Latest

నైరుతి ఎఫెక్ట్.. 17 రాష్ట్రాల్లో వర్షాలు
Politics· 6 Jun 2026

నైరుతి ఎఫెక్ట్.. 17 రాష్ట్రాల్లో వర్షాలు

ఇన్నాళ్లూ ఎండలతో ఉక్కిరిబిక్కిరైన దేశ ప్రజలు సేద తీరుతున్నారు. నైరుతి రుతుపవనాల రాకతో దేశవ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రుతుపవనాలు కేరళం నుంచి ఏపీని తాకాయి. రాబోయే 24 నుంచి 48 గంటల్లో ఏపీ, తెలంగాణతో పాటు దేశంలోని 17 రాష్ట్రాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. మైదాన ప్రాంతాలలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో భీకర గాలులు వీచే ప్రమాదం ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్ ఇచ్చింది.

కాక్రోచెస్ కి సపోర్ట్ గా 70 ఏళ్ల పెద్దాయన!▶
Politics· 6 Jun 2026

కాక్రోచెస్ కి సపోర్ట్ గా 70 ఏళ్ల పెద్దాయన!

కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు కేవలం జెన్ జీ కే పరిమితం కాలేదు. భయం లేని భారతదేశం కోసం యూత్ చేస్తున్న ఈ ప్రొటెస్ట్ కి సపోర్ట్ ఇవ్వడానికి 70 ఏళ్ల ఒక పెద్దాయన జంతర్ మంతర్ కి వచ్చారు. దీనిపై పీక్ టీవీతో ఆయన మాట్లాడుతూ.. యువత చేస్తున్న ఈ పోరాటానికి తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం ఈ పెద్దాయన మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతూ ఫుల్ వైరల్ గా మారింది.

జంతర్ మంతర్ లో సోనమ్ వాంగ్‌చుక్ పవర్‌ఫుల్ మెసేజ్!▶
Politics· 6 Jun 2026

జంతర్ మంతర్ లో సోనమ్ వాంగ్‌చుక్ పవర్‌ఫుల్ మెసేజ్!

యూత్ కోసం లడఖ్ నుండి వచ్చిన సోనమ్ వాంగ్‌చుక్ జంతర్ మంతర్ లో ఒక రేంజ్ లో ఇన్స్‌పైర్ చేశారు. కొన్ని నెలల క్రితం NSA కింద జైలుకి వెళ్లినా భయపడకుండా కాక్రోచ్ పార్టీ ప్రొటెస్ట్ లో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా యూత్ కి మీ మెసేజ్ ఏంటని రిపోర్టర్ అడగ్గా.. యువత అంతా ఒక్కటై ఒక పవర్‌ఫుల్ ఫోర్స్ లా మారాలని చెప్పారు. చాలా ప్రశాంతంగా ఉంటూనే, మన హక్కుల కోసం గట్టిగా నిలబడాలంటూ వాంగ్‌చుక్ ఇచ్చిన ఈ మెసేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.

త్వరలో దేశమంతటా కాక్రోచెస్ ప్రొటెస్ట్‌లు!▶
Politics· 6 Jun 2026

త్వరలో దేశమంతటా కాక్రోచెస్ ప్రొటెస్ట్‌లు!

జంతర్ మంతర్ ప్రొటెస్ట్ లో కాక్రోచ్ జనతా పార్టీ లీడర్ అభిజీత్ దిప్కే కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేశారు. ఈ నిరసనలు కేవలం ఢిల్లీకే పరిమితం కావని, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కచ్చితంగా రాజీనామా చేయాల్సిందేనని, లేదంటే దేశమంతటా ఈ ప్రొటెస్ట్‌లు కంటిన్యూ చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రజలను చాలా లైట్ తీసుకుందని, అందుకే తాము ఈ రేంజ్ లో ఫైట్ చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ అప్‌డేట్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.

