Latest

నీటి గుంతలో పడి అక్కాచెల్లెళ్లు మృతి
AP: కడప జిల్లా కాజీపేట మండలం దుంపలగట్టులో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ఆడపిల్లలు నీటి గుంతలో పడి మృతి చెందారు. దుంపలగట్టు విలేజ్‌కు చెందిన అక్కాచెల్లెళ్లు సంజన(18), అర్చన (14) తమ పందులకు నీళ్లు తాపడం కోసం పొలం పరిసరాల్లోకి వెళ్లారు. అక్కడ ఉన్న నీటిగుంతలో ఒకరు పడిపోగా, వారిని రక్షించే క్రమంలో మరొకరు మునిగిపోయారు. ఇద్దరికీ ఈత రాకపోవడంతో ఊపిరాడక ప్రాణాలు విడిచారు. గమనించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ఇద్దరి డెడ్‌బాడీలను బయటకు తీశారు.

'రేవంత్‌రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు'
TG: సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులపై ఎలాంటి అవగాహన లేకుండా పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి అబద్దాల లెక్కలు నమ్ముకుంటే రైతులు డ్రిప్పులు, స్ప్రింక్లర్ల మీదే ఆధారపడాల్సి వస్తుందన్నారు. దశాబ్దాల పాటు కాంగ్రెస్ హయాంలో పెండింగ్‌లో పెట్టిన ప్రాజెక్టులను పూర్తి చేసింది KCR అని గుర్తు చేశారు.

మెక్సికోలో దొంగిలించిన ఫ్యూయల్ తో ఉన్న ట్యాంకర్ భారీ పేలుడు
మెక్సికోలోని ప్యూబ్లా రాష్ట్రంలో దొంగిలించిన ఇంధనాన్ని తీసుకెళ్తున్న గ్యాస్ ట్యాంకర్ ట్రక్ ఒక్కసారిగా భారీ అగ్నిగోళంలా పేలిపోయింది. ఈ ప్రమాదం కారణంగా స్థానిక నివాసితులు, ఆసుపత్రి రోగులు,విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది. ప్యూబ్లాకు సమీపంలో ఉన్న టెపీకా అనే చిన్న నగరం లో జరిగిన ఈ ఇన్సిడెంట్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ట్యాంకర్ పేలుడుతో నారింజ రంగులో పుట్టగొడుగు షేప్ లో అగ్నిగోళం ఎగసిపడింది.

ఈతకు వెళ్లి నలుగురు గల్లంతు
TG: కామారెడ్డి జిల్లా పిట్లం మండలం బొల్లక్‌పల్లి వద్ద మంజీరా నదిలోకి ఈతకు వెళ్లిన నలుగురు గల్లంతయ్యారు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు గజ ఈతగాళ్లతో నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైనవారిలో వారిలో ముగ్గురి డెడ్‌బాడీలను బయటకు తీశారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండటంతో గవర్నమెంట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతులు కిష్టాపూర్‌కు చెందినవారుగా గుర్తించారు.
రాజ్‌పాల్ యాదవ్‌పై అక్షయ్ కుమార్ క్రేజీ ప్రాంక్!
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ సెట్స్‌లో ఎంత అల్లరి చేస్తారో ఈ వీడియోలో చూడండి. రీసెంట్ గా ఆయన నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'వెల్‌కమ్ టు ది జంగిల్' షూటింగ్ సెట్స్‌లో ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. ప్రముఖ కమెడియన్ రాజ్‌పాల్ యాదవ్‌పై అక్షయ్ కుమార్ ఒక క్రేజీ ప్రాంక్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. వీరిద్దరి కాంబినేషన్ ఎప్పుడూ హిట్టే కాబట్టి, సెట్స్‌లో వీరు చేసిన ఈ సందడి చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

బే సిటీగా విశాఖ నగరం - చంద్రబాబు
బే సిటిగా విశాఖ నగరాన్ని తీర్చిదిద్దేందుకు అవసరమైన కార్యాచరణ చేపట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ పై సీఎం 9 జిల్లాల కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, అధికారులతో సమీక్ష జరిపారు..నగరంలోని కైలాసగిరి నుంచి భోగా పురం వరకూ ఈ బేసిటీ ప్రాజెక్టును అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. గ్రేహౌండ్స్ కు చెందిన 303 ఎకరాల్లో కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించాలని, కైలాసగిరిని ఆధ్యాత్మికంగా, పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దా లని స్పష్టం చేశారు.

