Latest

ఒకే వేదికపై సోనమ్ వాంగ్‌చుక్, అభిజీత్ దిప్కే!
జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్న కాక్రోచ్ జనతా పార్టీ ప్రొటెస్ట్ మరింత ఊపందుకుంది. CJP ఫౌండర్ అభిజీత్ దిప్కేతో పాటు, లడఖ్ యాక్టివిస్ట్ సోనమ్ వాంగ్‌చుక్ కూడా ప్రొటెస్ట్ లో జాయిన్ అయ్యారు. పరీక్షల వివాదంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలంటూ వీరిద్దరూ కలిసి గట్టిగా డిమాండ్ చేశారు. వీళ్ళిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

కృత్రిమ మాంసాన్ని ఎలా తయారు చేస్తారు?
ఈ ప్రక్రియలో ముందుగా ఆరోగ్యకరమైన జంతువుల నుండి బయాప్సీ ద్వారా కణాలను (cells) సేకరిస్తారు. ఆ తర్వాత, వాటిని ల్యాబ్‌లోని 'బయో-రియాక్టర్లు' అనే ప్రత్యేక పాత్రలలో ఉంచి, కణాలు పెరగడానికి అవసరమైన పోషకాలను అందిస్తారు. అక్కడ ఆ కణాలు సహజమైన మాంసంలాగా కండరాలు, కణజాలాలుగా (tissues) వేగంగా అభివృద్ధి చెందుతాయి. ఎలాంటి జంతు హింస, హానికర రసాయనాలు లేకుండా కేవలం కొన్ని వారాల్లోనే స్వచ్ఛమైన మాంసాన్ని సిద్ధం చేస్తారు.

జంతువులను చంపకుండానే నాన్ వెజ్ తయారీ !!
గ్లోబల్ వార్మింగ్‌కు పశువుల పెంపకం కూడా ఒక కారణం. దీనికి ప్రత్యామ్నాయంగా జంతువులను చంపకుండా, వాటి నుండి సేకరించిన కణాలను (cells) ల్యాబ్‌లలో బయో-రియాక్టర్ల ద్వారా వృద్ధి చేసి కృత్రిమ మాంసాన్ని శాస్త్రవేత్తలు సృష్టిస్తున్నారు. సహజమైన మాంసంలాగే ఉండే ఈ సరికొత్త టెక్నాలజీ పర్యావరణాన్ని కాపాడటమే కాకుండా, భవిష్యత్తులో ప్రపంచ ఆహార కొరతను తీర్చడానికి ఒక అద్భుతమైన మార్గంగా నిలవనుంది.
అభిజీత్ దీప్కే: నేను వాయిస్ రైజ్ చేస్తే మా అమ్మ భయపడింది!
జంతర్ మంతర్ ప్రొటెస్ట్ లో కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ చేసిన ఎమోషనల్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. ప్రభుత్వంపై వాయిస్ రైజ్ చేస్తే తనను జైల్లో పెడుతుందని వాళ్ల అమ్మ భయపడిందని ఆయన చెప్పారు. ఈ దేశంలో క్వశ్చన్ చేసే ప్రతి బిడ్డను చూసి ఏ తల్లి అయినా ఇలాగే భయపడే పరిస్థితి వచ్చిందన్నారు. ఇంకా ఎంతకాలం ఈ ప్రభుత్వానికి భయపడుతూ బతకాలని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ ఎమోషనల్ వర్డ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రొటెస్ట్ స్పాట్ లో ఢిల్లీ పోలీస్ వీడియో!
జంతర్ మంతర్ ప్రొటెస్ట్ స్పాట్ దగ్గర ఒక shocking వీడియో బయటపడింది. అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీకి చెందిన ప్రమోషనల్ మెటీరియల్ (ఫేస్ మాస్క్)ని ఒక ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ సీజ్ చేసి, అక్కడ నుండి తీసుకువెళ్లిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన అప్‌డేట్స్ అండ్ విజువల్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.
అసలు కాక్రోచెస్ ఎవరికీ భయపడవు!
జంతర్ మంతర్ ప్రొటెస్ట్ పై 'కాక్రోచ్ ఈజ్ బ్యాక్' అకౌంట్‌లో మరో పవర్‌ఫుల్ పోస్ట్ పెట్టారు. దేశంలోని యూత్ ఇకపై ఎవరికీ భయపడరని, తమ హక్కుల కోసం ఫైట్ చేస్తారని అందులో స్పష్టం చేశారు. అసలు కాక్రోచెస్ ఎవరికీ భయపడవు, చావవు కూడా అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలంటూ వేలాది మంది చేస్తున్న ఈ ప్రొటెస్ట్ అప్‌డేట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

