Latest

ఇక్కడ భయంతోనే డ్యూటీ చేయాలి
Local· 11 Jun 2026

ఇక్కడ భయంతోనే డ్యూటీ చేయాలి

TG: వికారాబాద్ జిల్లా మర్పల్లి తహసీల్దార్ కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరింది. భవనం ఎప్పుడు కూలుతుందోనన్న భయంతో ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ భవనంలో వివిధ విభాగాలకు చెందిన సుమారు 40మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వర్షాకాలం వస్తే పైకప్పు నుంచి నీరు కారి లోపలంతా చిత్తడిగా మారుతోంది. వాన పడిన ప్రతిసారీ విలువైన భూరికార్డులు తడిసిపోకుండా ఉండేందుకు ప్లాస్టిక్ కవర్లతో కప్పాల్సిన దుస్థితి నెలకుందని అధికారులు తెలిపారు.

'ఎవరైనా హిట్ల‌ర్‌ను ఆదర్శంగా తీసుకుంటారా'
Politics· 10 Jun 2026

'ఎవరైనా హిట్ల‌ర్‌ను ఆదర్శంగా తీసుకుంటారా'

TG: CM రేవంత్ రెడ్డి త‌న‌ను తాను హిట్ల‌ర్‌తో పోల్చుకుంటూ చేసిన కామెంట్స్‌పై BRS రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జీవ‌న్ రెడ్డి ఫైరయ్యారు. జగిత్యాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హిట్ల‌ర్ గ‌తి ఏమైందో చివ‌రికి అంద‌రం గ‌మ‌నించామని, రేపు రేవంత్ రెడ్డికి కూడా అదే గ‌తి పడుతుందన్నారు. ఒక కాంగ్రెస్ నాయ‌కుడిగా రేవంత్ రెడ్డి ఏం కావాల‌ని కోరుకోవాలి.. ఇందిరాగాంధీని, రాజీవ్ గాంధీని ఆద‌ర్శంగా తీసుకోవాలి..కానీ ఎవ‌డ‌న్నా హిట్ల‌ర్‌ను ఆదర్శంగా తీసుకుంటాడా అని జీవ‌న్ రెడ్డి ప్ర‌శ్నించారు.

చెత్తకుప్పలో పసికందు మృతదేహం
Crime· 10 Jun 2026

చెత్తకుప్పలో పసికందు మృతదేహం

AP: కడప నగరంలో అప్పుడే పుట్టిన పసికందును రోడ్డు పక్కన పడేశారు. కడప శివారులోని అమర్ హాస్పిటల్ వద్ద శిశువును రోడ్డు పక్కన చెత్తకుప్పలో పెట్టి వెళ్లిపోయారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి స్థానికులను విచారించారు. చనిపోయిన తర్వాత పడేశారా లేదా బతికుండగానే పడేయడంతో పసికందు చనిపోయిందా అనేది తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

రన్నింగ్ ఆటోలో పాము.. దూకేసిన కూలీలు
Crime· 10 Jun 2026

రన్నింగ్ ఆటోలో పాము.. దూకేసిన కూలీలు

TG: మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం సిర్సా గ్రామంలో ఉపాధి హామీ కూలీలు తమ పనులను ముగించుకుని ఆటోలో తిరిగి ఇంటికి వెళ్తున్నారు. కూలీలు ప్రయాణిస్తున్న ఆటోలోకి పాము కన్పించడంతో షాక్‌కు గురై టెన్షన్ పడ్డారు. ప్రాణభయంతో స్పీడ్‌గా వెళ్తున్న రన్నింగ్ ఆటో నుంచి కూలీలు కిందకు దూకేశారు. ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే 108 అంబులెన్స్‌లో చెన్నూర్ గవర్నమెంట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో మంచిర్యాల గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు.

గ్యాస్ లీకై ఇంట్లో ఎగిసిపడ్డ మంటలు
Crime· 10 Jun 2026

గ్యాస్ లీకై ఇంట్లో ఎగిసిపడ్డ మంటలు

TG: కామారెడ్డి టౌన్‌ వినాయకనగర్ కాలనీలోని ఓ ఇంట్లో గ్యాస్ లీకవడంతో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. మంటలను ఆర్పుతుండగా మల్లవ్వ, మౌనిక, అలేఖ్య అనే ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే వారిని బయటకు తీసుకువచ్చారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. గాయపడిన వారిని కామారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు. గ్యాస్ లీకైనప్పుడు సిలిండర్ పేలకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

'సింగీతం' మూవీ ఫస్ట్ టికెట్ కొన్న రాజమౌళి..▶
Cinema· 10 Jun 2026

'సింగీతం' మూవీ ఫస్ట్ టికెట్ కొన్న రాజమౌళి..