పెద్దపులి సంచారంతో తగ్గిన పర్యాటకులు
AP: పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో పెద్దపులి సంచారంతో గిరిజన గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం పరగసానిపాడు, కూడిపల్లి, బోడిగూడెంలో పులి సంచారం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. పులి మెడకు అమర్చిన రేడియో కాలర్, డ్రోన్ కెమెరాలతో కదలికలను అధికారులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. పులి సంచారం దృష్ట్యా దేవీపట్నంలోని గండిపోచమ్మ టెంపుల్‌కు వెళ్లే రోడ్డు మూసివేశారు. పాపికొండలు వీక్షించేందుకు వచ్చే టూరిస్ట్‌ల సంఖ్య గణనీయంగా తగ్గింది.
'ఉప్పెన'ను మించి 'పెద్ది' రెస్పాన్స్: డైరెక్టర్ బుచ్చిబాబు
రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న 'పెద్ది' సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌పై డైరెక్టర్ బుచ్చిబాబు స్పందించారు. తన మొదటి సినిమా "#Uppena కంటే 'పెద్ది'కి వస్తున్న రెస్పాన్స్ 10 రెట్లు ఎక్కువగా ఉంది" అని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఆడియన్స్ నుంచి వస్తున్న ఈ రియాక్షన్ చూసి తాము చాలా హ్యాపీగా ఉన్నామని చెప్పారు. అంతేకాకుండా, ఈ క్యారెక్టర్ కోసం రామ్ చరణ్ గారు పడ్డ కష్టాన్ని, ఆయన డెడికేషన్‌ను ఇప్పుడు అందరూ గుర్తిస్తున్నారని బుచ్చిబాబు చెప్పుకొచ్చారు.

పవన్ పై నో కామెంట్ అన్న రేవంత్
తెలంగాణ రాజకీయాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తి చూపలేదు. 'పవన్ ప్రశ్నించారు.. మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానం చెప్పారు, ఇక మనకెందుకు శ్రమ' అని దాటవేశారు. ఇదే సమయంలో, కేసీఆరే నీళ్లు అనేది అబద్ధమని.. కేసీఆర్ అంటే సారా, సోడా అంటూ బీఆర్ఎస్ అధినేతపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో సెటైర్లు వేశారు.
రామ్ చరణ్ ఫ్యాన్ డాన్స్.. థియేటర్ షేక్!
రామ్ చరణ్ సినిమా స్క్రీనింగ్ టైమ్‌లో థియేటర్‌లో ఒక ఆసక్తికర వీడియో వైరల్ అవుతోంది. స్క్రీన్‌పై హీరో డాన్స్ చేస్తుండగా, ఒక అభిమాని అదే స్టెప్స్‌ను సింగిల్ టేక్‌లో అలవోకగా వేసి ఆకట్టుకున్నాడు. థియేటర్‌లోని ఆడియన్స్ అంతా సినిమాను చూడటం ఆపేసి, ఆ యువకుడి పర్ఫార్మెన్స్‌ను ఆశ్చర్యంగా, ఆసక్తిగా చూశారు. స్క్రీన్‌పై ఉన్న హీరోను సైతం ఓవర్‌షాడో చేస్తూ, ఫుల్ ఎనర్జీతో ఆ ఫ్యాన్ చేసిన డాన్స్ వీడియో ప్రజెంట్ నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

