Latest

హైవేపై ప్రయాణికులపైకి దూసుకొచ్చిన చిరుత
Local· 15 Jun 2026

హైవేపై ప్రయాణికులపైకి దూసుకొచ్చిన చిరుత

AP: నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణంలోని నేషనల్ హైవేపై చిరుత పులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. గండిపాలెం రోడ్డు సర్కిల్, చెంచురామయ్యనగర్ సమీపంలో ప్రయాణికులపైకి ఒక్కసారిగా చిరుత దూసుకురావడంతో రహదారిపై ప్రయాణిస్తున్న వాహనదారులు చిరుతను చూసి భయంతో పరుగులు తీశారు. అటవీశాఖ అధికారులు, పోలీసులు ఉదయగిరి పరిసర గ్రామాల్లో దండోరా వేయించి ప్రజలను అప్రమత్తం చేశారు. రాత్రి వేళల్లో బయటకు రావొద్దని, పశువులను సురక్షిత ప్రాంతాల్లో ఉంచాలని సూచించారు.

తెలంగాణలో అరుదైన ఖనిజ నిక్షేపాలు
TG· 15 Jun 2026

తెలంగాణలో అరుదైన ఖనిజ నిక్షేపాలు

TG: సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం రాయిపల్లి తండా పరిధిలోని పర్వతాపూర్‌ శివారులో అరుదైన ఖనిజ నిక్షేపాలు బయటపడ్డాయి. ఈ భూముల్లో వెనేడియం, టైటానియం, అల్యూమినస్‌ లేటరైట్‌ నిక్షేపాలు ఉన్నట్టు సెంట్రల్ జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా అధికారులు గుర్తించారు. ఈ ఖనిఖ నిక్షేపాలు ఎలక్ట్రిక్‌ బ్యాటరీలు, ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ రంగాలతో పాటు ఇంధన నిల్వలకు ఎంతగానో దోహదపడుతాయని చెప్పారు. సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాలమేరకు ఈ ఖనిజ నిక్షేపాలను గుర్తించేందుకు సంబంధిత శాఖాధికారులు పలుమార్లు గ్రామాన్ని సందర్శించారు.

బాసర త్రిబుల్ ఐటీ.. ఫుడ్‌లో బొద్దింక
Local· 15 Jun 2026

బాసర త్రిబుల్ ఐటీ.. ఫుడ్‌లో బొద్దింక

TG: నిర్మల్ జిల్లా బాసర త్రిబుల్ ఐటీ కళాశాలలో విద్యార్థులకు పెట్టిన ఫుడ్‌లో బొద్దింక రావడం తీవ్ర కలకలం రేపింది. E1-E2 మెస్‌లో చపాతీ ఆలూ కూర్మ వడ్డించగా బొద్దింక ప్రత్యక్షం కావడంతో విద్యార్థులు షాక్ అయ్యారు. డెయిలీ నాణ్యత లేని ఫుడ్ పెడుతున్నారంటూ స్టూడెంట్స్ ఆందోళన వ్యక్తం చేశారు. పలుమార్లు ఆకలిగా ఉన్నా పస్తులుంటున్నామని, డైలీ ఇలాంటి ఫుడ్ తినడం తమకు కామన్‌గా మారిందన్నారు. ప్రాథమిక విచారణ చేపట్టి నిజ నిర్ధరణ కోసం కమిటీని ఏర్పాటు చేసినట్లు యునివర్సిటీ అధికారులు తెలిపారు.

సాయం చేద్దామని వెళ్లి గోదావరిలో గల్లంతు
Crime· 15 Jun 2026

సాయం చేద్దామని వెళ్లి గోదావరిలో గల్లంతు

AP: ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం రుద్రంకోట విలేజ్‌కు చెందిన కనితిరెడ్డి రాంబాబు, హేమంత్‌కుమార్ స్నేహితులు. హేమంత్‌కుమార్‌కు చెందిన గేదెలు రుద్రమ్మకోట సమీపంలో గోదావరి నది అవతలి ఒడ్డుపై ఉన్నాయి. వాటిని తోలుకు వచ్చేందుకు హేమంత్, ఆయనకు సాయం చేసేందుకు రాంబాబు కలిసి లోతు తక్కువ ఉండే వైపు నడిచివెళ్లారు. తిరిగి గేదెలను ఇంటికి తీసుకొచ్చే క్రమంలో రాంబాబు లోతు ఎక్కువగా ఉండే వైపు వెళ్లి గల్లంతయ్యాడు. గల్లంతైన రాంబాబు కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపట్టారు. అయినా మృతదేహం ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు.

