అమెరికాలో భారతీయులే స్టార్టప్ శక్తి

అమెరికాలో ఉద్యోగాలు బయటి వారు తన్నుకు పోతున్నారన్న విమర్శలకు భిన్నంగా అక్కడి ఇండియన్ టెకీలు ఆ దేశ ఎకానమీకి కీలకమైన సోర్స్ గా నిలుస్తున్నారని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. అమెరికాలోని యూనికార్న్ స్టార్టప్‌లలో 59 శాతం సంస్థలకు భారతీయ మూలాలున్న వలసదారులు నాయకత్వం వహిస్తున్నట్లు నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ పేర్కొంది. అమెరికాలోని 775 యూనికార్న్ స్టార్టప్‌లలో 445 సంస్థలను వలసదారులు స్థాపించగా, వాటిలో 96 సంస్థలకు భారతీయ మూలాలున్న వ్యవస్థాపకులు నాయకత్వం వహించారు. ఈ కంపెనీలు లక్షలాది ఉద్యోగాలను సృష్టించి ట్రిలియన్ల డాలర్ల విలువను సాధించాయి.