పశ్చిమబెంగాల్ కు బుల్లెట్ రైలు
India· 6 Jun 2026

పశ్చిమబెంగాల్ కు బుల్లెట్ రైలు

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచాక ఆ రాష్ట్రానికి కేంద్రం వరాల జల్లు కురిపించింది. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తొలి బుల్లెట్ రైలుని ప్రకటించింది. ఢిల్లీ నుండి పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి మధ్య ఇప్పుడు రైల్లో ప్రయాణానికి ఒక రోజు పడుతుంది. ఈ బుల్లెట్ రైలు వస్తే 6 గంటల్లోనే చేరుకోవచ్చు. ఈ హైస్పీడ్ కారిడార్ లక్నో, వారణాసి, పాట్నా మీదుగా సాగుతుంది. బెంగాల్ రైల్వే అభివృద్ధికి ₹1 లక్ష కోట్లు కేటాయించామన్నారు. వచ్చే ఐదేళ్లలో కోల్‌కతా మెట్రోకు 60 న్యూ జనరేషన్ రైళ్లను అందిస్తామని మంత్రి తెలిపారు.

ట్రోలింగ్ కు మరో విద్యార్థి బలి
Crime· 6 Jun 2026

ట్రోలింగ్ కు మరో విద్యార్థి బలి

సోషల్ మీడియా ట్రోలింగ్ తట్టుకోలేక గోవాలో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. శామ్యూల్ డిసౌజా (23) రోడ్డుపై చెత్త వేస్తున్నట్లు ఉన్న ఒక వీడియో SMలో వైరల్ అయింది. దీంతో నెటిజన్లు శామ్యూల్ ని విపరీతంగా ట్రోల్ చేశారు. ఆ వేధింపులు భరించలేక హాస్టల్ గదిలో ఉరి వేసుకొని చనిపోయాడని శామ్యూల్ తండ్రి పోలీసులకు చెప్పారు. దీంతో శామ్యూల్ ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ కామెంట్లు చేసిన సైబర్ అకౌంట్లపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

అభిజీత్ దిప్కే: హిందూ-ముస్లిం పాలిటిక్స్ తో ఎవరికి లాభం?▶
Politics· 6 Jun 2026

అభిజీత్ దిప్కే: హిందూ-ముస్లిం పాలిటిక్స్ తో ఎవరికి లాభం?

జంతర్ మంతర్ ప్రొటెస్ట్ లో కాక్రోచ్ జనతా పార్టీ లీడర్ అభిజీత్ దిప్కే హిందూ-ముస్లిం పాలిటిక్స్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. గత 10-12 ఏళ్లుగా వీళ్ళు మనల్ని ఇలాంటి పాలిటిక్స్ లోనే ట్రాప్ చేసి ఉంచారని, అసలు దీనివల్ల ఎవరికి యూజ్ అయిందని ఆయన ప్రశ్నించారు. ఈ హిందూ-ముస్లిం పాలిటిక్స్ దేశంలో ఎవరికైనా జాబ్స్ తెచ్చిపెట్టాయా అంటూ నిలదీశారు. యూత్ ని ఆలోచింపజేసేలా ఉన్న ఈ పవర్‌ఫుల్ స్పీచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.

‘బందార్’లో బాబీ డియోల్  యాక్టింగే స్పెషల్ అట్రాక్షన్
Entertainment· 6 Jun 2026

‘బందార్’లో బాబీ డియోల్ యాక్టింగే స్పెషల్ అట్రాక్షన్

అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో తెరకెక్కిన బందార్ చిత్రంలో బాబీ డియోల్ నటన ప్రధాన బలంగా నిలిచిందని ఫిలిం క్రిటిక్ రేణుకా వ్యావహారే తన సమీక్షలో పేర్కొన్నారు. అత్యాచారం కేసు నేపథ్యంలో సాగే ఈ కోర్టు డ్రామా న్యాయవ్యవస్థలోని లోపాలను ప్రశ్నిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. బలమైన కథనం, నటీనటుల ప్రదర్శన సినిమాకు అదనపు బలంగా మారాయని తన రివ్యూలో పేర్కొన్నారు.