రోగనిరోధక శక్తిని పెంచే సహజ అమృతం తేనె
Health· 15 Jun 2026

రోగనిరోధక శక్తిని పెంచే సహజ అమృతం తేనె

తేనే అంటే కేవలం తీపి పదార్థం మాత్రమే కాదు అది ప్రకృతి మనకు ఇచ్చిన ఔషధ నిధి. వేల సంవత్సరాలుగా తేనె మన ఆహారంలో, ఆయుర్వేద వైద్యంలో ప్రత్యేక స్థానం సంపాదించింది. తేనెను తేనెటీగలు పువ్వుల నుంచి సేకరించిన మకరందంతో తయారు చేస్తాయి. సహజ యాంటీబ్యాక్టీరియల్ గుణాలు కలిగిన తేనె గాయాలు మాన్పడంలో, గొంతునొప్పి తగ్గించడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ మార్నింగ్ గోరువెచ్చని నీటిలో తేనె కలిపి తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

నదిలో పడవ బోల్తా.. నలుగురు మృతి
Crime· 15 Jun 2026

నదిలో పడవ బోల్తా.. నలుగురు మృతి

AP: పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం కోనూరు గ్రామం వద్ద తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కృష్ణా నదిలో పడవ బోల్తా పడి నలుగురు మృతిచెందారు. కుంకలగుంట గ్రామం నుంచి 10 మంది కలిసి కోనూరులో ఓ ఫంక్షన్‌కు హాజరయ్యారు. వేడుక అనంతరం తిరిగి గ్రామానికి వెళ్తుండగా కృష్ణా నదిలో పడవ బోల్తా పడడంతో వారంతా నీటమునిగారు. వీరిలో ఆరుగురిని గ్రామస్థులు కాపాడారు. మిగిలిన నలుగురు గల్లంతయ్యారు. ముగ్గురు చిన్నారులు గంధం సంధ్య (9), బత్తుల కార్తీక్‌ (12), గంధం సైనీ (10)తోపాటు కొనత చైతన్య(28) చనిపోయారు.

కొడంగల్‌లో రేవంత్ రెడ్డికి ఓటమి తప్పదు: KTR
Politics· 15 Jun 2026

కొడంగల్‌లో రేవంత్ రెడ్డికి ఓటమి తప్పదు: KTR

TG: కొడంగల్‌లో CM రేవంత్ రెడ్డిని ప్రజలు ఓడిస్తారని మాజీ మంత్రి KTR అన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా BRS నేతలతో కేటీఆర్ సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు. మహబూబ్‌నగర్ బిడ్డను అని పదేపదే చెప్పుకుంటూ జిల్లా ప్రజలను మోసం చేస్తున్న రేవంత్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి తరిమికొడతారని కేటీఆర్ స్పష్టం చేశారు. దాదాపుగా పూర్తయిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పక్కనపెట్టి, కమీషన్ల కోసం, కాంట్రాక్టుల కోసం లక్షల ఎకరాల పంటకు నీరందకుండా CM చేస్తున్న ద్రోహం ప్రతి ఒక్కరికీ అర్థమైందన్నారు.

పెట్టుబడుల పేరుతో భారీ సైబర్ మోసం
Crime· 15 Jun 2026

పెట్టుబడుల పేరుతో భారీ సైబర్ మోసం

TG: హైదరాబాద్‌‌లోని సనత్‌నగర్‌కు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి ఫేస్‌బుక్‌లో అధిక లాభాలు వస్తాయని ఇన్వెస్ట్‌మెంట్ యాడ్ చూశాడు. యాడ్‌పై క్లిక్ చేయడంతో సైబర్‌నేరగాళ్లు అతడిని సంప్రదించారు. ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌ఫామ్‌లలో పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయని నమ్మించి వాట్సాప్ గ్రూపుల్లో చేర్చారు. మోసగాళ్లు సూచించిన బ్యాంక్ అకౌంట్లకు మొత్తం రూ.2.22 కోట్లను ట్రాన్స్‌ఫర్ చేశాడు. నకిలీ ఇన్వెస్ట్‌మెంట్ యాప్ డ్యాష్‌బోర్డ్‌లో అతని అకౌంట్‌లో రూ.3.1 కోట్ల బ్యాలెన్స్ ఉన్నట్లు చూపించారు. ఆ డబ్బు విత్‌డ్రా చేసుకునేందుకు ఉద్యోగి పయత్నించగా రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు.

