హైదరాబాద్‌లో ఏడుగురు బంగ్లాదేశీయులు అరెస్ట్

TG: మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పరిధిలో అక్రమంగా నివసిస్తున్న ఏడుగురు బంగ్లాదేశీయులను పోలీసులు అరెస్టు చేశారు. గాజులరామారం HL కాలనీలోని ఓ అద్దె ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. వీసా, పాస్‌పోర్ట్ లాంటి ఎలాంటి చట్టబద్ధమైన పత్రాలు లేకుండా వారు అక్రమంగా దేశంలోకి ప్రవేశించి నివసిస్తున్నట్లు నిర్ధారించారు. అనంతరం తదుపరి చర్యల నిమిత్తం మెదక్ జిల్లా జోగిపేటలోని డిపోర్టేషన్ కేంద్రానికి తరలించారు. పశ్చిమబెంగాల్‌లో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే.



