చెత్తకుప్పలో పసికందు మృతదేహం

AP: కడప నగరంలో అప్పుడే పుట్టిన పసికందును రోడ్డు పక్కన పడేశారు. కడప శివారులోని అమర్ హాస్పిటల్ వద్ద శిశువును రోడ్డు పక్కన చెత్తకుప్పలో పెట్టి వెళ్లిపోయారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి స్థానికులను విచారించారు. చనిపోయిన తర్వాత పడేశారా లేదా బతికుండగానే పడేయడంతో పసికందు చనిపోయిందా అనేది తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