ఉద్యోగాల పేరుతో టోకరా
AP: ఉద్యోగాల పేరుతో కోట్లు కొల్లగొట్టి ప్లేట్ ఫిరాయించారు. నంద్యాలలో మెడికల్ కోడింగ్ కంపెనీలో ఉద్యోగాల పేరుతో యువతీ, యువకుల వద్ద కోట్ల రూపాయలు వసూలు చేసి ఆ తర్వాత బోర్డు తిప్పేశారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు 700మంది నుంచి డబ్బులు తీసుకుని జాబ్స్ ఇస్తామని చెప్పారు. 3నెలలు వర్క్‌ఫ్రమ్ హోమ్‌గా ఉద్యోగం చేయించుకుని సాలరీస్ ఇచ్చారు. ఆ తర్వాత ఏడునెలలు జీతాలు ఇవ్వకుండా కంపెనీనే ఎత్తేయడంతో వారు షాక్ అయ్యారు. ఒక్కొక్కరి నుంచి లక్ష నుంచి రెండు లక్షలు వసూలు చేసినట్లు బాధితులు తెలిపారు. ఘటనపై బాధితులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

పెద్దిలో జాన్వీ లుక్, రోల్ పై ఫ్యాన్స్ ఫైర్ !!
పెద్ది మూవీలో (Peddi) జాన్వీ కపూర్ 'అచ్చియమ్మ' రోల్ పై సోషల్ మీడియాలో విమర్శలు పెరుగుతున్నాయి. స్టోరీలో ఎలాంటి ఇంపార్టెన్స్ లేకుండా,కేవలం గ్లామర్ కోసం ఆమెను చూపించడానికే కొన్ని సీన్లను బలవంతంగా ఇరికించారని ప్రేక్షకులు ఫైర్ అవుతున్నారు. హీరో చెప్పే డైలాగ్ ఒకటైతే డైరక్టర్ ఆమె బాడీని ఎక్స్ పోజ్ చేయడంపై జాన్వీ ఫాన్స్ అసంతృప్తిగా ఉన్నారు. హీరో యిన్ పర్మిషన్ లేకుండా ఎక్స్ పోజింగ్ గా చూపరాదని గతంలో జాన్వీ ఇచ్చిన మరో పోడ్ కాస్ట్ కూడా వైరల్ గామారుతోంది. జాన్వీ తెలిసే ఇలాంటి చీప్ రోల్ చేసిందా అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

KCR చెల్లని నోటుతో సమానం: రేవంత్ రెడ్డి
TG: KCR చెల్లని రూ.1000 నోటుతో సమానం అని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. పాలమూరు జిల్లా రెండోరోజు పర్యటన సందర్భంగా ఆయన మాట్లాడారు. BRS పార్టీకి గతమే తప్పా, భవిష్యత్ లేదని, ఆ పార్టీ నేతలు చేసే వ్యాఖ్యలు, విమర్శలకు పైసా విలువలేదని అన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టులన్నింటినీ తామే కట్టినట్లు చెప్పుకుంటున్న BRS.. ఒక్క ప్రాజెక్టునైనా మొదలుపెట్టి పూర్తిచేసిందో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ సొంతంగా మొదలుపెట్టి.. చేపట్టిన ప్రాజెక్టు రాష్ట్రంలో ఒక్కటీ లేదన్నారు.

సంచలనంగా మారిన అన్నామలై ఐదు పేజీల లేఖ !!
అన్నామలై రాసిన ఐదు పేజీల లేఖ బీజేపిలో కలకలం రేపుతోంది. బిజేపి పెద్దలు జాతీయ భాషలో మాట్లాడటాన్ని ఆయన పార్టీ ఓటమికి కారణంగా చెప్పారు. స్థానిక ప్రజలకు అర్ధమయ్యే భాషలో మాట్లాడాలని ఆ లేఖలో తెలిపారు. ప్రజల ఆలోచనల్లో మార్పు, చైతన్యం తేవడానికి భాషే కీలకమని అన్నారు.తాను చెప్పినా బీజేపి పెద్దలు పట్టించుకోలేదని, ప్రజల ఆకాంక్షలు, జీవనశైలి, ఔన్నత్యం ఆత్మగౌరవం లాంటివి గమనించకుండా ఎన్నికల వ్యూహ రచన చేయకూడదని అన్నారు. అన్నామలై కామెంట్స్ హిందీని బలవంతంగా రుద్దడాన్ని ఉద్దేశించినవేననే చర్చ ఇప్పుడు మొదలైంది.