యూత్ వాయిస్ ప్రభుత్వం వింటోందా?
జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్న కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ప్రొటెస్ట్ పై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. రీసెంట్ గా 'కాక్రోచ్ ఈజ్ బ్యాక్' అనే అకౌంట్‌లో దీనిపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఒక పోస్ట్ పెట్టారు. దేశంలోని యూత్ వాయిస్‌ని అసలు ప్రభుత్వం వింటోందా లేదా అని అందులో నిలదీశారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ వేలాది మంది చేస్తున్న ఈ ప్రొటెస్ట్ అప్‌డేట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

పవన్.. ఆ భూమిని ప్రభుత్వానికి అప్పగించు: కవిత
TG: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎదుర్కొంటున్న కోడి చెరువు కబ్జా ఆరోపణలపై TRS పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల కవిత స్పందించారు. శనివారం జూబ్లీహిల్స్‌లోని టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కోడిచెరువు శిఖంభూమి అని ఇరిగేషన్ రికార్డులు స్పష్టంగా చెబుతున్నాయని అందువల్ల పవన్ కల్యాణ్ ఆ భూమిని ప్రభుత్వానికి అప్పగించాలన్నారు. అలాగే అక్కడ వేసిన కంచెను, మట్టిని తక్షణమే తొలగించాలని కవిత డిమాండ్ చేశారు.

వేలాది మంది కాక్రోచెస్.. ఒకే ఒక్క డిమాండ్!
జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్న కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ప్రొటెస్ట్ మరో స్థాయికి వెళ్తోంది. అక్కడ వేలాది మంది కాక్రోచెస్ ఒకే ఒక్క డిమాండ్ తో నిలబడ్డారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలంటూ అందరూ ఒకే వాయిస్ తో నినాదాలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రొటెస్ట్‌కు సంబంధించిన ఈ ఫోటో సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి.

అత్యాచారం కేసు.. ఎట్టకేలకు లొంగిపోయిన సీఐ
AP: పల్నాడు జిల్లా వినుకొండ PSలో సీఐ చినమల్లయ్య లొంగిపోయారు. తనపై అత్యాచారం చేశారంటూ ఓ మహిళ ఏప్రిల్ 29న ఫిర్యాదు చేసింది. దీంతో బ్రాహ్మణపల్లిలో సీఐ చిన్న మల్లయ్యపై కేసు నమోదైంది. ఘటన తర్వాత సీఐ చిన మల్లయ్య అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించగా, బెయిల్ పిటిషన్‌ను ఇరు కోర్టులు డిస్మిస్ చేశాయి. అరెస్ట్ తప్పదని భావించిన సీఐ చిన మల్లయ్య వినుకొండ పోలీస్‌స్టేషన్‌లో సరెండర్ అయ్యారు.

సెకండ్ ఫ్లోర్ నుంచి కిందపడ్డ లిఫ్ట్.. లిఫ్ట్‌లోనే MLA
TG: మానకొండూరు MLA కవ్వంపల్లి సత్యనారాయణకు పెను ప్రమాదం తప్పింది. మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ బర్త్ డే సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు కవ్వంపల్లి సత్యనారాయణ వెళ్లారు. వేడుకలు ముగించుకుని భవనంలోని సెకండ్ ఫ్లోర్ నుంచి లిఫ్ట్‌లో కిందకు వస్తుండగా సాంకేతిక లోపం తలెత్తి లిఫ్ట్ ఒక్కసారిగా కిందికి పడిపోయింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది, అనుచరులు లిఫ్ట్ తలుపులు తెరిచి లోపల ఉన్న ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్‌లను సురక్షితంగా బయటకు తీశారు.
కాక్రోచెస్ వస్తున్నారు.. ధర్మేంద్ర ప్రధాన్ వెళ్తున్నారు!
జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై కాక్రోచ్ పార్టీ తీవ్రంగా మండిపడింది. ఆయన వెంటనే రాజీనామా చేయాలంటూ గట్టిగా నినాదాలు చేశారు. మనం కట్టే టాక్స్‌ల నుంచే ఆయన శాలరీ తీసుకుంటున్నారని, కానీ ఆయన పదవిలో ఉన్నప్పుడే లక్షలాది మంది యూత్ భవిష్యత్తు చీకట్లోకి వెళ్ళిపోయిందని ప్రొటెస్టర్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కాక్రోచెస్ వస్తున్నారు.. ధర్మేంద్ర ప్రధాన్ వెళ్తున్నారు’ అంటూ X లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ స్లోగన్స్‌కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