RTC బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్లు
TG· 14 Jun 2026

RTC బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్లు

TG: రాష్ట్రంలోని అన్నీ RTC బస్సుల్లో ఇకపై ఫస్ట్ ఎయిడ్ బాక్సులు పెట్టనున్నారు. నిబంధనల ప్రకారం ప్రతి వాహనంలోనూ ప్రథమ చికిత్స కిట్లు ఉండాలనే రూల్ ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో అవి ప్రయాణికులకు అందుబాటులో లేవు. ఈ లోపాన్ని గుర్తించిన ఆర్టీసీ MD వై.నాగిరెడ్డి బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్ల పునరుద్ధరణకు శ్రీకారం చుట్టారు. ప్రతి బస్సులోనూ కచ్చితంగా పనిచేసే ఫస్ట్ ఎయిడ్ కిట్లు ఉండాల్సిందేనని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎండీ ఆదేశాలతో అలర్ట్ అయిన TGS RTC అధికారులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 10,130 బస్సుల్లో ఈ కిట్లను ఏర్పాటు చేయనున్నారు.

ట్రైబల్ యూనివర్సిటీలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు
TG· 14 Jun 2026

ట్రైబల్ యూనివర్సిటీలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు

TG: ములుగు జిల్లాలోని సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ(SSCTU)లో గెస్ట్ ఫ్యాకల్టీ నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రొఫెసర్ జి.రాంరెడ్డి తెలిపారు. 2026-27 విద్యాసంవత్సరం నుంచి ఐఐటీ హైదరాబాద్, టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (TISS) వంటి ప్రతిష్టాత్మక సంస్థల సహకారంతో కొత్త అకడమిక్ ప్రోగ్రామ్స్ ప్రారంభించనున్నారు. జూన్ 21 లోపు దరఖాస్తులు సమర్పించాలన్నారు. ఇతర వివరాల కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్ www.ssctu.ac.inను సందర్శించవచ్చని రాంరెడ్డి తెలిపారు.

త్రిబుల్ ఐటీ ఫలితాల్లో సత్తాచాటిన విద్యార్థినులు
Education· 14 Jun 2026

త్రిబుల్ ఐటీ ఫలితాల్లో సత్తాచాటిన విద్యార్థినులు

AP: త్రిబుల్ ఐటీ ఫలితాలలో ప్రకాశం జిల్లా సింగరాయకొండ ZP బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు సత్తా చాటారు. ముగ్గురు రాజీవ్ గాంధీ ట్రిపుల్ ITలలో సీట్లు సాధించారు. పాఠశాలకు చెందిన బీగాల నాగ జ్యోత్స్న నూజివీడు క్యాంపస్‌లో, పొట్టేళ్ల రేవతి ఇడుపులపాయ క్యాంపస్‌లో, పాకల అనూష ఒంగోలు క్యాంపస్‌లో సీట్లు సాధించారు. పాఠశాల HM కే.మహాలక్ష్మి విద్యార్థినులను అభినందించారు. త్రిబుల్ ఐటీల్లో సీట్లు సాధించిన విద్యార్థినులు అక్కడ ఇంటర్మీడియట్‌తో పాటు బీటెక్ కూడా పూర్తి చేసుకుని బయటకు వస్తారని ఆమె చెప్పారు.

నో వెహికిల్ చెకింగ్..  ఓన్లీ స్లీపింగ్
Local· 14 Jun 2026

నో వెహికిల్ చెకింగ్.. ఓన్లీ స్లీపింగ్

TG: భద్రాద్రికొత్తగూడెం జిల్లా బూర్గంప‌హాడ్‌ మండలంలోని మోరంపల్లిబంజర్ చెక్‌పోస్ట్‌లో పనిచేస్తున్న గార్డు పట్టపగలే నిద్రపోతున్న విషయం బయటపడింది. చెక్‌పోస్టు పర్యవేక్షణ బాధ్యత చూడాల్సిన FBO అక్కడ లేకపోవడంతో కిందిస్థాయి సిబ్బంది గార్డును ఉంచి వెళ్లడంతో ఆ వ్యక్తి డ్యూటీ టైమ్‌లో నిద్రపోతూ కన్పించాడు. నిత్యం వందలాది వాహనాలు ఈ చెక్‌పోస్టు మీదుగా వెళ్తున్నా తనిఖీ చేయడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గార్డు 24 గంటలూ విధులు నిర్వహించాల్సి ఉండ‌గా ఇలా పట్టపగలు నిద్ర పోతున్నాడంటే అటవీశాఖ అధికారుల పర్యవేక్షణ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