కాక్రోచెస్ ప్రొటెస్ట్ లో 83 ఏళ్ల పెద్దాయన!▶
Politics· 6 Jun 2026

కాక్రోచెస్ ప్రొటెస్ట్ లో 83 ఏళ్ల పెద్దాయన!

జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్న కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ప్రొటెస్ట్ లో ఒక ఇంట్రెస్టింగ్ సీన్ కనిపించింది. ఈ నిరసనల్లో పాల్గొనేందుకు 83 ఏళ్ల ఒక పెద్దాయన స్వయంగా ప్రొటెస్ట్ స్పాట్ కి వచ్చారు. దీనిపై 'కాక్రోచ్ ఈజ్ బ్యాక్' అకౌంట్ లో పోస్ట్ చేస్తూ. పెద్దల ఆశీస్సులు కూడా కాక్రోచ్ పార్టీకే ఉన్నాయని రాసుకొచ్చారు. యూత్ తో పాటు ఈ పెద్దాయన కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

అమెరికా హెచ్‌ఆర్ విభాగాల సృష్టి కర్తలు ఇండియన్సే !
World· 6 Jun 2026

అమెరికా హెచ్‌ఆర్ విభాగాల సృష్టి కర్తలు ఇండియన్సే !

అమెరికాలో భారతీయులపై పెరుగుతున్న వ్యతిరేక ప్రచారం మధ్య ఆసక్తికర అంశాలను నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ (NFAP) అధ్యయనం వెలుగులోకి తెచ్చింది. హిప్పోక్రాటిక్ ఏఐ, బ్లూమ్‌రీచ్, ఎయిట్‌ఫోల్డ్ ఏఐ వంటి బిలియన్ డాలర్ల సంస్థలను భారతీయులు స్థాపించి వేలాది ఉద్యోగాలను సృష్టించారని పేర్కొంది. ఉద్యోగాలు లాక్కుంటున్నారనే విమర్శలకంటే, కొత్త హెచ్‌ఆర్ విభాగాలనే నిర్మించే స్థాయిలో భారతీయులు ఉపాధి అవకాశాలను పెంచుతున్నారని అధ్యయనం వివరించింది.

అమెరికాలో భారతీయులే స్టార్టప్ శక్తి
World· 6 Jun 2026

అమెరికాలో భారతీయులే స్టార్టప్ శక్తి

అమెరికాలో ఉద్యోగాలు బయటి వారు తన్నుకు పోతున్నారన్న విమర్శలకు భిన్నంగా అక్కడి ఇండియన్ టెకీలు ఆ దేశ ఎకానమీకి కీలకమైన సోర్స్ గా నిలుస్తున్నారని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. అమెరికాలోని యూనికార్న్ స్టార్టప్‌లలో 59 శాతం సంస్థలకు భారతీయ మూలాలున్న వలసదారులు నాయకత్వం వహిస్తున్నట్లు నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ పేర్కొంది. అమెరికాలోని 775 యూనికార్న్ స్టార్టప్‌లలో 445 సంస్థలను వలసదారులు స్థాపించగా, వాటిలో 96 సంస్థలకు భారతీయ మూలాలున్న వ్యవస్థాపకులు నాయకత్వం వహించారు. ఈ కంపెనీలు లక్షలాది ఉద్యోగాలను సృష్టించి ట్రిలియన్ల డాలర్ల విలువను సాధించాయి.

సోనమ్ వాంగ్‌చుక్ పవర్‌ఫుల్ స్పీచ్!▶
Politics· 6 Jun 2026

సోనమ్ వాంగ్‌చుక్ పవర్‌ఫుల్ స్పీచ్!

జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్న కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ప్రొటెస్ట్ లో సోనమ్ వాంగ్‌చుక్ స్పీచ్ హైలైట్స్. అక్కడ ఉన్న వేలాది మంది యూత్ ని ఉద్దేశించి ఆయన “హలో కాక్రోచెస్” అంటూ తన స్పీచ్ స్టార్ట్ చేశారు. ఇండియాలోని ఎడ్యుకేషన్ సిస్టమ్ లో వెంటనే మార్పులు రావాలని ఆయన కోరారు. ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్ కండిషన్ ని ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉందని వాంగ్‌చుక్ చెప్పారు. ప్రస్తుతం ఆయన మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

ఒకే వేదికపై సోనమ్ వాంగ్‌చుక్, అభిజీత్ దిప్కే!
Politics· 6 Jun 2026

ఒకే వేదికపై సోనమ్ వాంగ్‌చుక్, అభిజీత్ దిప్కే!

జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్న కాక్రోచ్ జనతా పార్టీ ప్రొటెస్ట్ మరింత ఊపందుకుంది. CJP ఫౌండర్ అభిజీత్ దిప్కేతో పాటు, లడఖ్ యాక్టివిస్ట్ సోనమ్ వాంగ్‌చుక్‌ కూడా ప్రొటెస్ట్ లో జాయిన్ అయ్యారు. పరీక్షల వివాదంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలంటూ వీరిద్దరూ కలిసి గట్టిగా డిమాండ్ చేశారు. వీళ్ళిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

కృత్రిమ మాంసాన్ని ఎలా  తయారు చేస్తారు?
Technology· 6 Jun 2026

కృత్రిమ మాంసాన్ని ఎలా తయారు చేస్తారు?

ఈ ప్రక్రియలో ముందుగా ఆరోగ్యకరమైన జంతువుల నుండి బయాప్సీ ద్వారా కణాలను (cells) సేకరిస్తారు. ఆ తర్వాత, వాటిని ల్యాబ్‌లోని 'బయో-రియాక్టర్లు' అనే ప్రత్యేక పాత్రలలో ఉంచి, కణాలు పెరగడానికి అవసరమైన పోషకాలను అందిస్తారు. అక్కడ ఆ కణాలు సహజమైన మాంసంలాగా కండరాలు, కణజాలాలుగా (tissues) వేగంగా అభివృద్ధి చెందుతాయి. ఎలాంటి జంతు హింస, హానికర రసాయనాలు లేకుండా కేవలం కొన్ని వారాల్లోనే స్వచ్ఛమైన మాంసాన్ని సిద్ధం చేస్తారు.

జంతువులను చంపకుండానే నాన్ వెజ్ తయారీ !!
Technology· 6 Jun 2026

జంతువులను చంపకుండానే నాన్ వెజ్ తయారీ !!

గ్లోబల్ వార్మింగ్‌కు పశువుల పెంపకం కూడా ఒక కారణం. దీనికి ప్రత్యామ్నాయంగా జంతువులను చంపకుండా, వాటి నుండి సేకరించిన కణాలను (cells) ల్యాబ్‌లలో బయో-రియాక్టర్ల ద్వారా వృద్ధి చేసి కృత్రిమ మాంసాన్ని శాస్త్రవేత్తలు సృష్టిస్తున్నారు. సహజమైన మాంసంలాగే ఉండే ఈ సరికొత్త టెక్నాలజీ పర్యావరణాన్ని కాపాడటమే కాకుండా, భవిష్యత్తులో ప్రపంచ ఆహార కొరతను తీర్చడానికి ఒక అద్భుతమైన మార్గంగా నిలవనుంది.

అభిజీత్ దీప్కే: నేను వాయిస్ రైజ్ చేస్తే మా అమ్మ భయపడింది!▶
Politics· 6 Jun 2026

అభిజీత్ దీప్కే: నేను వాయిస్ రైజ్ చేస్తే మా అమ్మ భయపడింది!

జంతర్ మంతర్ ప్రొటెస్ట్ లో కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ చేసిన ఎమోషనల్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. ప్రభుత్వంపై వాయిస్ రైజ్ చేస్తే తనను జైల్లో పెడుతుందని వాళ్ల అమ్మ భయపడిందని ఆయన చెప్పారు. ఈ దేశంలో క్వశ్చన్ చేసే ప్రతి బిడ్డను చూసి ఏ తల్లి అయినా ఇలాగే భయపడే పరిస్థితి వచ్చిందన్నారు. ఇంకా ఎంతకాలం ఈ ప్రభుత్వానికి భయపడుతూ బతకాలని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ ఎమోషనల్ వర్డ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రొటెస్ట్ స్పాట్ లో ఢిల్లీ పోలీస్ వీడియో!▶
Politics· 6 Jun 2026

ప్రొటెస్ట్ స్పాట్ లో ఢిల్లీ పోలీస్ వీడియో!

