బృందానికి (SIT) చీఫ్ సీనియర్ ఐపీఎస్ అధికారి, ఐజీ రవిప్రకాశ్‌ను నియమించారు.

'మార్నింగ్ లేవగానే ఫోన్ల వాడకాన్ని తగ్గించాలి'
TG· 21 Jun 2026

'మార్నింగ్ లేవగానే ఫోన్ల వాడకాన్ని తగ్గించాలి'

TG: ప్రతిఒక్కరూ మార్నింగ్ లేవగానే సెల్ ఫోన్ల వాడకాన్ని తగ్గించి యోగా, వ్యాయామం చేయాలని మినిస్టర్ సీతక్క సూచించారు. ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ZPHS బాలుర పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో పాల్గొని యోగా ఆసనాలు చేశారు. ప్రతిరోజు ప్రతిఒక్కరూ యోగా చేయడం ద్వారా పలు రకాల వ్యాధులను దూరం చేసుకోవచ్చని మంత్రి స్పష్టం చేశారు. యోగా అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాదని, శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, క్రమశిక్షణతో కూడిన జీవన విధానమని తెలిపారు.

నేషనల్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్
Local· 21 Jun 2026

నేషనల్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్

TG: హైదరాబాద్ - విజయవాడ నేషనల్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం బొరొల్లగూడెం స్టేజీ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున కంటైనర్ బోల్తా పడింది. హైవేపై అడ్డంగా వాహనం పడడంతో ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు రెండు క్రేన్లతో కంటైనర్‌ను పక్కకు తరలించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. హైదరాబాద్ మార్గంలో కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రస్తుతం విజయవాడ మార్గంలో కైతాపురం నుంచి బొర్రాల్లగూడెం స్టేజ్ వరకు వాహనాలను పంపిస్తున్నారు.

ఆ ఆరోపణలు అవాస్తవం: TUTA
Education· 21 Jun 2026

ఆ ఆరోపణలు అవాస్తవం: TUTA

TG: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో ఉన్న తెలంగాణ యూనివర్సిటీ 2012 నోటిఫికేషన్ ద్వారా 2014లో నియమితులైన అధ్యాపకులపై కొందరు వ్యక్తులు చేసిన ఆరోపణలను తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (TUTA) తీవ్రంగా ఖండించింది. అధ్యాపకులపై చేసిన ఆ ఆరోపణలు పూర్తిగా ఏకపక్షమైనవి, న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉన్న అంశాన్ని ప్రజావేదికలపై తప్పుగా చిత్రీకరించేవిగా ఉన్నాయని స్పష్టం చేశారు. హైకోర్టులో అప్పీళ్లు పెండింగ్‌లో ఉండగా సింగిల్ జడ్జి తీర్పును అంతిమ తీర్పుగా ప్రచారం చేయడం చట్టవిరుద్ధమని TUTA సభ్యులు పేర్కొన్నారు.

సినీ నిర్మాత గొట్టిముక్కల పద్మారావు మృతి
Politics· 21 Jun 2026

సినీ నిర్మాత గొట్టిముక్కల పద్మారావు మృతి

TG: సినీ నిర్మాత, రాజకీయ నాయకుడు గొట్టిముక్కల పద్మారావు మృతి చెందారు. హైదరాబాద్ కూకట్‌పల్లి వివేకానందనగర్‌లోని ఆయన నివాసంలో ఆదివారం తెల్లవారుజామున కన్ను మూశారు. నవంబరు 8, 1954లో కూకట్‌పల్లిలో జన్మించిన పద్మారావు 1996లో తెలుగుదేశం పార్టీతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి విశేషంగా కృషిచేశారు. చిన్నప్పట్టి నుంచి సినిమాలపై ఉన్న ఆసక్తితో పద్మప్రియ ఆర్ట్స్ బ్యానర్ అనే నిర్మాణ సంస్థను స్థాపించాడు. తొలి సినిమాగా 1985లో రాజశేఖరరెడ్డి దర్శకత్వంతో సుమన్ హీరోగా 'కంచు కవచం' సినిమాను నిర్మించారు.