చెట్లకొమ్మల విషయంలో కొట్టుకున్న అధికారులు
Local· 13 Jun 2026

చెట్లకొమ్మల విషయంలో కొట్టుకున్న అధికారులు

TG: మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్‌లో విరిగి పడిన చెట్లకొమ్మల విషయంలో అటవీశాఖ అధికారులు, విద్యుత్‌శాఖ అధికారుల మధ్య ఘర్షణ జరిగింది. ఇది ఫారెస్ట్ ఏరియా అని అటవీశాఖ అధికారులు వాదించగా, కరెంట్ వైర్లు ఎలా వేయాలంటూ విద్యుత్‌శాఖ అధికారుల మధ్య వివాదం మొదలైంది. మాట మాట పెరిగి అధికారులు ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. చెట్లకొమ్మల తొలగింపు విషయంలో రెండు డిపార్ట్‌మెంట్ల మ‌ధ్య మొద‌లైన‌ గొడవ రోడ్డుపై కొట్టుకునే వరకు వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇసుక ట్రాక్టర్ బోల్తా.. 25 ట్రాక్టర్లను దిగ్భందించి నిరసన
Local· 13 Jun 2026

ఇసుక ట్రాక్టర్ బోల్తా.. 25 ట్రాక్టర్లను దిగ్భందించి నిరసన

AP: చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలం పూడి గ్రామ పరిధిలోని పంటపొలాల వద్ద ఇసుక ట్రాక్టర్ బోల్తా పడింది. అక్రమ ఇసుక రవాణా కారణంగా తమ వ్యవసాయ భూములు దెబ్బతింటున్నాయని రైతులు నిరసనకు దిగారు. రైతులంతా ఏకమై 25 ఇసుక ట్రాక్టర్లను పూడి ZP హైస్కూల్ ఆవరణలో దిగ్భందించారు. అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న సంబంధిత అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకుని రైతులతో చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

నో వెహికిల్ చెకింగ్..  ఓన్లీ స్లీపింగ్
Local· 13 Jun 2026

నో వెహికిల్ చెకింగ్.. ఓన్లీ స్లీపింగ్

TG: భద్రాద్రికొత్తగూడెం జిల్లా బూర్గంప‌హాడ్‌ మండలంలోని మోరంపల్లిబంజర్ చెక్‌పోస్ట్‌లో పనిచేస్తున్న గార్డు పట్టపగలే నిద్రపోతున్న విషయం బయటపడింది. చెక్‌పోస్టు పర్యవేక్షణ బాధ్యత చూడాల్సిన FBO అక్కడ లేకపోవడంతో కిందిస్థాయి సిబ్బంది గార్డును ఉంచి వెళ్లడంతో ఆ వ్యక్తి డ్యూటీ టైమ్‌లో నిద్రపోతూ కన్పించాడు. నిత్యం వందలాది వాహనాలు ఈ చెక్‌పోస్టు మీదుగా వెళ్తున్నా తనిఖీ చేయడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గార్డు 24 గంటలూ విధులు నిర్వహించాల్సి ఉండ‌గా ఇలా పట్టపగలు నిద్ర పోతున్నాడంటే అటవీశాఖ అధికారుల పర్యవేక్షణ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఫ్లైట్ బాత్‌రూమ్ లో బంగారం!▶
Politics· 13 Jun 2026

ఫ్లైట్ బాత్‌రూమ్ లో బంగారం!

దుబాయ్ నుండి అహ్మదాబాద్ వచ్చిన ఇండిగో ఫ్లైట్‌లో కస్టమ్స్ అధికారులు ఒక లేడి స్మగ్లింగ్ ప్లాన్‌ను బయటపెట్టారు. ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజనీర్ల సాయంతో ఫ్లైట్ ఫ్రంట్ బాత్‌రూమ్‌లోని స్పీకర్ బాక్స్‌ను విప్పి చెక్ చేయగా. అందులో బ్లాక్ టేప్‌తో దాచిన 24 బంగారు బిస్కెట్లు దొరికాయి. దాదాపు 2.8 కేజీల బరువున్న ఈ బంగారం వాల్యూ ₹4.26 కోట్లు ఉంటుందని అధికారులు చెప్పారు. ఈ వింత స్మగ్లింగ్ ఐడియా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కూటమి లీడర్స్‌ నా ఆస్తులు లూటీ చేస్తున్నారు: KA పాల్▶
Politics· 13 Jun 2026

