← Back to news

ఎక్స్‌పైరీ కెమికల్స్‌తో చాక్లెట్ల తయారీ!

By sahani· 5 Jun 2026· Andhrajyothy· Hyderabad
ఎక్స్‌పైరీ కెమికల్స్‌తో చాక్లెట్ల తయారీ!

హైదరాబాద్‌లో కల్తీ చాక్లెట్లు తయారు చేస్తున్న ఒక ముఠా గుట్టును హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ అండ్ సేఫ్టీ టీమ్ (H-FAST) బయట పెట్టింది. సీతారాంబాగ్‌లోని ఒక ఫుడ్ సంస్థపై అధికారులు సడన్‌గా దాడులు చేశారు. అక్కడ ఎక్స్‌పైరీ డేట్ అయిపోయిన డేంజరస్ కెమికల్స్ వాడుతూ కల్తీ చాక్లెట్లు తయారు చేస్తున్నట్లు అధికారులు ఐడెంటిఫై చేశారు. ఈ స్కామ్‌కు సంబంధించి కార్తీక్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పిల్లలు తినే చాక్లెట్లను ఇలా కెమికల్స్‌తో తయారు చేస్తుండడంతో పేరెంట్స్ షాక్ అవుతున్నారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.