అమెరికాలో ఇండియన్ టెకీలకు నో జాబ్స్
అమెరికాలో ఐటీ కొలువుల పరిస్థితి ఘోరంగా తయారైంది. రీసెంట్‌గా ఓ ఇండియన్ డేటా ఇంజనీర్ 1,500 జాబ్స్‌కి అప్లై చేసినా ఒక్క కాల్ కూడా రాలేదని రెeditలో పెట్టిన పోస్ట్ వైరల్ అయ్యింది. కంపెనీ H-1B వీసా రెన్యూ చేయకపోవడమే దీనికి కారణం. ఎంతోమంది సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ లాంటి టాప్ లీడర్స్ ఈ రూట్లోనే సక్సెస్ అయ్యారు. కానీ ప్రస్తుతం అక్కడున్న ఇండియన్ ప్రొఫెషనల్స్ తీవ్రమైన జాబ్ క్రైసిస్‌ను ఎదుర్కొంటున్నారు.

ఎక్స్‌పైరీ కెమికల్స్‌తో చాక్లెట్ల తయారీ!
హైదరాబాద్‌లో కల్తీ చాక్లెట్లు తయారు చేస్తున్న ఒక ముఠా గుట్టును హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ అండ్ సేఫ్టీ టీమ్ (H-FAST) బయట పెట్టింది. సీతారాంబాగ్‌లోని ఒక ఫుడ్ సంస్థపై అధికారులు సడన్‌గా దాడులు చేశారు. అక్కడ ఎక్స్‌పైరీ డేట్ అయిపోయిన డేంజరస్ కెమికల్స్ వాడుతూ కల్తీ చాక్లెట్లు తయారు చేస్తున్నట్లు అధికారులు ఐడెంటిఫై చేశారు. ఈ స్కామ్‌కు సంబంధించి కార్తీక్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పిల్లలు తినే చాక్లెట్లను ఇలా కెమికల్స్‌తో తయారు చేస్తుండడంతో పేరెంట్స్ షాక్ అవుతున్నారు.

ఫేక్ డాక్యుమెంట్ల కేసులో ఢిల్లీ హోటల్ ఓనర్ !
ఢిల్లీ హోటల్ ప్రమాద నిందితుడు లవ్ కేశ్ బజాజ్ మరో నేరం బయటపడింది. గత ఏడాది కొందరు బంగ్లా దేశీయులకు నకిలీ గుర్తింపు కార్డులు ఇప్పించినట్లు బయటపడింది. వారందరూ ఢిల్లీలో అక్రమంగా ఉండేందుకు ఫేక్ డాక్యుమెంట్లను తయారు చేసి ఇవ్వడంలో సాయపడ్డాడు. ఢిల్లీ హోటల్ ను సరైన నిబంధనలు లేకుండా నడపడం వల్లనే ఫైర్ యాక్సిడెంట్ అయ్యి 21 మంది సజీవ సమాధి అయ్యారు. కేవలం కొంత డబ్బు కోసం చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని, నిబంధనలను తుంగలో తొక్కాడు.

NTA, IIT వెబ్‌సైట్ల లూప్‌హోల్స్ బయటపెట్టిన 16 ఏళ్ల కుర్రోడు !
సార్ధక్ సిస్టమ్‌లోని లూప్‌హోల్స్ వెలికితీస్తే.. దుబాయ్‌కి చెందిన రైలన్ అనిల్ అనే 16 ఏళ్ల ఇండియన్ టెక్-విజ్ (Cybersecurity Researcher), ఏకంగా NEET, JEE పరీక్షలు నిర్వహించే NTA, IIT రోర్కీల సెక్యూరిటీ లోపాలను బయటపెట్టి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు!నీట్ (NEET 2026) రీ-ఎగ్జామ్ టైమ్‌లో NTA పోర్టల్‌లో ‘సూపర్ అడ్మిన్ లాగిన్ బైపాస్’ ఉందంటూ స్క్రీన్‌షాట్స్‌తో ఎక్స్ (X) లో పోస్ట్ చేశాడు. దీనివల్ల వేలమంది ఎగ్జామ్ కోఆర్డినేటర్లు, సెంటర్స్ డేటా ఈజీగా లీక్ అయ్యే ఛాన్స్ ఉందని హెచ్చరించాడు. మన ఇండియన్ ఎగ్జామినేషన్స్ ఆన్‌లైన్ సెక్యూరిటీ ఎంత వీక్‌గా ఉందో ఈ టీనేజర్ సింగిల్ హ్యాండ్‌తో ప్రూవ్ చేశాడు!
బ్రేకప్ చెప్పిందని ఆఫీస్ లోనే చంపేశాడు!
పంజాబ్‌లోని మొహాలీలో ఒక షాకింగ్ మర్డర్ జరిగింది. ఒకే కంపెనీలో వర్క్ చేస్తున్న డింపిల్ (30), హర్జిందర్ సింగ్ (39) మూడేళ్లుగా రిలేషన్‌లో ఉన్నారు. రీసెంట్‌గా డింపిల్ అతనికి బ్రేకప్ చెప్పి. తనను కలవద్దని వార్నింగ్ ఇచ్చింది. దీన్ని తట్టుకోలేని హర్జిందర్, అందరూ చూస్తుండగానే ఆఫీసులోనే ఆమెపై కత్తితో దాడి చేసి చంపేశాడు. ఆ తర్వాత అదే కత్తితో తను కూడా పొడుచుకుని ఆత్మహత్యకు ట్రై చేశాడు. ప్రజెంట్ అతను క్రిటికల్ కండిషన్‌లో హాస్పిటల్‌లో ఉన్నాడు. ఈ ఘోరానికి సంబంధించిన సీసీటీవీ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