'సింగీతం' సినిమా టికెట్ బుకింగ్స్ ఫైనల్ గా ఓపెన్ అయ్యాయి. జూన్ 12న వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి వస్తున్న ఈ మూవీ టీమ్‌కి డైరెక్టర్ రాజమౌళి ఒక అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ సినిమా ఫస్ట్ టికెట్‌ను రాజమౌళినే స్వయంగా కొని టీమ్‌ని ఎంకరేజ్ చేశారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా అప్‌డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతోంది.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, సోనియా గాంధీ లను కనిసిన CM విజయ్..
Politics· 10 Jun 2026

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, సోనియా గాంధీ లను కనిసిన CM విజయ్..

తమిళనాడు CM విజయ్ ఈ రోజు ఢిల్లీలో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ముని కలిసి మాట్లాడారు. ఆ తర్వాత వెంటనే కాంగ్రెస్ టాప్ లీడర్ సోనియా గాంధీని కూడా కలిశారు. CM అయ్యాక విజయ్ చేస్తున్న ఈ ఢిల్లీ టూర్ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

రాఘవ లారెన్స్ బిగ్ అనౌన్స్ మెంట్ పోస్ట్‌పోన్!
News· 10 Jun 2026

రాఘవ లారెన్స్ బిగ్ అనౌన్స్ మెంట్ పోస్ట్‌పోన్!

రాఘవ లారెన్స్ తన లైఫ్ కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అనౌన్స్ మెంట్‌ను పోస్ట్‌పోన్ చేశాడు. యాక్చువల్ గా జూన్ 11న గురువారం మార్నింగ్ ఈ అప్‌డేట్ ఇవ్వాల్సింది. కానీ డైరెక్టర్ భారతీరాజా చనిపోవడంతో, ఇండస్ట్రీ మొత్తం బాధలో ఉంటే ఇప్పుడు అనౌన్స్ మెంట్ చేయడం కరెక్ట్ కాదని ఆపేశాడు. మళ్లీ ఈ అనౌన్స్ మెంట్‌ను జూన్ 12న friday మార్నింగ్ 10AMకి రిలీజ్ చేయబోతున్నట్లు లారెన్స్ ట్వీట్ చేశాడు.

PM మోదీపై కమల్ హాసన్ ప్రశంసలు..
Politics· 10 Jun 2026

PM మోదీపై కమల్ హాసన్ ప్రశంసలు..

ఇండియా హిస్టరీలోనే ఎక్కువ కాలం PMగా రికార్డ్ క్రియేట్ చేసిన నరేంద్ర మోదీకి స్టార్ హీరో కమల్ హాసన్ కంగ్రాట్స్ చెప్పారు. మనలాంటి పెద్ద దేశంలో ఇన్నేళ్లు పబ్లిక్ నమ్మకాన్ని గెలుచుకోవడం మామూలు విషయం కాదంటూ మెచ్చుకున్నారు. మన ఫోకస్ అంతా ఎప్పుడూ దేశం ఇంప్రూవ్ అవ్వడం, జనాలు బాగుండటం పైనే ఉండాలని ట్వీట్ చేశారు. ప్రజెంట్ కమల్ హాసన్ పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.

రేపే 'కాక్రోచెస్ ప్రొటెస్ట్'..▶
Politics· 10 Jun 2026

రేపే 'కాక్రోచెస్ ప్రొటెస్ట్'..

కాక్రోచెస్ పార్టీకి సపోర్ట్ గా జూన్ 11న పుణెలో జరగబోయే బిగ్ ప్రొటెస్ట్ లో సోనమ్ వాంగ్చుక్ జాయిన్ కాబోతున్నారు. పేపర్ లీక్ ఇష్యూస్ పై సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రొటెస్ట్ కి స్టూడెంట్స్, పబ్లిక్ అందరూ భారీ సంఖ్యలో తరలిరావాలని కాక్రోచెస్ పార్టీ ఫౌండర్ పిలుపునిచ్చారు. ప్రజెంట్ ఈ అప్‌డేట్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.

'పెద్ది' సినిమా టికెట్ రేట్ల పెంపు ఇల్లీగల్!
Cinema· 10 Jun 2026

'పెద్ది' సినిమా టికెట్ రేట్ల పెంపు ఇల్లీగల్!

తెలంగాణ హోమ్ సెక్రటరీ శిఖా గోయల్‌పై హైకోర్టులో కంటెంప్ట్ పిటిషన్ ఫైల్ అయింది. రూల్స్ (జీవో 151) ఫాలో అవ్వకుండా ఈ నెల 2న 'పెద్ది' సినిమా టికెట్ రేట్లు పెంచుతూ ఆమె ఇచ్చిన జీవో ఇల్లీగల్ అని కోర్టు సీరియస్ అయింది. టికెట్ రేట్ల పెంపు జీవో కరెక్ట్ కాదంటూ. ఈ కేస్ నెక్స్ట్ హియరింగ్‌ను ఈ నెల 15కి పోస్ట్‌పోన్ చేసింది

మమతా బెనర్జీ సామ్రాజ్యం క్లోజ్? TMCలో తిరుగుబాటు!
Politics· 10 Jun 2026

మమతా బెనర్జీ సామ్రాజ్యం క్లోజ్? TMCలో తిరుగుబాటు!

అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఓడిపోయాక మమతా బెనర్జీ పార్టీ TMCలో ఇంటర్నల్ ఫైట్స్ బహిర్గతమవుతున్నాయి. MLA రితబ్రత బెనర్జీ 58 మంది MLAల సపోర్ట్ తో ప్రతిపక్ష నేత పదవి అడుగుతుండగా. మరోవైపు MP కాకోలి ఘోష్ 19 మంది MPలతో కలిసి NDAకి సపోర్ట్ ఇవ్వడానికి రెడీ అయినట్లు టాక్ నడుస్తోంది. లీడర్స్ అందరూ తిరుగుబాటు చేస్తుండటంతో దీదీకి ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది.

22 జిల్లాల సర్వే.. రిపోర్ట్ లో ఏముంది?
News· 10 Jun 2026

22 జిల్లాల సర్వే.. రిపోర్ట్ లో ఏముంది?

తెలంగాణలో కౌలు రైతుల సమస్యలపై 'రైతు స్వరాజ్య వేదిక' ఆధ్వర్యంలో ఒక important సర్వే రిపోర్ట్ రిలీజ్ అయింది. 22 జిల్లాల్లో 1816 మంది కౌలు రైతులను ఇంటర్వ్యూ చేసి ఈ నివేదికను తయారు చేశారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి, ప్రొఫెసర్ హరగోపాల్ లాంటి ప్రముఖులు ఈ మీటింగ్‌లో పాల్గొన్నారు. కౌలు రైతులకు వెంటనే గుర్తింపు కార్డులు ఇచ్చి, అన్ని రకాల ప్రభుత్వ స్కీమ్స్ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. 2011 భూ కౌలుదారుల చట్టాన్ని వెంటనే అమలు చేయాలని, CM దీనిపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని కోరారు.

RMP డాక్టర్ క్రేజీ ట్రీట్మెంట్.. దెబ్బ తగిలితే పిన్నులు కొట్టాడు!
Crime· 10 Jun 2026

RMP డాక్టర్ క్రేజీ ట్రీట్మెంట్.. దెబ్బ తగిలితే పిన్నులు కొట్టాడు!

నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలో ఒక షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. ఉపాధి పనుల్లో రాములమ్మ కి వేలికి గాయమైతే.. మంజునాథ్ అనే RMP డాక్టర్ ఏకంగా పేపర్లకి కొట్టే పిన్నుల మిషన్ (స్టేప్లర్) తో కుట్లు వేశాడు. నొప్పి తగ్గకపోవడంతో ఆమె '104' మెడికల్ క్యాంప్‌కి వెళ్ళింది. వేలికి ఉన్న పిన్నులను చూసి అక్కడి గవర్నమెంట్ డాక్టర్లు, స్టాఫ్ అందరూ మైండ్ బ్లాక్ అయి షాకయ్యారు.

నెల రోజుల క్రితమే పెళ్లి, ఇంతలోనే ఘోరం!
Crime· 10 Jun 2026

నెల రోజుల క్రితమే పెళ్లి, ఇంతలోనే ఘోరం!

కర్ణాటకలోని మండ్యలో ఒక ఘోర ప్రమాదం జరిగింది. బిజినెస్ లాసెస్, హోమ్ లోన్ అప్పులు ఎక్కువవడంతో తీవ్ర డిప్రెషన్‌లోకి వెళ్లిన ప్రభాకర్ అనే బట్టల వ్యాపారి.. తన భార్య జ్యోతి, కొడుకు సంతోష్‌లను చంపేసి, ఆ తర్వాత తను కూడా సూసైడ్ చేసుకున్నాడు. నెల రోజుల క్రితమే సంతోష్‌కి మ్యారేజ్ అయింది. పక్క రూమ్‌లోనే పడుకున్న కొత్త పెళ్లికూతురు ఉదయం లేచి చూసేసరికి ముగ్గురూ శవాలై కనిపించడంతో షాక్‌లోకి వెళ్ళిపోయింది.

అప్పులు తీర్చలేక తల్లిని చంపిన కొడుకు
Crime· 10 Jun 2026

అప్పులు తీర్చలేక తల్లిని చంపిన కొడుకు

AP: ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటకు చెందిన రఘువంశీ హైదరాబాద్‌లో మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. జల్సాలకు అలవాటుపడిన యువకుడు భారీగా అప్పులు చేశాడు. వాటిని తీర్చడం కోసం విస్సన్నపేటలో ఉన్న తమ ఇల్లు అమ్మాలంటూ తన తల్లి రమాదేవిపై గత కొంతకాలంగా ఫ్రెజర్ చేశాడు. అయితే ఇల్లు అమ్మడానికి ఆమె నిరాకరించడంతో తీవ్ర కక్ష పెంచుకున్న కుమారుడు దారుణంగా కొట్టి ఆమెను హతమార్చాడు. విస్సన్నపేట పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు.

హిస్టరీ క్రియేట్ చేసిన మోదీ!▶
Politics· 10 Jun 2026

హిస్టరీ క్రియేట్ చేసిన మోదీ!

ఇండియా హిస్టరీలోనే ఎక్కువ కాలం పీఎంగా రికార్డ్ క్రియేట్ చేసిన నరేంద్ర మోదీకి కేంద్ర క్యాబినెట్ కంగ్రాట్స్ తెలిపింది. దేశం కోసం ఆయన రాత్రి పగలు కష్టపడే తత్వాన్ని, లీడర్‌షిప్‌ని మెచ్చుకుంటూ మంత్రులందరూ గట్టిగా చప్పట్లు కొట్టి విషెస్ చెప్పారు. ప్రజెంట్ దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మోదీకి ఇటలీ PM జార్జియా మెలోని స్పెషల్ విషెస్!
Politics· 10 Jun 2026

మోదీకి ఇటలీ PM జార్జియా మెలోని స్పెషల్ విషెస్!

ఇండియాలో ఎక్కువ కాలం పీఎంగా ఉండి రికార్డ్ క్రియేట్ చేసిన నరేంద్ర మోదీకి కంగ్రాట్స్ చెప్తూ ఇటలీ పీఎం జార్జియా మెలోని ట్వీట్ చేశారు. రీసెంట్ గా రోమ్ లో మోదీని కలవడం చాలా హ్యాపీగా ఉందంటూ ఆమె పేర్కొన్నారు. రెండు దేశాల ప్రజల ఫ్యూచర్ కోసం, సరికొత్త అవకాశాల కోసం ఒక స్పెషల్ డీల్ సెట్ చేసుకున్నామని చెప్పారు. ప్రజెంట్ మెలోని పెట్టిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.

The Clear Cut News Headlines- ముఖ్యాంశాలు▶
News· 10 Jun 2026

The Clear Cut News Headlines- ముఖ్యాంశాలు

* డిగ్రీ ఉంటే చాలు.. SBI లో 7,150 జాబ్స్! * విశాఖ స్టీల్ ప్లాంట్‌ దగ్గరికి చేరుకున్న YS జగన్.. *క్యాన్సర్ పిల్లల మధ్య బాలయ్య బర్త్‌డే సెలబ్రేషన్స్! *తమిళ దిగ్గజ దర్శకుడు భారతీరాజా కన్నుమూత

గంజాయి ముఠా రాళ్లదాడి.. గాల్లోకి కాల్పులు
Crime· 10 Jun 2026

గంజాయి ముఠా రాళ్లదాడి.. గాల్లోకి కాల్పులు

AP: అల్లూరిసీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలోని లోతుగెడ్డ సమీపంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గంజాయితో వస్తున్న కారును తనిఖీ చేస్తుండగా అందులో ఉన్న ముఠా సభ్యులు హెడ్ కానిస్టేబుల్ కాలర్ పట్టుకున్నారు. అంతటితో ఆగకుండా పోలీసులపై రాళ్లతో దాడిచేశారు. దీంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. నిందితులు పరారయ్యేందుకు ప్రయత్నించగా, నలుగురిని పట్టుకున్నారు. నిందితులు ఆంధ్రా, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌కు చెందిన వారిగా గుర్తించారు. 290కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

అవినీతి అనకొండకు 14రోజుల రిమాండ్
Crime· 10 Jun 2026

అవినీతి అనకొండకు 14రోజుల రిమాండ్

TG: తెలంగాణ R & B ఇంజినీర్ ఇన్ చీఫ్ మోహన్ నాయక్‌కు కోర్టు 14రోజుల రిమాండ్ విధించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ACB అధికారులు ఆయన్ను కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి రిమాండ్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో అధికారులు ఆయన్ను చంచల్‌గూడ సెంట్రల్ జైలుకు తరలించారు. మియాపూర్‌లోని ఆయన నివాసం, నిజామాబాద్ సహా మొత్తం 16 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో జరిపిన సోదాల్లో రూ.200 కోట్ల విలువైన అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తించారు.