'అది ప్రమాదం కాదు, ప్లాన్‌తోనే నిప్పంటించాడు'
Crime· 21 Jun 2026

'అది ప్రమాదం కాదు, ప్లాన్‌తోనే నిప్పంటించాడు'

TG: మిర్యాలగూడలోని కలల్వాడ కాలనీలో ఈ నెల 5న రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో వనం చంద్రమ్మ (50), ఆమె మనువడు నక్కా లక్ష్మణ్(16), మనవరాలు నక్కా ప్రణతి(14) సజీవ దహనమైన విషయం తెలిసిందే. పోలీసుల లోతైన విచారణలో షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి. అది ప్రమాదం కాదని, పెట్రోల్ పోసి తగలబెట్టి ప్రమాదంగా చిత్రీకరించారని తేల్చారు. చంద్రమ్మ పెద్ద కుమార్తె ధనమ్మకు, భర్త శిరీశ్‌కుమార్‌కు ఇల్లు నిర్మించుకునే విషయంలో ఆర్థికపరమైన గొడవలు జరిగాయి. దీంతో శిరీశ్‌కుమార్, గాఢనిద్రలో ఉన్న చంద్రమ్మ, పిల్లలు లక్ష్మణ్, ప్రణతిలపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.

సూసైడ్‌కు సిద్దమైన మహిళ..  కాపాడిన పోలీసులు
News· 21 Jun 2026

సూసైడ్‌కు సిద్దమైన మహిళ.. కాపాడిన పోలీసులు

TG: కుటుంబ కలహాలతో తీవ్ర మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకోవాలనుకున్న ఓ మహిళను ఉప్పల్ పోలీసులు కాపాడారు. నాగోల్‌‌లోని మమతానగర్‌‌కు చెందిన బోడుగ స్వాతి(56) ఉప్పల్ భగాయత్ ప్రాంతంలో ఒంటరిగా కన్పించగా, డ్యూటీలో ఉన్న ఉప్పల్ బ్లూకోల్ట్స్ కానిస్టేబుళ్లు మోహన్ చౌహన్, శివకృష్ణ ఆమెను గమనించారు. ఆమెను ఆపి మాట్లాడగా, ఇంట్లో జరిగిన గొడవల కారణంగా ఆత్మహత్య చేసుకోవడానికి మూసీనది వైపు వెళ్తున్నట్లు తెలిపింది. వెంటనే ఆమెకు కౌన్సెలింగ్ నిర్వహించి జీవితంపై నమ్మకం కల్పిస్తూ కుటుంబసభ్యులతో మాట్లాడేలా చేశారు. పోలీసుల అప్రమత్తతతో ఒక కుటుంబంలో విషాదం తప్పింది.

మరికొద్ది గంటల్లో నీట్.. విద్యార్థిని సూసైడ్
Crime· 21 Jun 2026

మరికొద్ది గంటల్లో నీట్.. విద్యార్థిని సూసైడ్

TG: ఆంధ్రప్రదేశ్‌లోని YSR కడప జిల్లాకు చెందిన జాఫర్‌ హుస్సేన్‌ కుటుంబం HYDలోని మియాపూర్‌లో నివాసముంటోంది. జాఫర్‌ కుమార్తె షేక్‌ సనా(19) NEET రీఎగ్జామ్‌కు ప్రిపేర్ అవుతుంది. లాంగ్‌టర్మ్‌ కోచింగ్‌ తీసుకున్న సనా.. పరీక్ష ఒత్తిడిని తట్టుకోలేకపోయింది. రీఎగ్జామినేషన్‌ ఒత్తిడిని తట్టుకోలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని సూసైడ్ చేసుకుంది. సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత ఏడాది నీట్ పరీక్ష రాసినా ర్యాంక్ రాలేదు. దీంతో సనా మళ్లీ ప్రిపేర్ అవుతుంది. ఇవాళ జరిగే నీట్ పరీక్ష ఆమె రాయాల్సి ఉంది.