AIతో ఉద్యోగాలు పోవా ? కంపెనీలకు టోకెన్ బిల్లుల షాక్
AIతో ఉద్యోగాలు పోతాయని ఇన్నాళ్లూ అనుకున్నాం కదా. కానీ అది నిజం కాదని గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ అంచనా వేస్తోంది. దీనికి మెయిన్ రీజన్ కార్పొరేట్ కంపెనీలు AI టూల్స్ వాడకానికయ్యే టోకెన్ బిల్లులు కట్టలేకపోవడమే. ఒక సంస్థ జస్ట్ వన్ మంత్ లో ఆంత్రోపిక్ Claude AI కోసం 500 మిలియన్ డాలర్లు (రూ.4,200 కోట్లు) ఖర్చు చేసింది. ఈ క్లాడ్ ఏఐ ఫ్రీ కాదు. మనం ఏ చిన్న ప్రశ్న అడిగినా డబ్బులవుతాయి. మైక్రోసాఫ్ట్ అయితే క్లాడ్ కోడ్ లైసెన్స్ ని రద్దు చేసుకుంది. ఊబర్ AI కోసం ఏడాదికి సరిపడా కేటాయించిన బడ్జెట్ నాలుగు నెలల్లోనే అయిపోయింది. సో ఈ కంపెనీలన్నీ AI వాడకాన్ని ఆలోచిస్తున్నాయి. సో మీ జాబ్స్ సేఫ్ ...

వాల్యుయేషన్ సిస్టమ్ ని షేక్ చేసిన ‘సార్ధక్ సిద్ధాంత్’!
దేశ వ్యాప్తంగా మారు మోగిన CBSE అవకతవకలు బయట పెట్టినది ఎవరో తెలుసా? జార్ఖండ్‌కు చెందిన 18 ఏళ్ల సార్ధక్ సిద్ధాంత్, CBSE డిజిటల్ ఎగ్జామ్ ఇవాల్యుయేషన్ (OSM) సిస్టమ్‌లోని లూప్‌హోల్స్‌ను బయటపెట్టి హీరో అయ్యాడు. తన రిజల్ట్స్ తక్కువ రావడంతో డౌట్ వచ్చి.. RTI (సమాచార హక్కు చట్టం) ద్వారా ఆన్సర్ షీట్స్ తెప్పించుకుని, ఏకంగా 576 ప్రభుత్వ టెండర్ డాక్యుమెంట్లను లైన్ టు లైన్ స్టడీ చేసి ఈ స్కామ్‌ను ఎండగట్టాడు.బ్లాక్ లిస్ట్ అయిన కంపెనీలకే మళ్లీ కాంట్రాక్ట్స్ ఇచ్చారని ఆధారాలతో నిరూపించిన ఈ కుర్రాడి ఇన్వెస్టిగేషన్ దెబ్బకి పార్లమెంట్ ప్యానెల్ కూడా స్పందించాల్సి వచ్చింది!