అనుమానంతో భార్యను కిరాతకంగా చంపిన భర్త
TG: భార్యపై అనుమానంతో భర్త రాడ్‌తో దాడిచేసి చంపాడు. మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన కోమలి (31), అవినాష్ దంపతులు ఆరునెలల క్రితం బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వలస వచ్చారు. అత్తాపూర్ తేజస్వీనినగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో కోమలి వాచ్‌మెన్‌గా చేస్తూ అదే భవనంలోని పలు ఇళ్లలో పనిమనిషిగా చేస్తోంది. భర్త అవినాష్ ఆటోడ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఆలస్యంగా ఇంటికొస్తోందనే అనుమానంతో అవినాష్ కత్తి, స్క్రూడ్రైవర్, రాడ్‌తో దాడిచేసి భార్యను నడిరోడ్డుపై చంపాడు.

జంతర్ మంతర్ ప్రొటెస్ట్ స్పాట్ కి చేరుకున్న అభిజీత్ దీప్కే!
కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఫౌండర్ అభిజీత్ దీప్కే ఢిల్లీలోని జంతర్ మంతర్ ప్రొటెస్ట్ స్పాట్ కి చేరుకున్నారు. ఆయన రాకతో వేలాది మంది ప్రొటెస్టర్స్ ఒక్కసారిగా అక్కడ జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి, పీఎం నరేంద్ర మోదీ కూడా వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని ప్రొటెస్టర్స్ గట్టిగా నినాదాలు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో విజువల్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

డిజిటల్ స్పీడ్ కి "స్లో లుకింగ్" సొల్యూషన్
ఈ డిజిటల్ యుగంలో గంటల తరబడి రీల్స్, షార్ట్స్ చూడడం వల్ల మనకు ఫోకస్ బాగా తగ్గిపోయింది. యావరేజ్ అటెన్షన్ స్పాన్ కేవలం 8.25 సెకన్లకు పడిపోయింది. నిజానికి మన మెదడు బలహీనపడలేదు. డిస్ట్రాక్షన్లు పెరిగాయి. యాప్స్ వాడకం ఎక్కువైపోయి ఏ పనిపైనా ఎక్కువసేపు దృష్టి పెట్టలే కపోతున్నామని నిపుణులు చెబుతున్నారు. దీని నుంచి బయటపడాలంటే స్లో లుకింగ్ అలవాటు చేసుకోవాలి. రోజుకు కనీసం 5 నిమిషాలు ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ఒకే వస్తువును లేదా ప్రకృతిని గమనించడం వల్ల మెదడు రీఛార్జ్ అవుతుంది. ఏకాగ్రత పెరిగి మన ఆలోచనా విధానాన్ని మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు.
Flowers తో కాక్రోచెస్ ప్రొటెస్ట్!
జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో చేతిలో పూలు పట్టుకుని ఉన్న ఒక కాక్రోచ్ ని రిపోర్టర్ ఎందుకు పూలు తెచ్చావని అడిగారు. దానికి ఆ కాక్రోచ్ సమాధానమిస్తూ. మన దేశంలో ప్రొటెస్ట్ చేస్తే వెంటనే యాంటీ నేషనల్ అనే ముద్ర వేస్తారని. తాము కేవలం మిలియన్ల కొద్దీ స్టూడెంట్స్ భవిష్యత్తుతో ఆడుకుంటున్న వారిపై ఆక్షన్ తీసుకోవాలని, బాధ్యతగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేయడానికి మాత్రమే ఈ పూలు తెచ్చామని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.