కూటమి లీడర్స్‌ నా ఆస్తులు లూటీ చేస్తున్నారు: KA పాల్

ప్రజాశాంతి పార్టీ ప్రెసిడెంట్ KA పాల్ ఏపీ కూటమి లీడర్స్‌పై సంచలన ఆరోపణలు చేశారు. తాను ప్రపంచ శాంతి కోసం ఫైట్ చేస్తుంటే. CM చంద్రబాబు, డిప్యూటీ CM పవన్ కళ్యాణ్, మినిస్టర్ లోకేష్ మాత్రం తన చారిటీ ఆస్తులను లూటీ చేసే ప్లాన్‌లో ఉన్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన ఆస్తుల కోసమే వాళ్లంతా చూస్తున్నారంటూ KA పాల్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

భారీ వర్షాలు.. హైదరాబాద్‌లో CM హై అలర్ట్!
News· 13 Jun 2026

భారీ వర్షాలు.. హైదరాబాద్‌లో CM హై అలర్ట్!

తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో CM రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో హై అలర్ట్‌గా ఉండాలని చెప్పారు. పోలీస్, మున్సిపల్, హైడ్రా, కరెంట్, వాటర్ బోర్డ్ లాంటి అన్ని శాఖలు కలిసి పనిచేయాలన్నారు. సిటీ జనాలకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా, రెయిన్ ఫోర్‌కాస్టింగ్ ఆధారంగా రోడ్లపై నీరు నిలిచే సమస్యాత్మక ప్రాంతాల్లో ముందస్తుగా రెస్క్యూ టీమ్స్‌ను రెడీగా ఉంచాలని CM స్పష్టం చేశారు.

కాకినాడ మిస్సింగ్ కేసులో ఊహించని ట్విస్ట్!
Crime· 13 Jun 2026

కాకినాడ మిస్సింగ్ కేసులో ఊహించని ట్విస్ట్!

కాకినాడలో మిస్ అయిన చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో ఒక విచారకరమైన ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ నెల 6న ఆ అమ్మాయితో పాటు వెళ్లిన పెంపుడు కుక్క, మూడు రోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చి వింతగా అరుస్తూ ఏడ్చింది. దీంతో నిన్న ఆ కుక్కకు జీపీఎస్ ట్రాకర్ కట్టి, పాపను వెతికేందుకు పోలీసులు వదిలిపెట్టారు. కానీ, అంతలోనే ఆ పెంపుడు కుక్క చనిపోవడంతో ఈ మిస్సింగ్ కేసు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది.

బస్సులో మంటలు.. ఫైర్ సిబ్బంది వచ్చేలోపే దగ్ధం
Crime· 13 Jun 2026

బస్సులో మంటలు.. ఫైర్ సిబ్బంది వచ్చేలోపే దగ్ధం

AP: తిరుపతి జిల్లాలోని శ్రీసిటీకి చెందిన ఉద్యోగులు విధులు ముగించుకుని సూళ్లూరుపేట వెళ్తుండగా భారీ అగ్ని ప్రమాదం జరిగింది. IMOP కంపెనీ ఉద్యోగులు ప్రయాణిస్తున్న బస్సు తిరుపతి జిల్లా తడ సమీపంలోకి రాగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది వచ్చేలోపే బస్సు పూర్తిగా దగ్ధమైంది. అలెర్ట్ అయిన ఉద్యోగులు, డ్రైవర్ బస్సులో నుంచి దిగి దూరంగా వెళ్లిపోయారు. పెను ప్రమాదం తప్పడంతో ఊపిరిపీల్చుకున్నారు. బస్సులో షార్ట్ సర్క్యూట్ జరగడమే కారణమని అంచనా వేశారు.

హైదరాబాద్‌లో ఏడుగురు బంగ్లాదేశీయులు అరెస్ట్
Crime· 13 Jun 2026

హైదరాబాద్‌లో ఏడుగురు బంగ్లాదేశీయులు అరెస్ట్

TG: మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పరిధిలో అక్రమంగా నివసిస్తున్న ఏడుగురు బంగ్లాదేశీయులను పోలీసులు అరెస్టు చేశారు. గాజులరామారం HL కాలనీలోని ఓ అద్దె ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. వీసా, పాస్‌పోర్ట్ లాంటి ఎలాంటి చట్టబద్ధమైన పత్రాలు లేకుండా వారు అక్రమంగా దేశంలోకి ప్రవేశించి నివసిస్తున్నట్లు నిర్ధారించారు. అనంతరం తదుపరి చర్యల నిమిత్తం మెదక్ జిల్లా జోగిపేటలోని డిపోర్టేషన్ కేంద్రానికి తరలించారు. పశ్చిమబెంగాల్‌లో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే.