'ఎవరైనా హిట్లర్‌ను ఆదర్శంగా తీసుకుంటారా'

TG: CM రేవంత్ రెడ్డి తనను తాను హిట్లర్‌తో పోల్చుకుంటూ చేసిన కామెంట్స్‌పై BRS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి ఫైరయ్యారు. జగిత్యాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హిట్లర్ గతి ఏమైందో చివరికి అందరం గమనించామని, రేపు రేవంత్ రెడ్డికి కూడా అదే గతి పడుతుందన్నారు. ఒక కాంగ్రెస్ నాయకుడిగా రేవంత్ రెడ్డి ఏం కావాలని కోరుకోవాలి.. ఇందిరాగాంధీని, రాజీవ్ గాంధీని ఆదర్శంగా తీసుకోవాలి..కానీ ఎవడన్నా హిట్లర్‌ను ఆదర్శంగా తీసుకుంటాడా అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు.