OG సినిమా చూపిస్తూ బ్రెయిన్ సర్జరీ
AP: ప్రకాశం జిల్లా దర్శికి చెందిన కోటేశ్వరమ్మ అనారోగ్యంగా ఉండడంతో కుటుంబసభ్యులు వడ్లమూడిలోని డీవీసీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆమెకు న్యూరోసర్జన్ అరుణకుమార్ పలు వైద్యపరీక్షలు చేశారు. ఆ రిపోర్టులు పరిశీలించి కోటేశ్వరమ్మ మెదడులో గడ్డ ఉందని దానిని తొలగించాలని సూచించారు. మత్తు ఇవ్వకుండా మెలుకువగా ఉన్నప్పుడే సర్జరీ చేయాలని డాక్టర్ చెప్పారు. ఏదైనా సినిమా చూపిస్తూ సర్జరీ పూర్తిచేయాలని నిర్ణయించారు. ఆమెకు ఇష్టమైన పవన్ కళ్యాణ్ సినిమా OGని డాక్టర్లు కోటేశ్వరమ్మకు చూపిస్తూ సర్జరీచేశారు.
జంతర్ మంతర్ దగ్గర యంగ్ ప్రొటెస్టర్స్!
ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేస్తున్న ప్రొటెస్ట్‌లో యూత్ భారీగా కనిపిస్తున్నారు. ఈ సందర్భంగా కొందరు యంగ్ ప్రొటెస్టర్స్ మీడియాతో మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. దేశంలో జరుగుతున్న ఇలాంటి సిట్యువేషన్స్ లో మనమందరం బయటకు వచ్చి సపోర్ట్ చేయడం చాలా ముఖ్యమని వాళ్ళు చెప్పారు. జెన్ జీ వాయిస్ వినిపించడానికే ఇక్కడికి వచ్చామన్నారు. ప్రస్తుతం ఈ యంగ్ ప్రొటెస్టర్స్ మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

లిక్కర్ వ్యాన్ బోల్తా.. మద్యం లూటీ
AP: చిత్తూరు జిల్లాలో లిక్కర్ లోడుతో వెళ్తున్న వ్యాన్ అదుపు తప్పి బోల్తా పడింది. చిత్తూరు-పుత్తూరు మార్గంలో బసిరెడ్డిపల్లి సమీపంలో వ్యాన్ బోల్తా పడడంతో మద్యం సీసాలు రోడ్డుపై పడిపోయాయి. ఆ దారిలో వెళ్లే వారు మద్యం బాక్సులు ఎత్తుకుపోయారు. మరికొందరు లుంగీలు, టవళ్లలో మద్యం సీసాలు దోచుకెళ్లారు. సీసాల కోసం ఎగబడిన వారిలో మహిళలు సైతం ఉన్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేలోపు అంతా సర్దుకుపోయారు.
భారీ సెక్యూరిటీ మధ్య కాక్రోచ్ పార్టీ ప్రొటెస్ట్!
ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ప్రొటెస్ట్‌కి భారీగా జనాలు తరలివచ్చారు. ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు అక్కడ భారీ సెక్యూరిటీ పెట్టారు. ఈ ప్రొటెస్ట్‌లో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలంటూ అందరూ నినాదాలు చేశారు. ప్రస్తుతం ఈ ప్రొటెస్ట్‌కు సంబంధించిన లైవ్ వీడియోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.
'జై భీమ్' స్టేట్మెంట్ తో ఎంట్రీ ఇచ్చిన కాక్రోచ్ పార్టీ చీఫ్!
కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చీఫ్ అభిజీత్ దీప్కే అమెరికా నుండి ఇండియాకు తిరిగొచ్చారు. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అవ్వగానే ఆయన చేతిలో ‘అంబేద్కర్ బుక్’ పట్టుకుని, ‘జై భీమ్’ అంటూ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. జంతర్ మంతర్ దగ్గర జరగబోయే పీస్‌ఫుల్ ప్రొటెస్ట్ కోసమే ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన ఎయిర్‌పోర్ట్ నుండి బయటకు వచ్చిన వీడియో విజువల్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.