క్రిమినల్స్‌ను రాజ్యాంగ పదవుల్లోకి రానివ్వను: పవన్
Politics· 21 Jun 2026

క్రిమినల్స్‌ను రాజ్యాంగ పదవుల్లోకి రానివ్వను: పవన్

క్రిమినల్స్‌ను రాజ్యాంగ పదవుల్లోకి రానివ్వనని AP డిప్యూటి CM పవన్ కల్యాణ్ తెలిపారు. కాకినాడలో నిర్వహించిన 'మన ఊరు- మాటామంతి' కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నేరగాళ్లు పదవుల్లోకి వచ్చి మన జీవితాలను శాసిస్తామని బెదిరిస్తుంటే సహించేది లేదన్నారు. వారిపై తిరగబడడానికి నేనెప్పుడూ సిద్ధమేనని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. నేరస్థులకు కులాలు ఆపాదిస్తున్నారని ఫైరయ్యారు. క్రిమినల్స్ ను వెనకేసుకొచ్చే రాజకీయ నాయకులను ఆమడదూరంలో పెట్టాలన్నారు. లేకుంటే మీ భవిష్యత్తు పాడవుతుందని నేతలకు దిశానిర్దేశం చేశారు.

బైక్‌పై యువకులు స్టంట్స్.. పట్టేసిన డ్రోన్
News· 21 Jun 2026

బైక్‌పై యువకులు స్టంట్స్.. పట్టేసిన డ్రోన్

TG: హైదరాబాద్ నగరంలో యువకులు బైక్ రేసింగ్‌కు పాల్పడుతూ ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఉప్పల్ భగాయత్‌లో బైక్ రేసింగ్‌కు పాల్పడ్డ యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిఘా పెట్టినప్పటికీ తప్పించుకోవడంతో ఉప్పల్ పోలీసులు సరికొత్తగా డ్రోన్ ప్యాట్రోలింగ్ చేపట్టారు. బైక్‌పై స్టంట్స్ చేస్తున్న యువకులను డ్రోన్‌తో గుర్తించారు. గమనించిన యువకులు బైక్‌ను అక్కడే వదిలేసి పరుగులు తీశారు. బైక్ నంబర్ ఆధారంగా వారిని గుర్తించి వారిపై కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ రామలింగారెడ్డి తెలిపారు.

స్ట్రెచ్ చేయండి, శ్వాస తీసుకోండి.. వెల్‌నెస్ జర్నీని స్టార్ట్ చేయండి!
Health· 21 Jun 2026

స్ట్రెచ్ చేయండి, శ్వాస తీసుకోండి.. వెల్‌నెస్ జర్నీని స్టార్ట్ చేయండి!

ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగా, స్ట్రెచింగ్స్ ఒక సంజీవనిలా పనిచేస్తాయి. రోజూ ఉదయాన్నే ఒంటిని కాస్త స్ట్రెచ్ చేస్తూ, ప్రశాంతంగా దీర్ఘ శ్వాస (ప్రాణాయామం) తీసుకోవడం వల్ల మానసిక ఒత్తిడి మాయమవడమే కాకుండా శరీరానికి సరికొత్త ఎనర్జీ వస్తుంది. బాడీ ఫ్లెక్సిబిలిటీ పెరిగి, మైండ్ రిలాక్స్ అవుతుంది. ఈ సింపుల్ అలవాట్లతోనే మీ శారీరక, మానసిక ఆరోగ్య ప్రయాణానికి (వెల్‌నెస్ రోడ్‌) గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయండి.

అన్నదాతలను ఆదుకుంటా: చంద్రబాబు
AP· 21 Jun 2026

అన్నదాతలను ఆదుకుంటా: చంద్రబాబు

AP: రైతు కష్టంలో తోడుంటానని, ప్రతి ఒక్కరినీ ఆదుకుంటానని CM చంద్రబాబు పేర్కొన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో 'పీఎం కిసాన్- అన్నదాత సుఖీభవ' సాయం కింద 2026 ఖరీఫ్ సీజన్‌కు 46.86 లక్షల మంది రైతుల ఖాతాలకు ఒక్కొక్కరికి రూ.7 వేల చొప్పున రూ.3,125 కోట్ల ఆర్థికసాయం విడుదల చేశారు. రైతులు తల్లిలాంటి భూమిని.. రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు విరివిగా వాడకుండా కాపాడుకోవాలని సూచించారు. ప్రకృతి సేద్యంతో సాగును మరింత పరిపుష్టం చేయాలన్నారు.

ఈ వర్షాలకి మీ బెస్ట్ పార్ట్ నర్స్ ఇవే....లాగించండి
Health· 21 Jun 2026

ఈ వర్షాలకి మీ బెస్ట్ పార్ట్ నర్స్ ఇవే....లాగించండి

బయట చల్లటి జల్లులు పడుతుంటే, ఇంట్లో వేడివేడిగా ఏదైనా తింటే వచ్చే మజానే వేరు. ఈ వీకెండ్ వర్షాల కోసం పర్ఫెక్ట్ 'కమ్‌ఫర్ట్ ఫుడ్' కాంబినేషన్స్ కొన్ని - చమసాలా చాయ్ & వేడి పకోడీలు: ఉల్లిపాయ లేదా మిర్చి బజ్జీలతో పాటు అల్లం టీ ఉంటే వర్షానికి బెస్ట్ పార్ట్‌నర్. కమ్మని పప్పు చారు & అన్నం: వేడి అన్నంలో కాస్త నెయ్యి, పప్పు చారు లేదా సాంబార్ కలుపుకుని, నంచుకోవడానికి ఆలు ఫ్రై లేదా అప్పడం ఉంటే స్వర్గమే. వేడి సూప్ లేదా నూడుల్స్: స్పైసీగా ఉండే హాట్ అండ్ సోర్ సూప్ లేదా మసాలా నూడుల్స్ ఈ చలికి సూపర్ కిక్ ఇస్తాయి. కాస్త టైమ్ దొరికితే గరం గరం కిచిడీ లేదా వేడి ఉప్మా ట్రై చేయండి.. వీకెండ్ వైబ్స్ అదిరిపోతాయి

బొగ్గు నిల్వలపై సింగరేణి మౌనం.. దేనికి సంకేతం
TG· 21 Jun 2026

బొగ్గు నిల్వలపై సింగరేణి మౌనం.. దేనికి సంకేతం

TG: సింగరేణి కాలరీస్‌ బొగ్గు నిల్వల వ్యవహారం రాష్ట్రంలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సింగరేణి యాజమాన్యం చెపుతున్న లెక్కల్లోనే అవకతవకలు జరిగినట్లు స్పష్టమవుతుంది. 40లక్షల టన్నుల వ్యత్యాసంపై సూటిగా స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి ప్రకటించిన అధికారిక గణాంకాలే ఆరోపణలకు పునాదిగా మారాయి. 69.01 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి కాగా 65.27 మిలియన్‌ టన్నుల బొగ్గు రవాణా, అమ్మకం జరిగినట్లు సింగరేణి ప్రకటించింది. మిగిలిన 3.74 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి కాకుండానే సింగరేణి ప్రకటించిందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

ఆర్థిక ఆరోగ్య సూచీలో తెలంగాణ అగ్రస్థానం
TG· 21 Jun 2026

ఆర్థిక ఆరోగ్య సూచీలో తెలంగాణ అగ్రస్థానం

ఆర్థిక ఆరోగ్య సూచీలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. AP ఆర్థిక స్థిరత్వం అంత బలంగా లేదని, తెలంగాణలో పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉందని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఫైనాన్స్‌ అండ్‌ పాలసీ (NIPFP) ప్రపంచ బ్యాంక్ నివేదిక తెలిపింది. బడ్జెట్‌తో నిమిత్తం లేకుండా తెలంగాణలో అత్యధిక అప్పులు చేసినా గత మూడేళ్లుగా ఈ అప్పులు తగ్గిపోతున్నాయని స్పష్టం చేసింది. ఇది మంచి పరిణామమని పేర్కొంది. తెలంగాణకు రుణాలు, హామీలు, ఇతర భారాలు ఆందోళనకరంగా ఉన్నా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే దానికి బలమైన ఆర్థిక సామర్థ్యం ఉందని నివేదికలో పేర్కొంది.

అల్జీమర్స్ కి ఫస్ట్ స్టేజ్‌లో డ్రగ్ వాడితేనే రిజల్ట్ అంటున్న నిపుణులు
Health· 21 Jun 2026

అల్జీమర్స్ కి ఫస్ట్ స్టేజ్‌లో డ్రగ్ వాడితేనే రిజల్ట్ అంటున్న నిపుణులు

మతిమరుపు వ్యాధి (అల్జీమర్స్) చికిత్సలో కొత్త ఔషధాలు అద్భుతాలు సృష్టిస్తున్నా.. అవి వ్యాధి ప్రారంభ దశలో ఉన్న రోగులపైనే అత్యంత సమర్థవంతంగా పనిచేస్తున్నాయని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మెదడులో కణాలు పూర్తిగా దెబ్బతినక ముందే, అంటే ‘ఎర్లీ స్టేజ్’లోనే ఈ డ్రగ్స్ ఇస్తే వ్యాధి తీవ్రతను విజయవంతంగా అడ్డుకోవచ్చని రీసెర్చ్‌లలో తేలింది. ముదిరిన తర్వాత వాడితే పెద్దగా ఫలితం ఉండదని, అందుకే ఫస్ట్ స్టేజ్‌లోనే గుర్తించడం కీలకమని హెచ్చరిస్తున్నారు.

ఏఐ సాయంతో ఐటీ రిటర్నులు డేంజర్ అంటున్న నిపుణులు
Politics· 21 Jun 2026

ఏఐ సాయంతో ఐటీ రిటర్నులు డేంజర్ అంటున్న నిపుణులు

ఐటి రిటర్నులు దాఖలు చేయడానికి ఏఐ హెల్ప్ తీసుకుంటున్నారా? అయితే మీరు కాస్త డేంజర్లో ఉన్నట్లే. ఎందుకంటే ఏఐ తో మేలుకన్నా చిక్కులే ఎక్కువ. ఏఐ వల్ల పన్ను డేటా భద్రతకు తీవ్ర ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. పైగా మల్టిపుల్ ఆదాయ వనరులు, అంతర్జాతీయ పన్నులు, సంక్లిష్టమైన నిబంధనలను అర్థం చేసుకోవడంలో ఏఐ తడబడుతుంది. దీనివల్ల తప్పుడు సమాచారంతో కూడిన ఐటీఆర్ దాఖలై, చిక్కుల్లో పడే అవకాశం ఉంది. వచ్చే జూలైలో ఐటీ రిటర్నులు (ITR) దాఖలు చేయడానికి చాట్‌జీపీటీ, క్లాడ్ వంటి ఏఐ టూల్స్ వాడేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వర్షాకాలంలో  రెయిన్ బో లాగా  మెరిసిపొండి !
General· 20 Jun 2026

వర్షాకాలంలో రెయిన్ బో లాగా మెరిసిపొండి !

మబ్బుల వల్ల వర్షాకాలంలో వాతావరణ మంతా కాస్త డల్‌గా ఉంటుంది. అందుకే ఈ సీజన్‌లో మిమ్మల్ని బ్రైట్‌గా చూపించే కలర్ థెరపీ ఇక్కడుంది. నలుపు, తెలుపు రంగులను పక్కనపెట్టి.. వైబ్రెంట్ ఎల్లో, నియాన్ గ్రీన్, స్కై బ్లూ, పింక్ వంటి షేడ్స్ ట్రై చేయండి. దీనికి తోడు వాటర్‌ప్రూఫ్ ఫ్యాబ్రిక్స్ ఎంచుకో వడం, అలాగే మట్టి మరకలు పడకుండా డార్క్ బాటమ్స్ (ఫ్యాంట్లు) మ్యాచ్ చేయడం వల్ల మీ లుక్ మరింత పవర్‌ఫుల్‌గా, ట్రెండీగా మారుతుంది!