జంతర్ మంతర్ ప్రొటెస్ట్ స్పాట్ దగ్గర ఒక shocking వీడియో బయటపడింది. అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీకి చెందిన ప్రమోషనల్ మెటీరియల్‌ (ఫేస్ మాస్క్)ని ఒక ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ సీజ్ చేసి, అక్కడ నుండి తీసుకువెళ్లిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన అప్‌డేట్స్ అండ్ విజువల్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

అసలు కాక్రోచెస్ ఎవరికీ భయపడవు!▶
Politics· 6 Jun 2026

అసలు కాక్రోచెస్ ఎవరికీ భయపడవు!

జంతర్ మంతర్ ప్రొటెస్ట్ పై 'కాక్రోచ్ ఈజ్ బ్యాక్' అకౌంట్‌లో మరో పవర్‌ఫుల్ పోస్ట్ పెట్టారు. దేశంలోని యూత్ ఇకపై ఎవరికీ భయపడరని, తమ హక్కుల కోసం ఫైట్ చేస్తారని అందులో స్పష్టం చేశారు. అసలు కాక్రోచెస్ ఎవరికీ భయపడవు, చావవు కూడా అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలంటూ వేలాది మంది చేస్తున్న ఈ ప్రొటెస్ట్ అప్‌డేట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

యూత్ వాయిస్ ప్రభుత్వం వింటోందా?
Politics· 6 Jun 2026

యూత్ వాయిస్ ప్రభుత్వం వింటోందా?

జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్న కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ప్రొటెస్ట్ పై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. రీసెంట్ గా 'కాక్రోచ్ ఈజ్ బ్యాక్' అనే అకౌంట్‌లో దీనిపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఒక పోస్ట్ పెట్టారు. దేశంలోని యూత్ వాయిస్‌ని అసలు ప్రభుత్వం వింటోందా లేదా అని అందులో నిలదీశారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ వేలాది మంది చేస్తున్న ఈ ప్రొటెస్ట్ అప్‌డేట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

పవన్.. ఆ భూమిని ప్రభుత్వానికి అప్పగించు: కవిత
Politics· 6 Jun 2026

పవన్.. ఆ భూమిని ప్రభుత్వానికి అప్పగించు: కవిత

TG: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎదుర్కొంటున్న కోడి చెరువు కబ్జా ఆరోపణలపై TRS పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల కవిత స్పందించారు. శనివారం జూబ్లీహిల్స్‌లోని టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కోడిచెరువు శిఖంభూమి అని ఇరిగేషన్ రికార్డులు స్పష్టంగా చెబుతున్నాయని అందువల్ల పవన్ కల్యాణ్ ఆ భూమిని ప్రభుత్వానికి అప్పగించాలన్నారు. అలాగే అక్కడ వేసిన కంచెను, మట్టిని తక్షణమే తొలగించాలని కవిత డిమాండ్ చేశారు.

వేలాది మంది కాక్రోచెస్.. ఒకే ఒక్క డిమాండ్!
Politics· 6 Jun 2026

వేలాది మంది కాక్రోచెస్.. ఒకే ఒక్క డిమాండ్!

జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్న కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ప్రొటెస్ట్ మరో స్థాయికి వెళ్తోంది. అక్కడ వేలాది మంది కాక్రోచెస్ ఒకే ఒక్క డిమాండ్ తో నిలబడ్డారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలంటూ అందరూ ఒకే వాయిస్ తో నినాదాలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రొటెస్ట్‌కు సంబంధించిన ఈ ఫోటో సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి.